Pages

14/07/2008

తీవ్ర వాదం - IEDs - 1

చాలా రోజులయింది ఏమైనా రాసి. అయితే ఈ సారి ఏదయినా కొత్త విషయం రాద్దామని అనిపించింది. తీవ్ర వాదం గురించి రాస్తే ఎలా ఉంటుంది అనిపించింది. మనకి మన ఏరియాలొ ఎక్కడన్నా బాంబు పేలి ఒక పది పదిహేనుగురు చనిపోతే గానీ.. ఈ టాపిక్ అంటే ఇష్టం ఉండదు. ఒక సారి బాంబు పేలి, ఎంతో ప్రాణ నష్టం కలిగాక.. మీడియా కెమెరాల మధ్య ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూనే, మరుసటి రోజు, అదే పరిసరాల్లో, మన రొటీన్ జీవితం లోకి మెల్లగా జారిపోతాం.


మరి తీవ్ర వాదం అంటే ఏమిటి ? దీన్ని నిలువరించడానికి ఏమి చెయ్యాలి ? మనం మన ప్రశాంత మైన జీవితం లో మునిగి ఉండగా.. ఏదో ఒక దురదృష్టకరమైన క్షణం లో ముంచు కొచ్చే మృత్యువు తీవ్రవాదం ! ముఖ్యంగా మనలని భయోత్పాతానికి గురి చెయ్యడానికి దారుణ మారణ హేల ని రచించే ఉన్మాదమే తీవ్ర వాదం.


దీన్ని నిలువరించడానికి, ఈ సైద్ధాంతిక వైపరీత్యాన్ని తట్టుకోవడానికి, అసలు మన రక్షణ బలగాలకు దీని లోని లేటెస్ట్ పోకడ లు (ట్రెండ్ లు) తెలియాలి. సైద్దాంతిక వైరుధ్యాలని వెంటనే సరిదిద్దలేము. కానీ మన శత్రువుల (తీవ్ర వాదుల) బలా బలాలేమిటో, వారు అనుసరించే విధానాలేమిటో తెలుసుకుంటేనే కదా మనం వారిని ఎదుర్కోగలం !


రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం లాంటి జాతీయ పర్వ దినాలు దగ్గర పడుతూండగా, డిల్లీ లో ప్రభుత్వ యంత్రాంగం ఎంత హడావుడి చేస్తుందో తెలుసా ? వార్తా పత్రికలలో, రోడ్ ల మైకు ల లోనూ.. అనుమానాస్పదమెదైనా, వ్యక్తి అయినా, బాగ్ అయినా వెంటనే పోలిసుల దృష్టి లోకి తీసుకు రమ్మని విజ్ఞప్తులూ, ఇంటికి అద్దెకి వచ్చే యువకుల, ఇంట్లోకి పనికి పెట్టుకునే వ్యక్తుల మీదా పోలీసు వెరిఫికెషన్ చేయించండంటూ ప్రకటనలూ, వెల్లువెత్తుతాయి. రైల్ స్తెషన్ లోనూ, రోడ్ ల మీదా అదనపు బలగాలు మోహరించి ఉంటాయి. హఠాత్తుగా ఇండియా గేట్ చుట్టూ రక్షణ వలయాలు ఏర్పడిపోతాయి. ఏదో సాయంత్రం ఐస్క్రీం తినడాంకి వెల్టే, నల్ల పిల్లి కమాండోలు జీప్ లో కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఇవన్నీ మనల్ని కాపాడడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలు.


ఈ భయం దేనికి ? ఎవరి నుంచీ.. లాంటివన్నీ మనల్ని తీవ్రవాదాన్ని గురించి ఆలోచింప చేస్తాయి. తద్వారా, వారి సైద్ధంతిక వాదాల్ని బహిర్గతం చేస్తాయి. తీవ్రవాదం మామూలుగా మనల్ని భయపెట్టకపోను. కానీ బాంబులూ, ఐ.ఈ.డీ (Improvised Explosive Devices) లు లేకపోయి ఉంటే, మనం తీవ్రవాదాన్ని పెద్ద లెక్క చేసే వాళ్ళం కాదు. తీవ్రవాదం అంటే పోలీసులూ, తీవ్రవాదులకూ మధ్య ఏదో యుద్దం లే అనుకుని ఉండేవాళ్ళం. అందుకే, ఈ ఐ.ఈ.డీ లు ఇప్పటి తీవ్రవాదులకు మురిపెమైన ఆయుధాలు.


ఇప్పటి తీవ్రవాదులంతా, తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లూ.. రక రకాల సాంకేతిక రంగాలలో అత్భుత ప్రతిభ కలవాళ్ళూ కావడం ఈ ఐ.ఈ.డీ ల సృష్టి కీ, విస్తృత వాడకానికీ దారితీసింది. చవగ్గా, తేలికగా దొరికే రశాయనాలు, విడి భాగాలతో సులభంగా తయారయ్యే ఐ.ఈ.డీ లూ / బాంబులు అందుకే ఇప్పటి ఫేవరెట్ ట్రెండ్.


పైగా, ఈ కొత్త బాంబులతో నిక్కచ్చి గా దొరికే అత్భుత ఫలితాలు (ఎక్కువ సంఖ్య లో ప్రాణ నష్టం) రక్షణ బలగాలను తీవ్ర నిరాశ లోకి నెట్టేస్తాయి. (మొరేల్ దెబ్బ తీయడానికి బాగా ఉపయోగ పడుతుంది) వేరే వేరే తీవ్రవాద సంస్థలు ఈ విభాగంలో తమ తమ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటాయి. (Like.. you have one Idea and I have one Idea, when we share them, we both will have two ideas each!)


ఇలా ఎప్పటికప్పుడు మంచి పరిజ్ఞానం తో ఐ.ఈ.డీలు విజృంభిస్తున్నాయి. అందుకే, వీటిలో కొన్ని రకాల గురించి నాకు తెలిసిన కాస్త జ్ఞానాన్ని పంచుదామని ఈ ప్రయత్నం.

4 comments:

అబ్రకదబ్ర said...

ఇంత సీరియస్ విషయమ్మీద రాస్తూ 'సరదాగా తీవ్రవాదమ్మీద రాస్తే ....' అంటారేమిటండీ! ఆ మాట చదవటానికి కాస్త ఇబ్బందిగా అనిపించింది.

మీరు రాయబోయే విశేషాల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అయితే, వాటి గురించి మరీ ఎక్కువ విజ్ఞానాన్ని ఇక్కడ పంచవద్దని మనవి.

కత్తి మహేష్ కుమార్ said...

సరైన సమయంలోనే రాసారు.

జూలై 7 న కాబూల్ లోని భారత రాయబార కార్యాలయం మీద ఒక మానవబాంబు దాడి జరిగింది. ఇప్పటివరకూ 48 మంది చనిపోగా 150 మంది గాయపడ్డారు.

పాకిస్తాన్ unwritten-law ని ఉల్లంఘించి ISI ద్వారా ఈ పని చెయ్యించిందనడానికి ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం ఇరువురివద్దా కావలసినన్ని ఆధారాలున్నాయి.

ఇలా సార్వభౌమ దేశాలే తీవ్రవాదానికి పాల్బడుతుంటే అడిగేదెవరు? అమెరికా మాత్రం "ఇది ఆఫ్ఘన్ లోని సెక్యూరిటీ స్థితికి ఒక ఉదాహరణ మాత్రమే" అంటోంది.

సుజాత said...

సుజాత గారు,
మీరు ఇటువంటి విషయాల మీద రాయడానికి authorised కాబట్టి(ఎందుకంటే మీరు రక్షణ శాఖలో పని చేస్తున్నారు కాబట్టి) ఎటువంటి ఆక్షేపణలూ లేకుండా రాయండి! మీకు తెలిసినదంతా మాకు పంచండి. ఎక్కువైనా పర్లేదు. అధికారికంగా మీరు రాసే విషయాలని అంతా రాయండి,మీ బ్లాగుకి మీరే మహారాణి. కానివ్వండి.

ఈ టపా కూడా వివరంగా బాగుంది. 'సరదాగా తీవ్రవాదం గురించి..' కొంచెం కలుక్కుమంది.

sujata said...

అబ్రక దబ్ర గారు, సుజాత గారు. సారీ! 'సరదాగా' అనే పదం తీసేసాను. థాంక్స్.

మహేష్ గారు - థాంక్స్.