Pages

21/04/2008

జీవిత పరమార్ధం


'Conquer Taste, and you will have conquered the self' said Jagan to his listener, who asked, 'Why conquer the self ?' Jagan said, ' I do not know, but all our sages advise us so.'
- Vendor of Sweets (RK Narayan)


జీవిత పరమార్ధం గురించి రమణి గారి జాబు (మనసులోని మాట....) చదివాకా నాకు వెంటనే తోచిన విషయం ఇది. జీవితం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దృక్పథం వుంటుంది. 'పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి' అన్నట్టు, జీవితానుభావాల బట్టి లక్ష్యాలు, భావనలు, కోరికలు, భయాలు.. ప్రతి వారు ఎవరికీ వారే. ఒక హిందువు కర్మ-వాది. క్రైస్తవుడు క్రియ-వాది. భౌద్ధుడు దయా-వాది. ఇలా ఎవరి మతం వారి దిక్సూచి. ఒక్కోసారి అనుభూతులకు చిక్కని భావాలు మది లో మెదులుతాయి.



కొత్తగా ధ్యానం చేసే ఔత్సాహికులు 'మా పాపిట్లో ఏదో దీపం వెలిగినట్లు ఫీలయ్యామండి' అంటారు. గురువు గారు గుంభనంగా నవ్వుతారు. అబ్బాయిలూ అమ్మాయిలూ తొలిచూపు లోనే ప్రేమ లో పడిపోతారు. కొన్ని విచిత్రమైన సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. ఇదే నిజమేమో అన్న భ్రాంతో, ఇది భ్రాంతి ఏమో అనే నిజమో ... ఎదురుతుంటై.


జనం తరచూ తమ లక్ష్యాలను మార్చుకుంటూ ఉంటారు. జీవితానికి ఎటూ ఒక అంతం అంటూ ఉంది. అంతవరకూ జాలీ గా బ్రతికేద్దామని కొందరు, ఇతరుల కోసం బ్రతుకుదామని కొందరూ, తమ కోసం, తమ పిల్లల కోసం మాత్రమే తమ జీవితం అనుకునే ఇంకొందరూ.. ఇలా బోల్డంత మంది పాత్ర దారులతో మన జీవితం గందరగోళంగా తయారవుతుంది. ఇంత తికమకలో అసలు "జీవిత పరమార్ధం ఏమిటి ?" అని ఒక ప్రశ్న ఉదయించింది అంటే గొప్ప విషయమే.

ఇలాంటి ధర్మ సందేహాలు వస్తే 'లైఫే జీవితం రా!' అని పెదవి విరిచే అలవాటున్న ఒక కొంటె స్నేహితుడు (టీనేజ్ ఫ్రెండ్) గుర్తు వస్తున్నాడు.

4 comments:

Ramani Rao said...

పరమ 'అర్ధం, ఏదో చెప్పకుండా, మానకుండా చెప్పలేకుండా ఎంటో! కాస్త తికమక పెట్టేసారు. ఇంతకీ పరమార్ధం ఎవరి లైఫ్ వాళ్ళదనా? లేక ఇందులోంచి ప్రశ్న పుట్టడం గొప్పే అని చెప్పడమా.. సుజాతగారు.

Sujata M said...

అవును.. తికమక పెట్టేసాను. sorry. మీ అంత చక్కగా రాయలేను. నా పరమార్ధం (ఇంతకీ నేను చెప్పదలచుకున్నది.. ఏంటి అంటే..!) ఏంటంటే, ఈ బిజీ లైఫ్ లో.. వేదాంత చర్చ చెయ్యాలన్న ఆలోచన, అది కూడా progressive గా చెయ్యాలన్న ఆలోచన (సాధారణంగా ఇలాంటివి అన్నిటినించి రిటైర్ అయిన వాళ్లు చేస్తారు కద) రావటం బావుంది.

చాల thanx రమణి గారు.

Ramani Rao said...

అయ్యో! సారీ సుజాత గారు అపార్ధం చేసుకొన్నారు. నేనన్నది నేను అర్ధం చేసుకొలేకపొయాననే కాని, మీరు బాగరాయలేదని కాదు.

Sujata M said...

అయ్యో.. అపార్థం ఏమి కాదు మేడం. మీ వ్యాఖ్య చదివాకా, నా పోస్ట్ నేనే చదువుకుని, అర్థం కాక, నేనూ తన ప్రిస్క్రిప్షన్ తనే పోల్చుకోలేని డాక్టర్ లా ఫీలయ్యా. అయిన మీరు అంత పెద్ద పెద్ద పోస్టులు ఎలా రాస్తారు ? ఎక్కడ కంఫ్యూజన్ లేకుండా?! I think its a gift. Kudos.