సరదాగా వచ్చేసి ప్రేమించేస్తున్నానన్నాడు.
సరే లే అన్నాను.
కున్ని రోజులకు ప్రేమ ఉంది లే గానీ.. పరిస్థితులు బాలేవన్నాడు.
ఏమీ పర్లేదులే అనేసేను.
ఇంకున్ని రోజులకొచ్చి ప్రేమ ఎక్కువైపోయింది
తట్టుకోలేకపోతున్నా అని గొడవ చేసాడు.
పోనీలే తగ్గిద్దూలే అనేసి ఒప్పేసుకున్నాను.
ఉన్నట్టుండి... నిన్ను చూడ్లేకుండా ఉండ్లేనన్నాడు.
అవునా అని నోరెళ్ళబెట్టాను.
ప్రేమ గీతాలు నేర్చేసుకునుచ్చి పాడేడు.
పెన్నులూ, పెనిసిళ్ళూ కానుకలిచ్చి నన్ను వల్లో వేసేసుకున్నాడు
కారు లో లాంగ్ డ్రైవ్ అన్నాడు.
వీలు నాకిస్తేగానీ వీల్లేదన్నాను.
అయినా - ప్రేమించాను గా ఇంక చస్తానా అన్నాడు.
నేను ఉప్పొంగిపోయేను.
కొన్ని రోజులు పోయాకా, మళ్ళీ సరదాగా
చూద్దాంలే ప్రేమ సంగతి అన్నాడు.
నేనూ చూద్దాంలే అన్నాను.
మనసులో ప్రేమ బాధ కొన్ని రోజులు పడి,
నా వల్ల కాదేమో నని భయపడిపోయీనన్నాడు
సరే ఎందుకొచ్చిన గొడవలే అని - ఊరుకోద్దూ అని సముదాయించేను.
ఒకసారెప్పుడో, ఎమోషనల్గా ఎటాచ్ కాకు అమ్మలూ అని హితబోధ చేసేడు.
తరవాత నీ గుండె పగిలితే నేను తట్టుకోలేను కన్నలూ అని చెప్పాడు
అపుడు కూడా నిజమే నిజమే.. భద్రం, మనసు భద్రం అని జాగర్తపడిపోయేను.
ఊరెళ్ళిపోతూ, మర్చిపోతావా.. మర్చిపోకు నన్ను - అని ఒట్టేయించుకున్నాడు.
లేదు లేదు.. నాకు జ్ఞాపక శక్తి ఎక్కువే ని ఒప్పించీసేను.
ఆరోగ్యం జాగర్త - కంగారు పడిపోకు - ఆర్గనైస్డ్ గా ఉండు అని జీవితాన్ని గురించి బోధపరిచేడు.
నువ్వే నా ప్రియ నేస్తం అని తనకి చెప్పేసి ఎస్ ఎం ఎస్ ఇచ్చీసేను.
కొన్నిరోజులతరవాత బుద్దొచ్చి, జ్ఞాన దంతాలు వొచ్చి, లోక్ జ్ఞానం తెలిసొచ్చి..
మెడుల్లా ఆంబ్లాగేటా సర్వీసింగ్ చేయించుకొచ్చి,
నాకు భవ బంధాలున్నాయి.. అర్ధం చేసుకోమ్మా అని బ్రతిమలాడేడు.
మరేమీ పర్లేదు.. నేనేమీ నీ ప్రేమ కోసం అల్లాడట్లేదులే - పోయి స్వతంత్రుడవు కా ! అని ఆశీర్వదించేను.
చివరాఖరికి - నా వల్ల కాదని చెప్పి వొదిలేసాడు.
నేనూ - నా వల్ల అంతకన్నా కాదులే అని ఊరుకున్నాను.
ఎందుకొచ్చిందో ప్రేమ, ఎలా వొచ్చిందో అలా నిష్క్రమిస్తే గొడవేముంది ?
ఇంత పకడ్బందీ గా అంటీ ముట్టకుండా ప్రేమించినా, గుండె లోతుల్లోకి గాయం చెయ్యకుండా ఉండలేకపోయింది.
అరే ! నా మీద కొంచెం కూడా నీకు ఫీలింగ్స్ లేవన్నాడు.
నువ్వెప్పుడూ నన్ను తేలిగ్గానే తీసుకున్నావన్నాడు.
నేను ఏడ్చి మొర పెట్టలేదని నొచ్చుకున్నాడు.
అంతూ పొంతూ తెలియని పిచ్చి ప్రేమల్లో ఏమి జరుగుతుంది ? ఇక్కడా సరిగ్గా అదే జరిగింది.
అతను నొచ్చుకునందుకు నేనూ నొచ్చుకున్నానంటే నమ్మడు.
నేనూ ప్రేమించేనబ్బా అంటే వినడు.
25 comments:
ఇంతన్నాడు,అంతన్నాడే గంగరాజు,
మేడన్నడు మిద్దెన్నాడే గంగరాజు,
మేడ మీద నుయ్యన్నాడే గంగరాజు,
అమ్మలు,ఓపాలి ఈపాట ఇనుకోలాదా,
ఎంత బాగా చెప్పేరండి...గుండె లొపలి గాయన్ని...
ఎంత సంతొషం గా ఉన్నారండి...విషాన్ని చిమ్మిన ప్రేమ ను చూస్తూ !!
నిజంగా నిజం..చాలా బాగా రాసారు. కొన్ని స్నేహాలు, బంధాలు దగ్గరగా వున్నపుడు తెలియదు, అవి దూరమయినపుడే తెలుస్తుంది ఆ బంధంలో తీవ్రత.ఆ క్షణంలో మన ప్రాక్టికాలిటీ, డిటాచ్ మెంట్ మనల్ని దారుణంగా వెక్కిరంచి చంపేస్తాయి.
సుజాత గారు,
ఎంత చక్కగా రాసారండి!ఇంతకంటే విశ్లేషించలేనిక!
ఒకరు ఇష్టపడి ప్రేమిస్తే, మరొకరు కనికరించి అంగీకరించారు. ఒకరు కుదరదని బ్రతిమాలితే,మరొకరు సరేలే అని దయతలిచారు.ఇక చివరకు మిగిలింది!!!ప్రేమమీదున్న ప్రేమ చావడమేనా?
ఎందుకే ఇలా అన్ని వైపులా ఇంత మంట రేపుతావు అందని కలా
అన్ని వైపులా అల్లుకోకిలా, ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
వెంటాడుతు వేధించాలా? మంటై నను సాధించాలా?
జ్ఞాపకమై రగిలించాలా? కన్నీరై కరిగించాలా?
మరపన్నదే రానీయవా దయలేని స్నేహమా...
"ఎందుకొచ్చిందో ప్రేమ, ఎలా వొచ్చిందో అలా నిష్క్రమిస్తే గొడవేముంది ? " ... చాలా బాగా వ్రాసారు
బహు బాగు. అక్కడక్కడా మీరు పలికించిన స్లాంగ్ అద్భుతం, అలా ఇమిడిపోయింది....
@రాజేంద్ర, ఆ పాట ఏదో మీరే ఓపాలి ఇనిపించేద్దురేటి..
మీరు చెప్పడం కూడా అంటీఅంటనట్టుగా చెప్తూనే మనసుకు హత్తుకునేలా రాసారు!! చాలా బావుంది.. కానీ 'ప్రేమ మీద ప్రేమ చంపుకోవడం', ఇది నచ్చలేదు.. ఇంకోపాలి ఆలోచించండి :-)
రాజేంద్ర గారు..
సాంగు సూపరుగా ఉంది.. చిన్నప్పుడు రేడియోలో విన్న జానపద గీతాలు గుర్తొచ్చాయి. Thanks.
మధు
థాంక్స్.
శ్రీ విద్య,
చాలా థాంక్స్. చాలా మంచి కామెంట్. నాకూ కళ్ళు చెమర్చాయి. ఇలాంటివి నాలాంటి పాగల్ ల కే అర్ధం అవుతాయి అనుకున్నాను. మీకు అర్ధం అయినందుకు చాలా ఆనందం కలిగింది. (మిమ్మల్ని పాగల్ అని ఎంతమాత్రం అనట్లేదు)
సుజాత గారూ..
మీ వ్యాఖ్య పడిందంటే.. నా పోస్ట్ పర్లేదన్న మాట.
మహేష్ గారు..
మీ సూచన బావుంది. నాకూ ఎండింగ్ నచ్చలేదు. కిరణ్మయి గారు కూడా మీ మాటే అనడంతో కుంచెం మార్చేను. ఇదెలా ఉందో తెలీదు మరి. చూడాలి.
కానీ జాలితో కనికరంతో..లేదా మరేదో తో ప్రేమించరేమో ఎవరూ!! ఎంతో కొంత స్పందిస్తేనే గా ప్రేమ అనే బ్రహ్మ పదార్ధం పుడుతుంది. బలీయమైన వాంచ కూడా ప్రేమ అయితే, ఇష్టమైన జాలి కూడా ప్రేమ కావచ్చేమో ?
లక్ష్మి గారూ.. వాహ్ వాహ్..
ప్రఫుల్ గారు
చాలా థాంక్స్. అదే కదా గొడవ.
వరూధిని గారు..
నేనింక ఫ్లాట్!!!!
నిషిగంధ,
థాంక్స్. మీ సూచన ప్రకారం కొంచెం మార్చేసాను. ఇపుడు చెప్పండి. ఎలా వుందో ఈ పిచ్చి రాత!
బాగుందండీ.. సింపుల్ పదాల్లో, సింపుల్గా తేల్చేశారు విషయాన్ని.
ఎందుకొచ్చిందో ప్రేమ, ఎలా వొచ్చిందో అలా నిష్క్రమిస్తే గొడవేముంది ?
ఇలా వచ్చి అలా పోతే.. అది ప్రేమెలా అవుతుంది.
@sujatha:ఏంతోకొంత స్పందిస్తేనే ప్రేమపుడుతుంది. కానీ, జాలిపడితే పుట్టేదాన్ని కరుణ అంటారు. అది విశ్వజనీయమైన ప్రేమకు దారితియ్యొచ్చుగానీ ఆడామగల ప్రేమకు దారిదీస్తే..దాన్ని దయదలచడం అంటారేతప్ప ప్రేమకాదేమో!
‘పాపం నాకోసం ఆత్మహత్యకు సిద్దపడ్డాడు’ అని జాలిగా ప్రేమించడంలాంటివి ఉండొచ్చు.మీరు చెప్పినట్టు "తట్టుకోలేకపోతున్నా అని గొడవ" చేసినా దయతలచొచ్చు.కాకపోతే, వీటిల్లో కనీసం ఒకవైపునుంచీ ఖచ్చితంగా ఆకర్షణ ఉంది. అదీ అబ్బాయి తరఫునుంచీ. అలాంటప్పుడు కేవలం "జాలి" తలచిన అమ్మాయి (ఇక్కడ కవి..కవయిత్రికాబట్టి అదొక assumption) చివర్లో ఆ వాక్యం అనడం కొంచెం తికమకగా ఉంది.
Mahesh garu..
mmmm...hu ! Ardham kaledu.
@sujata: అయ్యో! ఇప్పుడు నేను చెప్పినదాన్ని డీటైల్ గా చెప్పాలంటే, కనీసం ఒక పేజీ వివరణకావాలి. ఇంకెవరైనా సహాయం చేస్తారేమో చూస్తాను.
Mahesh garu..
Ok!
Where is my ore kadal review.. Dont feel 'kya jabardasti hi?' .. mmmm... Im still waiting for it. Emito mee meede aasalannee pettukunnaa.
"అతను నొచ్చుకునందుకు నేనూ నొచ్చుకున్నానంటే నమ్మడు.
నేనూ ప్రేమించేనబ్బా అంటే వినడు."
సుజాత గారూ, ఇది చదివి భలే నవ్వొచ్చింది.. కాస్త సీరియస్ విషయంలో కూడా మీరు humor జోడించడం భలే నచ్చింది!! ముగింపు చాలా బావుంది..
మహేష్ గారు చెప్పింది మనసుకేదో అర్ధమైనట్లు అనిపిస్తోంది కానీ మాటల్లో పెట్టాలంటే కష్టంగానే ఉంది.. ఇక్కడ అమ్మాయి ప్రేమ 'జాలి ' తో కూడింది కాబట్టి ఒకవేళ అది ఫెయిలైనా 'ప్రేమ మీద ప్రేమ ' చచ్చిపోయేంత తీవ్రత ఉండదని ఆయన భావమేమో!? ఏమంటారు మహేష్?
పూర్ణిమా..
థాంక్స్. ప్రేమ ఎందుకు అవుతుందో అవదో నాకు తెలియలేదు. ఊరికే పిచ్చి రాత.
పూర్ణిమా..
థాంక్స్. ప్రేమ ఎందుకు అవుతుందో అవదో నాకు తెలియలేదు. ఊరికే పిచ్చి రాత.
నిషిగంధ..
థాంక్స్. ఇంకా ఏమో చెప్పాలనిపిస్తుంది గానీ, నాకూ చెప్పలేనేమో అని భయం.
sujatha gaaru..chaaala baaga raasaru..i think meeku real love ante defination thelsi vuntundy..okka matalo chepparooo..plz
Post a Comment