Pages

11/06/2008

గోవిందా ఆలారే!


నిన్న మా ఊరికి 'గోవిందా'' సినిమా ఏదో షూటింగ్ కి వచ్చింది. జనం, గోల గోల చేసారు. సినిమా పేరు తెలియదు గానీ... 'గోవిందా', 'శక్తి కపూర్', 'హరీష్', లాఫ్టర్ ఛాలెంజ్ తాలూకూ 'కుకీ' ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. ఇంగ్లీష్ వాళ్ళంతా.. ఈ హడావిడి కి కొంచెం కంగారు పడ్డారు. షూటింగ్ వేళ కి నేను 'టౌన్ సెంటర్' లోనే ఉన్నాను. అనుకోకుండా.. గోవిందా ప్రత్యక్షం అవడం తో.. జనం తమ తమ స్నేహితులకూ, ఇంట్లో వాళ్ళకూ ఫోన్లు చేసి పిల్చుకున్నారు. కాసేపట్లోనే పెద్ద మూక తయారైంది. ఫోటోలు తీసుకోవడం, 'చీ చీ' - 'చీ చీ' అని ,కేకలూ మొదలు పెట్టారు. 'గోవిందా' ముఖం మీదే.. 'ఎహ్ తో మోటా హోగాయా!', 'ఎహ్ తో బుడ్డా హోగాయా.. !' అని రిమార్కులూ చేసారు. గోవిందా మాత్రం పాపం విన్నంత సేపూ, మొహం ''ఈ టీవీ సీరియల్ లో నటుడి'' లా.. భావ రహితంగా పెట్టుకుని, ఈ మాటలు విన్నాడు.




నేనూ మొదటి సారి సినిమా షూటింగ్ చూసాను. ఒక చిన్న సీన్ కోసం బోల్డంత తిప్పలు పడుతున్నారు. ఒక డాన్స్ సీన్ కూడా తీసారు.. 'ఫారిన్ అమ్మాయి లతో'! జనం పెరిగేకా.. గోవిందా త్వర త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అందరూ చెదిరి పోయాక, మళ్ళీ వచ్చేడు. మాకు తెలిసిన వాళ్ళంతా.. దాదాపు పరిగెత్తుకుంటూ, కెమేరాలు పట్టుకుని, అక్కడకు వాలిపోయారు. చిన్న ఊరు కాబట్టి, ఈ ఊరికి బాలివుడ్ రావటం తో అందరూ బోల్డంత ఆనంద పడిపోయారు. స్థానిక ఇంగ్లిష్ వాళ్ళకు వచ్చింది 'బాలీవుడ్' స్టార్ అని చెప్తే, అర్ధం చేసేసుకున్నారు. మరి 'బాలీవుడ్' అన్న పదం డిక్షనరీ లో చేరింది గా! శక్తి కపూర్ మాత్రం... జనం ఆటోగ్రాఫులు అడుగుతారేమో అని ఆశ పడుతూ తిరిగాడు. అయితె, కొంచెం సేపటికి అమ్మాయిలు ఈ 'పక్కా విలన్ గాడి' తో ఫోటోలు తీసుకోవటం మొదలు పెట్టారు. శక్తి కపూర్ కూడా.. బోల్డంత సహకరించి, దాదాపూ అందరితో ఫోటోలు దిగాడు. వాతావరణం పెద్ద పండగ లాగా అయింది.

అయితె, ఒకటి.. ఇంత కష్టపడి.. నానా పాట్లు పది, ఒక చిన్న సీన్ కొన్ని పదుల సంఖ్యలో తీసి, ఇంత ఖర్చు పెట్టి తీసిన సినిమాల్ని మనం ఇంటర్నెట్ లో ఫ్రీ గా చూసేస్తాం కదా.. అని జాలి కలిగింది.

2 comments:

Anonymous said...
This comment has been removed by a blog administrator.
రానారె said...

గోవిందా ముసలివాడయినా డాన్సుల్లో మాత్రం తగ్గలేదనుకుంటా. ఈమధ్య చాలావరకూ హిందీ సినిమాలు పూర్తిగా విదేశాల్లోనే షూటింగు జరుపుకుంటున్నట్టున్నాయ్. మొత్తానికి ఒక సినిమాస్టారును, సినిమా షూటింగునూ చాశారన్నమాట. నాకు ఇంకా ఈ రెంటిలో ఒక్కటి కూడా కదరలేదు. :)