Pages

04/07/2008

న్యుక్లియర్ డీల్ కు పట్టిన గ్రహణం

ఈ రోజు వార్తల్లో ఒక విశేషం ఉంది. కారత్ అండ్ పార్టీ ''యాంటీ అమెరికనిజం'' తో చేతులూ కాళ్ళూ అడ్డు పెట్టిన న్యూక్లియర్ డీల్ ని ఎలా అయినా పుష్ చెయ్యాలని ప్రధాని + సోనియా .. ఇలా అందరు ప్రయత్నాలు చేస్తున్నారంట. ఈ రోజుకి ఇన్ ఫ్లేషన్ పన్నెండు శాతం ఉంది. ప్రపంచం అంతా చమురు సంక్షోభం లో చిక్కుకు పోయింది. కొందామన్నా పెట్రోల్ దొరకని రోజులు వచ్చాయి. పెట్రోల్ బారెల్ $ 150 కూడా దాటేస్తూంది. ఇలాంటి కష్ట కాలం లో బంగారు పళ్ళెం లాంటి ఈ న్యూక్లియర్ ఒప్పందం భారత దేశానికి మేలే చేస్తుంది. ఇంధనావసరాలలో కొన్నిటికైనా ఈ డీల్ వల్ల ఒక ప్రత్నామ్యాయం దొరుకుతుంది.

అదృష్టవశాత్తూ సమాజ్ వాదీ పార్టీ సహాయం తొ, ఒక వేళ కారత్ తిక్క వేషాలు వేసి ప్రభుత్వానికి మద్దతు ఉపసం హరించుకుంటే తట్టుకుని నిలబడి, ఈ డీల్ అసలు అమలు లోకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని విని, చెవుల్లో అమృతం పోసినట్టనిపించింది. నిజంగా.. రాజకీయ నాయకులు దేశానికోసం, దేశ ప్రయోజనాల కోసం ఇలా కూటములు ఏర్పాటు చెసె అసలు ఆలోచనంటూ చెసారంటేనే, ఏదో.. దివ్యానుభూతి కలిగినట్టయింది. ఇది ఎంతవరకూ పోతుందో తెలియదు గానీ.. అసలు కారత్ కి నోరు మూయించే ఆయుధం మన్మోహన్ కు దొరకడం.. మన అదృష్టం. ఒకవేళ ఈ రోజు ప్రభుత్వం పడిపోతే, ఈ ఖరీదు రోజుల్లో, ఇంకో సాధారణ ఎన్నికల డ్రామా కి జనం తట్టుకోగలరా ?

ఆలోచించగలిగే శక్తి ఉన్న ప్రతీ వారూ.. ప్రత్నామ్యాయ ఇంధన వనరుల ప్రయోజనాన్ని గుర్తిస్తున్నప్పుడు, భా.జ.పా.కూడా ఈ డీల్ కు వ్యతిరేకం కానప్పుడూ.. ఎవరో తిక్క పార్టీలు తప్ప దీన్ని అందరూ సమర్ధిస్తున్నప్పుడూ.. ఎందుకు ఈ వ్యతిరేకత ? మన ఖర్మ కాక పొతే !

అబ్దుల్ కలాం కూడా ఈ deal దేశ ప్రయోజనాలకు అవసరం అని చెప్పినా.. తలకెక్కని ఈ లెఫ్టిస్టు రాహు కేతువుల ఆట ఎప్పటికైనా కట్టి, న్యూక్లియర్ డీల్ ఒక గట్టున పడాలని ఆ శత కోటి దేవతలకు మొక్కుకుంటూ. .

3 comments:

పద్మనాభం దూర్వాసుల said...

లెఫ్ట్ పార్టీలు, ములాయం - విరిరువురూ వారి వారి రాజకీయ ప్రయోజనాలకు చూశారు. ఇది నిజం. చేతగాని ఈ యూ.పి.ఏ ప్రభుత్వం ఈ విధంగానైనా పోతుందని ఆశించాను. అన్నీ తప్పుడు విధానాలే. అడ్డూ అదుపూ లేని ధరలు. సామాన్యుడు బ్రతకలేని పరిస్తితి ఏర్పడింది. వీరి సూడో సెక్యులరిస్టు విధానాలు భారతీయ సంస్కృతిని మంట కలుపుతున్నాయి. ఇక ఈ న్యూక్లియర్ ఒప్పందానికి వస్తే దాని అనుబంధమైన 123 ఒప్పందంలో భావిలో మనకు కష్టాలు తెచ్చే క్లాజులు ఉన్నాయి. అమెరికా దాని (నికృష్టపు) ప్రపంచ రాజకీయాలను అడ్డులేకుండా నడపడానికి ఈ డీల్ ఉపయోగించే సూచనలున్నాయి.ఇటువంటి ఒప్పందం పట్టుకొని ఆదరాబాదరాగా ఎదో ఒకటి చేసెయ్యాలని మన్మోహనుడు పట్టుపట్టడం మూర్ఖత్వం.నిశితంగా చూస్తే తెలిసో, తెలీకో అమెరికన్ల ఉచ్చులో పడినట్టుంది. ఏదో ములాయం దేశాన్ని వెంటనే ఎన్నికలు రాకుండా రక్షించేడని సంబరపడడం సరికాదు.ఈ ములాయంలు, ఈ సోనియాలు,ఈ కారత్ లు ఈరోజు ఉంటారు. రేపు పోతారు. భారతదేశం ఎల్లప్పుడూ ఉండేది.

Sujata M said...

దూర్వాసుల గారు, మీ సమగ్ర వ్యాఖ్య కు థాంక్స్. కానీ, ప్రస్తుత పరిస్థితుల లో దేశానికి ఈ డీల్ పనికి వస్తుందనే నా నమ్మకం. దీని మీద ఇప్పటి దాకా పార్లమెంటు హౌస్ లో సమగ్ర మయిన చర్చ నే జరిగింది. డీల్ ని యధాతధంగా కాక పోయినా.. మనకి కావలసిన మార్పు చేర్పులతో సాధించుకోగల సాధికారత, సార్వభౌమత్వం మనకు ఎంతో కొంత ఏడిచే ఉంటుంది కదా. దాన్ని ఉపయోగించుకోవడం తప్పు కాదు.

మన్మోహన్ ఈ డీల్ ని పుష్ చెయ్యడానికి ప్రయత్నిచడం కూడా ఆయన రాజకీయ మైలేజీ కోసం కాక పోవచ్చేమో. ఎన్టీఆర్ టాంక్ బండ్ మీద విగ్రహాల నుంచీ, చంద్ర బాబు జన్మ భూమి పధకం వరకూ మనకు వాళ్ల వాళ్ల లబ్ది కోసం పనిచేసేరని గట్టి నమ్మకం తప్ప, వాళ్లు ఆయా పనుల ద్వారా మనకు మేలు చేసేరని ఒప్పుకోం! చంద్ర బాబు హైటెక్ మీద అంతగా ఆసక్తి చూపబట్టే, హైదరాబాద్ లో ఇంటింటా సాఫ్ట్ వేర్ నిపుణులు, యువత లో నిరుద్యోగిత తగ్గిన పరిస్థితి, వచ్చింది. కాబట్టి విజన్ ఉన్న రా.నా. లు లేరు అనుకోవడం తప్పు. అన్నీ స్వప్రయోజనాల కోసమే చేస్తారు గానీ.. మరీ పుట్టి మునగానివ్వరేమో అని నాకు కాస్త ఆశ!

Vinay Chakravarthi.Gogineni said...

nijamee ee deal manchide prati okkaru....edo papers chadivesi aa side nunche alochincharu anipistunnadi....eee project cost 2 lak crores..anni kottta reyacters kattali.....manam intakumundu ilane depend ayyi kattamu....but pokhran lo manam nuclear bomb test chesi napudu america restrictions valana .....ippudu tarapur reactor paristiti elavundante...chala worest..mannaku recyclying chesukone technology kuda ledu.....
alane bhavishyattulo..adi technology leda urenium supply apindanuko appudu enti...total projects waste.......anduke.....we have to see for another option that is fast breaders..thorium reactors....manam indialo ekkad chusina mee inti mundu mattlo kuda thorium vuntundi...anduke memu anedi dani research meeda atleast oka thousand crores spend cheste...manam evvari meeda depend kaavalsina paniledu kada ani.....

kalam chebutadu andi..meeru maree ataniki anni telusu annatlu maatladkandi....he said his view....tanaki chaala teleedu....