Pages

02/08/2008

విషాదం !

ఈ వార్త తెలియగానే చాలా బాధ కలిగింది. గౌతమీ ఎక్స్ ప్రెస్ లో జరిగిన ఘోర ప్రమాదం - భయంకరమైన మరణాలూ, అత్యంత విషాదం.. ఇవన్నీ ఎప్పట్లాగే జనం మర్చిపోతారు ఇంకో వారానికల్లా !


నేనూ మర్చిపోయాను. ఈరోజు ఆఫీసు కి లేట్ అయిపోతాననే తొందర్లో జుట్టు ఆరబెట్టుకుంటూంటే, హేర్ డ్రయెర్ వేడి కి చటాక్ తగిలినపుడు.. వెంటనే ఈ ప్రమాదం గుర్తొచ్చి బాధ కలిగింది. ఇంత చిన్న వేడికే.. లేదా అగరొత్తి చివర నిప్పు తునక పడినప్పుడే మనం ఓర్చుకోలేము ! మరి మనిషినే దగ్ధం చేసేంత వేడి - ఆ నిస్సహాయత తలచుకుంటే ప్రాణం కొట్టుకుపోయింది.


ఈ రైలు ప్రమాదం అత్యంత విషాద కరమైన సంఘటనగా పేర్కొంటున్నారు. అయితే దీనికి షార్ట్ సర్క్యూట్ కారణం అని వార్తలు రావడం, రైళ్ళ మైంటెనన్స్ గురించి ప్రశ్నలు ఉదయించడం - చాలా హేయమైన సంగతి అనిపించింది.


దీనికి కారణం అయిన వాళ్ళని - మరి ఇంకో సారి ఇలాంటి తప్పులు మరొకరు చెయ్యకుండా - కఠినంగా ఎందుకని శిక్షించరు ? మనకి మంత్రి పుంగవులు ఉండేది ఇలాంటివి జరిగితే ఎక్స్ గ్రేషియా ప్రకటించడానికే అనిపిస్తుంది. అంతకన్నా కొరడా ఝుళిపించి పాడైన వ్యవస్థలని పని చేయించగలిగే మంత్రులు ఉండడం అసాధ్యమా?


రైల్వే ఉద్యోగుల సంఘాలూ, యూనియన్లూ, రాజకీయాలూ ఈ నిర్లక్షాలని కప్పి పుచ్చుకుంటూ సంస్థాగత ప్రక్షాళనలకు ఎప్పటికీ దిగవు. గోధ్రా లో సబర్మతీ రైలు లో ప్రయాణీకులు కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మృతి చెందారని రైల్వే వర్గాలు నివేదిక ఇచ్చాయి. అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతాయి ? రైళ్ళలో భద్రత అనే ఫీచరే లేదా ?!


మన దేశంలో ఎవరూ దేనికీ బాధ్యత వహించరు. రైళ్ళలో అగ్ని నిరోధక ఎక్స్ టింగ్విషర్లు ఉండుంటే, ఇన్ని చావులు ఉండేవి కావు కదా ! ఓకె.. అవి ఎవరన్న ఎత్తుకుపోతారని పెట్టుండరు! మన దేశంలో ప్రాణాలకు పెద్ద విలువ లేదు. కానీ మరీ ఇంత ఘోరాలు జరిగేంతగానా ?!


అందరూ ఇది మనకి సంబంధించినది కానే కాదని చేతులకంటిన దుమ్ముని చెక్కగా దులుపుకుని వెళ్ళిపోతారు! ఇలాంటివి మరి జరగకుండా ఎక్కడా ఎవరూ చర్యలు తీసుకుంటారా ? లేదు!


ఇలా కాకుండా ఉండుంటే బావుండేది. ఇన్ని అన్యాయమైన చావుల్ని దేవుడే నిశ్చయించి ఉంటే అది చాలా పెద్ద విషాదం.

9 comments:

హర్షోల్లాసం said...

sujata గారు
అవునండి నాకు చాలా బాధ కలిగింది.అసలేమిటంటే మా పిన్నత్తగారూ అదే రైలు లో వెన్నారు.మా అద్ర్రుష్తం ఆవిడ s3 లో వున్నారట :( ఇప్పుడు బాగానే వున్నారు లెండి.లేచిన వేళా విశేషం చాలా బాగుంది.

Kalpana Rentala said...

మీ బాధ అక్షరాల నిజము. ఇలాంటి దుర్ఘటనల్ని కేవలం ఒక ప్రమాదంగా చదివి పక్కన పెట్టేస్తారు.
దుర్ఘటన జరిగిన భోగీల్లో ఒక స్టవ్ కనిపించింది. సిలిండర్ కనిపించటం లెదు అంటున్నరు కాని ఇండియా సంగతి తెలియనిదేముంది. ఎవరి మీదకు కేసు వస్తుందో అని ముందే కవర్ చేసేస్తుంటారు.

ఇదే కాదు, ఇంతకన్నా పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినా చేస్తాము, పొడుస్తాము లాంటి కబుర్లు ఒకటి, రెండు రోజులే. తర్వాత అంతా మాములే. ప్రమాదలప్పుడు నష్టపరిహారం ఇచ్చే బదులు దాన్ని ప్రమాదాల నివారణకు వుపయొగించాలన్న బుద్ధి మన ప్రభుత్వాలకు వుంటే బావుంటుంది.

కల్పన

సుజాత వేల్పూరి said...

సుజాత గారు,
నిజంగా దారుణం కదా! మండిపోతున్న కిటికీలను, రైలును చూసి వణుకొచ్చేసింది. తప్పించుకోలేని వాళ్లు ఆ కిటికీల లోంచి చేతులు బైటికి పెట్టి 'రక్షించమ 'ని ఆక్రందించారట. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటే మనసు కుదేలైపోతోంది. ఎవరు ఎవరో తెలీయకుండా కేవలం బూడిద మాత్రం నిండిన 'మహా చితి 'లా మిగిలిన బోగీలను చూస్తే మనిషన్న వాడి ప్రతి వాడు చలించాల్సిందే! కంట నీరు పెట్టాల్సిందే!

మీడియా కూడా చూడండి, రైల్వే భద్రత గురించి, బోగీల నాణ్యత గురించి ఇన్నాళ్ళూ ఒక న్యూస్గా పరిగణించకుండా ఇప్పుడు 'ఆ బోగీలు ఎప్పుడు తయారు చేశారో, ఏ ఏ రైళ్ళకు వాటిని వాడారో లెక్కలు గట్టి స్పెషల్ స్టోరీలు తయారు చేస్తున్నారు. పైగా 'మంటల్లో గౌతమి ' అంటూ కవితాత్మకంగా (టీవీ చానెల్స్) శీర్షికలు.

ప్రాణాలు పోయాక ఇచ్చే పైసలు కుటుంబానికి ఉపయోగపడతాయేమో! కానీ వారి మనసుల్లోచి ఈ దుర్ఘటనను తుడిచి వేయాలంటే 'కాలానికి గాయాన్ని మాంపే శక్తి ఉన్నా ' అది సాధ్యమని నేననుకోను. ఇప్పుడు శవాలు కూడా గుర్తించలేరు కాబట్టి, DNA పరీక్షలు చేయడం, అప్పుడు పరిహారం!

ఇప్పుడు పోయన ప్రాణాలకు విలువ గట్టేకంటే భద్రత గురించి ముందే జాగ్రత్తలు తీసుకోవాలన్న బుద్ధి ప్రభుత్వానికి లేదు.

సుజాత వేల్పూరి said...

మీరు ఇలాగే మంచి మంచి బ్లాగులు రాస్తూ, బోలెడన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ...పుట్టినరోజు శుభాకాంక్షలు!

శ్రీ said...

గౌతమిలో జరిగిన అగ్ని ప్రమాదం చాలా విచారకరం.

మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు!

cbrao said...

గౌతమి ప్రమాదం విషాధం
సుజాత పుట్టిన రోజు ప్రమోదం
ప్రపంచ స్నేహితుల రోజు దినానందం

జ్యోతి said...

happy birthday sujata,,

చైతన్య.ఎస్ said...

మీకు జన్మదిన శుభాకాంక్షలు.

Sujata M said...

Chaitanya,
Jyoti garu
CB Rao Garu
Sujata Garu
Sri garu

Thank you very much

Harshollasam & kalpana - Thanx for ur comments.