Pages

24/05/2008

విమానం Vs. వోల్వో బస్సు!!

బెంగుళూరు లో విమానాశ్రయం ప్రారంభం అయాకా, రెండు వారాలకు ఒకసారి బెంగుళూరు నుంచి హైదరాబాదు ప్రయాణం చేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.. వోల్వో బస్సే.. బెస్ట్! అని నిర్ణయించుకుని ఉంటారు. బెంగళూరు నుంచీ విమాన మార్గం ద్వారా.. హైదరాబాద్ రావడం ఇక నుంచీ కష్టం. ఎలెక్ట్రానిక్ సిటీ నుంచీ.. ఎయిర్ పోర్ట్ కి మూడు గంటలూ.. రిపోర్టింగ్ టైం గంట, ప్రయాణం గంటన్నర (సరిగ్గా టైం కి బయలు దేరితే..), హైదరాబాదు చేరాక, లగేజీ తీసుకోవడానికి అరగంట నుంచీ గంట, ఎయిర్ పోర్ట్ నుంచీ నగరానికి రెండు - మూడు గంటలూ ; ఇలా కనీసం తొమ్మిది గంటలు ప్రయాణిస్తే గానీ గమ్యం చేరలేరు. ఇంకా.. విమాన ప్రయాణానికి ఖర్చు ఒక వంతూ, ఎయిర్ పోర్ట్ చేరేందుకు ఆటోలకూ, టాక్సీ లకు అయ్యే ఖర్చు ఒక వంతు కలిసి, మొత్తం ప్రయాణాన్ని ఖరీదుగా చేసేసాయి.


అదే ప్రైవేట్ బస్సు అయితె.. సిటీ మధ్య లో రాత్రి పూట ఎక్కితే, తెల్లారే సరికి.. బెంగుళూరు గాని హైదరాబాద్ అయినా కనీసం ఏదైనా సెంటర్ లో (సిటీ మధ్యలో) దిగొచ్చు. ఇల్లు చేరేందుకు ఎవరన్నా ఫ్రెండ్ కు ఫోన్ చేసి పిలిచినా.. ఎక్కువ మైండ్ చెయ్యకుండా లిఫ్ట్ ఇచేందుకు వస్తారు. ఆటో కో , టాక్సీ కో కూడా.. మరీ దోచిపెట్టేయ్యనక్కర్లేదు. తక్కువ లగేజీ ఉంటే, సిటీ బస్సు పట్టుకోవచ్చు.


హైదరాబాదు లో ఇపుడు ఎయిర్ పోర్ట్ నుంచీ మా ఇంటికి వెళ్లడానికి టాక్సీ కి ఎనిమిది వందల నుంచీ వెయ్యి రూపాయలు పడుతుందంట. విమాన ప్రయాణం అందరికి అందుబాటులోకి రావలసింది కాస్తా.. కొండెక్కి కూర్చుంటుంది.

3 comments:

వికటకవి said...

లంచాల కోసం ప్రాజెక్టుల కంటే ముందు నీటి కాల్వలు గట్టే ప్రభుత్వాలివి. ఇంత కంటే ఎక్కువ ఆశించటం వృధా.

సుజాత said...

సుజాత గారు,
బాగా చెప్పారు. నిజానికి బెంగుళూరు నుంచి హైదరాబాదుకు (బేగం పేట్)విమానంలో 50 నిమిషాల ప్రయాణం. అక్కడినుంచి ట్రాఫిక్
లో పడి ఇల్లు చేరే సరికి మరో రెండు గంటలు. అదే హైదరాబాదు నుంచి బెంగుళూరు వచ్చామనుకోండి, ఎయిర్ పోర్టు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న (ముఖ్యంగా సాయంత్రం ఏడుగంటల టైములో లాండయ్యే ఫ్లైటులో వస్తే)ఇంటికెళ్ళడానికి 3గంటలు పట్టినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఇక త్వరలో దేవనహళ్ళి ఎయిర్ పోర్టు కూడా మొదలవుతుంది ఇక్కడ. అక్కడ షంషాబాదు!

అందువల్ల హాయిగా వోల్వో బస్సెక్కి ఇంతకు ముందు 11 సార్లు అదే బస్సులో చూసిన సినిమానే చూస్తూ, ఎలాగో హైదరాబాదు చేరడమే బెటరు. ఆ మధ్య మాకు వోల్వో టికెట్లు కూడా దొరక్క లాలూ పుణ్యమా అని మొదలైన గరీబ్ రథ్(fully air conditioned) లో HYD నుంచి BNGLR వచ్చాము. ట్రైనెక్కాక చూస్తే అందరూ ఐటీ వాళ్ళే! ట్రైను హాయిగా శుభ్రంగా ఉంది(కొత్త కాబట్టేమో)! 50 రూపాయలిస్తే రగ్గూ, తలగడా ఇచ్చాడు అటెండెంట్! టికెట్ కూడా తక్కువే! Rs.465 అనుకుంటా! (అదే కాచిగూడ ఎక్స్ ప్రెస్ లో దాదాపు 785 )

మరీ అర్జెంట్ అయితేనో, ఆఫీసు వాళ్ళు పెట్టుకుంటేనో తప్ప కొత్త ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే ధైర్యం ఇప్పట్లో లేదు.

తాజాకలం: మీరు చక్కగా రెగ్యులర్ గా రాస్తున్నారు. నాకు బ్లాగులు చదవడానికే టైము సరిపోవడం లేదు. అందువల్ల అన్ని బ్లాగులూ చదువుతూ కామెంట్లు రాస్తూ గడిపేస్తున్నాను.

sujata said...

వికట కవి గారు.. నిజం చెప్పారు.

సుజాత గారు.. మీ సూచన లో పాయింట్ ఉంది. కానీ ట్రైన్ బెంగలూరు సిటి కి వెళ్ళదు కదా. మళ్లా ఎలహాంక నుండి ఊర్లోకి ఇంకో రెండు గంటలు ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి, ట్రైను, విమానం.. తీరికా.. ఓపికా ఉన్నాళ్ళ కే లెండి. నేను వచ్చే నెల మళ్ళీ వర్క్ కి వెళ్ళటం మొదలెడతాను కాబట్టి అపుడు ఇంతగా బ్లాగకపోవచ్చు! :D