Pages

02/10/2008

కొత్త ప్రేమ

మేమిద్దరం.. కేవలం మేమిద్దరం.
రాత్రి తలత్ అజీజ్ మ్యూసిక్ నైట్ కి వెళ్ళాం.

కూర్చోడానికి కుర్చీల్లేవు.
అదనంగా కుర్చీలు తెచ్చారు.
చాల లేదు.
ప్రోగ్రాం మొదలవక ముందే
హాలు నిండింది.
చాలా మంది నించుని
కొందరు కూర్చుని,
కొందరు నేల మీద బైటాయించి
ఘజళ్ళు విన్నారు.

ఎవరూ ఒకర్నొకరు కసురుకోలేదు
వెర్రి కోపపు చూపులు చూసుకోలేదు
అంతా, మౌనంగా, సంబరంగా ఉంది.
అంత రద్దీ లోనూ,
మేమిద్దరమే ఉన్నాం.
మా ఇద్దరి కోసం.

ప్రోగ్రాం మొదలయ్యాకా, మనసుల్లో
నిశ్శబ్ద సంచలనాలు మొదలయ్యాయి.
జిందగీ జబ్ భీ తెరీ బజ్మ్ మె .. లాతా హై హమే..
లాంటి పాటలు వింటే, ప్రేమే కలుగుతుంది మరి.

మ్యూసిక్ నైట్ ముగుసాకా,
ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నాం
ఇద్దరం మొబైలు ఫోన్ పక్కన పెట్టి,
కాస్త రిలాక్స్ అయ్యాం.
తను ఇంత కష్టపడి వెళ్ళినందుకు
డ్రైవ్ చేసుకుంటూ, ఆపసోపాలు పడి
ఇల్లు చేరితే,
నేను ఫోను టేబుల్ మీద పడేసి
టీవీలో వార్తలు చూడడానికి వెళిపోయాను.

మేమిద్దరం.. మా ఇద్దరికోసం
అనుకోకుండా మొబైల్లో
శంకర్ దాదా లెవెల్లో
ప్రసారం చేసుకున్న
మ్యూసిక్ నైట్ - అదిరింది.
అన్యాయం.. పైరసీ అయింది అనకండి
నేను చెప్పేది..
ఐ.టీ.సీ.కాకతీయా లో ఆడిటోరియం
సౌండ్ క్వాలిటీ గురించి.
ఇంకా.. ఏర్ టెల్ అత్త్యుత్తమ
కనెక్టివిటీ గురించీ -
తలత్ అజీజ్ జనాకర్షణ గురించీ -
మా కొత్త ప్రేమ గురించీ.

20 comments:

Rajendra Devarapalli said...

wow,intelligent

congratulations :)

ramya said...

వారెవ్వా!
సుజాతగారు,ఎయిర్ టెల్ వాడు దీన్ని గనక చూసాడంటే ఎగరేసక పోతాడు.

Purnima said...

WOW!

Comes as a thorough surprise.. I simply LOVED IT!

ఇలాంటివి ఇంకా రాయరూ.. ప్లీజ్! :-)

చైతన్య.ఎస్ said...

చాలా బాగుంది మీ మ్యూసిక్ నైట్. చాలా చక్కగా ఉంది. AIRTEL వాడికి ఒక ADVT IDEA ఇచ్చినట్టూ ఉన్నారు.

Sujata M said...

రాజేంద్ర కుమార్ గారు

థాంక్స్... (సరదాకి..లెండి. అయినా కంగ్రాట్స్ కి ఇంకో థాంక్స్)

Sujata M said...

రమ్య గారు

థాంక్స్.

[ నా సీక్రెట్ విష్ - ఏడ్ డైరెక్టర్ అవుదామని. నాకు టీవీ లో ప్రోగ్రాముల కన్నా ఏడ్ లు ఎక్కువ నచ్చుతాయి. కానీ అంత సీన్ లేక, ఈ పిచ్చి రాతల్తొ సరిపెడుతున్నా. ]

Sujata M said...

పూర్ణిమా..

ఇలాంటి పిచ్చిరాతలు రాయమని ప్రోత్సహిస్తే... ఎలా ?

కానీ ఈ మాత్రం కోపరేసన్ ఉంటే.. నేను ఇంకా ఉత్సాహంతో .......రాసేస్తా!

Sujata M said...

చైతన్య గారు..

థాంక్స్. ఒక వేళ ఎప్పుడన్నా.. ఏ మొబైల్ కంపెనీ ఏడ్ అన్నా ఇలాంటిది వస్తే నన్నో మాటు గుర్తు చేసుకోండి.

Sujata M said...
This comment has been removed by the author.
Rajendra Devarapalli said...

యాడ్ డైరెక్టర్ సుజాత గారు,మీరు కొన్ని డాక్య్యుమెంటరీలు తీయాలి.ఖర్చులన్నీ మీవే:)అవిడియాలు మనవి.అభ్యంతరం లేకపోతే

devarapalli.rajendrakumar

@

gmail.com కి ఒక్క మెయిల్ కొట్టండి

Sujata M said...

రాజెంద్ర కుమార్ గారు

థాంక్స్ ఫర్ ద ఆఫర్!

కానీ నేనేమయినా సుమన్ నా చెప్పండి - ప్రొడక్షన్ మా నాయన చూసుకోడానికీ, దర్శకత్వం, సంగీతం, నాట్యం, స్క్రీన్ ప్లే, కధా, కబుర్లూ (డైలాగులు), లైటింగూ, కాఫీ, టీలూ.. అన్నీ నేనే పెట్టుకోడానికీ..?!

బట్ స్టిల్.., ఎంత ఐడియాలు మీరిచ్చినా, అసలు జాబ్ అంటూ ఒకరివ్వాలి గా..!! అపుడు ఏర్ టెల్ ఏడూ, పొయ్యి తుడిచే మిస్టర్ మసిల్ లిక్విడ్ క్లీనర్ ఏడూ, కారు కడిగడానికి చిక్ షాంపూ ఏడూ తీసేసి పూడుస్తాను.

నిషిగంధ said...

SUPER!! మీలో ఈ కోణం చాలా చాలా నచ్చేసింది.. అందరిమాటే నాది కూడా.. ఇంకా ఇలాంటివి రాయండీ :-)

కొత్త పాళీ said...

Beautiful.
జిందగీ తెరీ బజ్మ్ మే లాతీ హై హమే .. నాకు చాలా ఇష్టం.

రాధిక said...

నాకు ఎయిర్టెల్ వాడి ఏడ్ లు చాలా నచ్చుతాయి.ఇది కూడా చాలా నచ్చేసింది :)

సిరిసిరిమువ్వ said...

అదిరింది. తలత్ అజీజ్ మీ చేత ఓ షాయిరీ చెప్పించాడు.
ఎయిర్‌టెల్ యాడు కూడా తీసేసి పూడుస్తారా, ఎన్నబ్బా ఇంద పైత్యం.

Kathi Mahesh Kumar said...

जिन्दगी जब भि,तेरॆ बज्म मे लाती है हमे
ए जमी चांद से बेहतर नजराती है हमॆ...

అనే (ఉమరౌజాన్ సినిమాలోని)తలత్ అజీజ్ పాటలో ఈ లైనంటే నాకు పిచ్చి ప్రేమ
"हर मुलाकात का अंजाम जुदाई क्यूहै?"

మీకు తెలీదుగానీ,ఈ టపా రాసి కొన్ని జ్ఞాపకాల్ని తట్టి లేపారు..మరిన్ని టపాలు నేను రాయాల్సిందే!

Sujata M said...

Mahesh garu

Thanks a lot. I am looking forward for ur jnapakaalu series.

Sujata M said...

కొత్త పాళీ గారు.. చాలా థాంక్స్ ! That is a very romantic song. yeah.

Sujata M said...

రాధిక గారు..

నాకూ ఏర్ టెల్ ఏడ్ లు ఇష్టం. ఒకటి రెండు ఫెన్సింగ్ ల మధ్య ఇద్దరు ఒకరి భాష ఒకరు తెలియని పిల్లలు ఆడుకునే ఏడ్ - కమ్యూనికేషన్ కు ఉన్న శక్తి ని చెప్తూ - ఈ ఏడ్ నాకు చాలా ఇష్టం.

Sujata M said...

నిషిగంధ - ఏ కోణం ? ఏ కోణం ?

వరూధిని గారు - మీకు ముందే చెప్పేను - తలత్ అజీజ్ కాదు. నా చేత షాయిరీ చెప్పించింది కొత్త ప్రేమ.