ఝుంపా లాహిరీ రాసిన ఈ పుస్తకానికి 2000 సంవత్సరానికి గాను ప్రఖ్యాతమైన పులిట్జర్ బహుమతి వచ్చింది. ఇది ఒక కధల సంపుటి. పుస్తకం ప్రాచుర్యాన్ని బట్టి, బ్లాగర్లు చాలామందికి, ఈ పుస్తకాన్ని ఇంకో సారి పరిచయం చేసే అవసరం లేదు. కానీ.. చదివిన చాలా రొజుల తరవాత, ఇంకో సారి ఈ పుస్తకాన్ని చదివినప్పుడు, మొదటిసారి చదివినప్పటి కన్నా ఎక్కువ నచ్చింది.
లాహిరి బెంగాలీ. లండన్ లొ పుట్టారు. అమెరికా లో స్థిరపడ్డారు. దేశానికి దూరంగా ఉన్న భారతీయుల ఆత్మలను తాకుతూ రాసిన కధలు.. వాటిల్లో, కొత్త జీవన విధానాలకూ, తాము నమ్మిన భారతీయ విలువలకూ మధ్య నలిగిపొయె పాత్రల చిత్రణ, ఆమె కధలను అంతర్జాతీయ స్థాయిలొ నిలబెట్టాయి.
ఈ కధలన్నిట్లొ, నాకు బాగా నచ్చిన కధ, మిస్సెస్.సేన్. ఇలియట్ అనే ఒక అమెరికన్ పదకొండేళ్ళ పిల్ల వాడు.. వాడి ఒంటరి తల్లి ; మిస్సెస్.సేన్, మిస్టర్ సేన్ లు, మొత్తం పాత్రధారులు. (అనొచ్చా...?!) ఈ ఎలియట్ తల్లి, పిల్లవాడి స్కూల్ ముగిసాక, వాడిని చూసుకొవడానికి అంతవరకూ కుదుర్చుకున్న బేబీ సిట్టింగ్ చెస్తూ ఉండిన అమ్మాయికి వేరే యూనివెర్సిటీ లొ సీట్ వచ్చి, తను వేరే ఊరికి వెళ్ళిపొతుంది. సరిగ్గా అదే సమయంలొ, మిస్సెస్.సేన్ '' ప్రొఫెస్సర్ భార్య.. పిల్లలను, మా ఇంట్లోనే చూసుకుంటాను' అని ఇచ్చిన ప్రకటన చూసి, వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇలియట్ ని ప్రతి రోజూ, స్కూల్ తరవాత, మిస్సెస్.సేన్ చూసుకునె విధంగా, ఇలియట్ తల్లి ఏర్పాటు చేస్తుంది.
అప్పుడే మిస్సెస్. సేన్ పాత్ర చిత్రీకరణ జరుగుతుంది. మిస్సెస్ సేన్, ఒక సాధారణ బెంగాలీ గృహిణి. భర్త, యూనివెర్సిటీ లో మాథెమెటిక్స్ బోధిస్తుంటాడు. ప్రతీ రోజూ, ఇలియట్ కోసం రోడ్ చివర వరకూ వచ్చి, బస్సు లొ వచ్చే పిల్లాడికి, ఏదో ఒకటి తినడానికి ఇవ్వటం, ఇంటికి జాగర్తగా తీసుకుని రావటం, సాయంత్రం వరకూ వాణ్ణి కనిపెట్టుకుని ఉండి, తల్లి పికప్ చేసుకోవటానికి వచ్చినప్పుడు, ఆమె కు కూడా, ఏవో తినటానికి ఇవ్వటం.. ఇలా ఎంతో, జాగర్తగా, సహృదయత తొ మెలుగుతూ ఉండే మిస్సెస్.సేన్ అంటే ఇలియట్ కు ఎంతో అభిమానం, ప్రేమా కలుగుతాయి. తల్లి కన్నా, నిజానికి మిస్సెస్.సెన్ దగ్గరె వాడికి ఎక్కువ వాత్సల్యం దొరుకుతుంది.
ఇలియట్ కు మిస్సెస్.సేన్ చేసే పనులన్నీ విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. ఆవిడ పాపిట్లో సింధూరం చూసి, ఆవిడ తలకి దెబ్బ తగిలిందేమో అనుకుంటాడు. ఆవిడ చాకుతో కూరగాయలు తరిగే విధానం.. ఆవిడ తో చేపల దుకాణానికి వెళ్ళడం.. ఇలా.. ఆవిడ భారతీయత అంతా.. వింతగా, ఇష్టంగా గమనిస్తూ ఉంటాడు ఇలియట్. కానీ అతని తల్లికి ఈ విచిత్రమైన భారతీయ గృహిణి పెద్దగా నచ్చదు. ఏదో తప్పక ఈ ఏర్పాటు కు ఒప్పుకుంటుంది గానీ.. మిస్సెస్.సేన్ ప్రతీ సాయంత్రం ఇలియట్ ను తీసుకెళ్ళడానికి వెళ్ళేప్పుడు - తనకు చేసే అతిధి సత్కారం కూడా ఆవిడకు నచ్చదు.
మిస్సెస్.సేన్.. తన హృదయన్నంతటినీ.. ఈ పిల్లవాడి ముందు స్వచ్చంగా బయటపెడుతూ.. తన మంచితనం తో.. మనల్ని కూడా మురిపిస్తుంది. ఉదా.. తను నేల మీద పేపర్ పరుచుకుని రోజూ కూరగాయలు తరిగేటప్పుడు, పిల్లవాణ్ణి, సోఫా దిగనివ్వదు. తనకు డ్రైవింగ్ అంటే, అయిష్టం, భయం. అందుకే.. ఏది ఏమైనా.. మిస్టర్ సేన్ ఎంత ఒత్తిడి చేసినా... ఇలియట్ కూడా ఉన్నప్పుడు డ్రైవ్ చెయ్యదు. ఇలా.. తన మీద ఆవిడ చూపించే కన్సెర్న్ ని ఇలియట్ హృదయం ఎప్పటికప్పుడు గమనిస్తూ.. అర్ధం చేసుకొవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
ఇలాంటి రోజుల్లోనే.. ఒక సారి మిస్టెర్ మరియూ మిస్సెస్ సేన్, ఇలియట్ కలిసి బీచ్ కు వెల్తారు. హాయిగా సమయం గడిపిన తరవాత, ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, మిస్టెర్ సేన్ ఒత్తిడి మీద (ఆవిడకు డ్రైవింగ్ లైసెన్స్ కోసం పరీక్ష ఉంది మరి!) డ్రైవ్ చేస్తుంది. అయితె, ఆ భయంలో ఒక చిన్న ఆక్సిడెంట్ చేసేస్తుంది. అదృష్టవశాత్తూ .. ఇలియట్ కు దెబ్బలు ఎవీ తగలవు. మిస్సెస్.సేన్ కు కాస్త దెబ్బలు తగులుతాయి. పొలీసులూ.. నచ్చజెప్పడాలూ అవుతాయి. దంపతులిద్దరూ.. పిల్లాణ్ణి ఇంటికి తీసుకొచ్చాక, తల్లికి ఫొన్ చెస్తారు. ఆక్సిడెంట్ గురించి చెప్పడానికి.
ఇంక ఆ రోజంతా, దంపతులిద్దరూ ముభావంగా ఉంటారు. తల్లి పిల్లాణ్ణి తీసుకెళ్ళడానికి వచ్చే ముందు, మిస్సెస్.సేన్, ఇలియట్ కొసం, తినడానికి ఏదో తయారుచేసి పెడుతుంది.. తరవాత, మిస్టెర్ సేన్ కు పిల్లాణ్ణి అప్పచెప్పి, గది లొకి వెళ్ళి, తలుపు వేసుకుంటుంది. తల్లి వచ్చాకా.. మిస్టెర్ సేన్, ఆమెకు క్షమాపణ చెప్తాడు. ఇంక ఆ రోజు నుంచీ మిస్సెస్.సేన్ పిల్లాణ్ణి చూసుకునెది లేదు అని నిర్ణయించుకుంటారు. తన సామాన్లు తీసుకెళ్ళటానికి లోపలికి వెళ్ళిన ఇలియట్ కు, మూసి ఉన్న బెడ్ రూం తలుపుల లొంచీ.. మిస్సెస్.సేన్ ఏడుపూ, వెక్కిళ్ళూ వినపడతాయి.
తల్లీ, ఇలియట్, ఇంటికి వెళ్ళిపొతారు. దార్లో.. తల్లి ''తనకి ఈ ఏర్పాటు తప్పిపొవడం ఒక రిలీఫ్ అనీ.. ఆవిడకు ఎప్పుడూ.. మిస్సెస్.సేన్ నచ్చలేదనీ..'' చెబుతుంది. ఇంక నుండీ.. ఇలియట్ పెద్ద వాడు అయ్యడు కాబట్టి... ఇంక ఒంటరిగానే ఇంట్లొ ఉండాలని నిర్ణయిస్తుంది. అప్పుడు వాడికి తనని కంటికి రెప్పలా చూసుకున్న మిస్సెస్.సేన్.. గుర్తొచ్చి, చాలా బాధ కలుగుతుంది. ఆ తరవాత, వాడు ఎప్పుడూ మిస్సెస్.సేన్ ను కలుసుకోడు.
ఆ అమెరికన్ పిల్లవాడు, భారతీయ సాంప్రదాయాన్ని గురించి సెన్సిటైస్ అవ్వడం, జోళ్ళు బయట విడిచి పెట్టి ఇంట్లొ కి రావడం, మిస్సెస్.సేన్ తన ఇంటి గురించీ.. భారత దేశం గురించీ చెప్పడం వినడం.. అసలు అదేంటో తెలియని దేశం తాలూకూ స్వాభావికత ను అంచనా వెయ్యడానికి ప్రయత్నించడం.. ఇలా.. ఈ కధ లొ సున్నిత పార్స్వాలు అమోఘం.
ఈ కధ నాకు అందుకే బాగా నచ్చింది.
5 comments:
ఎంత బాగా చెప్పారండి!ఇదే మొదటిసారి ఝంపాలహిరి రచన గురించి తెలుగులో చదవటం.
బాబ్బాబుమీకు పుణ్యముంటూంది వీలున్నప్పుడల్లా అంటే వారానికి కనీసం ఒకట్రెండ్ మూడుసార్లన్నా ఇలా పుస్తకపరిచయం చెస్తుండండి,నాలాంటి వాళ్ళ కోసం.మిగిలిన వాళ్ళెటూ ఇంగ్లీషులో చదువుకుంటారుగా!
అన్నీ చాలా మంచి కథలు. నాకు మోస్టు నచ్చినవి ఎంచుకోవాలంటే మొదటిదీ, చివరిదీ
thanks sujata gAru. oka manchi pustakAnni parichayam chEsAru.
ఓపిక చేసుకుని చదివి, వ్యాఖ్యలు రాసినందుకు థాంక్స్. ఏదేదో రాసేద్దామని ప్రయత్నిస్తూ, ఏదీ రాయలేకపొతానేమో అని, ఇంకేదో రాసేస్తుంటాను. అసలు చదివినందుకే థాంక్స్ చెప్పుకోవాలి మీకు.
రివ్యూ చాలా బాగా రాశారండీ..:-) మీ బ్లాగు చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది...ఒక రోజు తీరిక గా అన్ని పోస్టులు చదవాలి..:-)
Post a Comment