Pages

02/07/2011

పెద్ద్ధ వంతెన !



అందరికీ తెలిసే వుంటుందీ బ్రిడ్జ్ ! ప్రపంచం లోనే పొడవైన వంతెన ఇది. అదీ సముద్రంపై కట్టేరు. అంతా బానే వుంది గానీ మొత్తం నాలుగేళ్ళలో కట్టేసేరంట. నాకిక్కడ కొన్ని డౌట్లు.

1) చైనా లో కావడం వల్ల దీన్ని నాలుగేళ్ళలోనే నిర్మించారా ?

2) సముద్రం లో కావడం వల్ల అటూ ఇటూ స్థలం ఖాళీ చెయ్యించడం, కూల్చిన దుకాణాలకి డబ్బు ఇవ్వడం, కొన్ని ప్రాంతాల వాళ్ళుఒప్పుకోకపోవడాలూ లాంటివి లేకపోవడం వల్ల తక్కువ టైం లో నిర్మించగలిగారా ?

3) ఏదైనా దివ్య శక్తి చైనా కి సాయం చేస్తోందా ? అలాంటి శక్తి ని మన ఎన్ టీ ఆరూ, అల్లూ లు మందేశానికి తీసుకురావొచ్చుగా.

11 comments:

మాలా కుమార్ said...

:))

KumarN said...

Exactly!!. నాక్కుడా వావ్ కేవలం నాలుగేళ్ళే అనిపించింది.

But, you know what, It's China!!

తృష్ణ said...

చదివా కాని ఇంతదాకా చూడలే. వీడియో పంచుకున్నందుకు థాంక్స్.

మీకు సమాధానం:

*అది కమ్యూనిస్ట్ దేశం అవటం వల్ల కావచ్చు !
*may be beacuse it's 'China' :)

సిరిసిరిమువ్వ said...

ముమ్మాటికీ మొదటిదే కారణం కావచ్చు. ఇక రెండవది...అలాంటి సమస్యలు ఇండియాలో కానీ చైనాలో ఉండవేమో!

"అలాంటి శక్తి ని మన ఎన్ టీ ఆరూ, అల్లూ లు మందేశానికి తీసుకురావొచ్చుగా."...హ్హాహ్హా...మీరు భలే వారే! అయినా అంతటి శక్తే వాళ్ళకుంటే వాళ్ళ సినిమాలు ఎందుకు పోయాయంటారూ?

అవునూ మీ బజ్జులో మీకు నా వ్యాఖ్యలు కనపడుతున్నాయా?

కృష్ణప్రియ said...

దివ్య శక్తి ని NTR,అల్లు... :-) LOL.

Mauli said...

"అలాంటి శక్తి ని మన ఎన్ టీ ఆరూ, అల్లూ లు మందేశానికి తీసుకురావొచ్చుగా."

:))) మెట్రో రైల్ కోస౦ ఎదురు చూస్తున్నారా?

Anonymous said...

One of my colleague from Kerala told me that China uses JTB technology if they need a place to build something, meaning, they just move all the people staying there physically to a different place. I understand that is how they build that Shanghai IT city :)

మురళి said...

:-) :-)

కొత్తావకాయ said...

:D

పద్మ said...

వెల్, నా వరకు నాకైతే నోరు తెరిస్తే నాలుక్కోస్తా, పని జెయ్ అనే వాళ్ళ ప్రభుత్వ విధానాలు కారణం అనిపిస్తోంది. ;)

ఆ.సౌమ్య said...

దివ్యశక్తిని NTR, అల్లు...హహహహ :)))))))))