బీ.ఎస్.ఎన్.ఎల్ కన్నెక్షన్ సూపరో సూపరు అంటే తీసుకున్నాను. యూ ట్యూబు కూడా చూడలేక పోతున్నాను. ప్రతీ అరక్షణానికీ బఫరింగ్ అంటూ ఆగిపోతూ, ప్రాణాన్ని విసిగిస్తుంది. ఎప్పుడూ, సరిగ్గా మెయిల్ కంపోస్ చేసే వరకూ పని చేసి, చిలిపిగా ''సెండ్ '' మీద క్లిక్ చేసేసరికీ.. ''రీడయల్ '' అంటూ ఒక విండో మెరుస్తుంది. లేఖిని లో కష్టపడి ఏదో రాద్దామని ప్రయత్నించి, పెద్ద పోస్టు ఏదో ఉత్సాహంగా రాస్తానా .. అది సేవ్ చేసే టప్పుడే సరిగ్గా నాకు తెలియకుండా డిస్ కనెక్ట్ అయి కూర్చుంటుంది. ఏ రోజయినా బ్లాగు జోలికి వెళ్ళనా, కూడలి లో బ్లాగులు చదివానా అంటే, ఆ శ్రీ కృష్ణ పరమాత్మ దయ వల్లనే కదా ! అనిపిస్తుంది. మరి మా శ్రీ కృష్ణ పరమాత్మ రోజూ నేను చెప్పిన మాట వినడు.
అంతకు ముందు సిఫీ ఉండేది. అది కూడా ఏమంత తృప్తి ని ఇవ్వలేదు. యూ.కె లో వర్జిన్ బ్రాడ్ బాండ్ ఉండేది. అది.. మహాతల్లి. నిజంగా ఆ స్పీడ్, సీరియస్ నెస్స్, మా బీ.ఎస్.ఎన్.ఎల్ కు ఎప్పటికి వస్తాయో ? ఎన్ని సార్లు కంప్లైంట్ చేసినా సదరు అయ్యోరు ఫోన్ చసి, కంప్లైంట్ చేసేరా ? ప్రాబ్లెం ఏంటి ? చూస్తాం లెండి ! (అంత మర్యాదగా కాదు - తెలంగాణా యాస లో) కూసి, పెట్టేస్తారు. మా సిఫీ ఆయనే మంచోడు ! కనీసం ఒక ఇంజినీరు ఇంటికి వచ్చి చూసి వెళ్ళేవాడు.
ఇదంతా చూసి, ఒక ధర్మ సందేహం వచ్చి, తెలిసిన వాళ్ళందర్నీ ఇదే ప్రశ్న అడిగాను.. (వాళ్ళు పాపం ఏమన్న అనుకోనీ అని!) ఒకరు వీ.ఎస్.ఎన్.ఎల్. సూపరు గానీ కాస్త ఖర్చెక్కువ అన్నారు. ఇంకోరు రిలయన్సు సూపరు డూపరే గానీ, నెలకో వారం రోజులు పని చెయ్యదు అన్నారు. ఏర్ - టెల్ గురించీ ఎవరో (సుజాత గారు) విసుగ్గా ఒకట్రెండు సార్లు ప్రమదావనం లో కోప్పడ్డారు కాబట్టి దాని మీదా డౌటే! మరి కనీసం యూ.ట్యూబు వీడియోను ఎంజాయ్ చేసే ప్రాప్తం ఏ కంపెనీ వారు అందుబాటు ధరలలో అందిస్తారో, నాకు ఈ జన్మ కు ఆ యోగం ఉందో లేదో ! అని అనుమానంగా ఉంది.
బ్లాగరులు ఈ విషయం లో ఏవైనా మంచి సూచనలు అందిస్తారేమో అని ఇక్కడ ప్రస్తావిస్తున్నా ! అసలు ఏ కంపెనీ మన దేశం లో మంచి సర్వీస్ ఇస్తుందంటారు ? నేను ఈ పోస్టు రాస్తున్నానే గానీ గుండె పీచు పీచు మంటుంది. ఎప్పుడన్నా కనెక్షన్ పోవచ్చు. ఈ రాత్రంతా / లేదా రేపు మధ్యాన్నం దాకా వెయ్యిన్నొక్క దేవుళ్ళకు మొక్కుకుంటే గానే పని చెయ్యకుండా మొరాయించొచ్చు. నిజంగా ఈ కనెక్షన్ తో 'ఏ నిముషానికి ఏమి జరుగునో..' ఎవరూ ఊహించలేరు !
దయచేసి మంచి ప్రొవైడెర్ ను సూచించండి. ఎక్కడైతే 2 ఎం.బీ.పీ.ఎస్ అంటే 2 ఎం.బీ.పీ.ఎస్ ఇస్తారో, ఎక్కడైతే పుటుక్కుమని ఇంటెర్నెట్ కనెక్షన్ తెగిపోయి, రాసినదంతా గాల్లో కలిసిపోదో, ఎక్కడైతే, కనీసం యూ ట్యూబు వీడియో పూర్తి గా వస్తుందో, ఎక్కడైతే, బఫరింగ్ బఫరింగ్ అంటూ నా లాప్ టాప్ కొట్టుకు చావదో, బ్లాగర్లారా.. అ దివ్య లోకానికి దారి చూపండి.
ఈ రోజు ఆ దేవుడి దయ వల్ల ఈ పోస్ట్ రాసి, పబ్లిష్ అనే బటన్ మీద నొక్కితే, ఆ పోస్టు నా బ్లాగు లో ప్రత్యక్షం అయితే, ఫలనా గుడి ముందు ఒక అర డజను కొబ్బరి కాయలు కొడతానని మొక్కుకుంటున్నాను.
9 comments:
Beamcable is best among the worst!! My own experience.
Airtel and Reliance.. either heard they r too good or too bad!! Extremes!!
Pick anything except TATA.. u got to open a new blog just for those experiences. ;-)
Anything u choose, u pay and u also pray it works!! No other simple way!! This is the best advice I can give u!!
As Poornima said Beamcable is a better option. I am facing hell lot of problems with TATA data card (Plug @ Surf).
నేనైతే ముందు మీ ఏరియా లో అంటే ఇంటి చుట్టుపక్కల వారు వాడుతున్న వారిని ఎంక్వైరీ చేసి అప్పుడు నిర్ణయం తీసుకుంటా అండీ. నేను 2 యేళ్ళ క్రితం బెంగళూర్ లో ఉన్నపుడు Airtel చాలా బాగా పని చేసింది. అక్కడ ఇల్లు మారిన తర్వాత అదే తీస్కుంటే రోజూ ఏవో సమస్యలు వచ్చేవి, మళ్ళీ అక్కడ TATA బాగా పనిచేసింది. ఒకో చోట ఒకో provider కి ఒకో సమస్య ఉండటం గమనించాను. అదే కాక ఒకో సారి VPN/virus/software updates వల్ల కూడా ఊరికే డిస్కనెక్ట్ అవుతుంది అని మా ఫ్రెండ్స్ కొందరు చెప్పేవాళ్ళు.
BSNL is working like anything for me!!
It never stopped
I use CISCO's modem which will connect it always. is your problem with the modem? is it broad band? or dial up :)
BSNL పేరెత్తితే నాకు కోపం ఏ లెవెల్లో వస్తుందో కూడా చెప్పలేను. సిఫీ వాడి కస్టమరు సర్వీసు ఏడినినట్టు ఉంటుంది. ఎయిర్ టెల్ వాడి కస్టమరు సర్వీసు బాగానే ఉంటుంది(వీళ్ళు వారానికి కనీసం పధ్నాలుగు సార్లు ఫోన్ చేసి నా పోస్ట్ పెయిడ్ బిల్ ప్లాన్ ఏమిటొ మొత్తం వివరిస్తారు అనవసరంగా) , అసలు సర్వీసు బాగోదు. 256 kbps అంటాడు కానీ ఏ రోజు అంత ఫీల్ అవలేదు నేను. ముఖ్యంగా నేను ప్రమదావనానికి తీరిక చేసుకుని వచ్చేసరికి డెడ్ స్లో గా నడుస్తూ ఉంటుంది నా బ్రాడ్ బాండ్! ఇందులో కూడా యూ ట్యూబు వీడియోలు మొదటిసారే చూడలేము. ఒకసారి బఫర్ అయి ఆగుతూ, మొత్తం అయ్యాక అప్పుడు మాత్రమే వీలవుతుంది.
సుజాత గారు,
Youtubeలో వీడియో నాకు తెలిసి కంటిన్యూస్ గా ఒకేసారి చూడటం అవ్వదు. దాని పాటికి దాన్ని వదిలేసి ఒక నిద్ర వేసి లేదా ఈ లోపు ఏదైనా పని చూసుకొని lol తర్వాత రెండవసారి ప్లే నొక్కితే అపుడు వీడియో బఫర్ రాకుండా చూడచ్చు. నేను అలాగే చేస్తాను. :-(
మాది TATA Broadband. మాకు సర్వీస్ చాలా బాగుంటుంది. ఫోన్ చెయ్యటం ఆలస్యం కాస్త సమయం తేడాలో అయినా వస్తారు. మాటికి డిస్ కనెక్ట్ అనే ప్రాబ్లెం లేదు. అపుడపుడు మా నెట్ కు కాస్త జలుజు, దగ్గులు లాంటివి తప్ప. అది కూడా 15 నిముషాలు. మరీ సమస్య తీవ్రంగా ఉంది అంటే నెట్ కేబుల్ వైర్ ఎక్కడో తెగింది అని అర్ధం. పాపం అది కూడా సాధ్యమైనంత వరకూ తొందరగానే పరిష్కరిస్తారు.
వేణూ శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఒక్కొచోట ఒక్కో ప్రొవైడర్ బాగా పని చేస్తుంది. శ్రీకాంత్ గారి సలహా ప్రకారం మీ ఎరియాలో ఏ ప్రొవైడర్ బాగా పనిచేస్తుందో ఎంక్వైరి చెయ్యండి.
సుజాత గారూ!
మంచి ఇంటర్నెట్ ప్రొవైడర్ నేను సూచించలేను గానీ రాసేటపుడు డిస్కనెక్ట్ అయితే రాసినదంతా గాల్లోకలసిపోకుండా ఉండటానికి మాత్రం నేనో మార్గం చెప్పగలను.ముందుగా అసలు నెట్‌తోనే పనిలేకుండా ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకుని దానిలో రాయాలి.రాస్తూ ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటుండాలి.దీనివలన నేట్ డిస్కనెక్ట్ అయినా,పవర్ పోయినా మనం రాసినది యెక్కడికీ పోదు.పైగా పెద్ద వ్యాసాలైతే కొంచెం కొంచెం గా రెండు మూడుసార్లుగా శ్రమలేకుండా రాసుకోవచ్చు.అంతా అయిన తరువాత అప్పుడు నెట్ కనెక్ట్ చేసుకుని,లేఖిని ఓపెన్ చేసుకుని వర్డ్ లో రాసినదంతా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు.నేనిలాగే చేస్తుంటాను.అందరూ ఇలాగే చేస్తుంటారని నేను అనుకుంటున్నాను.
చాలా థాంక్స్ అందరికీ. మీరు ఇచ్చిన సలహాలు చాలా పనికి వస్తాయి నాకు. నాదగ్గర బీ.ఎస్.ఎన్.ఎల్ దగ్గర కొన్న వైర్ లెస్ మోడెం ఉంది. నేను 2 ఎం.బీ.పీ.ఎస్. కోసం సబ్స్క్రైబ్ చేసినా, నాకు అంత స్పీడ్ రావట్లేదని అనుమానం. 2 ఎం.బీ.పీ.ఎస్ స్పీడ్ కు యూ ట్యూబ్ రావాలి గా. ఈ సారి కాస్త ఎక్కువ రీసెర్చ్ చేస్తాను.
చాలా థాంక్స్ అందరికీ. మీరు ఇచ్చిన సలహాలు చాలా పనికి వస్తాయి నాకు. నాదగ్గర బీ.ఎస్.ఎన్.ఎల్ దగ్గర కొన్న వైర్ లెస్ మోడెం ఉంది. నేను 2 ఎం.బీ.పీ.ఎస్. కోసం సబ్స్క్రైబ్ చేసినా, నాకు అంత స్పీడ్ రావట్లేదని అనుమానం. 2 ఎం.బీ.పీ.ఎస్ స్పీడ్ కు యూ ట్యూబ్ రావాలి గా. ఈ సారి కాస్త ఎక్కువ రీసెర్చ్ చేస్తాను.
Post a Comment