స్వామీ అండ్ ఫ్రెండ్స్ - ఆర్.కే. నారాయణ్ గారి అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకానికి తెలుగు అనువాదం కొన్నేళ్ళ క్రిందట విశాఖపట్నం లో 'జ్యోతి బుక్ డిపో' లో చాలా అదృష్టం మీద దొరికింది. ఈ పుస్తకం నిండా ఆర్.కే. లక్ష్మణ్ గారి ఇలస్త్రేషన్ లు ఉన్నాయి. ఈ పుస్తకం ఎవరు అనువదించారో గుర్తు లేదు.. బహుసా శ్రీమతి.వాసిరెడ్డి సీతాదేవి అనుకుంటాను. అయితే, ఈ పుస్తకం ఒక ఫ్రెండ్ కి బహుమతి గా ఇవ్వటం జరిగింది. ఆ తరవాత ఈ పుస్తకం ఎక్కడ ప్రయత్నించినా దొరకలేదు (తెలుగులో..) ! బ్లాగరులు చాలా మంది చదువరులు కాబట్టి, యధాప్రకారం. ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో, ఎవరు అనువదించేరో.. లేదా.. ఎటువంటి సమాచారాన్నయినా ఇవ్వగలరని ఆశిస్తున్నాను.
ఈ పుస్తకాన్ని నా సేకరణలలో (కొనుక్కుని ఉంచుకోవలసిన పుస్తకాలలో) చేర్చుకోవాలని ఆశిస్తున్నాను. తెలుగు లో కూడా స్వామీ... రాజన్, మని .. వీళ్ళంతా.. చాలా అలరిస్తారు మరి. అనువాదమే అయినా.. చాలా బావుంటుంది. ఎవరికయినా ఈ పుస్తకం గురించి తెలిస్తే ఒక సారి వ్యాఖ్య ద్వారా తెలియచేయ గలరు. ఆర్కుట్ సమూహం లో సభ్యులు.. ఇంగ్లీష్ లో చదువుకోవచ్చు గా.. అని, ఇంగ్లీష్ లోనే బావుంటుంది లెమ్మని....ఒక ఉచిత సలహా పడేసారు. తెలుగు అనువాదం కూడా బావున్నపుడు, (అసలు అనువాదం సంగతి చాలా మందికి తెలియదు) చదివితే మంచిదేగా..
14 comments:
సుజాత గారు,చాలా రోజుల తర్వాత బ్లాగుతున్నట్టున్నారు,.
ఈ పుస్తకం నా దగ్గరుంది. అనువాదం సీతాదేవి గారిదే! బొమ్మలు వేసింది మనోభిరామ చక్రవర్తి! ఈ పుస్తకాన్ని ప్రచురించింది నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు. ఇది నాకు విశాలాంధ్ర లో దొరికింది. వాళ్ళు ఎవరూ కొనని పుస్తకాలు ఈశాన్య మూలలో పోగు పడేస్తారు. ఆ పోగులో వెదికి కొన్ని పుస్తకాలు పట్టాను. మీ విశాలాంధ్రకి(ABIDS) వెళ్ళి ఈశాన్య మూల వెదకండి. దొరక్క పోతే...డన్, నేను ఇస్తాను (చదవడానికి).
అన్నట్టు ఇంకో మాట, మీరన్నట్టు అనువాదాల గురించి చాలామందికి తెలియదు. కానీ సరైన అనువాదకుడి చేతిలో పడితే ఒరిజినల్ కన్నా, అనువాదమే మజాగా ఉంటుంది. నండూరి రామ మోహన రావు గారు మార్క్ ట్వైన్ పుస్తకాలాన్నీ తెలుగులోకి (టాం సాయర్, హక్ ఫిన్, ప్రిన్స్ అండ్ ది పాపెర్,ట్రెజర్ ఐలాండ్ ఇంకా టాం సాయర్ అబ్రాడ్ ) అనువదించారు. నేను మార్క్ ట్వైన్ కలెక్షన్ genuine గా ఉంటుందని సెంట్ లూయిస్ లో మిస్సిస్సిప్పి నది ఒడ్డున కొన్నాను. అవి చదివాక కూడా నండూరి గారి అనువాదాలనే ఇష్టపడి మళ్ళి మళ్ళీ చదువుతాను. అలాగే సహవాసి గారి అనువాదాలు కూడా!
ఇటీవల జాక్ లండన్ పుస్తకం call of the wild పుస్తకానికి ఏ.గాంధి గారి అనువాదం చదివాను. సహవాసి గారికి దీటుగా అనువదించారు. దొరికితే చదివి చూడండి, పీకాక్ క్లాసిక్స్ వాళ్ళు వేసారు.
సుజాత గారు,
మళ్ళీ నేనే, ఇప్పుడే మీ పాత పోస్టు చూసాను మొపాసా కథల గురించి! అది కూడా నా దగ్గరుంది. నా ఫేవరెట్ పుస్తకం! దాన్ని అనువదించింది ధనికొండ హనుమంత రావు గారు.(ఈయన మా వారి వైపు నుంచి నాకు వరసకి పెదనాన్న గారవుతారు. కానీ నేను ఎప్పుడూ కలుసుకోలేదు )మీరు చెప్పిన రోజ్ కథ చాలా బాగుంటుంది. అంటే కాదు, 'శిక్ష ' అనే కథ గుర్తుందా అందులో!
ఇక లాభం లేదు, మీరు మా ఇంటికి రావాల్సిందే!
hmm.. swami and his friends naakishtamaina pustakam.
adi telugulo untundani cheppina meeku, chadaventa baaguntundani teliyajesina sujaata gaariki dhanyavaadaalu.
Purnima
Sujata garooooooooo
meeku huggule haggulu... I dont know when can I go to Visalandhra but.. Im happy with your offer..
I love 'siksha' but.. cant write such a big story on my blog.
Thanks Purnima..
పైన మ.మ. సుజాత గారి మాటలకి అభ్యంతరం తెలుపుతున్నాను అధ్యక్షా. నాక్కూడా టాం సాయర్ పరిచయం .. ఆమాటకొస్తే అనేక పాశ్చాత్య పాత్రల పరిచయం తెలుగు అనువాదాల ద్వారానే జరిగింది. నండూరి వారు ఆ అనువాదాల్ని తనదైన శైలిలో "తెలుగైజ్" చేసి రాశారు .. బానే ఉంటుంది గానీ .. ఒరిజినల్ కంటే బావుంటుందని మాత్రం అస్సలు ఒప్పుకోను. మార్క్ ట్వెయిన్ శైలి అనితర సాధ్యం.
Here is the contact information for Visalandhra head office and store. Don't know how responsive they are on phone and email.
visalaandhraph@yahoo.com
Bank Street
Abids, Hyderabad 500 001
Phone: 24744580
Another way to purchase Telugu books is through Navodaya of Vijayawada. They can procure for you anything that is currently in print and sometimes those out of print also.
You can contact Sri Ramamohana Rao garu at
vjw_booklink@yahoo.co.in
BTW, Treasure Island (translated as కాంచన ద్వీపం) was by RL Stevenson
కొత్తపాళీ గారితో బేషరతుగా ఏకీభవిస్తున్నా.నండూరి అనువాదాలు ఒరిజినళ్ళ మీద అవగాహన కలిగిస్తాయి,పరిచయం చేస్తాయి.కానీ అసళ్ళను మరిపిస్తాయి అంటే నాకు అసలు నమ్మకం లేదు.
టామ్ సాయర్ పేరిట ఒక ఇరవైయేళ్ళ క్రితం ఒక సినిమా చూసా,అప్పటికి ఏ
యాభయేళ్ళ క్రితం వచ్చుంటుంది.అందులో టాముడి బాలనాయిక ఒకానొక సందర్భంలో సిగ్గుపడుతుంది.అసలు ఈ భూప్రపంచకం మొత్తం మీద అంత అందంగా ఏ పిల్లయినా అలా సిగ్గు,అంత అందంగా చూపగలుగుతుందా అని ఇప్పటికీ నాకొక అనుమానం.అమెరికా దేశీయులు వీలుంటే ఆసినిమాను చూసి వివరాలు రాయగలరు.
సుజాత,
కొత్తపాళీ, రాజేంద్ర గార్లతో నేనూ ఏకీభవిస్తున్నాను. అనువాదాలెంత బాగున్నా అసలు భాషలోని చమక్కులని తెలుగించలేవు కదా. టాం సాయర్ లో హక్ మాట్లాడే southern యాస తెలుగులో ఎలా పలుకుతుంది? కాకపోతే, ఆంగ్లంతో పరిచయం లేనివారికి అనువాదాలో మంచి అవకాశం.
ధనికొండ హనుమంతరాయలు గారి 'కాంచన ద్వీపం' (Treasure Island) అనువాదం నాకు ఏడో, ఎనిమిదో ఏళ్లున్నప్పుడు చదివాను. ఆంగ్ల సాహిత్యం మీద అభిరుచి కలిగించిందా పుస్తకం. తర్వాత ఆంగ్ల Treasure Island ని ఎన్ని సార్లు చదివుంటానో గుర్తులేదు. ఆ పేరుతో వచ్చిన ఆగ్ల చిత్రాలన్నీ (ఒక muppet animation సినిమాతో సహా) చూసేశాను కానీ ఏదీ నచ్చలేదు నాకు. ఈ మధ్య డిస్నీ వాళ్ల 'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్' చూశాక జానీ డెఫ్ ని లాంగ్ జాన్ సిల్వర్ పాత్రలో పెట్టి Treasure Island పునర్నిర్మిస్తే బావుంటుందనిపించింది. చూద్దాం, డిస్నీనే ఆ పని చేయొచ్చు.
Kotta PaaLee gaaru:
Would they (Navodaya Vijayawada) send the books over post? I'm dying to read some books not available in Hyderabad. I want the following books:
anubhavaalu jnapakaalu - sripaada
komma komma ko sannayi - veturi
ViSaalandhra Abids people are responsive enough over phone.. my own experience.
@ Purnima
Yes, Navodaya can ship you books by courier or parcel post.
However, I suspect anubhavAlU jnApakAloonoo may be out of print.
good luck.
కొత్తపాళీ గారు, రాజేంద్ర గారు,మరియు అబ్రకదబ్ర గారు,
నేను మార్క్ ట్వైన్ కలెక్షను చదివినప్పుడూ,(అదో పెద్ద వ్యాస పీఠం మీద పెట్టి చదవాల్సిన గ్రంథం)పిచ్చ పిచ్చగా నవ్వొచ్చింది. నండూరి అనువాదాలు చదివినప్పుడూ అదే లెవెల్లో నవ్వొచ్చింది. ఎప్పుడెక్కువ అంటే చెప్పలేను. హక్ ఫిన్ నవల్లో అనుకుంటా ఫ్రెంచ్ భాష గురించి టాం హక్ కి వివరించే సన్నివేశం నన్ను నండూరి అనువాదంలోనే అలరించింది. ఎవరి శైలి వాళ్ళదే, కానీ రెండు ఒకదాన్ని మించి ఒకటి ఆకట్టుకున్నాయి.
అబ్రకదబ్ర,
జాక్ స్పారో ని చూస్తున్నంత సేపూ, లాంగ్ జాన్ సిల్వరే గుర్తొస్తాడు. నిజమే!
sujata garu, kotta palee garu, poornima, abrakadabra garu, rajendra kumar garu, andariki thanks. It was stimulating to read your comments.
Captain Jack Sparrow .. and Log John Silver .. hmm I don't see the connection. OTOH, if you mean the character played by Jeffrey Rush in the first movie, then I am with you. Captain Jack is a scumbag, no doubt, but he simply doesn't have the worldliness and cunning of Silver, IMO.
మ.మ. సుజాతగారూ మిమ్మల్ని మరోసారి సవరిస్తున్నందుకు క్షమించాలి. ఫ్రెంచి భాష గురించిన వాదన హకల్ బెరీ ఫిన్ నవల్లో హక్ కీ, పారిపోతున్న నీగ్రో బానిస జిం కీ మధ్య జరుగుతుంది. సుమారుగా ఇలా నడుస్తుంది.
ముందు హక్ జింతో అంటాడు.
"నువ్వు ఫ్రెంచి వాడితో మాట్లాడుతున్నావనుకో, వాడప్పుడు ఇలా అంటాడన్నమాట" అని ఫ్రెంచి వాక్యం చెబుతాడు.
దానికి జిం "ఎవడన్నా నాతో అట్టా అడ్డదిడ్డంగా మాట్టాడితే వాణ్ణి చెప్పుచ్చుకు కొడతాను."
"అయ్యో జిం, వాడేమీ నిన్ను తిట్టట్లేదూ. గుడ్ మాణింగ్, హవ్వార్యూ అంటున్నాడన్న మాట."
"మరైతే ఆ మాటే అనొచ్చుగా! ఆ పిచ్చి కూతలు కుయ్యడవెందుకు?"
"హయ్యో జిం. నీకేవ్హీ తెలీదు. ఇప్పుడు చూడు .. గుర్రం మనలాగా మాట్లాడుతుందా?"
"లేదు"
"పోనీ ఒక ఆవు మనలాగే మాట్లాడుతుందా?"
"లేదు"
"అట్లాగే ఫ్రెంచోడు కూడా మనలాగా మాట్లాడ్డు"
"ఐతే నండి హక్ గారూ, నాకో యెదవ డౌటు. గుర్రం మనిషంటారా?"
"కాదు."
"పోనీ ఆవు మనిషంటారా?"
"కాదు."
"ఫ్రెంచోడు మనిషేనంటారా?"
"కచ్చితంగా అవును. అందుకు సందేహమెందుకు?"
"మరైతే ఆడు మనుషు మాట్టాడే బాషే మాట్టాడచ్చు గదా?"
హక్ - ???
Post a Comment