Pages

27/07/2008

బాంబు దాడి సూచనలు

బెంగుళూరు, అహ్మెదాబాద్ లో జరిగిన బాంబు పేలుళ్ళు చాలా అన్యాయం. అహ్మెదాబాద్ లో హాస్పిటల్స్ దగ్గర పేలుళ్ళు మరీ అమానుషం. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు ఏమి చేస్తున్నారో, ఎలా అప్రమత్తంగా ఉండాలో పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తే బావుంటుంది. కారు పార్కింగ్ లో టికెట్లు ఇచ్చే అబ్బాయిలూ, వాచ్ మేన్లూ.. టీ దుకాణం వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండే లా ఏదయినా వర్క్ షాప్ దేశవ్యాప్తం గా నిర్వహించాలి.


ఈరోజు రేడియోలో వాతావరణ సూచనలు వింటూంటే, పనిలో పని గా.. దేశంలో ఎక్కడెక్కడ బాంబు పేలుళ్ళు జరగొచ్చో చెప్పేస్తే బావుణ్ణనిపించింది. విశాఖ లో తుఫాను హెచ్చరికల సమయంలో అప్పటికే సముద్రం లోకి వెళ్ళిన జాలర్ల సంగతి వొదిలేస్తే, రేడియో లో ఎంతో మంచి గొంతు ఒక్కటి మాత్రం - సముద్రం లోకి చేపలు పట్టడానికి వెళ్ళొద్దు నాయనలారా.. ఫలానా చోట 'అల్ప పీడన ద్రోణి ' ఉందంట బాబూ - అని చెప్పేస్తుంది. ఈ హెచ్చరికలు విన్నారా సరే ! లేదా పాపం జాలర్లు చాలా మంది ప్రతీ సారీ గల్లంతు అయిపోయే అవకాశాలుంటాయి !


అలానే, నిన్న అక్కయ్య, చెల్లెలూ, అమ్మా, నాన్నా, ఇతర బంధు గణాలూ.. ''అమ్మాయీ.. బోనాలూ బోనాలూ అంటూ వీధి లోకి వెళ్ళొద్దు తల్లీ.. హైదరాబాదు లో కూడా బాంబులు పేలొచ్చుట !'' అని హెచ్చరికలు జారీ చేసేరు.


భారత దేశం - అండర్ ఎటాక్ అంటూ టీవీ వాళ్ళూ ఫ్లాష్ వార్తలు ప్రకటిస్తున్నారు. కాబట్టి, ప్రజలారా, ఒక రెండు మూడు రోజులు జాగర్తగా ఉండండి.


.. ఈ అప్రమత్తత ఒకట్రెండు రోజులకో, ఒకరిద్దరో పాటించడం కాదు ! చెత్త ఏరుకునే పిల్లలు కూడా బాంబు అంటే ఏమిటో, ఎలా ఉంటుందో తెలుసుకుని, ప్రాణాలు రక్షించేలా అందరూ అప్రమత్తంగా ఉండాలి. తీవ్రవాదుల మీద మనమూ అప్రమత్తత పోరాటం మొదలు పెట్టాలి. నిర్లక్షం ఎంత మాత్రం వొద్దు !


ఇది ఈ యుగ ధర్మమేమో ! రోజూ వానొస్తుందా / ఎండ ఉంటుందా అని మాత్రమే కాకుండా.. బాంబు లూ, పేలుళ్ళూ కూడా మీ ఊర్లిలో లేదా మీరు రోజూ ఆఫీసుకెళ్ళే దారిలోనో ఉన్నయ్యేమో చూసుకోవాలి మరి ఇంక నుంచీ ! అందుకే మరి దీనికి 'బాంబు దాడి సూచనలు ' అంటూ ఏదో ఒక కార్యక్రమం ఉంటే బావుణ్ణు.

5 comments:

Kathi Mahesh Kumar said...

చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం.
బాంబులు పేలినప్పుడు నేను బెంగుళూరులోనే ఉన్నానండోయ్!

Bolloju Baba said...

మహేష్ గారు
నిజమా. అక్కడే ఉన్నారా?
praise god.

Sujata M said...

Baba garu Nijame. Praise the Lord.

Mahesh garu. Hope u are fine.
I just missed the Sarojini Nagar explosions just by an hour, at Delhi.. it was pure luck.

mari, chanipoyina vaari sangati ..? Can they ever believe in God ?

పెదరాయ్డు said...

మీ సూచన ఆచరణీయం. ప్రతిఒక్కరూ ఈ ఉగ్రవాద చర్యల గురించి కొంత అవగాహన కలిగి ఉండాలి. అనుమానాస్పద కదలికలను గమనించినపుడు ప్రతిస్పందించగలిగేలా వుండాలి.

Rajendra Devarapalli said...

ఇక్కడ ఇంకొక్కటి నేను జతచేస్తున్నాను సుజాత గారు మీ అనుమతిలేకుండా.ఉగ్రవాద్/తీవ్రవాద.అతివాదులెవరైనా ఆశచూపే ప్రలోభాలకు లొంగకుండా ఉండగలటం కూడా అలవాటు చేసుకోవాలి.