Pages

06/08/2008

మీ చిరునామా ఏమిటి ?

ఎవరైనా గొప్పవాళ్ళ గురించి చెప్పేటప్పుడు - వారెంత గొప్పవారో వారి చిరునామా బట్టీ చెప్పేవారు. నీకు తెలుసా.. ఆయన ఎంత గొప్పవాడంటే, ఉత్తరం మీద ఆయన పేరు రాస్తే చాలు - తపాలా శాఖ వాళ్ళు తిన్నగా ఆయనకే ఆ ఉత్తరం డెలివర్ చేసేవాళ్ళు... అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనుషులు పెద్ద వాళ్ళయిపోయి - గొప్ప వాళ్ళు అవటం కూడా ఎక్కువ అయిపోతుంది. ఫలానా గొప్ప మనిషి అంటే తెలియట్లేదు. ఎడ్రెస్స్ తిన్నగా రాసినా ఉత్తరాలు మిస్ అవుతుంటాయి. ఎవరిదీ తప్పు లేదు... జనం ఎక్కువ అయిపోయారు గా మరి.


ఇప్పుడు అంతా మేయిళ్ళూ, ఫేక్స్ లూ.. టెలిఫోన్లూ అయిపోయాకా చిరునామా అంటే ఏమిటో ఎవరికీ తెలియట్లేదు. అయితె గ్రామాల్లో ఫలానా వాళ్ళ ఇల్లు ఎక్కడా అంటే.. చూపిస్తారు. మేమొకసారి హర్యాణా లో ఒక గ్రామం లో పెళ్ళికి వెళ్ళాం. పేరు పెట్టి అడిగితే తెలియలేదు. కులం ఏమిటి అని అడిగారు. పెళ్ళికొడుకు మా కొలీగ్! తన కులం ఏమిటో మాకూ తెలియదు. చచ్చేము రా భగవంతుడా ! అనుకున్నాము. ఆ గ్రామం ఆగ్రా-మథురా రోడ్ లో ఉంది. లైట్లు లేవు. రాత్రి కావస్తూంది. కులం తెలిస్తే గానీ ఇల్లు తెలీదు. ఎలాగో నానా కులాల పేర్లు ఆలోచించి.. జాట్ల పెళ్ళి ఎక్కడ జరుగుతుందని అడిగాం. ఆ ఇలాకా లో జాట్ లు ఉన్నారు గానీ వాళ్ళ పిల్లలు చిన్న వాళ్ళుట ! పెళ్ళి కెదిగిన పిల్లలు కారుట ! మాకు మిగతా కులాల పేర్లు తెలియదు. మొత్తానికి మాతో వచ్చిన ఒక నార్త్ ఇండియన్ కొలీగ్ మమ్మల్ని గట్టెక్కించింది. ఆవిడ రకరకాల ఆలోచనలూ, విశ్లేషణలూ చేసి, ఆ అబ్బాయి కులం గెస్ చేసి, చిరునామా సంపాయించుకొచ్చారు.


ఆఫీసులో ఒక సర్దార్జీ ఉండే వాడు. మేము ఎప్పుడూ లంచ్ టైం లోనో, కాఫీ టైం లోనో మాత్రమే కలిసే వాళ్ళం. ఇతను ఎంత ఔట్ స్పోకెన్ అంటే.. మేడం! మీ అడ్డ్రెస్స్ కేంటీనే! మీరు కావాలంటే కేంటీన్ లోనే దొరుకుతారు! అనే వాడు. అదీ - అందరి ముందూ! నేను 'బరువు బాధ్యతలు ' ఎక్కువయిన మనిషిని. కాబట్టి చాలా ఎంబరాస్ అయిపోయే దాన్ని.


ఇలా మన లక్షణాలో, కులాలో మన చిరునామా పట్టిస్తే సరే ! మరి ఎవరో తెలీని వ్యక్తిని చిరునామా లేకుండా పట్టుకోవడం ఎలా ? ఒక చిన్న సంఘటన చెప్తాను.


ఉత్తరాల విషయానికొస్తే, కొందరు ఎంత అమాయకంగా రాస్తారో వాటి మీద చిరునామాలు - ముఖ్యంగా ఆర్మీ లో కొందరు అమాయక సిపాయిలు ! వీళ్ళు సాధారణంగా గ్రామీణ ప్రాంతాలనుంచీ వచ్చిన వాళ్ళయి ఉంటారు. ఇప్పటి జెనెరేషన్ లో చదువుకున్న వాళ్ళూ, ఎమ్మే లూ ఎంబీయే లూ ఆర్మీ లో చేరినా... పూర్వ కాలంలో మాత్రం అంతగా చదువుకోని పేద యువకులు ఆర్మీ నౌఖరీ లో చేరే వాళ్ళు ! సాధారణంగా ఆర్మీ వాళ్ళ చిరునామాలు కోడ్ అయి ఉంటాయి. దేశం మొత్తం మీద ఎవరు ఎక్కడ ఉన్నారో పట్టుకోవడం - ఈ కోడ్ల ఆధారంగా మొత్తం ఉత్తరాలు చక్కగా బట్వాడా ఔతాయి. మరి ఆ కోడ్ గుర్తు లేదనుకోండి - ఎలా ?


ఈమధ్య నా చేతికి ఒక ఉత్తరం వచ్చింది. దీన్ని అసాం వెల్తున్న ఒక కొలీగ్ కి పొస్ట్ చెయమని రెక్వెస్ట్ తో అందజేయాలి. అది ఎవరు రాసారో తెలియదు. ఎవరికి వెళ్తుందో కూడా (వ్యక్తిగతంగా) నాకు తెలియదు. దాని మీద అడ్రెస్స్ చూసాకా, నవ్వొచ్చింది.
నేను పైన చెప్పిన అమ్మయకపు సిపాయి ఎవరో రాశారు దీన్ని !

దాని మీద చిరునామా ఇలా రాసి ఉంది. (ఇది మామూలు పోస్ట్ మేన్ కోసం రాసినది) (in Hindi script)

['Dehradun Railway Station me utar kar Ghadi Cantt wali bus me baith kar, Clement Town me x x x batallion me 'B' company me Sepoy x x x x x ko de dena..']

డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ లో దిగి ఘడీ కేంట్ బస్సెక్కి, క్లెమెంట్ రోడ్ లో దిగి, అక్కడ ఫలానా బెటాలియన్ లో ఫలానా సిపాయికి ఈ ఉత్తరం ఇవ్వండి ! అని రాసి ఉంది.

ఎంత వివరంగా రాసారో కదా సిపాయి గారి చిరునామా అనుకున్నాను. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఆ ఉత్తరం నిక్షేపంగా చేరిపోయింది. భారతీయ పోస్ట్ వాళ్ళే బట్వాడా చేసారు. ఇక్కడ నిజంగా చిరునామా గొప్పదా, పోస్టలు వాళ్ళు గొప్పోళ్ళా తెలియట్లేదు. అంత బాగా చిరునామా రాస్తే ఎందుకు చేరవెయ్యరు అనుకుంటున్నారా ?

మరి మీ చిరునామా ఏమిటి ?

9 comments:

stock market timing said...

thats amazing story.

కత్తి మహేష్ కుమార్ said...

ఆర్మీవాళ్ళకు రాసే ఉత్తరాలలో బెటాలియన్ పెరు రాస్తేచాలు, ఎంచక్కా వెళ్ళిపోతుంది.

ఇక మన భారతీయ పోస్టల్ వారి ఘనత కొరియర్ కంపెనీలొచ్చిన తరువాత మనకు తగ్గినట్లనిపిస్తుందికానీ, ఇప్పటికీ 90% లెటర్లు వీరు బట్వాడా చేస్తేనే మనకి గడిస్తోంది.జై ఇండియన్ పోస్టల్ సర్విస్ !!

యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ said...

అయిదేళ్ళ క్రితం..నా విషయంలో జరిగింది..

వై.వి.యస్.యన్.శర్మ
దిల్ సుఖ్ నగర్
హైదరాబాద్.
అని ఎవరో పోస్ట్ చేస్తే...అందింది..

sujata said...
This comment has been removed by the author.
sujata said...

మహేష్ గారు - ఒక్కోసారి బెటాలియన్లు స్థలం మారిపోతుంటాయి కదా.. మీరన్నది నిజమే కానీ బెటలియన్ లొకేషన్ మారిపోతే, ఉత్తరం చేరకపోవచ్చు !


శర్మ గారు - అయితే మీరు గొప్ప గొప్పోళ్ళన్నమాట ! మీ పోస్ట్ మేన్ కు ఎంత లోకల్ నాలెడ్జ్ ఉందో కూడా తెలుస్తుంది.


నాకెప్పుడైనా అలా ఉత్తరం వస్తే బావుణ్ణు !

సుజాత said...

మీరు ఇలా ఆర్మీకి, రక్షణ శాఖకు చెందిన అనేక విశేషాలను మాతో పంచుకోవాలని నా అభ్యర్ధన సుజాతా! మా నాన్న గారూ గొప్పోరే! ఎంచేతంటే ఆయన పుట్టి, పెరిగి చదివి , ఉద్యోగం చేసి, రెటైర్ అయ్యింది కూడా మా వూర్లోనే! టౌన్లలో నాలుగు సార్లు ఇటునుంచి అటు, అటు నించి ఇటూ తిరిగితే అందరూ తెలిసిపోతారు!ఆయన పేరు, PWD అని రాస్తే అది ఠంచనుగా మా ఇంటికి రావాల్సిందే!

మీకెవరైనా అలా ఉత్తరం రాస్తే అది నాకొస్తుందేమో, చూడండి!

శ్రీవిద్య said...

Beautiful story....

ఏకాంతపు దిలీప్ said...

న్యూ డిల్లీ లో రైలు దిగి బయటకొచ్చి 355 నెంబరు బస్సు ఎక్కి నోయిడా 19 సెక్టారు ఏ బ్లాకు దగ్గర బస్సు దిగి మదర్ డైరీ సెంటర్ దగ్గరకొచ్చి ఎవరైన తెలుగు మాట్లాడే వాళ్ళు కనపడితే నా పేరు అడగండి...

కొత్త పాళీ said...

good one.