23/05/2008
వర్షం - నేనూ!
ఈ రోజు వర్షం పడింది! ఆకులూ.. అలములూ, వీదులూ.. శుబ్రంగా తడిచాయి. అసలే పొద్దుట్నించీ డల్ గా ఉన్న వాతావారణం.. మరింత చిరాగ్గా మారింది. నేను కిటికీ లోంచీ చూస్తూ ఇంట్లోనే కూర్చున్నాను. చెయ్యడానికి పని ఉంది.. కానీ చెయ్యబుద్ధి కావట్లేదు ! బద్దకం కాదు.. ఇల్లు గుర్తోస్తూంది! వర్షం పడితే.. ఇంట్లో ఉన్నట్లయితే, హాయిగా ఫ్యాన్ స్పీడ్ లో పెట్టుకుని, మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకుని.. చెల్లి తో కబుర్లో, పుస్తకం చదవటమో చేసేదాన్ని. వర్షానికి బయట దొరికిపోతే.. మాత్రం చిరాకు.
నాకు వర్షం అంటే ప్రత్యేక అభిమానం అదీ లేదు. వర్షం వచ్చే ముందు మట్టి వాసన మాత్రం ఇష్టం. వర్షం పడేటప్పుడు నేను ఇంట్లో ఉంటేనే ఇష్టం. వైజాగ్ లో ఐతే.. దూరం నుంచీ కనిపించే కొండల మీద వర్షాన్ని చూడొచ్చు. కమ్ముకోస్తున్న మేఘాల్ని చూస్తూ, టీ తాగొచ్చు. హైదరాబాద్ లో సరిగ్గా.. ఆఫీసుకి వెళ్లేటప్పుడు, లేదా ఆఫీసు నించీ తిరిగీ వస్తున్నప్పుడూ వర్షం పడుతుంది. వర్షం లో రోడ్లూ.. ఆగిపోయే ట్రాఫిక్! రాత్రంతా వర్షం పడితే.. వెచ్చగా ఇంట్లో పడుకున్నపుడు, ఇళ్లు లేని బీద వాళ్ల కష్టం తలుచుకుని; పాపం వాళ్ళంతా ఎలా సర్దుకున్నారో..?! అనిపిస్తుంది.
వర్షం పడితే.. అయినవాళ్లు దగ్గర ఉన్నప్పుడే ఆనందం. ఒక్కరూ.. ఒంటరులు.. ఎలా ఆనందిస్తారు ? వర్షం పడుతుంటే.. మిర్చి బజ్జి తినాలనిపిస్తుంది! కానీ.. అందరం కలిసి ! వానలోస్తే.. తోట పని చెయ్యాలనిపిస్తుంది. మనిషికి తల దాచుకోవడానికే స్థలం లేదు. తోట ఎక్కడిది ? వర్షం పడితే, విపరీతంగా ఆనందించే అక్కయ్య గుర్తొచ్చింది. వేసవి కాలంలో..వైజాగ్ లో .. విపరీతమైన వేడికి తట్టుకోలేక పోతుంటే, సాయంత్రానికి ఫెళ ఫెళ లాడుతూ కురిసే వర్షం గుర్తొచ్చింది. ఉరుములకూ, మెరుపులకూ.. ఎప్పుడు వానకి పేలిపోయే ట్ట్రాన్స్ఫార్మర్ ! రాత్రంతా.. ఆకాశం చేసే గోల కి నిద్ర పట్టకపోవటం గుర్తొచ్చింది. జ్ఞానాపురం జంక్షన్ లో మునిగిపోయే వీధులు గుర్తొచ్చాయి.
పచ్చని పచ్చిక బయళ్ళూ.. చెట్లూ, చేమలూ నిండి ఉన్నా .. కొండలు లేని దేశం ఇది. అనుకోకుండా అప్పటికప్పుడు చినుకుల దారాలు నెల వైపు ప్రయాణిస్తూ వుంటాయి. ఎప్పుడూ వానే.. ఎప్పుడూ గొడుగు కావాల్సిందే! తరచూ చూస్తున్న వానని చూసి కాదు ఈ విసుగు! రోజు రోజుకీ ఇంటి కి దూరంగా..వెళ్ళిపోతుంటే, వర్షం, వెన్నెలా.. గొప్పగా అనిపించడం మానేశాయి. మళ్ళా కాలం లోకి - 'ఆదిత్యా 365' లో లా వెళిపోయి .. చిన్నప్పుడు స్కూల్ రోజుల్లోకి వెళ్లి అక్కడే ఉండిపోవాలనుంది. ఒక రోజు విశాలాక్షి నగర్ లో, ఒక కసిన్ తో కలిసి, కాలి నడకన, బాటా స్లిప్పర్లు వేసుకుని, జారి, పాకి, పడీ, లేచి... కొండెక్కి, అక్కడ్నించీ సముద్రాన్ని చూసాను. ఆ రోజుల్లోకి !
నా తో నేను విసిగిపోయి.. నా నుంచీ నేనే పారిపోయి.. ఇక్కడ్నించీ మాయం అయ్యి.. అక్కడికి వెళ్లిపోయి.. సముద్రం ముందు అల్చిప్పలూ, గవ్వలూ ఏరుకుంటూ... ఎవరి కోసమో ఎదురు చూడాలని అనిపిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
very nice.okala maadi vizag.i did my school in sacred heart,i hope u know,mee konda yakkadam chadivithe,
naaku varsham lo nenu aadina attalu guruthochai.
అందంగా రాశారు, టైమ్ ట్రావెల్ అలోచన అద్భుతం. ఈ ఆలోచన మీ బ్లాగు చదివి అందరికీ వస్తుంది.
మీది వైజాగా! మొన్నీమధ్యే ఫ్యామిలీ హాలిడేస్ అక్కడ గడిపా. గోవాని తీసిపోని అందాలు. కానీ మన వాళ్ళు అంతబాగా బయటివాళ్ళని ఆకర్షించడం లేదెందుకు చప్మా?
మీ 80% blog addiction తో కుటుంబ సభ్యులు ఎలా adjust అవుతున్నారు? Complaint చెయ్యటం లేదా?
Nice post!!!
సుబద్ర, సౌమ్య, మహేష్ గార్లకు.. థాంక్స్. మాది వైజాగ్. వైజాగ్ - గోవా లకు చాలా తేడా ఉంది. గోవన్లు వాళ్ల పర్యావరణాన్ని రక్షించుకుంటారు. వైజాగ్ వాళ్లు బీచ్ లు ఎంత చెత్త చేసేస్తారో చూడాలంటే, ఋషికొండ బీచ్ కు వెళ్ళాలి. పదేళ్ళ క్రితం యారాడ బీచ్ కీ, ఇప్పటికీ చాలా తేడా ఉంది.
సిబీ రావు గారు.. ప్రస్తుతానికి ఈ అడిక్షన్ (నేను బ్లాగులు ఎక్కువగా, పదే పదే .. [repeatedly] చదువుతాను) నాకు పెద్ద కాలక్షేపం. మా వారు ఆఫీసుకి వెళ్ళాకా.. నా పని ఇదే. ఇపుడే సమస్య తీవ్రతను గుర్తించి, వేరే వ్యాపకాల వైపు మళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నేను మళ్లా వర్క్ కి వెళ్ళేదాకా.. నాకు కష్టమే.
em parledu sodari, edaina,enta busy jeevitamaina, ishtamaina vaatikosam samayam sardukodam lone anandam undi, nuvvu keep it appu, enta busy ayina, blog cheyyatam maanaku, naalanti vallaki ento hayiga untundi chadavataaniki..
వైజాగ్ లో .. మీరు లేరు, మీ వాన ఉంది :-)
బాగుంది.
Post a Comment