Pages

18/03/2009

ఆరంభింపరు నీచ మానవులు

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్ - ఏనుగు లక్ష్మణ కవి.ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా వెరువక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి నైజం. అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు.


(ఇష్టమైన తెలుగు పద్యం.. పాత ఈనాడులో దొరికింది)

25 comments:

సుజాత said...

ఈ పద్యం నాక్కూడా ఇష్టమైనదే!
అది సరే ఏమైపోయారూ? మరీ బిజీగా ఉన్నట్లున్నారు?

te.thulika said...

నాక్కూడాను. :)

కొత్త పాళీ said...

మీరు ఇంతకన్నా తరచుగా రాస్తుండాలి!

పుల్లాయన said...

baagundandi padyam

మురళి said...

మా తెలుగు మాస్టారి గొంతు ఖంగున మోగిందండి చెవుల్లో.. మంచి పద్యాన్ని గుర్తు చేశారు..

rayraj said...

ఇది మాకు భర్తృహరి సుభాషితాని గా చెప్పారు!?

ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచై:
ప్రారభ్య విఘ్న నిహతా విరమంతి మధ్యా:
విఘ్నై: ముహుర్ముహరపి ప్రతిహన్య మానా:
ప్రారబ్ధం ఉత్తమ జనా:న పరిత్యజంతి

ఇంకోటి:

ఛిన్న: అపి రోహతి తరవ:
క్షీణ: అపి ఉపచీయతే పున: చంద్ర:
ఇతి విమృశంత: సంత:
న సంతప్యంతే విప్లుతా లోకే

ఈ పైరెండూ బాగా జీవితంలో వాడుకుంటుంటాను. ఏం చేద్దాం అలా ఉంది - స్మూత్ గా లైఫ్ సాగదుగా మరి! :)

రేడీయోలో వచ్చే:
కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా న స్నానం న విలేపనం నాలంకృతా మూర్ధజా:
వాణ్యేక సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతే ఖలు భూషణాని సతతం
వాక్ భూషణం భూషణం

నేను సరిగ్గా నేర్చుకోని వాడుకోవాల్సిన మరో సుభాషితాని
"మౌనం అపణ్డితానాం" అని అది గుర్తులేకే ఈ వాగుడు - టైపుడు!?? ఎవరన్నా చెప్పి పుణ్యం కట్టుకోండి.

krishna rao jallipalli said...

ఈ మీరు చెప్పే ఉత్తములు, మధ్యములు, అధములు... వారికి సంబందించిన, వారికి మాత్రమె ఉపయోగ పడే పనుల విషయంలో వర్తిస్తుంది అని అనుకుంటున్నాను. మరి పదిమందికి పనికి వచ్చే పని మొదలు పెట్టె, పెట్టిన పనులను హేళన, అవరోధం, అడ్డంకులు కలుగ చేసే వారిని ఏమనాలి?? సోది నాయాళ్ళు ?? వేదవలనాలా?? సన్నాసులనాలా? కోజ్జాలనాలా??

anuradha manda said...

EE padhyam ea panikaina varthistundi, addankupettevare leka pothe dhherulu lokamlo undaneundaru
mrmr

Gnaneswara Nath Ponnuri said...

chinnapudu chadivina padhyam.. dorukunthunda leda ani try chesanu... chala thanks...

Gnaneswara Nath Ponnuri said...

chinnapudu chadivina padhyam...Sagam varaku gurthosthundhi..... migilina rendu padhala kosam try chesa....

meku chala chala thanks.....

assa rao said...

thank you...

sravanthi k said...

Thanks for posting..

Lanke Vijayvarma said...

Thanks for posting

Lanke Vijayvarma said...

Thanks for posting

Gopal Nanduri. said...

Thanks for the post.

masthanaiah aluru said...

It would be good to follow this poem in life.

Unknown said...

Manchi padyam. Vethiki mari chinanatidi ikada dorikindi. Kani ikada ichina danilo chinna grammar mistakes unnayani pidithundi.
Vignanihanya.... 3 line
Pragnanidhul.....4 line

narasingarao said...

I am teaching this to my I year Civil students. I wanted telugu script for the poem and I got it thanks.

narasingarao said...

I am teaching this to my I Year Civil Engineering students. Thanks for the Telugu script of the poem.

Anonymous said...

Good poem

Vadapalli Soami Dayal said...

ఈ పద్యం చదివి తెలుగు వక్తృత్వము పోటీ లో రెండవ ప్రైజు పొందేను. 1968-69 10 వ తరగతి 1st batch.

Sujata said...

సంతోషం అండీ.‌

Chaitanya Koredla said...

Please add the meaning of each line too. Thanks.

Sai Kiran said...

Fell good poem

Unknown said...

Word to word ardhalu evaranna vivarinchagalaru /m\