ఇది నా childhood memory. స్కూల్లో చదివాను. ఇన్నేళ్ళు తరవాత శ్రీ అనిల్ బత్తుల గారు దీని లింక్ ఇచ్చారు. అనుకోకుండా మా హీరో కజిన్, ఒక సోదరి దగ్గర ఈ పుస్తకం దొరకడం తో భాగ్యరాశి దొరికినట్టు అనిపించింది.
ఈ పుస్తకం లో చాలా మంచి కథలున్నాయి. ఒక వయసులో చిన్న బొమ్మ కనబడితే, ఆ పుస్తకం వంక చూస్తూ ఎన్ని ఊహలు అల్లుకునే వాళ్ళమో, గిఖోర్ లాంటి బీద పిల్లవాడిని గురించి తలచుకుని కళ్ళు నిండా నీళ్ళు నింపేసుకునే వాళ్ళమో.. అలాంటి వెట్టి చాకిరీలో మగ్గిపోతున్న పిల్లలు, బాల కార్మికులు, మన చుట్టూ ఉన్నా కూడా.. అసలు ఈ బాల కార్మిక చట్టాలు రాసిన వారు, ఆయా రంగాలలో సేవ చేసేవాళ్ళూ ఇలాంటి సాహిత్యాన్ని చిన్నతనాన చదివి వుంటారు అనిపిస్తుంది నిజానికి. గిఖోర్ ఒక బీద పిల్లవాడు. నిర్దాక్షిణ్యంగా స్వయానా తండ్రి పట్నంలో పనిలో పెట్టాకా, బాల్యాన్ని మరిచి పని చేసీ చేసీ, అనారోగ్యం బారిన పడి మరణిస్తాడు.
మాట్లాడే చేపల కథలు - పదే పదే రిపీట్ అయ్యే నక్క తోకల కథలు.. ఇలా. మనం, అన్ని దేశాల, కాలాల, భాషల మనుష్యులమూ - అందరం మొత్తానికి ఒక్కరమే. మాటాడే చేపల్నే చూసుకుంటే, మన పురాణ కథల్లోనూ, ఫేబుల్స్ లోనూ, సుధా మూర్తి పిల్లల కథల్లోనూ.. ఎంత మంచి, మహిమ గల చేపలో. ఒక్కసారి కరుణిస్తే, ఆపదకు ఆదుకుంటాయి. అలాగే, తెలివి లేని అన్నలూ, వారి తెలివైన తమ్ముళ్ళూ, చురుకైన భార్యలూ - వారి ఉపాయాలు - తలచుకుంటే, ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి.
మేమూ అంతా అమ్మాయిలం, కాబట్టో, మా అమ్మా నాన్నా కూడా దాదాపూ ఇలాంటి అమాయకులే కావడం బట్టో, ఎందుకో, ఈ చిన్న కథ నాకు అప్పట్లో చాలా ప్రత్యేకం. అందుకే ఇలా "గిఖోర్" కన్నా ఎక్కువ గుర్తు ఉండిపోయింది. దీని ఆధారంగానే (జ్ఞాపకం ఆధారంగా) ఈ పుస్తకాన్ని వెతికాను. చాలా మందిని అడిగాను. ఆఖరికి అనిల్ గారు ఖజానా లోంచీ, [డోరేమాన్ సంచీ లోంచి తీసిచ్చినట్టు గా] ఇచ్చారు. ఈలోగా అనుకోకుండా ఏడాది క్రితం, ఒక సోదరి దగ్గర పుస్తకం దొరకడం, దాన్ని నేను చాలా అపురూపంగా భావించి, అడగలేక అడగబోతుండగనే, ఆవిడ, తన తల్లిగారి జ్ఞాపకమైనా సరే, నన్ను ఆదరించి ఇవ్వడం - చాలా అదృష్టమే. అసలు ఇలాంటి వెర్రి వ్యామోహాలు వొదులుకోవడమే జీవితం అని చాలా రోజులకి గ్రహింపుకొచ్చింది గానీ, దీన్ని రికార్డ్ చెయ్యడం కోసం ఇలా బ్లాగ్ లో రాస్తున్నాను. దీన్ని ఏ అరవైల్లోనో చదవొచ్చు కదా అని. ఇప్పుడు కథ చూడండి.
http://sovietbooksintelugu.blogspot.in/2015/04/ebook-link_10.html
ఊరించడానికో, గిఖోర్ ని తలచుకోవడానికో ఇది కూడా ఓ మంచి జ్ఞాపకం. వీలైతే, చదవండి.
దీని రచయిత : హోవనేస్ తుమన్యాన్ పేజీ ఇది
Original Story (English) : The Death of Kikos
Original Story (English) : Gikhor
Movies : Gikhor - రెండు సార్లు తీసినట్టున్నారు - 1934, 1982 లో
ఇది commissioned translation కాబట్టి అనువాదకులకు కూడా నా ధన్యవాదాలు. తెలుగు అనువాదం కూడా సోవియట్ రష్యాలో ప్రచురితం.
4 comments:
We have this book in home. I grew up listening this story. Now telling these stories to my kids. Very nice book.
కధలో కానీ జీవితంలో కానీ నెగిటివిటీ ఉంటే అసలు భరించలేను.జరిగేది ఎలాగూ జరుగుతుంది.
ఈ కధలో ఎంతో నెగిటివిటీ ఉంది. ఎందుకు నచ్చింది మీకు ?
Thank you for your comment andi. ఈ కథ లో నెగిటివిటీ గురించి.. అంతా ఆ పిల్ల imagination, మిగిలిన అందరి అమాయకత్వం, తమ దగ్గర మిగిలిన ఆఖరి వస్తువులతో వారు విందు ఇవ్వడం, మరుసటి రోజు నిండీ జీవితంలో పడిపోవడం.. ఆ imagination లో, అసలు పుట్టడం, చచ్చిపోవడం అసలు జరగనే జరగవు. అదీ రిలీఫ్ గా అనిపించింది. నెగిటివిటీ అంతా ఊహే. వెంగళప్ప కథ లా. ఈ పుస్తకం లో చాలా మంచి పిల్లల కథలు (గిఖోర్ కథ) ఉన్నాయి. ఈ పోస్ట్ ని ఇంకొంచెం వివరాలు కలిపి రాస్తాను. థాంక్యూ.
థాంక్ యూ. I know that feeling.
Post a Comment