Pages

04/10/2008

నిషబ్ద్

నిషబ్ద్ - పోస్టర్ మీద 'అతనికి 60, ఆమెకు 18' అని రాసి ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ కాస్త ఇరుకైనది. నిషబ్ద్ అసలు చాలా హైప్ లోంచీ, కాంట్రవర్సీ, ఈ సబ్జెక్ట్ మీద ఎప్పట్లాగే మీడియా లో చర్చల లోంచీ బోల్డంత ఆసక్తి కలిగిస్తూ థియేటర్లలో విడుదలయింది. ఇలాంటి ప్రేమ ని ఒప్పుకోలేని సమాజం సంకుచితమా, సమాజం హర్షించలేని ఆ ప్రేమ సంకుచితమా అని మనుషుల్లో కలిగే ఒక ఆలోచన కలిగించడానికి పనికి వస్తుంది.


నిజంగా చెప్పాలంటే, ప్రేమకు వయసు, కారణం.. ఇలాంటివన్నీ ఉండవు. సినిమాల్లో అయితే మరీ గ్లోరిఫై అయిన ప్రేమ - మొదటి చూపు లోనే ప్రేమ - ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయి, చంపడం లేదా చచ్చిపోవడం, ఇలాంటివన్నీ సాధారణంగా చూస్తూ ఉంటాము గాబట్టి మనకవన్నీ అలవాటే. నిజ జీవితం లో ప్రేమ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా వయసు మళ్ళిన ఒక గృహస్థు (భార్యా, పిల్లలు కలవాడు) తన వయసులో కన్నా ఎంతో చిన్నదైన అమ్మాయిని ప్రేమించడం - ఆ అమ్మాయి, అతని కూతురి స్నేహితురాలు కావడం, ఇవన్నీ ఎంత అనూహ్యమైన విషయాలు ?


నిషబ్ద్ మొదలయేసరికే విజయ్ (అమితాబ్) ఒక పర్వత శిఖరం కొన మీద నించుని ఉంటాడు - అక్కణ్ణించీ దూకి, ఆత్మ హత్య చేసుకోవడానికి. ఎందుకు - అంత కష్టం ఏమొచ్చిందీ అంటే - అతను చెప్పిన తన కధ ఈ నిషబ్ద్. ఒక నటుడిగా అమితాబ్ విలక్షణత, అతని భార్యగా నటించిన రేవతి మీనన్ ప్రతిభ ఈ సినిమాని చూడ చక్కగా తీర్చిదిద్దాయి.


కేరళ లో (మున్నార్) అందమైన పిక్చర్ పెర్ఫెక్ట్ పరిసరాల్లో విజయ్ (అమితాబ్), అమృతల (రెవతి) అందమైన పొదరిల్లు లాంటి ఇల్లు. విజయ్ ఒక ఫొటొగ్రాఫర్. వీళ్ళకి ఒక అందమైన కూతురు రీతు (ష్రద్ధా ఆర్య)! ఈ అమ్మాయి స్నేహితురాలే జియా. జియా ఒక ట్రబుల్డ్ టీనేజర్. ఈమె తల్లిదండృలు విడిపోయారు. తల్లి ఆస్ట్రేలియా లో ఒంటరిగా ఉంటుంది. జియా మాత్రం ఇండియాలో ఉండి చదువుకుంటూంది. ఈమె రీతూ తొ కలిసి, శలవులకు కేరళ రావడంతో కధ మొదలవుతుంది. రామూ శైలి లో జియా..(ఆస్ట్రేలియన్ పెంపకం గాబట్టి అనుకోవాలా) చిన్న చిన్న బట్టల్లోనే పరిచయం అవుతుంది. ఈ ఇద్దరు పిల్లల్నీ రీతూ తల్లి దండృలు ఎంతో సాదరంగా ఆహ్వానిస్తారు. రీతూ, జియా ఇద్దరూ ప్రాణ స్నేహితులు. రీతూ కన్న, జియా చాలా పెంకిది, తెలివైనది. చురికైనది. తొందరలోనే, అందరితోనూ కలిసిపోతుంది.


అయితే ఆమె లో ఏదో చైతన్యం తో విజయ్ (అమితాబ్) ఉత్తేజితుడవుతాడు. ఆమె కూడా అతని పట్ల తెలియని ఇష్టాన్ని పెంచుకుంటుంది. ఇవన్నీ ఎవరికి వారు గమనించుకునే లోగానే, ఇద్దరూ ప్రేమ లో పడతారు. ప్రేమ లో పడటానికి మనలో ఏదో కావాలి. అది ఏమిటి - మనలో స్పందనల్ని ఒడిసిపట్టగలిగే ప్రేరణలని ఎదిరించి, ప్రేమ కోసమే ప్రేమించడానికి కూడా ఏదో అవసరం. అందరూ ప్రేమించలేరు. అయితే, సమాజంలో ప్రేమ కి ఒక బాధ్యత ఉంటుంది. ఒక భార్య కి భర్త అయి ఉండి, ఒక కూతురి తండ్రి అయి ఉండి, తన కూతురి వయసు పిల్లతో ప్రేమ లో పడటం న్యాయం కాదు. అయితే ఎవరూ కావాలని ప్రేమ లో పడరు.


అంతవరకూ తన భాద్యతలని ఎరిగిన మనిషిగా, ఎంతో హుందాగా, ఎంతో గౌరవంగా జీవితాన్ని గడిపిన వ్యక్తి, తన వయసుని మరిచి, తన ముందున్న స్త్రీని ఒక స్త్రీ లాగా ప్రేమించడం, అదే తొలి ప్రేమ అన్నంతగా ప్రేమించడం సాధ్యమా..?


జియా ఖాన్ కూడా చాలా అందంగా - యవ్వనంతో మిసమిస లాడుతూ, కనిపించినా, పాత్ర పరంగా తన అంతరంగం లో దాగున్న అగ్నిపర్వతాలను కూడా చాలా బాగా ప్రదర్శించింది. జియా (పాత్ర పేరు కూడా అదే) ఒక ఫ్రీ బర్డ్. ఆమె అన్ని మానసిక అవసరాలనూ తీర్చడానికీ ఒక కుటుంబం అంటూ లేకుండా, ప్రేమను అనుభవించకుండా, బలవంతపు కఠినాత్మకత, కేర్లెస్ నెస్, తల్లి కున్న బాయ్ ఫ్రెండ్స్ ని చూస్తూ, తల్లి అనుభవాల్ని చూస్తూ ఏర్పరచుకున్న వ్యక్తిత్వం ఆమెది. అంతవరకూ ఆమె తొ మామూలుగానే ఉంటూ వచ్చిన తల్లి బాయ్ ఫ్రెండ్ కూడా - తనకు కాస్త వయసు రాగానే తననే ఆశించడాన్ని తీవ్రంగా అసహ్యించుకున్న వ్యక్తి - ఒక తెగిన గాలిపటం. ఇపుడు ఆమెకు ఆస్ట్రేలియా వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ 'అతను ' ఉంటాడు. తల్లి అతన్ని వొదులుకోలేదు.


ఇలాంటి అమ్మాయికి ఈ అరవయ్యేళ్ళ వృద్ధుణ్ణి చూసి ప్రేమ కలిగింది. అయితే, తను అనుభవిస్తున్న ప్రేమ వెనకున్న పరిమాణాల సంగతి ఆమెకు తెలియదు. ఆమెకు ప్రేమో / ఆకర్షణో కలిగింది. ఈ ప్రేమకి చలించిన విజయ్ - తన వయసునీ, వరుసనీ మరిచి, పిచ్చివాడైపోతాడు. అతను అలా చెయ్యకూడదు - అలా చెయ్యకూడదని జియాకు తెలియదు. ఆమె లో భారతీయత తక్కువ.


ఈ సినిమా లో రేవతి గురించి చెప్పుకోవాలి. రేవతి అంటేనే, చాలా మంచి నటి.. అని అందరికీ తెలుసు. ఒక సారి జియా వీళ్ళ ఫేమిలీ ఫోటోలు చూస్తూండగా, రేవతి చిన్నపుడు (పెళ్ళి కాక ముందు) భరతనాట్య ప్రదర్శన ఇచ్చినప్పటి ఫోటో కనపడుతుంది. అపుడు జియా 'ఆంటీ.. మీకు డాన్స్ వచ్చా.. ?' అంటే నవ్వి రేవతి 'పెళ్ళయ్యాక మానేసాను ' అంటుంది. జియా.. ఎందుకు మానేసారు అని అడిగితే, ఆలోచన లో పడి.. 'పెళ్ళయ్యాక, విజయ్ నే నా జీవితం. తరవాత రీతూ వచ్చింది.. ఇంకెక్కడ కుదురుతుంది ?' అంటుంది. ఇంతగా కుటుంబం కోసం తన ఇష్టాఇష్టాలని వొదులుకుని, పూర్తిగా విజయ్ కే అంకితమైన భార్య ఆమె.


విజయ్ గా అమితాబ్ - తప్పు ఒప్పుల సంఘర్షణల మధ్య ఊగిసలాడినా.. జియా వైపే మొగ్గుతూ ఉంటాడు. ఈ పరిస్థితుల్లో రీతూ కు తండ్రికీ, తన స్నేహితురాలికీ మధ్య ఉన్న 'అనుబంధం' గురించి అనుకోకుండా తెలుస్తుంది. తండ్రికి తల్లి కాకుండా వేరే ఎవరితోనో 'ప్రేమ ' ఉందని తెలిస్తే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది ? రీతూ గా ష్రద్ధా ఆర్య నటన చాలా బావుంది. ఈ అమ్మాయి, ఈ విషయాన్ని తల్లికి చెప్పలేక, తండ్రితో మాట్లాడలేక, (జియా తో మాత్రం మాటాడటం మానేస్తుంది) ఎంత తల్లడిల్లిపోతుందో చూస్తే జాలి కలుగుతుంది. ఆఖర్న తల్లికి జియాని పంపెయమ్మా.. తను మనింట్లో ఉండొద్దు ! అని చెప్తే, అమృత కి అసలు విషయం అర్ధం కాదు. ''మీరు ఫ్రెండ్స్ కదా - అలా కోపం వస్తే ఆమెని వెళ్ళిపోమంటారా ఎవరైనా..?'' అని సర్దేస్తుంది. ఈ పాత్ర లో రేవతి ఎంత చక్కగా ఒదిగిపోయిందంటే, ఆమెకి భర్త మీద లేశమాత్రమైనా అనుమానం ఉండదు. అసలు వీరిద్దరి మధ్యా జరుగుతున్నది రేవతి కి మాత్రం కనిపించదు - అనిపించదు.


ఈ పరిస్థితుల్లో ఆపధ్బాంధవుడిలా శ్రీధర్ (నాజర్) (అమృత సోదరుడు) ప్రవేశిస్తాడు. రీతూ తన హోం ట్రూత్ ని మామయ్య కి చెప్పడం, ఆయన విజయ్ తో (అమితాబ్) తో ఈ విషయం డిస్కస్ చెయ్యడం (జియా ఇంకా చిన్నపిల్ల ! ఆమె ఒక వేళ నిన్ను నిజంగా ప్రేమించిందే అనుకో - నీ వయసు కు నువ్వు ఆమెకు ఎలాంటి జీవితాన్నివ్వగలవు ? ఆమె ను ప్రేమించి, ఆమె ఫ్యూచర్ కు నువ్వు అన్యాయమే చేస్తున్నావు అని వాదిస్తాడు శ్రీధర్) చివరికి రేవతి కి కూడా సంగతి తెలియడం.. ఆమె భర్తని అసహ్యించుకోవడం..(అది చూసి తీరాల్సిన సీన్) చివరికి సమాజపు, కౌటింబికపు భాద్యతల పరంగా విజయ్ - జియాని పిలిచి, 'నేను నిన్ను ప్రేమించడం లేదు - నీది ఎడాలసెంట్ వయసు అందుకే నీకు అలా అనిపిస్తూంది. నువ్వు నా ఇంటి నుంచీ వెళిపో. నీ ముఖం కూడా చూపించొద్దు. ఏదో కాస్త ప్రేమ గా మాట్లాడితే అది నిజం ప్రేమ అనుకుంటావా..'' లాంటి ఏవో మనసు విరిచే మాటలని, ఆమెను ఇంటినుంచీ వెళ్ళగొట్టడం - తో ఈ గొడవ సద్దుమణుగుతుంది. ఈ నిరాకరణ ని ఎదుర్కోవడానికి జియా కు ఎంత ధైర్యం కావాలి ? జియా విజయ్ ని బ్రతిమాలుతుంది. 'నిన్ను చూడకుండా ఉండలేను ' అంటుంది. కానీ అమితాభ్ కాఠిన్యాన్ని చూసి, గుండె చెదిరి - ఏడుస్తూ వెళిపోతుంది. ఈమెను ప్రేమించే బాయ్ ఫ్రెండ్ (ఆమె ఇష్టపడదు) ఆఫ్తాబ్ శివ్ దాశానీని పిలిచి అతనికి ఆమెని అప్పగించేస్తాడు విజయ్.


ఈ చిన్ని ఎపిసోడ్ ముగిసాక, విజయ్ ఒంటరి అయిపోతాడు. అతనితో భార్య మాటలాడదు. (ఆమె విశ్వాసాన్ని అతను కోల్పోయాడుగా) కూతురు అసహ్యించుకుంటుంది. జియా లేదు. వెళిపోతున్న జియా ఎంత హర్ట్ అయిపోయి వెళిపోయిందో అదే గుర్తొస్తూ.. ఆమె లేక బ్రతకలేక, ఆ కొండ కొమ్మున నించుని ఉంటాడు అమితాబ్. కానీ చాలా సేపు, ఆమె ని తలచుకుని రోదిస్తూ.. పొద్దు పోయేదాకా గడిపి, ఇంటికొస్తాడు. Sridhar (నాజర్) 'ఇంత వరకూ ఎక్కడికెళ్ళావు విజయ్?' అని అడిగితే, 'చావడానికీ అని నిర్లిప్తంగా చెప్పి - 'కానీ చావలేకపోయాను. జియాని తలచుకుంటూ.. ఆ విరహ బాధలో ఇంకొన్నాళ్ళు ఆమె కోసం బాధపడుతూ బ్రతకాలనుంది - అందుకే ఇంటికొచ్చేసాను ' అంటాడు. అప్పుడు విజయ్ లో ఉన్న ప్రేమ తీవ్రత అర్ధం అవుతుంది. అంతే..! ఇదే ముగింపు.


అయితే, రాం గోపాల్ వర్మ కి కొంచెం ప్రేక్షకులను ఆకర్షించడానికి కాస్త ఉత్సాహపడే లక్షణం - ఈ సినిమాని కొంచెం (కొంచెమే లెండి) చతికిలపరిచాయి. కొన్ని సార్లు ప్రేమ ని కొంచెం మంచిగా చూపించాలి. సౌందర్యానికీ, పొడుగు కాళ్ళకూ, స్కిన్ షో కూ కొంచెం ఎక్కువ మోతాదులో ప్రాముఖ్యత ఇస్తే, జియా ఖాన్ ని తడిపి, చిన్న బట్టల్లో చూపితే - అది చూసి అమితాబ్ కు ప్రేమ కలగడం - ఇవి కొంచెం చీప్ గా అనిపిస్తాయి. సినిమా లో జియాఖాన్ కాళ్ళు చూసీ చూసీ విసుగు పుడుతుంది. అసలు జియా ఖాన్ ముఖం చూస్తేనే చిరాకు వచ్చేంత వరకూ చూపించి, చివరి అర్ధ గంట లో మాత్రం మంచి నటన చూపించాడు. ప్రేమ ఒక ఉత్కృష్టమైన భావన. దీన్ని అంతకన్నా తక్కువగా చూపిస్తే, అది కన్విన్సింగ్ గా ఉండదు.


విజయ్ పాత్ర లో అమితాబ్ కాకుండా ఇంకోరెవరైనా ఉంటే సినిమా తేలిపోయి ఉండేది. నిస్సహాయమైన ఒక వృద్ధ ప్రేమికుడి గా విజయ్ 'జియా జ్ఞాపకాలలో నైనా జీవించాలని ఉంది..' అన్నప్పుడు పురుషుని ప్రేమ ఎంత లోతైనదో అర్ధం అవుతుంది. మన సమాజం లో - ఒక వయసు రాగానే పెద్దలు కుదిర్చిన పెళ్ళీ.. పెళ్ళి అయిన కొన్నాళ్ళకి పిల్లలూ - ఇవి మనుషులకి తప్పని చిక్కుముళ్ళు. వీటికి వ్యతిరేకంగా ఏ ఒక్కటి జరిగినా సమాజం లో అలజడి మొదలవుతుంది. 'ఇంకా ఎందుకు పెళ్ళి చేసుకోలేదు '? 'ఇంకా ఎందుకు పిల్లలు కనలేదు ?' 'ఇంకా ఎందుకు మీ పిల్లలకి పెళ్ళి చెయ్యలేదు ?' ఇలా ప్రశ్నలు - వీటికి సమాధానం ఏముంది ? పెళ్ళి బయట ప్రేమ అంటే సమాజం (family) ఊరుకుంటుందా ? అయినా ఒక కుటుంబాన్ని కలిపి ఉంచే నమ్మకం, విశ్వాశం, ప్రేమ, ఇవన్నీ ఏమిటి ? ఈ ఏక్సిడెంట్ ల తరవాత ఆ ముగ్గురు కుటుంబ సభ్యులూ బాధితుల్లా ఒకరి కొకరు దూరమయిపోయి - తట్టుకోలేని నిశ్శబ్దం లో మిగిలిపోతారు. ఈ నిశ్శబ్దం లో కూడా విజయ్ లో ప్రాణాన్ని హరించకుండా నిలిపి ఉంచింది, ఈ ప్రేమే. నిష్కారణంగా బంగారం లాంటి సంసారాన్ని పాడుచేసుకున్నాడే - అనిపించినా, ఎట్ లీస్ట్ జియా పట్ల తనకి కలిగిన ప్రేమ ని అంగీకరించి, (రేవతి ముందు) నిజాయితీ గా, దాని పర్యవశానాన్ని ఎదుర్కున్న ప్రేమికుడిగా అమితాబ్ చాలా చక్కగా నటించారు.


So..ఇన్ని సమస్యలకూ ఒక కళా రూపం నిషబ్ద్ ! పోస్టర్ చూసీ, స్టోరీ వినీ, వెళ్ళని వారు భయపడకుండా చూడొచ్చు. భారత దేశపు అత్యుత్తమ నటులు ముగ్గురు ప్రధాన పాత్రల్లో నటించారు. పర్లేదు. ధైర్యంగా చూడండి.

24 comments:

Motorolan said...

I liked the movie verymuch , But I think our people are not yet ready to "accept" these sort of ideas...

Ramu is always a decade ahead :)

కొత్త పాళీ said...

ఇప్పుడీ సినిమా మీద విపరీతమైన ఆసక్తి రగిలించారు. డిస్కు దొరక్క పోతే మీదే బాధ్యత!

వికటకవి said...

Nice review.

కత్తి మహేష్ కుమార్ said...

ఈ సినిమా నేను చూసి "I don't have any problem with it" అంటే, నన్నొక బహుష్కృతుడిలాగా చూసారు. ప్రేమల్లో కూడా కూడికలూ తీసివేతలూ,భాగాహారాలూ ఉండాలనుకునే జనాలకి ఇదొక బూతు సినిమా.

స్క్రీన్ ప్లే పరంగా నాకు కొన్ని issues ఉన్నా, సబ్జెక్ట్ పరంగా మంచి చిత్రం. ఒక విభిన్నమైన చిత్రం.

Purnima said...

Yeah, even I feel like watching the movie, straight away!

That was a nice review.

సూర్యుడు said...

Nice review. Always, I have a confusion between love, attraction, and infatuation. If we don't define love appropriately, there will be a confusion.

We express our love towards our parents first and then siblings and then friends, pets and so many other things. However, when it comes to the love between opposite sex, it has to explicitly stated so that there is no confusion.

Here in case of love between a 60 year old male to a 20 year old female can be of many forms. When this male falls in love with that female after seeing her in wet clothes or in short clothes, I consider it as a mere sexual attraction than love in its purest form (does it exists?).

Not sure whether I am clear enough here but this is what I felt after reading this review and I generally don't watch cinemas and this is no exception either :-)

Best regards,
suryudu :-)

sujata said...

motorolan..

thanks. Perhaps I would nt have liked the idea myself. But.. i liked the movie. Confusing and compelling in many ways.

sujata said...

కొత్త పాళీ గారు

థాంక్స్. నేనూ నవతరంగం లో చేరాను.

హా హా - మీకు సీడీ దొరకాలి అని కోరుకుంటున్నాను. మీకు మళయాళం అర్ధం అయితే, 'ఒరె కడల్' మూవీ చూడండి. ఇదీ ఇలాంటి సబ్జక్టే.. కానీ చాలా బావుంది.

sujata said...

వికట కవి గారు..

Oh ! thanks.

కత్తి మహేష్ కుమార్ said...

@సూర్యుడు: సమస్య ఆడా-మగా మధ్య కలిగే ప్రేమని నిర్వచించడంతోనే మొదలౌతుంది.ప్రేమకు కారణాలు కావాలంటే వాటిని లౌకిక అవసరాల కొలమానంతో కొలవాలి. అంటే,దాన్నొక లాభనష్టాల వ్యాపారంలో భాగం చేస్తున్నామన్నమాట. చాలా వరకూ "పవిత్ర ప్రేమలు" ఈ కోవలోకే వస్తాయి. ఇలాంటి లౌక్యం తెలిసిన ప్రేమల్లో పవిత్రత ఎంత అనేది విజ్ఞులకే వొదిలేద్దాం.

వయసుతో సంబంధం లేకుండా స్త్రీపురుషుల మధ్య ఆకర్షణ ఏర్పడచ్చు. సినిమాలో అమితాబ్ ను ఆ అమ్మాయి ఇష్టపడుతున్నట్లు చెప్పటానికి కారణం అతని ‘ఆకర్షణీయమైన వ్యక్తిత్వం’ అని తన కూతురితోనే చెబుతుంది. ఇక అమితాబ్ కేవలం ఆ అమ్మాయిని తడిబట్టలతో చూసి కేవలం వాంఛించాడని నేను అనుకోను..అది ప్రారంభం కావొచ్చేమోగానీ అతడి ప్రేమకు అదే మొదలూ,తుదీ కాలేదు.

బలీయమైన వాంఛకూడా ప్రేమే..‘కేవలం పెళ్ళి పర్యవసానమైతే ప్రేమ’ అనే మన conditioning నుంచీ కొంచెం బయటకు రాగలిగితే ఈ confusion లు తగ్గే అవకాశం ఉంది.

sujata said...
This comment has been removed by the author.
sujata said...

మహేష్ గారూ.. నాకూ కొంచెం 'అతి వాదం' నచ్చలేదు. మీ కామెంట్ కి థాంక్స్. నా సీ.డీ. దొరికిందా ?

sujata said...

Suryudu garu.

I agree. But, as I said, I didnt like, at the first place, tricks of Ramu to show the woman in a sexiest way possible. This, I think, is to add some spice to it and to attract collections at Box Office.

I may not be explaining it to you very clearly, but I suppose Love, in these days is a bit different from our olden days. But it is not difficult to love any one. But to express it and to abide by it.. can be difficult for individuals, depending on which situation they are in.

I think, sex is the last thing Vijay has in his mind, when he fells in Love with Jia. I think Ramu tried to elevate the beautiful and womanly side of a teenage & tomboyish Jia with a Hose pipe in her hands. I hope this is what he tried to establish.

Thanks for the comment here.

sujata said...
This comment has been removed by the author.
sujata said...

Mahesh garu

Kudos to your communication skills. Thanks for your reply to Suryudu garu. That is more convincing I suppose.

కొత్త పాళీ said...

The debate set up by Mr. Suryudu resonates with the one raging on another blog right now -
My question to Mr. Suryudu .. or anyone else who cares to answer - Isn't the raw, physical and clearly definable "attraction" of a man to a beautiful young woman in wet clothes preferable to the undefiniable, vague, uneasy (yet somehow very great, magnificent, grand) feeling called pure love?

sujata said...

కొత్త పాళీ గారు - చాలా బావుంది.

Thanks for the link.

When it comes to your comment, ఈ విషయం లో మగ వాళ్ళ, ఆడ వాళ్ళ అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉంటాయనుకుంటాను. మీ ఐడియా నాకు నచ్చింది. బెటర్ స్టిల్. కానీ ఆ ఆకర్షణ కి కేవలం అందమే ప్రమాణం అయి ఉండి.. 'తన తెలివి తేటలూ, ఆమె అందం .. ' కాంబినేషన్ కాకుండా 'ఆమె తెలివితేటలూ, తన అందం..' లాంటి resulting కాంబినేషన్లు కూడా ఒక ప్రాబబిలిటీ.


స్త్రీ ని స్త్రీ లాగా.. ప్రేమించడానికి, అందం, సెక్సీనెస్ అవసరమే అనుకుంటాను బహుశా. కొందరిలో కొన్ని కేరక్టెరిస్టిక్స్ మనకు నచ్చుతాయి. ఎపుడైనా స్త్రీలు కొంత ఎటెన్షన్ ని ఇస్టపడతారు. తమ అందాన్ని అందరూ ఎప్రీషియేట్ చెయ్యాలని వారికీ ఉంటుంది. అయితే, అందమే ముఖ్య ప్రమాణం గా మిగలట్లేదు. ఇపుడు బ్యూటీ కి కొంచెం బ్రెయిన్ ఉంటేనే అందం అని తెలుసుకుంటున్నారు.

గ్రాండ్ - ప్యూర్ లవ్ ఎప్పటికీ గ్రాండే, గ్రేటే నే మో ! ఎందుకంటే, అందాన్ని చూసి, రా - గా 'ప్రేమ ' లో పడి తే, అది క్లిక్ కావచ్చు/కాక పోవచ్చు. So I believe, ప్రేమ కూడా ప్యూర్ లక్.

కత్తి మహేష్ కుమార్ said...

@సుజాత గారు: దసరా శెలవులకి కేరళ వెళ్ళిన నా మిత్రుడు వస్తూవస్తూ మీ సీడీ తెస్తాడు. ఇంకోవారం అన్నమాట!

sujata said...

mahesh garu

thanks. I am eager to know the full story and plot and justification.. and I want to see what you would say about them all.

సూర్యుడు said...

నా సమస్య ఇంకా అలానే ఉంది :-)

ప్రశ్నేంటంటే, వయస్సులో పెద్దాయన తన కూతురి వయస్సులో ఉన్న అమ్మాయిని ప్రేమించటం. ఈ ప్రేమించటం ఎన్నో రకాలుగా ఉండొచ్చు. అంటే, ఆయన కూతురి స్నేహితురాలిని కూడా తన అమ్మాయిలాగే ప్రేమించొచ్చు, అలా ప్రేమిస్తే దాన్లో తప్పుపట్టవలసిన విషయమేమీలేదు. అతని భార్యకూడా అసహ్యించుకునేదికాదు. కాని ఇక్కడ, ఈ ప్రేమ కూతురికీ నచ్చలేదు, భార్యకీ నచ్చలేదు, భార్య అన్నో/తమ్ముడో, అతనికి కూడానచ్చలేదు, ఎందువల్ల? భార్యకి, కూతురికి అయితే తమకి చెందవలసిన ప్రేమని వేరేవాళ్లతో పంచుకోవడం ఇష్టం లేకనా, లేక ఆ ప్రేమ శారీరకమైనదనా?

@కొత్తపాళీ గారు:
మనకి రకరకాల వ్యక్తులతో రకరకాల ప్రేమలుంటాయి. మీరు చెప్పే అనిర్వచనీయమైన ప్రేమ ఎవరిమీద పుడుతుందో చెప్పలేం కాని, మనకి పుట్టిన ఒకరకమైన ప్రేమని వేరే రకంగా typecast చెస్తేనే ఇబ్బంది. When one has a strong physical attraction towards a woman, let it be expressed that way but in the guise of eternal love in the reverence of which he can lead rest of his life :-)

~సూర్యుడు :-)

సూర్యుడు said...

@కొత్తపాళీ గారు:
మనకి రకరకాల వ్యక్తులతో రకరకాల ప్రేమలుంటాయి. మీరు చెప్పే అనిర్వచనీయమైన ప్రేమ ఎవరిమీద పుడుతుందో చెప్పలేం కాని, మనకి పుట్టిన ఒకరకమైన ప్రేమని వేరే రకంగా typecast చెస్తేనే ఇబ్బంది. When one has a strong physical attraction towards a woman, let it be expressed that way but not in the guise of eternal love in the reverence of which he can lead rest of his life :-)

~సూర్యుడు :-)
PS: ఇంతకుముందు కామెంట్లో NOT పెట్టడం మర్చిపోయాను :-)

ప్రవీణ్ గార్లపాటి said...

మంచి సమీక్ష, చాలా ప్రశ్నలు.
సమాధానాలు అంత సులువు కాదు :)

కొత్త పాళీ said...

సూర్యభగవాన్లూ, ప్యూర్ లవ్ ప్రసక్తి ముందు మీరే తెచ్చారు, నా మాట కాదు.
I quote from your comment - "I consider it as a mere sexual attraction than love in its purest form."

I am saying that the "mere sexual attraction" (which is real and understandable) is preferable to the "love in its purest form" (which is unreal, undefinable, and basically hogwash).

There is no confusion here about other forms of love - it is all about how a man loves a woman. If it were any other form of love between them, the film wouldn't have a story and we wouldn't be having this conversation.

సూర్యుడు said...

@కొత్త పాళీ gaaru,

I think, I have to give a detailed explanation. Sujatha garu, sorry for using your blog to do that.

My comment was high on context so I take the blame for confusion it created.

In the review, based on the story, this old man fallen in love with a beautiful young girl, of his daughter's age (may be after looking at her in wet clothes and short clothes, whatever). This is the context.

Based on the above context, I see a contradiction in the kind of love between the old man and the young girl.

1. If the love is based on physical attraction, let it be expressed like that and not to glorify it as an eternal love by saying that he can live the rest of his life in her memories

2. If the love is pure (here what I mean by pure is that, it is nothing to do with physical attraction) or whatever, you can equate it to the love he has for his daughter, then his daughter and wife should not be feeling bad for his love towards this young girl.

This is my confusion. If it is still not clear, we can live with it, right :)

Best regards,
సూర్యుడు :-)