Pages

28/10/2008

మహిళలూ - పిల్లకాయలూ - ఉద్యోగాలూ !!

సిక్స్థ్ పే కమిషన్ రికమండేషన్స్ లో ఒక విషయం మీద నేనూ మా ఫ్రెండూ నిన్న రాత్రే వాదించుకున్నాం. వాదన అంటే పోట్లాట కాదు - ఒక విషయ విచారం అన్నమాట. అదేంటంటే మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం 6 నెల్ల జీతంతో సహా ప్రసూతి సెలవు ఇవ్వడంతో పాటూ, పూర్తి సర్వీసులో ఒక రెండేళ్ళపాటూ - పిల్లల సంరక్షణ సెలవులు తీసుకోవచ్చు. ఈ రెండేళ్ళూ, జీతం ఇస్తారు. నేను వావ్ అనుకున్నాను కానీ మా ఫ్రెండ్ కి కొన్ని అనుమానాలున్నాయి. ఆ అనుమానాలు విని నేనూ ఆశ్చర్యం లో పడ్డాను.


మా బేచ్ లో ఒక సఖి కి మొన్నీమధ్యే హీరో పుట్టేడు. అప్పుడే ఈ పే కమిషన్ ఔట్ అయింది. అరే వా.. నీకింక 6 నెల్లు సెలవు.. ఎంజాయ్! అని చెప్పేసుకున్నాం.


ఇది పర్లేదు కానీ, నా తో వాదించిన సఖి కి మాత్రం ఆ రెండేళ్ళ పెయిడ్ లీవ్ మీద కాస్త గుర్రు గా ఉంది.. ఎందుకని..? పిల్లల్ని పెంచడం కేవలం ఆడవాళ్ళ టెర్రిటరీ నా ? మగ వాళ్ళకి బాధ్యత ఉండదా ? ఈ అమ్మాయి కి కెరీర్ అక్కర్లేదా ? ఫిల్లల్ని కనడం, పెంచడమూనేనా ఆడ వాళ్ళ జీవితం ? ఈ సెలవుల్లో ఆమె ప్రమోషనూ, ఇంక్రెమెంట్లూ, బోనస్ లూ, లాంటివి మిస్ అయిపోతాయి కదా ? రెండేళ్ళ సెలవంటే ప్రమోషన్ అవకాశాలు ఖచ్చితంగా దెబ్బ తింటాయి కదా !! మగ వాళ్ళకు కూడా ఆ సెలవేదో ఒక ఏడాది ఇవ్వచ్చు కదా.. వారు కూడా పిల్లల్ని పెంచాలి కదా.. ఇలా బోల్డంత వాదించేసింది.


ఏమో.. ఈ ప్రశ్నల్లో కొన్ని పట్టున్నవే - ఆడ వాళ్ళకు ఆడ వాళ్ళే శత్రువులంటారు. (మగ వాళ్ళకి మగ వాళ్ళూ శత్రువులు కానట్టు) అయితే, ఈ వాదన వల్ల నాలో కూడా కొన్ని ప్రశ్నలు పుట్టేయి. స్త్రీ వాదానికీ, స్త్రీత్వానికీ చాలా తేడా ఉంది. అతి వాదం, స్త్రీ నే ఎందుకు పిల్లల్ని కనాలి అని ఆలోచించలా చేస్తుంది. స్త్రీ వాదం - దాన్ని ఒక చాయిస్ లా చెయ్యాలని కోరుకుంటుంది. స్త్రీత్వం దాన్ని తన అస్థిత్వం లో భాగంగా వాదిస్తుంది. మన ఆలోచనల్లో అస్పష్టత ఎదురవుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు పుడతాయిగా..


నా అక్కయ్య ని చూస్తే పిల్లలూ - ఉద్యోగమూ అన్న సంగతి చాలా చికాకు కలిగించింది. ఈ ఉద్యోగం కోసం తను కనీసం 3 ఏళ్ళు రాత్రీ పగలూ కష్టపడి చదివింది. పెళ్ళి కి ముందు చాలా చాలెంజింగ్ గా ప్రిలిమినరీ, మెయిన్సూ రాసాక, పెళ్ళి అవ్వగానే ఇంటర్వ్యూ - ఉద్యోగం వచ్చాయి. కొడుకు పుట్టే సమయానికి రెస్పాన్సిబుల్ ఉద్యోగం లో ఇంకా ప్రొబేషనర్. అవతల ఆఫీసు నీ నిర్లక్షం చెయ్యకూడదు, ఇక్కడ కన్న కొడుకు ని కూడా జాగ్రత్త గా చూసుకోవాలి. ఉయ్యాల్లో పిల్లాడ్ని వొదిలి ఆఫీసుకి వెళ్ళడం, పాలు తాగాడో లేదో అని బెంగ పడటం, జ్వరం తొ ఉన్న కొడుకుని తలుచుకుని బాధ పడుతూ కేంపు కో, ట్రైయినింగ్ కో వెళ్ళడం.. హోం వర్క్ చేసాడో లేదో, తిన్నాడో, మట్టి లో ఆడు కుంటున్నాడో అని మధనపడుతూ ఉద్యోగం చెయ్యడం, అక్కడ కూడా ఈ ఏకాగ్రత దెబ్బ తిని చిక్కుల్లో పడటం, ఎప్పటికప్పుడు, పిల్లాడికి జ్వరమనో, విరేచనాలనో - సెలవు పెట్టడం వల్ల, సుపీరియర్ లకు చులకన కావడం, ఇవన్నిటినీ అధిగమిస్తూ.. పిల్లాడికి త్వరగా ఒక 10 - 12 ఏళ్ళ వయసు రావాలని కోరుకోవడం తప్ప ఇంకేమీ చెయ్యలేక, ప్రస్తుతానికి ఈ సంసార రధాన్నీ, ఉద్యోగాన్నీ నెట్టుకొస్తూ ఉండటం చూస్తూ ఉండటం వల్ల - అమ్మో పిల్లలు !! అనుకున్నాను.

తను ఒంటి చేత్తో పిల్లాడ్ని పెంచుతూంది అని అనట్లేదు. కానీ పిల్ల వాడే ఆమె కు మెయిన్ ప్రయారిటీ. అందరు స్త్రీ ల లాగే తను తన కోసం కన్నా పిల్లాడి కోసమే బ్రతుకుతుంది. ఉద్యోగం చేసే మహిళలకు పిల్లకాయలు పెద్ద తంటానే. తలలో అస్తమానూ మెదిలేది వాళ్ళే. కొంచెం పెద్దయ్యే దాకా కొంచెం బెంగ, కొంచెం కన్సర్న్ ఉండనే ఉంటాయి. ఇది ... మానవ సహజం!!


కాబట్టి - నాకు ఈ రెండేళ్ళ సెలవు భలే మంచి అవకాశం గా అనిపించింది. ఇలాంటి లా బ్రిటన్ లో అమల్లో ఉంది. ఖచ్చితంగా ఇలానే కాదు - కానీ ఉంది. సో.. ఇది మనమే కొత్తగా కనిపెట్టినదేమీ కాదు.

అయితే ఇది స్త్రీ ల పట్ల ప్రభుత్వం.. స్వీట్ గా అమలు పరుస్తున్న వివక్షా లేక స్త్రీ ల మాతృత్వానికి వ్యవస్థ ఇస్తున్న ప్రాధాన్యమా ? లేక ఏ యునెస్కో నో తెచ్చిన ఒత్తిడి ఫలితమా ? ఇలాంటి అవకాశాలు ఇతర రంగాల్లో పని చేసే మహిళలకు కూడా ఇవ్వొచ్చా ? మహిళలకే ఎందుకివ్వాలి - పిల్లల్ని పెంచడం లో పురుషుల పాత్ర లేదా ? అందరికీ పిల్లని పెంచడం కోసం సెలవులిస్తూ పోతే దేశం ఏమి కావాలి ?

అసలే మహిళా ఉద్యోగులు సరిగ్గా పని (సరిగ్గా డ్రైవ్ చెయ్యరనీ.. కూడా) చెయ్యరని చెడ్డ పేరు (అన్ని నిజాలూ ఖచ్చితమైన నిజాలు కావు కదా)!! ఈ పిల్ల కాయల వల్ల పెట్టే సెలవులు ఇలా మహిళల స్థానాన్ని బలహీనపరుస్తాయా లేవా ? ఏమో !! ఏది వితండ వాదమో, ఏది సరైన ఆలోచనో అర్ధం అయ్యి చావట్లేదు. ఎవరన్నా కాస్త సాయం చేస్తారా ?

9 comments:

Kathi Mahesh Kumar said...

1997 లో కేంద్రప్రభుత్వం (5th pay commission రూల్స్ లో భాగంగా)ప్రసవానంతరం తల్లికి 135 రోజులూ తండ్రికి 15 శెలవు ఇచ్చేట్టుగా ప్రకటించింది.దీని వెనుక unicef,ILO లకృషి ఉందనివిన్నాను.

పబ్లిక్ సెక్టార్ లో పెద్ద సమస్య లేదుగానీ, మొదట్లో ఈ మెటర్నిటీ లీవ్ కారణంగా ప్ప్రైవేటు రంగంలో మహిళలపట్ల వివక్షవుండేదని విన్నాను. కానీ, ఈ మధ్యకాలంలో మహిళల loyalty factor (they don't hop jobs as frequent as men do) కారణంగా, కంపెనీలు మహిళల్ని ప్రిఫర్ చెయ్యడమేకాకుండా, వారి comfort level పెంచి retain చేసుకోవడానికి ఇష్టపడుతున్నట్లుగా కొన్ని స్టడీస్ చెబుతున్నాయి.

ఆడామగా సమానమేకానీ, ఇద్దరూ ఖచ్చితంగా వేరు. They are equal,but different. కాబట్టి ఒకే న్యాయం ఇద్దరికీ వర్తించదు. ఒకే రూలూ ఇద్దరికీ వర్తించదు. సామాజిక,శారీరక ధర్మాలరీత్యా కొన్ని సౌలభ్యాలు ఇద్దరికీ లబ్జిస్తాయి.వాటిని అర్థం చేసుకుంటేనే, కలిసికట్టుగా బ్రతకడం సాధ్యం. ఆడామగా మధ్యవున్నది మిత్రవైరమేగానీ, శతృత్వం కాదుకదా!

ఈ నిజాన్ని గ్రహించలేని అతివాదులు ఇరువైపులా చాలామందేవున్నారు.వారు అర్థరహిత పోరాటాలకేతప్ప అంగీకారాత్మక సహవాసానికి చస్తే ఒప్పుకోరు.పరిస్థితి త్వరలో మారుతుందని ఆశిద్ధాం!

Anonymous said...

What Mahesh garu said is exactly correct.

Unknown said...

Awesome Insight Mahesh ..can't agree more.ఈ నిజాన్ని గ్రహించలేని అతివాదులు అర్థరహిత పోరాటాలకేతప్ప అంగీకారాత్మక సహవాసానికి చస్తే ఒప్పుకోరు.పరిస్థితి త్వరలో మారుతుందని ఆశిద్ధాం!" I dont think it will ever change call me a pessimist , but I'd call myself a realist..men and women can never be equals..you got to accept it and strive to make living an easy task..

Sujata M said...
This comment has been removed by the author.
Sujata M said...

Mahesh garu -

I loved this comment. Thank you. I think I hv to do some more homework to write my posts. That is going to help me a lot I suppose.

Sujata M said...

Anonymous garu

Thanks for leaving that comment.

Sujata M said...

Is that u sodari ?

thanks a lot for taking pain to read this blah blah in the name of a blog. :D

U r really marvellous.

శ్రీనివాస్ పప్పు said...

అయితే ఇది స్త్రీ ల పట్ల ప్రభుత్వం.. స్వీట్ గా అమలు పరుస్తున్న వివక్షా లేక స్త్రీ ల మాతృత్వానికి వ్యవస్థ ఇస్తున్న ప్రాధాన్యమా ? లేక ఏ యునెస్కో నో తెచ్చిన ఒత్తిడి ఫలితమా ? ఇలాంటి అవకాశాలు ఇతర రంగాల్లో పని చేసే మహిళలకు కూడా ఇవ్వొచ్చా ? మహిళలకే ఎందుకివ్వాలి - పిల్లల్ని పెంచడం లో పురుషుల పాత్ర లేదా ? అందరికీ పిల్లని పెంచడం కోసం సెలవులిస్తూ పోతే దేశం ఏమి కావాలి ?
ఇవాల్టి రాజకీయ స్థితిగతుల దృష్ట్యా సొంత ప్రయో"జనానికో" లేక పార్టీ ప్రయోజనానికో తప్ప మహిళల మీద గౌరవం కాదు..వ్యవస్థ కిచే ప్రాధాన్యతా కాదు..
ఆడదానికి ఆడదే శత్రువు అన్నది అనాదిగా ఉన్న నానుడే..కాకపొతే పిల్లల్ని పెంచడము పోషించడము అనేది ఆయొక్క దంపతుల విచక్షణాజ్ఞానం మీద ఆధారాపడి ఉంటుంది..ఇందులో ఒకరు ఎక్కువా లేదు..ఒకరు తక్కువా లేదు..అందుకే పూర్వం ఉమ్మడి కుటుంబాలు సౌలభ్యం గా ఉండేవి...మాట సాయనికైనా..మనిషి సాయనికైనా...కాకపొతే ఇప్పుడు నడుస్తున్న ఇండిపెండెంట్ ఫేమిలీస్ వల్ల వచ్చిన ఇబ్బంది కూడా ఇది...మార్పు సహజం..కోరుకుందాం మంచి జరగాలని..

Kathi Mahesh Kumar said...

@పప్పుగారు, "స్వీట్ వివక్ష" అనేముందు, యునెసెఫ్(UNICEF) లేక ఇతర అంతర్జాతీయ సంస్థలు (WHO,ILO) ఈ విషయంపై ఎందుకుపట్టుబట్టాయో కొంత వివరంగా తెలుసుకోవడం అవసరం.

తల్లిని natural care giver గా ప్రపంచం గుర్తిస్తుంది. తల్లిదండ్రులకు సమాన బాధ్యత వున్నప్పటికీ,శారీరక లక్షణాల కారణంగా ఆడవారే చెయ్యదగిన పనులు కొన్నివున్నాయి. అందులో స్థన్యమివ్వడం ఒకటి. పుట్టిని పాపకు ఖచ్చితంగా 6 నెలలపాటూ తల్లిపాలు ఇవ్వాలి. కొన్ని పరిస్తితుల్లో తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి.

అంతేకాక,పుట్టిన శిశువు వాసన,స్పర్శ ద్వారా కేవలం తల్లిని మాత్రమే గుర్తించే సమయం ఇది. ఈ టైంలో vaccination వంటి ప్రక్రియలుంటాయి. తండ్రి దగ్గరున్నా, ఖంగారుపడటమో లేక భార్యను మరింత ఖంగారుపెట్టడమోతప్ప మరో పని చెయ్యలేరు.అందుకే ఎవరైనా పెద్దవారు, ముఖ్యంగా మహిళలు ఈ సమయంలో ఉండాలంటారు.

పిల్లల్ని పెంచడంలో పురుషులపాత్ర ఖచ్చితంగా వుంది. అయితే,బిడ్డపుట్టిన 6 నెలలవరకూ మగాడిది సహాయకుడి పాత్రమాత్రమే.

మనదేశంలో వచ్చిన దౌర్భాగ్యమేమిటయ్యా అంటే,ఈ విషయాల గురించి తెలుసుకుంటేగానీ తెలియవు.మహిళలకు ఈ సంగతులన్నీ తెలుసుండాలని మనతరఫునుంచీ expectations ఉంటాయేగానీ, వారికిమాత్రం ఎక్కడినుండీ తెలుస్తుందనే స్పృహుండదు.

విద్య,ఆరోగ్యానికి బడ్జెట్ కేటాయింపులు 2-4% ఎప్పుడూ మించలేదు.దీన్నిబట్టి ప్రభుత్వాలకి ఈ రంగాలమీద ఎంత చిత్తశుద్ధి వుందో తెలుస్తుంది.సమస్యలున్నాయి, అందుకే దేశంలో Infant Mortality Rate(IMR),Maternal Mortality Rate (MMR)ఇలా తగలడ్డాయి.

కానీ మార్పు ఇక్కడే రావాలి, వస్తోంది. అందులోభాగమే ఇవన్నీనూ! ఈ సౌలభ్యం అన్ని రంగాలలోని మహిళలకూ వర్తిస్తుంది.