ఈ వాహనాలనే బాంబు లు గా వాడడం లో ఇంకో గమ్మత్తు ఉంది. (గమ్మత్తు అన్న పదం నిర్దాక్షిణ్యమే! క్షమించండి) ఈ వాహనం పేలుడు కు గురయ్యాక, దీని బాడీ ముక్కలు ముక్కలు గా చెదురుతుంది. ఈ ఇనుప ముక్కలు (Sharpnel) బాధితుల శరీరాల్లోకి చొచ్చుకుపోయి, తీవ్ర గాయం, రక్త స్రావం తద్వారా బాధితుల మృత్యువు కు దారి తీస్తాయి. పూర్వకాలం లో లాగా, బాంబు ల లో ఇనుప ముక్కలూ, మేకులూ కుక్కి, కష్టపడి తయారు చెయ్యనక్కర లేదు. తెలివి గా ఏ స్కూటర్ నో, కార్ నో, సైకిలు నో వాడితే, పేలుడు తరవాత, ఆ వాహనాల విడి ముక్కలే అధిక నష్టాన్ని కలిగిస్తాయి.
3) కంటైనెర్ ఐ.ఈ.డీలు
సినిమా హాళ్ళ లో, రద్దీ గా ఉండే మార్కెట్ లలో, టూరిస్ట్ స్పాట్ లలో, రైళ్ళ లో (public transport systems) కామన్ పీపుల్ (సామాన్య జనాన్ని) టార్గెట్ చెయ్యడానికి వాడతారు. ఈ బాంబులు సాధారణంగా ఆయా పరిసరాల్లోకి సరిపోయే విధంగా ఉండే కంటైనర్ ల (ప్రెషర్ కుక్కర్ లూ, సూట్ కేసులూ, ఏర్ బాగ్లూ లాంటివి) లో ఒక ఐరెన్ కేసింగ్ తో తీసుకుని వెళ్తారు. ఈ పద్ధతిని లక్నో లోని కోర్టు భవనం లోనూ, లాయర్ల చాంబర్ లోనూ ప్రయోగించారు. మన కళ్ళ ముందు ముంబాయి లోకల్ ట్రైన్ ల సీరియల్ దాడుల జ్ఞాపకం చెదిరిపోనేలేదు కదా ! ఈ దాడుల్లో ఈ ప్రెషర్ కుక్కర్ లనే వాడారు.
కంటైనర్ లంటే, కుక్కర్ లే కాకుండా, పాల కేన్లూ, టిఫిన్ బాక్సు లూ, కేరియర్లూ, ఘీ (నెయ్యి) డబ్బాలు, ట్రంక్ పెట్టెలు, ఆఖరికి ఎల్.పీ.జీ.సిలిండర్లు కూడా కావచ్చు.
కాబట్టి, ఎక్కడన్నా, అసాధారణంగా ఏదయినా బాగ్, బాక్స్ లేదా కనీసం టిఫిన్ బాక్స్ దొరికినా, కనిపించినా ప్రమాదమే అని తెలుసుకోవాలి.
4) మానవ బాంబు
మానవ బాంబు / ఆత్మాహుతి దాడి చాలా పోటెంట్ మెథడ్ గా పేరొందింది. పేలుడు పదార్ధాలను, (ఐ.ఈ.డీ లను) వొంటికి ధరించి, లేదా పోర్టబుల్ పేలుడు పదార్ధాలను వాహనం లో అమర్చి, ఆ వాహనాన్ని టార్గెట్ ను చేరేందుకు వాడుతూ టార్గెట్ దగ్గరకు పోయి, వాటిని పేల్చడం ద్వారా, టార్గెట్ కు ప్రాణ నష్టం కలిగించడం దీని ప్రధాన లక్షణం. వాయు మార్గం గుండా దాడి చెయ్యడం - (ఏరియల్ దాడి) కూడా ఆత్మ హత్యా సదృశ్యమే !
ఉదా : ఎల్.టీ.టీ.ఈ దాడులు
రాజీవ్ గాంధీ హత్య, బియాంత్ సింగ్ హత్య, మనకు మానవ బాంబులను పరిచయం చేసాయి. హైదరాబాదు లో ఎస్.టీ.ఎఫ్. ఆఫీసు మీద మానవ బాంబు దాడి గుర్తుందిగా. ఇలానే, మన పార్లమెంట్ మీద దాడి కూడా ఆత్మాహుతి దాడే ! ఈ దాడి లో తీవ్రవాదులు ప్రాణాలకు తెగించి పాల్గొన్నారు.
5) పార్సెల్ బాంబులు / లెటర్ బాంబులు
పార్సెల్ / లెటర్ లో టార్గెట్ కు బాంబు ను పంపాలంటే, సాధారణంగా ఐ.ఈ.డీ చాలా చిన్నదీ మరియూ శక్తి వంతమైనదీ అయి ఉండాలి. ఈ రకం బాంబులు ఐ.ఈ.డీ రకాన్ని బట్టీ నష్టాన్ని కలిగిస్తాయి. కేరళ లో 2006 లో ఇలాంటి బాంబులు కూడా పేలాయి. వీటిని సాధారణంగా లో ఇంటెన్సిటీ బాంబు దాడులు గా పరిగణిస్తారు.
2 comments:
I.E.D ల గురించిన మూడు వ్యాసాలు వివరణాత్మకంగా ఉన్నాయి. వీటి నుంచి మనలను మనం ఎలా కాపాడుకోవాలో తరువాతి భాగం లో ఉండగలదని ఆశిస్తాను. ఈ టపాకు కామెంట్స్ లేవంటే అర్థం, ఇలాంటివి చదవటానికి కూడా భయం.
థాంక్స్ రావు గారు! మీరు చెప్పిన మాట నిజమే. ఈ సబ్జెక్ట్ ఎవరికీ నచ్చదు. తీవ్ర వాదం అంటే చికాకు, విసుగు, ఆ అమానుషత్వం మీద కోపం వంటివి అందరికీ సహజం గానే ఉంటాయి. అయినా, తెలుసుకోవడం లో తప్పేముంది ?! మనిషి కి భగవంతుడు ఇచ్చిన క్రియేటివిటీ ని వారు ఈ అక్రుత్యాలకు వాడుతూ, మనల్ని ఓడిస్తుంటే, మనం, కనీసం వారి కన్న ముందే ఆలోచించడానికి తయారవాలి గా! అందుకే, వాళ్ళు ఎప్పుడూ మన కన్న ముందు ఉంటూ.. వస్తున్నరు. అయితే, ఈ ఐ.ఈ.డీ ల నుంచీ ఎలా కాపాడుకోవాలో నేను బహుసా చెప్ప లేనేమో ! అప్రమత్తత అన్నిటికన్నా ఫండమెంటల్ రక్షణ కవచం మనకి. అంతే!
Post a Comment