Pages

11/02/2008

నా వ్యాపకం
నేను వాలంటీర్ గా పని చేసేది షెల్టర్ అనే ఓ సామాజిక సహాయ సంస్ఠ. ఊర్లో తిరుగుతున్నప్పుడు కపడే చారిటీ షాపుల్లో ఎక్సైటింగ్ గా ఎమీ జరుగుతున్నట్టనిపించదు. కానీ ఒక సారి మా టీం లో చేరాక చాలా నేర్చుకున్నాను. షాప్ ఫ్లోర్ వెనక పని ఎలా జరుగుతుందో మాత్రం నాకు మొదట్లొ పెద్ద ఐడియా లేదు. నాకిచ్చిన పని చేస్తొన్నా.. ఇంత వరకూ. కుప్పలు తెప్పలు గా వచ్చే డొనషన్ లను సార్ట్ చేయటం, సర్దుకోవటం, లేబుళ్ళు తగిలించడం, ధర నిర్ణయించడం.. కబుర్లూ, టీ, స్వీట్స్.. తో పాటూ ఒక్కో చారిటీ షాపూ ఎంతెంత లాభం గడిస్తాయో చూసాక ఆహ అనిపించింది. మన దేశం లో కూడా క్రై లాంటి సంస్థలు చారిటీ షాపుల్ని నిర్వహింఛొచ్చు కదా అనిపించింది.

షెల్టెర్ ముఖ్యంగా ఇళ్ళు లేని వారికోసం నిధులు సేకరిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ప్రతి ప్రధాన నగరం లోనూ దానికి షాపులున్నయి. ఈ షాపులు సాధారణంగా సెకండ్ హాండ్ వస్తువుల్ని, కొన్ని కొత్త వస్స్తువుల్ని కూడా అమ్మి, వీలైనంత ఆదాయాన్ని గడిస్తాయి. ముఖ్యంగా విరాళాలు సేకరిస్తారు. షాపుల్లోకి మాత్రం ప్రజలు తమకు పనికి రాని, ఇతరులకు పనికి వచ్చే పాత వస్తువులూ వగైరాలు ఉచితంగా ఇచ్చి వెళ్తూంటారు. ఇంకా నామ మాత్రమైన కమీషన్ కు కొందరు వర్కర్ లు దగ్గర ఊర్లలో వస్తు రూపంలో ఇచ్చే విరాళాలు కలెక్ట్ చేస్తారు. ప్రతీ వర్కర్ మీ ఇంటి పోస్ట్ బాక్స్ లో ఒక సాక్ ఎన్విలొప్ లో పెట్టి పోస్ట్ చేస్తారు. ఆ ఎన్విలోప్ మీద మరలా వాళ్ళు మీ డొనషన్ లను ఎప్పుడు కలెక్ట్ చేస్కొవటానికి వస్తారో డేత్ లేదా వారం మార్క్ చేస్తారు. సాధారణంగా మీకు రెండు వారాల్నించీ ఒక నెల రోజుల టైం ఇవ్వబడుతుంది. మీరు చెయ్యల్సిందంతా.. మీరు వాడని, డొనేట్ చేద్దమనుకున్న వస్తువుల్నీ, బట్టల్నీ, ఇతరత్రాల్నీ, ఆ సాక్ లో నింపి, నిర్ణీత రోజు న మీ ఇంటి బయట వదిలైయండి. అవన్నీ వర్కర్లు సేకరించి షాపు కి తెచ్చి ఇస్తారు.

ఇలాంటి షాపుల్లొ పని చేసే వాలంటీర్లు రోజులో కనీసం రెండు గంటలు పని చెయాలి. మీరు చేయగలిగిన ఏ పని నైనా చెయ్యొచ్చు. ఈ వాలంటీర్లలో రక రకాల మనుషులు తారస పడతారు. కుర్రకారూ, వ్రుద్ధులూ, స్పెషల్ పీపుల్, బోర్డం తో బాధ పడే ఇల్లాళ్ళూ.. అందరూ. ముఖ్యంగా మా షాపు లో పని చేసే బామ్మలు, వాళ్ళ ఉత్సాహం చూసి నాకు చాలా ఆనందం కలుగుతుంది. విపరీతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో పిచెక్కించేస్తారు. వాళ్ళను చూసి, ఈ జీవితంలో ఉద్యోగం + సంసారం రంధి లో పడి ప్రస్తుతానికి చేయలేక పోతున్న ఏమైనా పనులు.. (పెట్టెల్లో కుక్కేసిన కలలు..తీరిగ్గా నిజం చేస్కోవటం లా అన్న మాట) రిటైర్ అయ్యాక చెయ్యొచ్చా అని ఆలోచిస్తూంటాను.

కాబట్టి మీరూ వాలంటీర్ గా చేరలనుకుంటే తొందరగా చేరిపోండి. రోజూ కొత్త కొత్త వ్యక్తుల్ని కలవటం, కొత్త ఆలోచనా ద్రుక్పధాలను తెలుసుకోవటం చాలా బావుంటుంది. రోజూ కొన్ని గంటలు మీ కమ్యూనిటీకో, మీ కాలనీ లో గుడి కో, గ్రంధాలయం కో.. కేటాయించండి. చీర్స్.

03/02/2008

వారెవా వంటలు..

నాకు మొదట్నించీ వంటా వార్పూ మీద పెద్దగా ఆసక్తి లేదు. అయినా మా ఆయన బిర్యానీ ప్రియత్వం.. నేనో సైట్ కనుక్కొవదానికి దోహదం చేసింది. ఈ సైట్ లో వీడియోలు చూసాక నాకూ వంట మీద ఆసక్తి కలిగింది.


మనం చాల ఫుడ్-బ్లాగ్లు లేదా చానెళ్ళు చూస్తాం. కానీ ఈ సైట్ లో హైలైట్ వీడియోలు. షెఫ్ సంజయ్ విజయానికి ఆయన వీడియోల్లో తను చేసే పనిని ఆనందంతో (ఎంజాయ్ చేస్తూ..) చేయడం.. ఒక ముఖ్య కారణం.


నేను వ్యక్తిగతంగా, ఈ సైట్ వల్ల లాభపడ్డాను కాబట్టి, సైట్ నిర్వాహకుడు, మన టెల్గూ అయిన సంజయ్ కి నా వంతుగా ప్రచార సహాయం చేసేద్దామని కాదు గాని.. (నా బ్లాగ్ కి అంత సీను లేదు...) మీకు ఇష్టమైన ఏదైన వంటకం తినాలనుకుంటే.. ఇక్కడ చూడండి.. మీరు వంట చెయ్యకపోయినా.. వీడియోని ఎంజాయ్ చేస్తారు.

ఈ వంటల వీడియోలు యూట్యుబ్.కాం లో కూడా చూడొచ్చు.

తెలుగు లో బ్లాగు విప్లవం.

తెలుగు లో బ్లాగింగ్, తెలుగు బ్లాగర్ల గురించి ఈనాడు లో వ్యాసం ఇక్కడ చదవండి. ఇన్నాళ్ళూ చక్కగా ఎవరెవరి బ్లాగులయితే చదివానో, ఆయా బ్లాగర్లు అసలు ఎలా ఈ బ్లాగింగ్ మొదలుపెట్టారో చదివి ఆనందం కలిగింది.