అమితాబ్ బచన్ ఇపుడు ఎవర్నీ ఊరికే వదిలి పెట్టడం లేదు. ఎందుకనో అన్ని వివాదాలకూ సాధ్యమైనంత దూరంగా ఉండే అమితాబ్ ఈ మధ్య తన మీద ఎటువంటి దాడి జరిగినా స్పందిస్తున్నారు. వృత్తి, ప్రవృత్తుల పరంగా నిష్ఠ గా వుండే అమితాబ్, ఇటీవల మంత్రి అన్బుమణి రామ్దోస్ కు తన వెబ్సైట్ లో ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈనాడు లో ఈ వార్త చదివాక నాకు చాలా ఆనందం కలిగింది.
http://www.eenadu.net/archives/archive-4-5-2008/panelhtml.asp?qrystr=htm/panel10.htm
సాధారణంగా రెవెన్యూ కోసం ప్రభుత్వమే మధ్య వ్యాపారానికి పూర్తి మద్దతు ఇస్తుంది. పై పై మెరుగులు గా సిగరెట్ పెట్టెల మీద అస్థిపంజరం బొమ్మ ముద్రించమని.. ఒక చట్టం చేసి చేతులు దులిపేసుకుంటుంది. అలాంటప్పుడు రామ్ దోస్ మాత్రం సినీ నటుల సామాజిక బాధ్యత ను తరచూ గుర్తు చేస్తూ, కరకు ప్రకటనలు చేస్తూ, కోర్టు నోటిసులు పంపిస్తూ .. ఏదో 'గొప్ప పని' చేసేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఇదంతా హిపోక్రాసీ నే కదా. ఆయనకు చిత్త శుద్ధి ఉండి ఉంటే తరచూ సమ్మెలు చేస్తూ ప్రభుత ఆస్పత్రుల లో నిష్కారణమైన చావులకూ, ప్రజల తీవ్ర అసౌకర్యానికీ కారణమయ్యే డాక్టర్లూ, మెడికో ల పై ఏదైనా చర్య తీసుకునే వారు. లేక అసలు వాళ్ళతో గొడవ పెట్టుకో కుండా వాళ్ల సమస్యల్ని పరిష్కరించే వారు. లేదా పొగాకు, మద్యాల క్రయ విక్రయాల మీదే దేశ వ్యాప్త నిషేధం విధించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేవారు. కనీసం ప్రజల్లో అవేర్ నెస్ కలిగించే ప్రకటన లన్నా ప్రచారం చేయించే వారు. కాబట్టి నాకు అమితాబ్ వాదన సరైనది గానే అనిపించింది.
1 comment:
ఈ ఆదివారం మహిళా బ్లాగర్ల సమావేశానికి మీరు కూడా తప్పకుండా హాజరు కాగలరు.. వివరాలకు నా బ్లాగు చూడండి. http://jyothivalaboju.blogspot.com
Post a Comment