Pages

23/04/2008

గ్రంధాలయం


మేముంటున్న బెడ్ ఫోర్డ్ లో కౌన్సిల్ వాళ్ళచే నడపబడుతున్న బ్రహ్మాండమైన లైబ్రరీ వుంది. ఇంగ్లీష్, ఇంకా ఇతర యురోపియన్ భాషల లో నే కాకుండా మైనారిటీ ఆసియన్ సంతతి వారి కోసం, తమిళం, మలయాళం, పంజాబీ, సింధీ, ఉర్దు, హిందీ భాషల లో కూడా మంచి (చెప్పుకోదగిన సంఖ్య లో) పుస్తకాలున్నాయి. ఇక్కడ నేను చదివినవి Mark Tully, Jhumpa Lahiri, Kushwant Singh, VS Naipaul.. ఇంకా ఇతర ప్రముఖుల రచనలు. తెలుగు పుస్తకాలూ మాత్రం లేవు. నేను కొన్నాళ్ళ క్రితం ఢిల్లీ లో పని చేసేటప్పుడు, (వాయు సేన ముఖ్యాలయ్) అక్కడ కూడా అన్ని ప్రాంతీయ భాషల లో నూ పుస్తకాలూ ఉండేవి కాని తెలుగు పుస్తకాలు వుండేవి కాదు. అయితె మంచి మంచి మాగాజీన్ ల ను చదివే సువర్ణావకాసం లబించింది. అక్కడ National Geographic, News Week, Time లాంటి కాస్ట్లీ పత్రికలూ హాయిగా చదివే వాళ్ళం. అవే కాకుండా, మంచి ఆంగ్ల సాహిత్యం, ఫిక్షన్, సస్పెన్స్, మిస్టరీ, క్లాసిక్స్ చదివాను. ఢిల్లీ లో కేంద్ర సాహిత్య అకాడమి లైబ్రరీ సూపర్. అన్ని భాషల లో నూ మంచి పుస్తకాలు దొరుకుతాయి. కాని సభ్యత్వ రుసుము కాస్త ఎక్కువ.

నిజానికి చదవటం చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, బాల జ్యోతి ల ద్వారా చిన్నాప్పటి నుంచే అలవాటూ, ఇష్తమూ.. ఆ పుస్తకాల కోసం అక్క తో యుద్ధం, చిన్న దాన్ని కాబట్టి నెగ్గటం.. మంచి జ్ఞాపకాలు. ఇంకా ౨ రూపాయల నవలలూ.. అందాల రాజకుమారి, దయ్యాల ద్వీపం, వీరుడైన రాజ కుమారుడు.. రాకాసి లోయ ..ఇలాంటి బోల్డన్ని నవలలు, సైన్సు ఫిక్షన్.. జూల్స్ వెర్న్ అనువాదాలు, (భూగర్భం లోకి ప్రయాణం.. లాంటివి) కూడా కవర్ చేశాను. మా అన్నయ్య ఒక రెండు రూపాయల నవల రాసాడు కూడా. అది పబ్లిష్ అయాక వాడికి కాస్త డబ్బు వచ్చింది. దాంతో మేము ఊర్లో ఎగ్జిబిషన్ కు వెళ్ళాం.
చదువుకునే రోజుల్లో, నాన్ డీ టైల్ ల లో Adventures of Tom Sawyer, Huck berry, David Copperfield.. లాంటివి చదివాక.. ఆంగ్ల సాహిత్యం అంటే ఇష్టం ఏర్పడింది. పెద్దయ్యాక Pride & Prejudice, Sence and Sensibility, Jane Eyre.. లాంటి పాపులర్ రచనలు చదివాక ఈ మైదానాలూ.. పచ్చ గడ్డి, ఇంగ్లీష్ country side, అంటే పిచ్చ అభిమానం ఏర్పడింది... ఈ పుస్తకాలు మాత్రం ప్రతీ లైబ్రరీ లో నూ ఒక్కో సరి తిరగేసా.. ఊరికే.. అమ్మాయిలకిదో పిచ్చి అనుకోండి. ఇక్కడ అర్బన్ లైఫ్ చూస్తున్ననేమో.. ఈ జ్ఞాపకాలూ కొన్నాళ్ళకు మధురం అవుతాయి.
గత దశాబ్ది లో బాగా నడిచిన కాన్సెప్ట్.. Lending Libraries. అక్కడ తెలుగు నవలలన్నీ చదివాను. ఇంట్లో కొనే వాళ్ళం కూడా. కానీ అరువిచ్చి మోసపోయం.. ఒక్క నవల తిరిగీ రాలేదు. అందుకే ఈ అద్దె కు తెచ్చుకుని చదవటం. మల్లాది, యండమూరి ల నవల లు దాదాపు అన్నీ చదివాను.
తెలుగు లో గద్యమే తప్ప పద్యం తల కు ఎక్కలేదు. పద్యం, రూల్స్, అర్ధాలు, టీకా తాత్పర్యాలూ.. చాల కష్టం అనిపించింది. కన్యాశుల్కం, గురజాడ కధనికలు, చాలా తెలుగు అనువాదాలు, అమ్మ, తండ్రులూ - కొడుకులు, గై ద మపాసా కధలూ, బుచ్చి బాబు కధలు చదివాను. బుడుగు మామూలే..
అన్నిటి కన్న మధుర జ్ఞాపకం, రామ కృష్ణ మిషన్ వారి ప్రచురణలు. మా చిన్నప్పుడు ఒక సన్యాసి పుస్తకాల మూట భుజాన పెట్టుకుని తీసుకొచ్చి అమ్మే వారు. ఆయన తెచ్చే పుస్తకాలు, బాలల బొమ్మల రామాయణం (చందమామ లో బొమ్మలు వేసే శంకర్ బొమ్మల తో) , మహా భారత కధలు, భాగవతం, నీటి కధలు ఇలా బోల్డన్ని. ఇంకా తిరుపతి కి వెళ్ళినప్పుడల్లా ధర్మ ప్రచార పరిషత్ వారి చిన్న పుస్తకాలు.. వాటిలో ఎందరో మహానుభావుల గురించి చదివాను.
ఇంకోటి.. ఢిల్లీ పుస్తక మహల్ వారి 'Childrens Knowledge Bank'..తెలుగు లో.. ఇప్పటికీ ఢిల్లీ లో దర్యాగంజ్ లో పుస్తకాలు ఆరు వోల్యుములు అమ్ముతారు.. మా బాల్యం లో అవే మా Encyclopedia.. అబ్బ! ఇంకా రక రకాల పుస్తకాలు గుర్తొస్తున్నాయి.. చిన్నప్పట్నించే ఇంటి నిండా పుస్తకలున్నందున కాలేజీ కెళ్ళే దాక గ్రంధాలయాల మాట ఎత్తలేదు. ఆంధ్ర యునివర్సిటీ లైబ్రరీ కూడా చాలా బావుంటుంది. ఆ రోజుల్లో ఆ లైబ్రరీ నాకో fascination. అక్కడ కుర్చీలూ బల్లలు, లైట్లు, ఫాన్ లు అన్నా ఎంతొ గౌరవ భావం కలిగేది. స్టూడెంట్స్ పుస్తకాలు ఎత్తుకుపోకుండా, EXIT లో bags చెక్ చేసేవారు. మగ పిల్లలకు పుస్తకాలూ షర్టు లలో దాచేసుకునే అలవాటు ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది.
పెళ్ళయాక.. నా జీవితం లో పెను మార్పు పుస్తకాలూ కొనలేకపోవటం. అప్పటికే షెల్ఫ్ ల నిండా గ్రూప్ వన్ అనీ ఇంకోటని బోల్డు పేరుకుపోయాయి. ఆఫీసు లైబ్రరీ బాగుంది. పుస్తకాలు అంటే.. చెత్త అనే భావన ఇంట్లో వాళ్ళలో కలిగేంతగా పుస్తకాలు పెరిగి పోయాయి. పైగా మా అత్తగారి ఇంట్లో తెలుగు ఎవరికీ చదవటం రాదు. ఇంగ్లిష్ పుస్తకాలు మా మామగారు చదువుతారు. నేనైతే.. ఇంట్లో అన్ని పుస్తకాలున్నందుకు చాలా హాపీ అయి ఉండే దాన్ని. ఎప్పటికైనా వాటికి మంచి యోగం కలిగించి నా చిన్న లైబ్రరీ ఏర్పరచుకోవాలని నా కల.

6 comments:

జాన్‌హైడ్ కనుమూరి said...

మీ కల నెరవేరాలని కోరుకుంటున్నానుమా అమ్మగుర్తుకు వచ్చింది
బాగా చిన్నగా వున్నప్పుడు నడుస్తూ, నడుస్తూ ఎదురయ్యే పక్షులను పేర్లతోనూ రంగులతోను, వాటి కూతలతోనూ ఎలా గుర్తించాలో చెప్పేది.
అలాగ్రంధాలయం మీదుగా మీజ్ఞాపకాల వాకిళ్ళలోకి నడిపిస్తూ కొన్ని మీరు చదివిన పుస్తకాలను ముందుంచారు.
అబినందనలు
నెనర్లు
john000in@gmail.com

sujata said...

జాన్ హైడ్ కనుమూరి గారు..

Sir, మీకు చాల thanx. అక్షరాల మీరు నా బ్లాగ్ లో కామెంట్ రాసేరంటే.. నమ్మలేక పోయాను. నా morale చాల బూస్ట్ చేసారు. Thanks a lot. ఇది చాల మంచి ఫీలింగ్.

కొత్త పాళీ said...

సుపెర్ గా ఉంది మీ పుస్తకాల గ్రంథాలయాల అనుబంధం. చిన్నప్పుడు .. బొమ్మరిల్లు మరియు బుజ్జాయి అధినేతలు బుల్లి బుల్లి పాకెట్ బుక్స్ (మీరనే రెండ్రూపాయల నవల్లు) వేసి అమ్మే వాళ్ళు. మా అమ్మ కొనేది ఖాదు. అందుకని ఇంటికొచ్చిన చుట్టాలందర్నీ చంపేవాణ్ణి ఇవి కొని పెట్టమని :-) మీ అన్నయ్య వీటిల్లో ఒక నవల రాశారంటే .. మైగాష్ .. మీరు నాకో సెలెబ్రిటీ అన్నమాట!

జ్యోతి said...

సుజాతగారు
మీరు పుస్తకల పురుగే అన్నమాట. నిజంగా ఎంత అమూల్యమైనవి కదా .నేను బుల్లి పాకెట్ బుక్స్ లోని జానపద కథలంటే పడి చచ్చేదాన్ని. మాకు అప్పుడు రూపాయికే దొరికది. ఎన్నో కొన్నా. దానిని చదవడానికి మా తమ్ముళ్ళతో ఫైటింగ్.

sujatha said...

సుజాత గారు,

పుస్తకాలు అనే సబ్జెక్టు ఎవరినా ఎత్తితే మంత్రముగ్ధ లాగా వాళ్ల వెంట వెళ్ళిపోతాను నేను. ఇప్పటికీ నేను వొదులుకోని (వొదులుకోడానికి రాజీ కూడ పడని)అలవాట్లలొ ప్రతి నెలా పుస్తకాలు కొనడం! ఇప్పుడు బెంగుళూరులో కుదరడంలేదు కానీ, హైదరాబాదులో అయితే ఆదివారాలు నా ఆచూకీ కావాలంటే కోఠీ ఫుట్ పాత్ లు వెదకాల్సిందే! మళ్ళీ హైదరాబాదు వెళ్ళిపోతున్నాం మేము. మళ్ళీ రెగ్యులర్ గా పుస్తకాలు కొనచ్చని ఆశ. USAలో ఉన్న రోజుల్లో కూడా telupu.com నుంచి తెలుగు పుస్తకాలు తెప్పించుకునేదాన్ని.

మీ జ్ఞాపకాలు బాగున్నాయి. నిజం. లైబ్రరీలో పని చేసే వాళ్లంటే కూడా ఈర్ష్య నాకు.

చిన్నప్పటి పాకెట్ నవల్లు ఇప్పుడు కూడా ఎక్కడైనా పాత పుస్తకాలు షపుల్లో దొరుకుతాయేమో అని వెదుకుతాను నేను.

'చాంగ్ అద్భుత తివాసి ' బుడతరాజు-బొమ్మ గుర్రం' ' గడ్డం రాజకుమారి ' ' తలలేని మంత్రి-కాళ్ళు లేని రాజు ' ఇలాంటి పుస్తకాలు బోలెడన్ని! అవన్నీ భద్రంగా దాచుకోవాలని ఆ వయసులో తెలీయ్లేదు. తెలిసే సరికి నా కంటే ముందే తెలిసిన వాళ్ళు (మా పెదనాన్న గారి పిల్లలు) జాగ్రత్త పెట్టేసుకున్నారు.

sujata said...

కొత్త పాళీ గారు..
జ్యోతి గారు..
సుజాత గారు..

ఈ బ్లాగ్ విషయం మీద రాయాలంటే.. అస్సలు కష్టపడకుండా, చాల ఇష్టపడి రాసేసాను. అందరూ అలానే జ్ఞాపకాల అలల్లో తేలిపోయి రాసిన టపాలన్నీ చదివాను. నాకు చాల హాయి గా అనిపించాయి మీ వ్యాఖ్యలు. చిన్నప్పుడు అక్కలతో తమ్ముల్లతో గొడవపడి చదివిన పుస్తకాలు.. ప్రతీ వేసవి లో ఇంట్లో చేరే కొత్త పుస్తకాలు.. అవన్నీ ఏమయ్యయో! అని బాధ కలిగింది. మా చెల్లి పుట్టాక.. చాల పుస్తకాలూ చింపి పుణ్యం కట్టుకుంది. తనూ చిన్నపుడే ఉషశ్రీ రామాయణం, మహాభారతం, ఇంకా దేవీ భాగవతం.. లాంటి పుస్తకాలు కూడా మరమరాలు తింటూ చదివి ఊదేసేది. ఆ జ్ఞాపకాలు పదిలం. ఇపుడు తన స్కూల్ పుస్తకాలూ కూడా 'Joy of Reading' లూ అన్నీ భద్రంగా ఉంచుకుంటుంది. మరి మనకు పుస్తకాలే మంచి ఫ్రెండ్స్. నా బ్లాగ్ లో వ్యాఖ్యలు రాసినందుకు చాల చాలా థాంక్స్.