Pages

24/04/2008

కికోసు మీకు తెలుసా ?!

ఈ గ్రంధాలయాల బ్లాగ్విషయం ఆశ్చర్యకరంగా చాలా మంది పాఠకుల 'సోవియట్ లాండ్' పరిచయాన్ని తెలియచేసి నన్ను ఉత్తేజ పరిచింది. నేను చిన్నప్పుడు 'విశాలాంధ్ర' స్కూల్ లో చదివాను. స్కూల్ ఫీజు నామ మాత్రం, ఇంగ్లీష్ మీడియం, కాస్త వామ పక్ష భావజాలన్ తో నిండిన ఈ స్కూల్ లో నే (లైబ్రరీ) మొదటిసారి సోవియట్ లాండ్ చదివాను. సోవియట్ లాండ్ - (రష్యా) సాహిత్యం అనగా బాల సాహిత్యం బాగా గుర్తుంది. ఈ స్కూల్ లైబ్రరీ అంటే వేరే ఏమి కాదు. క్లాస్ రూం కే బోల్డన్ని పుస్తకాలు కేటాయించే వారు. బ్రేక్ ల లో / రీడింగ్ అవర్ లో చదువుకోవటమే. ఆ పుస్తకాల్లో కొన్ని కధలు జ్ఞాపకం (బొమ్మలతో సహా..) వాటిల్లో మొదటిది నా కికోసు కధ! ఈ కధ ఒక రైతు కూతురిది. ఒక రైతుది. ఒక గ్రామంలో ఒక రైతు వుంటుండేవాడు. అతనికి ఎనిమిది మంది (సంఖ్య ప్రామాణికం కాదు - ఎక్కువ మంది అని అర్ధం) పిల్లలుండే వారు. ఏడుగురు కూతుర్లు, ఒక కొడుకు. ఆ కొడుకు అందరికన్నా చిన్నవాడు. ఈ పిల్లలంతా.. తల్లి పోయాక తండ్రికి చేదోడు వాదోడు గా వుంటారు. అడవి కి వెళ్లి గొర్రెలను మేపుకు రావటం, వంట కు కట్టెలు ఏరుకు రావటం, అడవి లో పళ్ళూ, దుంపలూ సేకరించటం.. లాంటి పనులన్నీ చేస్తుండే వారు. మరీ చిన్న పిల్లలు పొలం లో తండ్రి తోటే, అక్కయ్య ల సంరక్షణ లో వుండే వారు. ఒక రోజు పెద్ద అమ్మాయి అడవి లోకి వెళ్ళింది కట్టెలు తీసుకొచ్చేందుకు. చాల సేపు తిరిగిందేమో.. అలిసిపోయింది. ఈ పిల్ల కు పొద్దు పోయేందుకు ఏదో ఒకటి బాగా ఆలోచించటం అలవాటు. (మొత్తానికి కుటుంబం అంతా పల్లెటూరి అమాయకత్వం). ఒక ఓక్ చెట్టు కింద ఒక బండ మీద కూర్చుని సేద తీరుతూంది. ఇంతలో ఒక ఆలోచన వస్తుంది. 'కొన్నాళ్ళకు తనకు పెళ్లవుతుంది. ఒక కొడుకు పుట్టుకొస్తాడు. వాడికి తను 'కికోసు' అని పేరు పెట్టుకుంటుంది. ఈ కిసోసును తన వీపుకు కట్టుకుని పనులు చేసుకుంటుంది. కొన్నాళ్ళకు వాడు పెద్దవుతాడు. పెద్దయ్యాక తనూ అడవికోస్తానని మారాం చేస్తాడు. తను వెంట పెట్టుకు రావల్సోస్తుంది. చిన్న వాడు కదా.. ఈ ఓక్ చెట్టు ఎక్కుతానంటాడు. తను వద్దంటుంది.. అయినా అరచి గోల చేసి చెట్టు ఎక్కుతాడు. చిన్న పిల్లవాడు కదా.. పట్టు తప్పి ఇదిగో.. ఈ పెద్ద రాయి మీద పడతాడు (తను కూర్చున్న బండ రాయి) అప్పుడు తల కి తెబ్బ తగిలి, తన చిన్ని కికోసు చనిపోతాడు....' ఈ ఆలోచన రావటం.. ఇక అంతే ! దుఃఖం ఒర్చుకోలేక ఆ అమ్మాయి ఏడుపు మొదలు పెడుతుంది! ఒక పాట కూడా పాడుతుంది. (ఆ పాట మొత్తం తన కధే.. ) " ....................................................................... ........................................................................... (జరిగిన సంఘటనా క్రమం..) బుజ్జి కికోసు, చిట్టి కికోసు.. మరి ఇక లేవ నా తండ్రీ !" .... అంటూ ఏడుస్తూ ఆ చెట్టు కిందే కూర్చుని వుండిపోతుంది. కాసేపటికి ఇంట్లో తండ్రి కి కంగారు మొదవుతుంది.. తన కూతురు అడవి కి వెళ్ళింది.. ఇంక రాదేం! అని. ఇంకో అమ్మాయిని అక్కని తీసుకురమ్మని పంపిస్తాడు. తను వెళ్ళాక అక్కయ్య.. తన గాధ చెప్పి - 'అయ్యో చెల్లి! మన కికోసు కి ఇలా అయిందే !' అని బావురుమంటుంది ఆ పిల్ల .. 'అయ్యో ! ఈ పిన్ని కి కనిపించకుండానే పోయావా కికోసూ!' ఏడుస్తుంది. ఇద్దరు మళ్లా ఆ పాట పాడతారు. ఇలా.. ఇంట్లో అందరూ మిగిలిన వాళ్ళని వెతుక్కుంటూ రావటం, కికోసు కధ విని ఏడుపులు పెడబొబ్బలు పెట్టడం.. జరిగి ఆఖరికి తండ్రి కూడా రావలసి వస్తుంది.. ఆ రైతు కూడా తన మనవడి గురించి విని.. ఎంతొ బాధ పడి, చివరికి చేసేది లేక కేవలం ఊహలో పుట్టిన ఆ కికోసు కి ఆ అడవి లోనే అంత్యక్రియలు నిర్వహిస్తాడు. ఆ తరవాత భారమైన మనసు తో అంతా ఇంటికి చేరతారు. ఈ పుస్తకం లో ఇలాంటి అమాయక గాధలు బోల్డన్ని ఉంటాయి. సైన్యం లో చేరి ఎప్పటికీ ఇల్లు చేరని ఒక కొడుకు, అతని ముసలి తల్లి ఎదురు చూపులు.......... ఇంకా ఒక గయ్యాళి భార్య కధ, చాల ప్రముఖమైన 'తాతకు ఉత్తరం' కధ.. ఇలా చాలా కధలు ఉన్నాయి! ఈ కికోసు కధ గురించి ఈ బ్లాగు ప్రపంచం లో ఎందరికి తెలుసో తెలుసుకోవాలనుంది. నాకో కికోసు పుడితే ఈ కధ చెప్పాలని ఉంది. మా అక్కయ్య వాళ్ల అబ్బాయి కి చెప్పింది. (మేమిద్దరం ఎప్పుడూ ఒకటే స్కూల్.. కాలేజి... కాబట్టి తను కూడా ఈ కధ కు అభిమానే! ) ఈ కధ లో ఏముంది గొప్పతనం అంటే.... ఏమి లేదు! ఫక్తు అమాయకత్వం, మంచి తనం, జాలి, కరుణ, ప్రేమ, అభిమానం తప్ప! పిల్లలకు తెలియాల్సిన విషయాలు అవే కదా! కధ చదివాక చిన్నపిల్ల గా నా మనసు బరువెక్కటం గుర్తుంది. కికోసు పుట్టనే లేదు! కానీ అతని మరణం అనే భావన ఆ కుటుంబాన్నంతటినీ కదిలించడం కాస్త తమాషా గా అనిపించినా ఆ కనిపించని కికోస్ నే వాళ్లు ఎంతగా అభిమానిస్తారో అనిపిస్తుంది. అందుకే.. ఈ కికోసు కధ ఎవరికైనా తెలుసా?!..... అని చిన్న ఆలోచన. ఆ పుస్తకం బహుసా ఇప్పుడు ముద్రణ లో లేక పోవచ్చు. ఈ పుస్తకంలో illustrations అన్నీ Roald Dahl పిల్లల పుస్తకాల లో మాదిరిగా వుంటాయి. ఈ కధ ఎవరు రాసారో తెలుసుకోవాలని ఉంది. సోవియట్ లాండ్ పాఠకులకు తెలుస్తుందేమో అని కొంచం ఆశ!


Update : 

Finally, I got the book in 2021 and wrote about this story here




23/04/2008

గ్రంధాలయం


మేముంటున్న బెడ్ ఫోర్డ్ లో కౌన్సిల్ వాళ్ళచే నడపబడుతున్న బ్రహ్మాండమైన లైబ్రరీ వుంది. ఇంగ్లీష్, ఇంకా ఇతర యురోపియన్ భాషల లో నే కాకుండా మైనారిటీ ఆసియన్ సంతతి వారి కోసం, తమిళం, మలయాళం, పంజాబీ, సింధీ, ఉర్దు, హిందీ భాషల లో కూడా మంచి (చెప్పుకోదగిన సంఖ్య లో) పుస్తకాలున్నాయి. ఇక్కడ నేను చదివినవి Mark Tully, Jhumpa Lahiri, Kushwant Singh, VS Naipaul.. ఇంకా ఇతర ప్రముఖుల రచనలు. తెలుగు పుస్తకాలూ మాత్రం లేవు. నేను కొన్నాళ్ళ క్రితం ఢిల్లీ లో పని చేసేటప్పుడు, (వాయు సేన ముఖ్యాలయ్) అక్కడ కూడా అన్ని ప్రాంతీయ భాషల లో నూ పుస్తకాలూ ఉండేవి కాని తెలుగు పుస్తకాలు వుండేవి కాదు. అయితె మంచి మంచి మాగాజీన్ ల ను చదివే సువర్ణావకాసం లబించింది. అక్కడ National Geographic, News Week, Time లాంటి కాస్ట్లీ పత్రికలూ హాయిగా చదివే వాళ్ళం. అవే కాకుండా, మంచి ఆంగ్ల సాహిత్యం, ఫిక్షన్, సస్పెన్స్, మిస్టరీ, క్లాసిక్స్ చదివాను. ఢిల్లీ లో కేంద్ర సాహిత్య అకాడమి లైబ్రరీ సూపర్. అన్ని భాషల లో నూ మంచి పుస్తకాలు దొరుకుతాయి. కాని సభ్యత్వ రుసుము కాస్త ఎక్కువ.

నిజానికి చదవటం చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, బాల జ్యోతి ల ద్వారా చిన్నాప్పటి నుంచే అలవాటూ, ఇష్తమూ.. ఆ పుస్తకాల కోసం అక్క తో యుద్ధం, చిన్న దాన్ని కాబట్టి నెగ్గటం.. మంచి జ్ఞాపకాలు. ఇంకా ౨ రూపాయల నవలలూ.. అందాల రాజకుమారి, దయ్యాల ద్వీపం, వీరుడైన రాజ కుమారుడు.. రాకాసి లోయ ..ఇలాంటి బోల్డన్ని నవలలు, సైన్సు ఫిక్షన్.. జూల్స్ వెర్న్ అనువాదాలు, (భూగర్భం లోకి ప్రయాణం.. లాంటివి) కూడా కవర్ చేశాను. మా అన్నయ్య ఒక రెండు రూపాయల నవల రాసాడు కూడా. అది పబ్లిష్ అయాక వాడికి కాస్త డబ్బు వచ్చింది. దాంతో మేము ఊర్లో ఎగ్జిబిషన్ కు వెళ్ళాం.
చదువుకునే రోజుల్లో, నాన్ డీ టైల్ ల లో Adventures of Tom Sawyer, Huck berry, David Copperfield.. లాంటివి చదివాక.. ఆంగ్ల సాహిత్యం అంటే ఇష్టం ఏర్పడింది. పెద్దయ్యాక Pride & Prejudice, Sence and Sensibility, Jane Eyre.. లాంటి పాపులర్ రచనలు చదివాక ఈ మైదానాలూ.. పచ్చ గడ్డి, ఇంగ్లీష్ country side, అంటే పిచ్చ అభిమానం ఏర్పడింది... ఈ పుస్తకాలు మాత్రం ప్రతీ లైబ్రరీ లో నూ ఒక్కో సరి తిరగేసా.. ఊరికే.. అమ్మాయిలకిదో పిచ్చి అనుకోండి. ఇక్కడ అర్బన్ లైఫ్ చూస్తున్ననేమో.. ఈ జ్ఞాపకాలూ కొన్నాళ్ళకు మధురం అవుతాయి.
గత దశాబ్ది లో బాగా నడిచిన కాన్సెప్ట్.. Lending Libraries. అక్కడ తెలుగు నవలలన్నీ చదివాను. ఇంట్లో కొనే వాళ్ళం కూడా. కానీ అరువిచ్చి మోసపోయం.. ఒక్క నవల తిరిగీ రాలేదు. అందుకే ఈ అద్దె కు తెచ్చుకుని చదవటం. మల్లాది, యండమూరి ల నవల లు దాదాపు అన్నీ చదివాను.
తెలుగు లో గద్యమే తప్ప పద్యం తల కు ఎక్కలేదు. పద్యం, రూల్స్, అర్ధాలు, టీకా తాత్పర్యాలూ.. చాల కష్టం అనిపించింది. కన్యాశుల్కం, గురజాడ కధనికలు, చాలా తెలుగు అనువాదాలు, అమ్మ, తండ్రులూ - కొడుకులు, గై ద మపాసా కధలూ, బుచ్చి బాబు కధలు చదివాను. బుడుగు మామూలే..
అన్నిటి కన్న మధుర జ్ఞాపకం, రామ కృష్ణ మిషన్ వారి ప్రచురణలు. మా చిన్నప్పుడు ఒక సన్యాసి పుస్తకాల మూట భుజాన పెట్టుకుని తీసుకొచ్చి అమ్మే వారు. ఆయన తెచ్చే పుస్తకాలు, బాలల బొమ్మల రామాయణం (చందమామ లో బొమ్మలు వేసే శంకర్ బొమ్మల తో) , మహా భారత కధలు, భాగవతం, నీటి కధలు ఇలా బోల్డన్ని. ఇంకా తిరుపతి కి వెళ్ళినప్పుడల్లా ధర్మ ప్రచార పరిషత్ వారి చిన్న పుస్తకాలు.. వాటిలో ఎందరో మహానుభావుల గురించి చదివాను.
ఇంకోటి.. ఢిల్లీ పుస్తక మహల్ వారి 'Childrens Knowledge Bank'..తెలుగు లో.. ఇప్పటికీ ఢిల్లీ లో దర్యాగంజ్ లో పుస్తకాలు ఆరు వోల్యుములు అమ్ముతారు.. మా బాల్యం లో అవే మా Encyclopedia.. అబ్బ! ఇంకా రక రకాల పుస్తకాలు గుర్తొస్తున్నాయి.. చిన్నప్పట్నించే ఇంటి నిండా పుస్తకలున్నందున కాలేజీ కెళ్ళే దాక గ్రంధాలయాల మాట ఎత్తలేదు. ఆంధ్ర యునివర్సిటీ లైబ్రరీ కూడా చాలా బావుంటుంది. ఆ రోజుల్లో ఆ లైబ్రరీ నాకో fascination. అక్కడ కుర్చీలూ బల్లలు, లైట్లు, ఫాన్ లు అన్నా ఎంతొ గౌరవ భావం కలిగేది. స్టూడెంట్స్ పుస్తకాలు ఎత్తుకుపోకుండా, EXIT లో bags చెక్ చేసేవారు. మగ పిల్లలకు పుస్తకాలూ షర్టు లలో దాచేసుకునే అలవాటు ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది.
పెళ్ళయాక.. నా జీవితం లో పెను మార్పు పుస్తకాలూ కొనలేకపోవటం. అప్పటికే షెల్ఫ్ ల నిండా గ్రూప్ వన్ అనీ ఇంకోటని బోల్డు పేరుకుపోయాయి. ఆఫీసు లైబ్రరీ బాగుంది. పుస్తకాలు అంటే.. చెత్త అనే భావన ఇంట్లో వాళ్ళలో కలిగేంతగా పుస్తకాలు పెరిగి పోయాయి. పైగా మా అత్తగారి ఇంట్లో తెలుగు ఎవరికీ చదవటం రాదు. ఇంగ్లిష్ పుస్తకాలు మా మామగారు చదువుతారు. నేనైతే.. ఇంట్లో అన్ని పుస్తకాలున్నందుకు చాలా హాపీ అయి ఉండే దాన్ని. ఎప్పటికైనా వాటికి మంచి యోగం కలిగించి నా చిన్న లైబ్రరీ ఏర్పరచుకోవాలని నా కల.

21/04/2008

జీవిత పరమార్ధం


'Conquer Taste, and you will have conquered the self' said Jagan to his listener, who asked, 'Why conquer the self ?' Jagan said, ' I do not know, but all our sages advise us so.'
- Vendor of Sweets (RK Narayan)


జీవిత పరమార్ధం గురించి రమణి గారి జాబు (మనసులోని మాట....) చదివాకా నాకు వెంటనే తోచిన విషయం ఇది. జీవితం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దృక్పథం వుంటుంది. 'పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి' అన్నట్టు, జీవితానుభావాల బట్టి లక్ష్యాలు, భావనలు, కోరికలు, భయాలు.. ప్రతి వారు ఎవరికీ వారే. ఒక హిందువు కర్మ-వాది. క్రైస్తవుడు క్రియ-వాది. భౌద్ధుడు దయా-వాది. ఇలా ఎవరి మతం వారి దిక్సూచి. ఒక్కోసారి అనుభూతులకు చిక్కని భావాలు మది లో మెదులుతాయి.



కొత్తగా ధ్యానం చేసే ఔత్సాహికులు 'మా పాపిట్లో ఏదో దీపం వెలిగినట్లు ఫీలయ్యామండి' అంటారు. గురువు గారు గుంభనంగా నవ్వుతారు. అబ్బాయిలూ అమ్మాయిలూ తొలిచూపు లోనే ప్రేమ లో పడిపోతారు. కొన్ని విచిత్రమైన సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. ఇదే నిజమేమో అన్న భ్రాంతో, ఇది భ్రాంతి ఏమో అనే నిజమో ... ఎదురుతుంటై.


జనం తరచూ తమ లక్ష్యాలను మార్చుకుంటూ ఉంటారు. జీవితానికి ఎటూ ఒక అంతం అంటూ ఉంది. అంతవరకూ జాలీ గా బ్రతికేద్దామని కొందరు, ఇతరుల కోసం బ్రతుకుదామని కొందరూ, తమ కోసం, తమ పిల్లల కోసం మాత్రమే తమ జీవితం అనుకునే ఇంకొందరూ.. ఇలా బోల్డంత మంది పాత్ర దారులతో మన జీవితం గందరగోళంగా తయారవుతుంది. ఇంత తికమకలో అసలు "జీవిత పరమార్ధం ఏమిటి ?" అని ఒక ప్రశ్న ఉదయించింది అంటే గొప్ప విషయమే.

ఇలాంటి ధర్మ సందేహాలు వస్తే 'లైఫే జీవితం రా!' అని పెదవి విరిచే అలవాటున్న ఒక కొంటె స్నేహితుడు (టీనేజ్ ఫ్రెండ్) గుర్తు వస్తున్నాడు.

08/04/2008

హాపీ డే..

నాకు చిన్నపిల్లలతో తీసే commercials లో అన్నిటి కన్న ఇష్టమైన commercial ఇది. ఎంత BAD DAY ఐనా చాలా happy happy గా గడిపెయ్యడానికి పనికొచ్చె భలే నాపీ huggies
అని చక్కగా క్యూట్ గా చెప్పే ఈ AD నాకు చాలా ఇష్టం.


06/04/2008

Rahul Gandhi

I tried to use lekhini today, to post this content but I couldnt do it.. I have experienced some trouble in opening lekhini.org. And since I am technically challenged, I couldnt find an immediate solution / alternative to type my content in Telugu. So please bear with me.

I am amused to read the recent stories about Rahul Gandhi... that he rejects to be a minister in the current cabinet reshuffle. I also read that Rahul stated that 'since he is born into a rich family, he doesnt know what poverty is like.. and that he wants the experience it first hand'!!

Alas.. he tried to stay with a dalit family in Amethi during one of his campaigns. But his staff had ofcourse arranged all kinds of mosquito repellants at his servise.. and made his stay a pleasant one.

I suppose he didnt have much to see and experience during his trials and tribulations to experience poverty. Had he spent one open night with mosquitos, he would have experienced what it would like to be poor and uncatered for.

Unfortunately, the young leader doesnt even seem to have a vision for himself. Or Does He ? I have no idea.