చాలా రోజులయింది కదా
అసలు మాటలాడుకుని ..
తెల్లారితే పరుగు పరుగు జీవితం అయిపోయింది.
ఆఫీసులో నవ్వుతూ తిట్టే బాసు గోడు
నీకు కాక ఎవరికి చెప్పుకోను ?
ఇంట్లో అంతా గందర గోళం గా వుంది
బయట కూడా ఏవో గొడవలు
ఆ పనీ ఈ పనీ మిగిలిపోతుంటాయి.
మరీ కష్టం అనిపిస్తే నీ దగ్గరకే గా నేను పరిగెట్టేది ?
ఏ పనీ కాదనకుండా చేసేస్తావు
నా కష్టాల్లో కడగండ్లలో బోల్డన్ని
కబుర్లు చెప్పి, అందమయిన ధైర్య వచనాలు చెప్పేసి
నా పని సుళువు చేసి పడేస్తావు
ఏవో బాధలు - టెన్షన్లూ - నీతో కాక ఎవరితో
పంచుకోను ?
నాకు ఎల్లప్పుడూ శక్తి ని ఇచ్చేందుకు
రోజుకెంత శక్తి ని ఉత్పత్తి చేస్తావో నువ్వు !
అబ్బ - ఈ పరుగుల్లో నీతో నా బాధలు చెప్పుకోవడానికే కుదరట్లేదు!
ఎలా వున్నావు ? ఏమిటి కత ?
ఎప్పుడు మనం మాటాడుకునేది ?
ఎపుడు పాట్లాడుకునేది ?
ఎపుడబ్బా కనీసం ఫోన్ చేసుకునేది ?
పొద్దున్న లేవడం ఆలశ్యం అవుతూంది -
నీ ప్రపంచంలోని కొన్ని పక్షుల కిచ కిచలు ముఖ్యంగా
వినిపించి చాలా కాలం అయింది.
నీ కారు హారన్ శబ్దం కూడా !
ఆ మధ్య పుస్తకాల్లో, నీ చేతి రాత ని చూసుకుని ఒక్క సారి
నీ జ్ఞాపకాల ఉప్పెన్లో కొట్టుకుపోయాను !
చదవమని చెప్తూంటావు కదా !
ఎపుడు మనం డిస్కషన్ కి కూర్చునేది ?
నాకు ఖాళీ ఉంటే నువ్వు పరుగుల్లో ఉంటావు !
నీకు ఖాళీ అయితే నేను పరుగులు !
ఒక్క మాట ! మనం ఒకర్నుంచీ ఒకరు మాత్రం దూరంగా
పరుగులు తీయకూడదు !
అంటే - ఎన్ని పరుగుల తరవాతయినా,
ఎన్ని రోజులు గడిచిపోయినా కూడా
మన మనసులు మాత్రం దగ్గరగానే ఉండాలి.
సరే నా ?
అన్నట్టు - నీకో మంచి పెన్ను కొన్నాను
పరుగుల్లో పడి ఇవ్వడం మర్చిపోయాను
ఈ సారి నీకు తీరికయితే
పాటలాడుకోవడానికి వస్తేనే ఇచ్చేది !
ఎపుడూ నాకోసమే ఆలోచించే నీ
కాల్పనికత -
కాసేపు నేనూ అప్పు తీసుకుంటే
అరే ! చాన్నాళ్ళయిపోయిందే- మాటాడుకుని
అని విపరీతంగా బాధేసేస్తుంది !
ఈ బాధ ని నువ్వెలా తట్టుకుంటావో !
ఈ ఒక్క మాట కే నాకు ఎంతో
ఆశ్చర్యంగా వుంది !
మొత్తానికి నీతో మాట్లాడాలని
ప్రాణం కొట్టుకుపోతుంది - అంతే !
10 comments:
ఒక్క మాటంటూ మొదలెడితే ఎన్ని కబుర్లో కదా!
చాలా బాగుంది! :-)
పరుగులు...పరుగులు....పరుగులు
ఎందుకీ పరుగులు?..ఎక్కడికీ పరుగులు?
ఎప్పటికీ పరుగులేనా?కాస్త స్థిమితంగా కూర్చోలేమా?
అలా కూర్చుని ఆలోచించుకుంటుంటే....ఆలోచించుకో గలిగితే...
ఎంత బావుంటుంది...
ఆలోచించండి.
(సరదాగా)
నేను, మా తమ్ముడి తో చెప్పాలనుకున్నవి, నా మనసులోని మాటలవి.ఎలా కనిపెట్టారేంటి? (అఫ్ కొర్స్ అందరూ వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళతో చెప్పే మాటలే అనుకొండి) మీరు బాగా రాయగలిగారు.
చాలా రోజులనుండి కనపడటంలేదు. అంత బిజీనా అనుకుంటి. కాని అప్పడప్పుడు కాస్త కబుర్లు చెప్పుకోవాలి..
పాటలాడుకోవడానికి వస్తేనే ఇచ్చేది !
ప్రయోగం కొత్తగా ఉంది. బాగుంది!!
-గడ్డిపువ్వు
మీకు ఇంతకు ముందే చెప్పినట్లు మీరు ఆ లేబుల్ మార్చాలి సుజాత గారు. ఇంత చక్కగా రాస్తూ పిచ్చి రాతలు అంటే ఎలా :-)
చాలా బాగుంది, పని వత్తిడి లో పడి ఈ మధ్య కాలం లో బొత్తి గా మాట్లాడ లేక పోయిన నేస్తాన్ని గుర్తు చేసారు. ఈ వీకెండ్ ఖచ్చితంగా మాట్లాడాలి.
beautiful thoughts
Hi purnima
avunu ! Thanks.
నరసింహ గారు
ఔనౌను. బావుంటుంది. చిన్నప్పుడు తాత గారింట్లో డాబా ఎక్కి, పక్కనే పెంకుటింటి వాలు మీదికి చేరి, అక్కడ మేను వాల్చి, పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు ఆకులు పీకుతూ, చందమామ నీ, చుక్కల్నీ చూస్తూ రాజకీయాలు మాటాడుకున్న రోజులు మళ్ళీ రావు ! వచ్చినా, ఇపుడు పెంకులిరిగిపోతాయి ఖచ్చితంగా ! :D Thanks.
బావుంది సుజాత గారూ..
"నీ ప్రపంచంలోని కొన్ని పక్షుల కిచ కిచలు ముఖ్యంగా
వినిపించి చాలా కాలం అయింది..
నీ కారు హారన్ శబ్దం కూడా !"
ఇది చాలా నచ్చేసింది..
Post a Comment