Pages

09/06/2008

చెప్పట్లు ! నా యాభయ్యవ పోస్టు కి

అందరూ బ్లాగుతున్నారని, రాయక పోతే, ఏదో వెనక బడిపోతానేమో అన్న కుతి తో, బోల్డు కుళ్ళు కు చచ్చి పోయి, - నేనూ రంగం లోకి దూకాను। కానీ, అప్పుడు ఇది ఎంత దూరం పోతుందో తెలియదు। చివరికి ఈ చెత్తా, చెదారం, గడ్డీ, గాదం - తెగ రాసేసి ఇప్పుడు నా 50 వ పోస్ట్ రాసేస్తున్నాను. ఇది నా బ్లాగు గురించే !! (సెల్ఫ్ డబ్బా అని గమనించాలి).


బ్లాగ్ రాయటం వల్ల, నా భాష మెరుగు పడింది। రాయటం లో - ఒక స్పష్టత రావడానికి ఇంకా బోల్డంత సమయం ఉంది. ఇంకా - మంచి మంచి వాళ్ల బ్లాగులూ చదివాను. మంచి విషయాలూ తెలుసుకున్నాను. ఏవో నా - గోల - అంతా, నా ఇష్టం ఉన్నట్టు చెప్పుకోవడానికి ఇది బాగా ఉపయోగ పడింది. 'జీవ హింస' మహా పాపం. అయినా దాన్ని క్షమించి, ఉదాత్త హృదయం తో నా బ్లాగ్ చదివే వారందరికీ బోల్డు ధన్యవాదాలు. మీరెంత మంచి వాళ్ళో !?!!

అందుకే, నా 50 వ పోస్ట్ కి నాకు నేనే ఆనందంగా చెప్పట్లు కొట్టుకుంటున్నా !

15 comments:

Anonymous said...

ఆ గడ్డీ గాదం అడుగు భాగం లోనుంచి నావి కూడా రెండు చప్పట్లు.

-- విహారి

Bolloju Baba said...

అభినందనలు.
బొల్లోజు బాబా

cbrao said...

పాడితే గాత్ర శుద్ధి, రాస్తే భాష శుద్ధి అవుతాయి. రాయటానికి చదవాలి. చదివినప్పుడు రాయకుండా వుండం. ఈ క్రియ లో , మీరు జ్ఞానవంతులయి, పాఠకులకూ కొత్త విషయాలు చెప్పాటానికి ప్రయత్నం చేస్తారు.గడ్డిపూలు, పసరు వాసన నుంచి, పరిమళాలు వెదచల్లే 50 వ టపా దాకా ఎదిగినందుకు హార్దిక శుభాకాంషలు అందుకోండి. చప్పట్లు కూడా.

మాలతి said...

అచిరకాలంలోనే నూరో బ్లాగు చూడగలమని ఆశిస్తూ శుభాకాంక్షలు
మాలతి

సుజాత వేల్పూరి said...

కుళ్ళుకుంటూ.....చప్పట్లు!

Kathi Mahesh Kumar said...

హాఫ్ సెంచరీ అన్నమాట...అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభ కనపర్చారు. త్వరలో సెంచరీ పూర్తిఅయ్యి మ్యాన్ (వుమన్) ఆఫ్ ది మ్యాచ్(బ్లాగ్) అవ్వాలని కోరిక.అభినందనలు.

సుధాకర బాబు said...

అభినందనలు. ఇక వంద టపాల పండుగకు పరుగులు తీయండి.

సిరిసిరిమువ్వ said...

నావి కూడా ఇంకో రెండు చప్పట్లు అందుకోండి.

ramya said...

సుజాత గారు నా చప్పట్లూ అందుకోండి :-),
లేఅవుట్ లో ఫొటో గురించి ఆవ చెట్టు అని రాసారు, చెట్టు కాదేమో మొక్క అనుకుంటా.

Sujata M said...

సుజాత, వరూధిని, రమ్య, మాలతి గార్లకు,
విహారి, సి.బి.రావు, బోల్లోజు బాబా, మహేష్, సుధాకర్ గార్లకు.. చాలా థాంక్స్.
రమ్య గారికి - కుంచెం ఎక్కువ థాంక్స్.. తప్పు చూపించి నందుకు!

Ramani Rao said...

అట్లతద్దోయి, ఆరట్లోయ్!
ముద్దపప్పోయ్ మూడట్లోయ్!
అర్ధశతక టపాలో(చ్)య్!
అందరి చప్పట్లోయ్!

శుభాభినందనలు సుజాతగారు. తొందర్లో శత టపాభిషేకం చేసుకోవాలని..

Purnima said...

Congratulations for the 50th post!! Looking forward for may more!!

జ్యోతి said...

అర్ధశతటపోత్సవ శుభాకాంక్షలు...

చెత్తాచెదారం కాదుగాని, ఈ పూలగుత్తిలోని ఒక పువ్వు నా తరపున తీసుకోండీ.ఐనా ఈ చెప్పట్లేమిటి???

Sujata M said...

Ramani garu,
Purnima,
Jyoti garu..

Thanks a lot. :D

నిషిగంధ said...

Congratulations Sujatha :-)