Pages

11/09/2010

గణేశ ప్రార్ధన



తొండము నేకదంతమును
దోరపు బొజ్జయు వామహస్తమున్,
మెండుగ మ్రోయు గజ్జెలును
మెల్లని చూపులు మందహాసమున్,
కొండొక గుజ్జు రూపమున
కోరిన విద్యల కెల్ల నొజ్జవై,
యుండెడి పార్వతీ తనయ!
ఓయీ గణాధిప ! నీకు మ్రొక్కెదన్.

తొలుత నవిఘ్నమనుచు
ధూర్జటినందన ! నీకు మ్రొక్కెదన్
ఫలితము సెయుమయ్య నిను
ప్రార్ధన చేసెదనేకదంత! నా
వలపటి చేతిఘంటమున
వాక్కున నెప్పుడు బాయకుమీ
తలపున నిన్ను వేడెదను
దైవ గణాధిప! లోకనాయకా !!

5 comments:

సూర్యుడు said...

వినాయక చవితి శుభాకాంక్షలు

చందు said...

వినాయక చతుర్థి శుభాకాంక్షలు.

SRRao said...

మీకు, మీ కుటుంబానికి
వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు

SRRao

శిరాకదంబం

Sujata M said...

సూర్యుడు గారు

సావిరహే గారు

రావు గారు

ధన్యవాదాలు, మీకు కూడా శుభాకాంక్షలు.

భావన said...

కూసంత లేట్ గా, వినాయక చవితి 9 రోజులు కదా అందుకే ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు.