Pages

16/10/2008

శ్రీలంక - హా !

చాలా ముద్దొచ్చీసింది నాకీ వేళ జయలలిత స్టేట్మెంట్ చదివి. ఇప్పుడు దేశం అంతా వొళ్ళంతా చెవులు చేసుకుని సిగపట్లేసుకున్న ఇద్దరు అమ్మలిద్దరి గొడవా చూస్తూ... వింటూ ఉంటూండగా, ఇంకో పక్క ఇంకో గడ్డిపోచలమ్మ వీధి లో గొడవ పడుతూ ఉండగా, సాధారణంగా బేజారెత్తించే ఈ యమ్మి మాత్రం, మంచి తెలివైన మాట చెప్పింది.

అసలు శ్రీలంక అంతర్గత వ్యవహారాల్లో చెయ్యీ కాలూ ముక్కూ దూర్చడానికి మనమెవ్వరం ? ఒక టెర్ర్రరిస్టు / ఉగ్రవాద సంస్థ మీద ఒక దేశ ప్రభుత్వం అంత మంచి విజయం సాధించబోతూ ఉండగా, దాన్ని నిరోధించడానికి (వాళ్ళు ఎత్నిక్ గా తమిళులు కావడం వల్ల మాత్రమే) మనం ఎవరం ?

వీధుల్లో బాంబులు పేలడం, మనుషులు చావడం సాధారణం అయిపోతున్న మన దేశంలో, ఉగ్రవాదం - పచారీ కొట్లలో కూడా ఈసీ గా దొరుకుతున్నప్పుడు (మన దేశంలో తీవ్రవాదాన్ని ప్రచారం చెయ్యడం / మారణ హోమం సృష్టించడం, అతి సులభం) .. మన ముందున్న ముఖ్య శత్రువు తీవ్రవాదం. మనం తీవ్రవాదుల్ని ఏమీ చెయ్యం. ఇంకెవ్వర్నీ ఏమీ చెయ్యనివ్వం !

చేస్తే, మిత్ర పక్షాల వారికి అది ఒక సామాజిక వర్గాని టార్గెట్ చేసిన వేధింపు లా కనిపిస్తుంది. (Mulayam & Amar loves SIMI) అలా అయితే ఎలా ? శ్రీలంక లో ఇన్నాళ్ళకిన్నాళ్ళకి తీవ్రవాదానికి ప్రతిఘటన ఒక స్థాయి కి అంటూ చేరినపుడు, అందులో ప్రభుత్వ విజయ సూచనలు కనిపిస్తున్నపుడూ, ప్రభాకరన్ ఒత్తిళ్ళకు (సానుభూతితో నా ) ఈ తమిళ ముఠా అంతా, ప్రధాని మీద ఒత్తిడి తేవడం.. అన్యాయం. తెస్తే తెచ్చేరు - ఈయన ఎందుకు లొంగిపోవాలి ?

ప్రభాకరన్ ఇప్పుడు కలుగు లోంచీ బ్రతికి బయటకు వస్తే ఎలా విజృంభిస్తాడో, ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటాడో - ఇంకెందరు తీవ్రవాదులకు సాయపడతాడో - ఈ విజయం కలిగించే పరిణామాలకు రక్షక దళాలకు ఎంత నైతిక మైన అస్థైర్యాన్ని ఇస్తుందో - ఎవరికన్నా ఆలోచన ఉందా ?

మన దేశంలో, మన వ్యవహారాల్లో ఇంకొకరు చెయ్యి దూరిస్తే మనం అందుకే చచ్చినట్టు ఊరుకుంటాం. అరుణాచల్ ప్రదేష్ మాది అని పైవారు అంటే - హీ హీ అని నవ్వుతాం. కాష్మీరు మాది అని ఇంకొకరు అంటే - చీ పో ! అని సిగ్గుపడతాం. ఇంక మనల్ని రోజుకోక చోట, పూటకొక రకంగా తీవ్రవాదం బెంబేలెత్తించకపోతే ఏమి చేస్తుంది ?

తీవ్రవాదానికి - అన్నట్టు ఇంతవరకూ బలవుతూంది సామాన్య ప్రజలే - మన దేశంలో - ఎవరన్నా పెద్దాయన, రాజకీయ నాయకుడో / స్థాయి పరంగా చూసుకుంటే, ఏ 'గాంధే'య వాదో చచ్చూరుకుంటే తప్ప, వ్యవస్థ లో చలనం ఉండదు. అప్పటివరకూ మనకి అందరూ 'బాగా' కావాల్సిన వాళ్ళే ! మా వాళ్ళ మీద చెయ్యి వేస్తే బావుండదండీ అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉండండి - మీ పీక నొక్కే వాడు మీ వెనకే తయారవుతాడు !

శ్రీ లంక లో వినిపిస్తున్న ఆ 'హా హా కారాలు ' ఇప్పుడు ప్రభాకరన్ నుంచీ వినిపిస్తున్నాయి. తమిళులు - చాందస వాదులూ - బుద్ధి హీనులూ - అతన్ని రక్షించాలని చూస్తూండడం చాలా అయోమయంగా వుంది. ఈ అయోమయంలో ఈ అమ్మి మాటలు విని అందుకే కొంచెం ముద్దొచ్చీసింది.

ఎవర్నీ వ్యతిరేకించడానికి అని కాదు గానీ.. ఒకరు తీవ్రవాదానికి వ్యతిరేకంగా పని చేస్తున్నప్పుడు, అది కాదండీ మాకు ప్రభాకరన్ బాగా కావల్సిన వాడు (తమిళుడు - కరుణానిధి గారి ప్రకారం) - వాడ్ని మీరు చంపకండీ అని బతిమలాడే మనం - రేప్పొద్దున్న మనల్ని పేలుచుకు చంపే తీవ్రవాదుల్ని పాకిస్తాను వాళ్ళు - ''స్వాతంత్ర పోరాట యోధులు'' అనకూడదని ఎలా డిమేండ్ చెయ్యగలం ?

4 comments:

Kathi Mahesh Kumar said...

ఆ మధే మలేసియాలో ఉన్న ఇస్లాం ప్రభుత్వం హిందూ దేవాలయాల్ని ఏదో చేస్తే మన బీజేపీ బాధపడలేదూ! ఆ హిందువుల్లో మెజారిటీ తమిళులు కాబట్టి ‘రామ సేతువు వట్టి బూటకం’ అన్న కరుణానిధి కూతురు భారతప్రభుత్వాన్ని "ఏదైనా చెయ్యండి" అని వేడుకోలేదూ!

ఇవన్నీ రాజకీయపుటెత్తులు,ethnicity పేరుమీద వారి లోకల్ constituenciesని సంతోషపెట్టడానికి చేసే ప్రయత్నాలు. మన రాజకీయనాయకులకి దేశంకన్నా ఎలక్షన్లలో నెగ్గడం ముఖ్యం. దేశ సమస్యలకన్నా అధికారంలో ఉండటం ముఖ్యం.

తమిళవాళ్ళందరిలో ఈ misplaced sense of "Tamilism" (ఇది వారి జింగోఇజానికి నేనిచ్చే పదం) ఉందని నేననుకోను. ఇదొక రాజకీయ rhetoric. అంతే!

పెదరాయ్డు said...

అమ్మ గారి ఆక్షేపణ కేవలం అయ్యాగారికి వ్యతిరేకంగానే.కాని మీరన్నట్లు ఒక తీవ్రవాద సంస్థపై ఒక ప్రభుత్వ విజయానికి మన నైతిక మద్దతునందించాలి. వారు తమిళులైనా, భారతీయులైనా, హిందువులైనా ఇందులో సందిగ్దానికి తావులేదు. కరుణానిధి లాంటి ఒక అపర చాణిక్యుని ఎదుర్కొనేంత సమర్థత మన ప్రధానికి లేదు. అంతేకాదు శ్రీలంకను ఈ విషయంలో సంప్రదించే ధైర్యం కూడా అసలుండక పోవచ్చు. కనుక మనం నిశ్చింతగా వుండొచ్చు.

సూర్యుడు said...

I completely agree with your analysis

Unknown said...

పార్లమెంట్ ని పెల్చేయ్యడానికి కుట్ర పన్ని సుప్రీం కోర్ట్ లో వురి శిక్ష పడిన వుగ్రవాదిని వురి తియ్యడానికే గత కొన్నేళ్ళ గ దమ్ములు లేని ప్రభుత్వాలు ఉన్నంత కాలం ఈ వుగ్రవాదం వారానికోసారి పేపర్ లో పతాక శీర్షికలలో వచ్చే ఒక న్యూస్ ఐటెం.ప్రజలు కూడా పొద్దున్నే కాఫీ తాగుతూ యెంత మంది పోయారో headline చదివి ,అనుమానాస్పద పరిస్తితులలో యువతి శవం అన్న వార్త ని ఇంటరెస్టింగ్ గాచదివినంత కాలం rdx వాడకం పెరుగు ట్యూన్ వుంటుంది.సుజాత గారు జోక్ ఏంటంటే నిన్న శ్రీలంక రాయభారి ని pm పిలిపించుకుని పాక్ జలసందిలో శ్రీలంక గస్తిని ఆపుచేసి అమయుకులైన తమిళ్ బెస్తవర్నిచేపలు పట్టుకోనివ్వాలని సూచించారు.రేపు భారత రాయభార్ని పాక్ pm పిలిపించుకుని అమ్యకులైన ముస్లిం యువతను హైదరాబాద్ లో పోలీస్ లు వేధించకుండా చూడాలని హుకుం జారి చేసిన ఆశ్చర్య పోనక్కర లేదు.