Pages

24/09/2010

'నో కామెంట్ల' బ్లాగర్ల సంఘం

హలో ఎవ్రీబడీ ! బ్లాగుల్లో ఈ మధ్య ఎక్కువగా నడుస్తున్న ట్రెండ్ ని చూసి నాకూ ఓ పెద్దగా పనికిరాని ఆలోచన వచ్చింది.

ఈమధ్య బ్లాగర్లు జట్ట్లు జట్ట్లుగా, ఊర్ల వారీగా, ప్రాంతాల వారీగా, రక రకాల భావసారూప్యాల వారీగా,వృత్తుల వారీగా, వ్యాపకాల వారీగా, కామెంట్ల వారీగా బ్లాగర్ల సంఘాలు తెరవడం, (ఆ తరవాత ఏమి జరుగుతుందో నాకూ తెలీదు - with few exceptions though) - ఫాలో అప్ చేసుకోవడం వగైరా బాగా నడుస్తోంది కాబట్టి నేనూ ఒక బ్లాగర్ల సంఘం తెరుద్దామని మధ్యాన్నం పగటి కల తర్వాత నిశ్చయించుకున్నాను. అదే ఈ 'నో.కా.బ్లా.స.' అనగా - నో కామెంట్ల బ్లాగర్ల సంఘం. అంటే ఈ బ్లాగర్లు ఎక్కడా ఏమీ కామెంటరని కాదు. అస్సలు కామెంట్లు రాలని టపాలు రాయటమే వీళ్ళ ప్రత్యేకత ! అనగా కామెంటు పెట్టే అవకాశం తమ తమ బ్లాగుల్లో ఇచ్చినా కూడా పెద్దగా వ్యాఖ్యలు రానివాళ్ళు ఈ సంఘం లో వీజీ గా చేరొచ్చు.

బ్లాగు మొదలు పెట్టిన కొత్తలో ఉండే ఉత్సాహం ఇప్పుడు లేదు. ముఖ్యంగా, ఈరోజే ఎవరో బ్లాగులో చదివినట్టు - కొట్టు తెరిచిపెట్టి బేరాల కోసం ఎదురుచూసే టైపులో - పోస్టు రాయడం, ఆ వచ్చే ఒకటీ, అరా లేదా సున్నా వ్యాఖ్యల కోసం కళ్ళల్లో వొత్తులు వేసుకొని ఎదురు చూడటం - వగైరాలు నా ఒక్కరికే సొంతాలు కావేమో అనిపించింది.

ముఖ్యంగా నేను ఎంతో మనసు పెట్టి రాసిన కొన్ని టపాలకు (నా సొంత రేటింగు ప్రకారం - కొన్ని పుస్తక పరిచయాలు) రాలని చెప్పట్లు, కొన్నాళ్ళకి నాకే స్టుపిడ్ అనిపించే ఇంకో రకం టపాలకు భలే వినిపిస్తాయి. ఒక సారి సుజాత గారిని టిప్స్ కూడా అడిగినట్టు గుర్తు. కానీ సలహాలని కేష్ (వ్యాఖల / పాపులారిటీ రూపంలో) చేసుకోవడంలో ఘోరంగా విఫలం అయ్యాను.


కారణాలేమైనా కానీ, చాన్నాళ్ళ నుంచీ బ్లాగు రాసినా, అందులో సంగతి లేక సగం, ఇంకో సగం నాకు తెలీని కారణాల వల్లనూ, నా సేల్స్ గ్రాఫ్ (Comments) ఇన్ని సంవత్సరాలనుంచీ, దారిద్ర్య రేఖ కు (కనాకష్టం గా 3-4 వ్యాఖ్యలకు) దిగువునే ఉంది గాబట్టి, నానూ ఒక ఐ.కా.స పెడతాను.


చేరబోయే వాళ్ళు కామెంటు చెయ్యక్కర్లేదు. ఇంతకీ నా 'నో.కా.బ్లా.స.' / 'ఐ.కా.స' నియమాలు ఏమిటంటే, ఏమి రాసినా కామెంట్లు రాని బ్లాగర్లకు దీన్లో సభ్యత్వం ఇస్తాం. (ను!) అదేంటో, మనం పోస్టు పెట్టిన్రోజే, కూడల్లో ట్రాఫిక్ ఎక్కువయి, మనం అట్టడుక్కి తరవాత పేజీ నుంచీ బైటికీ - అయిపోయి బహుసా కామెంట్లు రావట్లేదు అనుకునే వాళ్ళకు కూడా సాదర ఆహ్వానం.

ఇతరుల దృష్టి లో పడాలని ఎంతగా ప్రయత్నించినా, కొన్ని రకాల వ్యక్తిగత, వృత్తి పరమైన కారణాల మూలంగా బ్లాగ్లోకంలో ఒంటరి గా ఫీలయిన వాళ్ళకు గౌరవ సభ్యత్వం అందచేస్తాము (ను!). సెక్స్, రాజకీయాలు, కుట్రలు, తవిక, గాసిప్, వార్తలూ, సినీమా, మతం - ఇలా జనాల్ని ఆకర్షించే అత్భుత విషయాల మీద అనర్గళంగా రాసే ప్రతిభ లేని వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వొచ్చు. ఈ సంఘం లో ఎవరు & ఎందరు చేరబోతున్నారో చూసి, దానిబట్టి మిగతా కార్యాచరణ అంటే మీటింగులూ వగైరా ప్లాన్ చెయ్యబడుతుంది.

ఈ టపా చదివి విచిత్రంగా పెట్టిన మీ మొహాల మీదుగా జూం చేసిన క్లోసప్ షాట్ మీద భయంకరమైన రాంసే బ్రదర్స్ తరహా నేపధ్య సంగీతంతో -



బ్రేక్.


----


------



-------- {మళ్ళీ కలుద్దామా.. ప్లీజ్ ? }

42 comments:

భాస్కర రామిరెడ్డి said...

ఈ టపాకు చూడండి ఎన్ని కామెంట్లు రాలుతాయో. మేఘాల్లో తేలినట్టుందే అని పాట పాడుకోవడమే తరువాయి. ఇకనుంచి మీకు బోరుకొట్టినప్పుడల్లా ఇలాంటివి వ్రాయాలని కూడా డిసైడింగ్ అయిపోతారేమో :)

మరి సభ్యత్వ రుసుములు గట్రా వుంటే ముందే చెప్పేయండి.. ఏంచక్కా వచ్చిన దార్లో వెళ్ళిపోతాము.

వేణూశ్రీకాంత్ said...

"కొట్టు తెరిచిపెట్టి బేరాల కోసం ఎదురుచూసే టైపులో - పోస్టు రాయడం, ఆ వచ్చే వ్యాఖ్యల కోసం కళ్ళల్లో వొత్తులు వేసుకొని ఎదురు చూడటం.

ముఖ్యంగా నేను ఎంతో మనసు పెట్టి రాసిన కొన్ని టపాలకు రాలని చెప్పట్లు, కొన్నాళ్ళకి నాకే స్టుపిడ్ అనిపించే ఇంకో రకం టపాలకు భలే వినిపిస్తాయి."

హ హ :-D మరే you are not alone. "ఈ బ్లాగర్లను అర్ధంచేసుకోడం మనవల్లకాదు" అనుకున్న సంధర్బాలు కోకొల్లలు :) జిందాబాద్ నో.కా.బ్లా.స.

శరత్ కాలమ్ said...

:))

ఇందులో సభ్యత్వానికి నేను అర్హుడినే అంటారా? అలా అయితే ఇందులో ఓ పదవి ఇచ్చేయండిచ్చేయండి.

నాకో సూక్తి వుంది. బయటకి ఎప్పుడూ చెప్పలేదనుకుంటా. అదేంటంటే "వ్యాఖ్యాతలనూ, స్త్రీలనూ జన్మలో అర్ధం చేసుకోలేం". ఎందుకంటే కామెంట్లు టపటపా రాలతాయేమో అనుకున్న టపాలకేమో రాలవు - ఏదో ఆషామషీగా వ్రాసిన వాటికేమో వద్దన్నా వచ్చేస్తుంటాయి (యాజ్ యూజువలుగా కొన్ని మినహాయింపులతో)

కొత్త పాళీ said...

అసలు కామెంటొద్దు అనుకున్నా గానీ ... :)

హరే కృష్ణ said...

నో కామెంట్స్ :)

శారద said...

సుజాత గారూ,
నో కా.బ్లా.స అంటే అసలు ఎప్పుడూ కామెంటు చెయ్యని బ్లాగర్ల సంఘం అనుకున్నాను.చూస్తే వేరేలా వుంది. అయితే ఏ డెఫినిషన్ అయినా నేను అందులో మెంబర్నే అని మనవి చేసుకుంటున్నాను.
నాకు పోస్టు చాలా నచ్చినా తగని బధ్ధకం వల్ల కామెంట్లు ఎక్కువగా రాయను. పోతే, మీరు చెప్పిన టాపిక్సు మీద రాయలేను కాబట్టి నా బ్లాగుకీ ఒకటీ-అరా-సున్నా తప్పితే కామెంట్లు రావు.
అందుకనే ఏ రిజర్వేషన్లూ లేకుండా ప్యూర్ మెరిట్ మీద మీ సంఘంలో నాకు సభ్యత్వం ఇవ్వాలని, మనవీ, డిమాండూ, చేసుకుంటున్నాను,
శారద

Anonymous said...

కామెంట్స్ తీసేస్తే ఆ నిరుత్సాహం వుండదు. :)

KumarN said...

:-) Looks like you have free time on hands, of late :-)

పద్మ said...

ఇదిగో కామెంటు చూడండి. :)

అసలు కామెంట్లెందుకండి? వస్తేనే గోల. వాటికి రిప్లై ఇవ్వాలి. ;)

rishi said...

:))

మంచు said...

నొ బ్లాగ్ బ్లాగర్ల సంఘం ఒకటి పెడదామనుకుంటున్నా... అంటే ఒక్క బ్లాగూ లేకుండా కేవలం కామెంట్లు పెట్టేవారి కొసం :-))

sunita said...

hahaha! baagundi. vesukoenDi naa membership.

Anonymous said...

Lol... సుజాతగారూ.. మీ కొత్త సంఘం బాగుంది.
మీరెందుకో వెనుకాడుతున్నారు గానీ, కామెంట్లు రాలడం చాలా వీజీ... అదీ ఆడవారికి.. :)

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

ha..ha.. ready to join!!

Anonymous said...

Excellent. I read your blog regularly and even think about you when you don't write frequently. Nevermind about how many comments you get, you are a very good writer.

Sree

సుజాత వేల్పూరి said...
This comment has been removed by the author.
ఫణి ప్రసన్న కుమార్ said...

మీరు ఈ సంఘం లోంచి వెలి వేయబడ్డారు. ఎందుకంటే ఈ పోస్టుకి ఎన్ని కామెట్లు వచ్చాయో చూడండి.:)

మాలా కుమార్ said...

అసలు ముందిది చెప్పండి , మీరెప్పుడైనా నా పోస్ట్ కు కామెంట్ రాశారా ? ఆయ్ ((( . . .

శివరంజని said...

హ.హ.. మీ బ్లాగ్ దారిద్ర్య రేఖ కు దిగువన ఉందా మీరే ఇలా అనుకుంటే మాకు confidence ఎలా వస్తుంది ..

మంచు గారి ఐడియా సూపర్....

Shiva Bandaru said...

:) పైన పద్మ గారి అభిప్రాయమే నాదీనూ..
అసలు కామెంట్లెందుకండి? వస్తేనే గోల. వాటికి రిప్లై ఇవ్వాలి. ;)

రాధిక(నాని ) said...

:)నేనూ చేరిపోతున్నాను మీ "'నో కామెంట్ల' బ్లాగర్ల సంఘంలోకి :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

నిన్ననే శ్రీ ఆత్రేయగారి(లిపిలేనిభాష) బ్లాగులో కాలేబ్లాస, కామెంట్లు లేని బ్లాగర్ల సంఘం, స్థాపించాం.అధ్యక్ష పదవి కి ఆయన, నేను పోటీ పడుతున్నాం.ఇప్పుడు మీరు నోకాబ్లాస మొదలు పెట్టి మాకు పోటీ వస్తున్నారా? మనం సమైక్యంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి మాసంఘం రద్దు చేసుకుంటాం. పేరు మట్టుకు కాలేబ్లాస ఉంటే బాగుంటుందని మనవి చేసుకుంటున్నాం.కామెంట్లు లేకపోతే కాలదా మరి అని ప్రశ్నిస్తున్నాను అధ్యక్షా.

మురళి said...

భలే టాపిక్ దొరికిందండీ మీకు..
అన్నట్టు హెడర్ సైజు కొంచం తగ్గించాలేమో చూడండి.. చాలా స్క్రోల్ డౌన్ చేస్తే కానీ టపా కనిపించడం లేదు..

3g said...

పైన ఫణి గారు చెప్పింది నిజమేనండి. సంఘం మొదలుపెట్టిన మొదటిరోజే మీరు సభ్యత్వాన్ని కోల్పోయారు. :))

శ్రీనివాస్ said...

నాకు కూడా కామెంట్లు తక్కువ కదా నేను చేరిపోతా :)

శ్రీనివాస్ పప్పు said...

హ్హహ్హహ్హ మొన్న మీరు రాసిన మాయాబజార్ పోస్ట్ లో కామెంట్లు లేనప్పుడే అనుకున్నా ఇలాంటి అనర్ధమేదో జరగబోతోందని నా 160వ సెన్స్ నాకు తెలియచేసింది.అనుకున్నంతా అయింది, శుభంభూయాత్,శతకామెంట్ల ప్రాప్తిరస్తు.
అన్నట్లు మురళి గారి పాయింటే నాదీను హెడర్ విషయంలో.

నీహారిక said...

మీ పాత టెంప్లెటే బాగుందండీ.

durgeswara said...

ఏదో కాలక్షేపానికి , సరదాకి పెట్టే ఈ సంఘాల వల్ల కొ్ద్దిగానైనా నవ్వులు పంచుతున్నాయి నలుగురికీ . శుభం .కానివ్వండి .

వేణూశ్రీకాంత్ said...

హ హ సుబ్రహ్మణ్యం గారు "కాలేబ్లాస" పేరు బాగుందండీ :-) "కామెంట్లు లేకపోతే కాలదా మరి?" సూపరు.

భావన said...

హి హి హి.... బాగుందమ్మా.. అమావాస్య కో పున్నమి కో బ్లాగు గుర్తొచ్చి రాసేసికామెంటలేదంటే ఎట్లా , మళ్ళీ సంఘం... (మనలో మనమాట నేను అంతె లే రాసేది) .... సరే నాకో పదవిచ్చెయ్యండి మరి. :-)

swapna@kalalaprapancham said...

abba ninna comment pettadaniki entha try chesa chala problem vachindi at any cost pettalsinde nenu cheppalsina vishayam cheppalsinde anukunna mottaniki ivala time bagundi :)

nenu blog start chesinapudu naku telisina blogs lo midi kuda undandi mi pichhi rathalu category lovi tega chadivedanni :)

half century kodutaru pondi ;)

swapna@kalalaprapancham said...

saratthu mikenduku miku boledu comments vastayiga ;) edi rasina sensational ga rastaruga

అనామిక said...

అబ్బా... ఈ టపా చడువుతుంటే నన్ను చూసి రాసినట్టే అనిపించింది.. నేను కూడా ఇదే రకం .--కొట్టు తెరిచిపెట్టి బేరాల కోసం ఎదురుచూసే టైపులో..అదీ కొట్లో సరుకేం లేకుండా..
మరి సభ్యత్వ వివరాలు ప్రకటించండి

శరత్ కాలమ్ said...

@ స్వప్న
నో కామెంట్ల సంఘంలోనూ సంచలనం సృష్టిద్దామనీ :) కామెంట్లు ఇవ్వాలని ఏమాత్రం అనిపించని టపాలు ఓ ఛాలెంజిగా తీసుకొని వ్రాసి!!

తృష్ణ said...

"కొట్టు తెరిచిపెట్టి బేరాల కోసం ఎదురుచూసే టైపులో - పోస్టు రాయడం, ఆ వచ్చే వ్యాఖ్యల కోసం కళ్ళల్లో వొత్తులు వేసుకొని ఎదురు చూడటం."

"ముఖ్యంగా నేను ఎంతో మనసు పెట్టి రాసిన కొన్ని టపాలకు రాలని చెప్పట్లు, కొన్నాళ్ళకి నాకే స్టుపిడ్ అనిపించే ఇంకో రకం టపాలకు భలే వినిపిస్తాయి."

same pinch..!

పోస్ట్ లేట్గా చూసినా మొదట సభ్యత్వం నాకే ఇవ్వాలి మీరు... ఇప్పుడు ఈ వ్యాక్యలు రాసినవారంతా మిగతా టపాలు రాసినప్పుడేమౌతారబ్బా...?? అని నాకు మహా పెద్ద డౌట్ వచ్చేస్తూదండీ...నేను ఎక్స్పెక్ట్ చెయ్యని టపాకి ఎక్కువ కామెంట్లు వచ్చినప్పుడు!!

చందు said...

సభ్య సమాజంలో ఎదవ కామెంట్ అని తెగ తిట్టుకుంటాము కానీ, ఈ బ్లాగు సమాజంలో కామెంట్ మన లాంటి బ్లాగరులకి కోంప్లాన్ లాంటిది కాదూ? ఏ మాత్రం సంకోచించక, మీ సంఘం లో సభ్యత్వం మా కిచ్చేసుకోండి

ఆ.సౌమ్య said...

మీకు కామెంట్లు రమ్మంటే ఎందుకొస్తాయండీ....ఇలా అంటున్నానని కాదుగానీ మీరెప్పుడూ కామెంట్లకి బదులివ్వరు, అలా చేస్తూ ఉంటే మాకూ ఉత్సాహం తగ్గిపోతుంది. నేను మీకు ఇంతకుముందు 2-3 సార్లు కామెంటు రాసాను, మీరు జవాబివ్వలేదు. మొన్నటికి మొన్న మాయబజార్ సినిమాకి కామెంటు రాసాను. ఈ పోస్ట్ లో ఎంతమంది స్పందించారో చూడండి, ఒక్కరికైనా మీరు సమాధానమిచ్చారా?

అది సరే మీరెప్పుడైనా నా బ్లాగులో కామెంటు పెట్టారా, అసలు నేనెందుకు మీకు పెట్టాలి అని నేను గదమాయించి అడుగుతున్నానంతే :D

మీరు ఈ పోస్ట్ సరదగానే రాసారని తెలుసు. నేనూ ఊరికే సరదాకి మిమ్మలని దబాయిస్తున్నాను, మళ్ళి నా మీద ఒక కొత్త పోస్ట్ రాసేరు, వద్దు తల్లోయ్! :P

తృష్ణ said...

పొద్దున్న వ్యాఖ్య రాసిన గుర్తండి? రాలేదా?

తృష్ణ said...

పొద్దున్న వ్యాఖ్య రాసిన గుర్తు.. రాలేదాండీ?

భాను said...

నేను తృప్తి మరియు తృష్ణ గారితి ఏకీభవిస్తున్న ,నీను ఈ సంగం లో చేరతా నండహో, మరి నాకు సబ్యత్వం కావలి మనలో మన మాట ఇది ఫ్రీ ఎన .ఒక స్మైలీ

భాను said...

అవును ఇన్ని కామెంట్లతో మీరు సబ్యత్వం కోల్పోయారుగా. మరి ఇప్పడు దీనికి అధ్యక్షుకు ఎవరబ్బా? నాకేమయినా ఛాన్స్ ఉందా అధ్యక్షా అని అడుగుతున్నా

..nagarjuna.. said...

హహ్హహ్హహ్హహ....సుజాతగారు, నొ.కా.బ్లా.స అధ్యక్షులు మీకే ఇన్ని కామెంట్లు వచ్చాయి కాబట్టి సంఘంలో మీరు ఉంటారా లేదా...? :D