Pages

05/05/2008

టిబెట్ స్వతంత్ర పోరాటం

టిబెట్ ఇప్పుడు (కనీసం బీజింగ్ ఒలంపిక్స్ ముగింపు వరకూ) ఒక వార్త. దలైలామా ప్రతినిధుల కూ, చీనీ అధికారులకూ జరిగే చర్చల్లో ఎప్పట్లాగే ఏమీ తేలేది లేదు. కానీ విషయాన్ని చర్చల వరకన్నా కనీసం తీసుకు రాగాలగటానికి టిబెట్ వాసులు ప్రపంచ వ్యాప్తంగా చాలా కృషి చేసారు. చైనా కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్సనలు, పెద్ద పెద్ద దేశాల్లో ఒలింపిక్ జ్యోతి ని ఆర్పటం లాంటివి పెద్ద ఎత్తున ధైర్యం గా చేసి ప్రపంచ వ్యాప్తంగా తమ గొంతు ను, గోడు ను వినిపించే ప్రయత్నం చేసారు.
టిబెట్ కు స్వాతంత్రం రావాలని, దేశాన్ని విడిచి బ్రతుకుతున్న టిబెతన్లు ఎప్పటికన్నా తమ దేశాన్ని చేరాలని నేనూ కోరుకుంటున్నా.
ఈ దృశ్యం జెనీవా లో ఒక టిబెటన్ - ఇండియన్ దుకాణం ముందు కనిపించింది. (మరీ ఈనాడు విలేఖరి లా రాస్తున్నానా ? నేను గత వారం జెనీవా వెళ్ళాను. ఈ ఫోటో నేను తీసిందే. ఎమేచ్యూరు ఫోటోగ్రఫీ ! ) ఈ నినాదాన్ని ప్రపంచం ఇంతకూ ముందు లైట్ గా తీసుకుంది. కానీ టిబెతన్లు మాత్రం ఈ సారి చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలూ అహింస ను నమ్ముకున్న టిబెట్ ప్రజలు సాధించలేక పోయిన Attention చైనా ప్రతిష్టాత్మకంగా జరప బోతున్న ఒలింపిక్ క్రీడ ల సందర్భంగా తమ వ్యతిరేకత ను ఉధృతం చేసి సాధించారు. అందుకే టిబెట్ కు సంబంధించిన ప్రతి వార్తా, టీవీ డాక్యుమెంటరీ...ప్రతీ వ్యాసం, చర్చా ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షించించాయి.


2 comments:

కొత్త పాళీ said...

అవును. ఈ మధ్యన రేడియోలో ఒక ఎక్సుపర్టుగారు - బీజింగ్ లో క్రీడలని జరపడానికి పోటీ పడినప్పుడే చైనా ఇటువంటి గ్లోబల్ స్క్రూటినీని ఆహ్వానించి నట్లైంది. అందుకని చైనా ంఈద యేమీ జాలి పడనక్కర్లేదు అని వ్యాఖ్యానించాడు.

Sujata M said...

కొత్తపాళీ గారు.

ధన్యవాదాలు. గ్లోబల్ స్క్రూటినీ సంగతీ నిజమే. కానీ నా ఉద్దేశం లో ఒలింపిక్స్ కాంగానే టిబెట్ విషయం కూడా మరుగున పడిపోతుంది. అది చాల బాధాకరమైన విషయం. అప్పుడు గ్లోబల్ స్క్రూటినీ కూడా పోతుంది.