Pages

04/06/2008

ఈ టీవీ - మీ టీవీ



సుమన్ - ఈ టీవీ ప్రభను ఒంటి చేతితో పడగొట్టి.. ఈ చానెల్ చూసేవాళ్ల సంఖ్యను గణనీయంగా తగ్గించేసారు. నిజానికి ఈ-టీవీ లో కొన్ని మంచి ప్రోగ్రాములు కూడా వస్తాయి. పప్పేట్ ల తో చేసిన పంచతంత్రం వీటిలో ఒకటి.


ఈటీవీ - రెండు లో సఖి అనే ప్రోగ్రాం ఎపుడైనా చూసారా ? వ్యాఖ్యాత.. చక్కగా అచ్చ తెలుగు మాట్లాడతారు. 'సుఖీభవ' కూడా ఒక పనికొచ్చే ప్రోగ్రాం. ఈనాడు సంస్థ నుంచీ వెలువడే 'చతుర', 'విపుల' మాగజీన్లు కూడా ఎన్నాళ్ళుగానో మంచి సాహిత్యాన్నీ ప్రచురిస్తున్నాయి. ఆవకాయలు అమ్ముకుని.. అంబానీ లా ఎదిగిన రామోజీ రావు తీసిన సినిమాలు కూడా పర్లేదు.. మంచివే! ఈటీవీ మొదలు అయిన కొత్తలో 'వసుంధర' ఎంత బావుండేది ?


బాలు గారు మొదలు పెట్టిన 'పాడుతా తీయగా' ఎంతొ ఇష్టంగా చూసేవాళ్ళం. అన్నిటి కన్నా.. సాయత్రం వచ్చే 'సినీ రంజని' లో చాల సినిమాల క్లిప్పింగ్స్. ఇపుడు రక రకాల డైలీ సీరియల్లూ.. రియాలిటీ షో లూ.. స్టాండర్డ్ తుడిచి పెట్టేసాయి. ఇపుడు మబ్బులు తొలిగిపోయాయి కాబట్టి, ఈ చానెల్ నాణ్యత కొంచెం అయినా పెరగుతుందని ఆశిస్తున్నా!

4 comments:

Anonymous said...

ramoji rao politikal "views" manesi political "news" andistea again he will become number 1

koumudi said...

ETV & ETV 2 baagu padaalante Ramoji "Mark" Padaalsina avasaram entina undi. Aayaniki chala baga teludu talent ni ela shine cheyali anedi. ETV 2 lo konni programms intavaraku mari e TV lonu levu Ex: Maargadarshi, Telugu Velugu etc.,

Kathi Mahesh Kumar said...

ఈ టీవీ -2 పెద్దగా ఎప్పుడూ చెడిపోలేదుగానీ, సుమన్+ ప్రభాకర్ విజయవంతంగా చెడగొట్టింది ఈ టీవీ నే. ఇప్పుడు కొంత బాగుపడే అవకాశం ఉన్నా,మిగతా చానళ్ళ పోటీకి తట్టుకుని నిలబడేనా?

Sujata M said...

Suman, Kaoumudi, Mahesh,

Thank you