Pages

07/04/2011

The Nonsense i.e., అవినీతి!!

వాటీస్ దిస్ నాన్సెన్స్ ! అందరికీ సడన్ గా ఏమొచ్చింది ? ఎవర్ని చూస్తే వాళ్ళే అవినీతి పై పోరాటం చేసేస్తున్నారు. ఇదో పెద్ద ఫాషన్ అయిపోయింది ! అవినీతి అంటే ఏమిటి ? 'అవినీతి' అన్న మాటలోనే 'నీతి' వుంది. ఇంత కన్నా నీతి ఎక్కడ దొరుకుతుంది ? బాబా రాందేవ్ అడావుడి గా అవినీతి పై వాగ్బాణాలు సంధించేస్తుంటే - కాషాయ వస్త్రాలని ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్ గా పరిగణించే భా.జ.పా కూడా ఝడుసుకుంటూంది. అన్నా హజారే కి సడన్ గా ఏమొచ్చింది ? జంతర్ మంతర్ కాడికి రోజూ ఎంత మంది ఫారినర్స్ వస్తారు ? ఇదంతా చూసి ఏమనుకోవాలి ? జనం తామర తంపెర లా వస్తున్నారంట. ఎంత ట్రాఫిక్ జాం ? ఎంత ఇబ్బంది ?

ఎంత వరకూ సక్సస్ అవుతుందో ఈ కొత్త పోరాటం ? ఎవరో స్విస్ బాంకు లో డబ్బుల్దాచేరంట - అవన్నీ ఇండియా తీసుకు రావాలంట. కొంచెం అయినా సెన్స్ ఉందా ? మన సిస్టం అలాంటిది. ఆ తెచ్చిన డబ్బంతా ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెడుతుండగా, మరింత సొమ్ము ఉత్పత్తి అయ్యి, మళ్ళీ బ్యాంక్ బాకీలకెళిపోతుంది అని తెలుసుకోరు ! ఎందుకంత అర్ధం లేని డిమాండింగులు ? ఎవరి సొమ్ము? ఏమి సొమ్ము ? అంతా మాయ !

మన దేశంలో 'అవినీతి ఈజ్ అ వే ఆఫ్ లైఫ్'. ఆ మాత్రం అర్ధం కాపోతే ఎలా ? అవినీతి అంటే ఏంటి ? కేవలం ద్రవ్యార్జనే అవినీతా ? అలా అయితే కట్నం తీసుకోవడం అవినీతే ! మరి మన ఆస్థి కి కేవలం తాళి కట్టినందుకంచెప్పి ఒక పిల్లొచ్చి ఊరికే వారసురాలు అయిపోవట్లా ?! ఈ సంపాదనాస్థి లో కొంచెం అన్నా పెట్టుబడి ఆ పిల్ల పెట్టొద్దూ ? అది అవినీతెలా అయింది ? రాందేవ్ బాబా కి బుర్ర లేదు ! ముక్కు మూస్కొని ప్రాణాయామం చేస్కోకుండా, ద్రవ్యార్జన అంటూ రాజకీయాల్లోకి వస్తానంటాడు. తన యోగా బిజినెస్సు బోరు కొట్టి వుండొచ్చు. అవినీతి వ్యతిరేకత ఎంత ఫేషన్ కాపోతే ఆ ధైర్యం ?

నిజంగా జనానికి చిత్త శుద్ధే ఉంటే, అందరూ పన్నులు సరిగ్గా కట్టి, (చిల్లర కొట్లో కూడా బిల్లు అడిగి), ఎక్కడా ఫార్మాలిటీస్ అన్న మాట రానీయకూడదు. ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి చీమలు పుట్టలు పెట్టాయి సరే ! మరి ప్రైవేటు సంస్థల్లో ఈ 'ఫార్మాలిటీ' పద్దులు లేవా ఏంటీ ? లక్ష్య సాధన కోసం ఎవరి బాధ వాళ్ళు పడతారు. దానికి అవినీతి అని పేరు పెట్టడం అన్యాయం.
టీ.ఆర్.పీ కోసం వార్తా చానెళ్ళు అశ్లీల కధనాలను పదే పదే ప్రసారం చేస్తాయి. వార్తా పత్రికలు భళా భళీ అంటూ అధికార పార్టీ లకు భట్రాజీయం వెలగబెడతాయి (ప్రజల ఖర్చుతో) ! ఒక ప్రముఖ సినీ సెలెబ్రిటీ ఇంకో సినీ సెలెబ్రిటీ తో టాక్ షో నిర్వహిస్తారు. పాపులారిటీ కొసం poor things, ఏదైనా చేస్తారు. ఈ పాట్లన్నీ కోటి (కూటి) కోసమే కదా ! కోటి కి తక్కువున్నయా భూముల రేట్లు ? ఇళ్ళు ఎంత ఖరీదున్నాయి ? పిల్లల్ని రేప్పొద్దున్న, ఐ.బీ.ఎం లోనో, బిజీజిస్ స్కూల్లోనో, ఐ.ఐ.పీ.ఎం లో చేర్చాలంటే సంవత్సరానికి ఎన్ని లక్షలు కట్టాలి ? ముందు చూపు కనపర్చకపోతే, రేప్పొద్దున్న పిల్లలకు ఏమిస్తాం అన్న ఆలోచన అందర్నీ (దేశాన్ని) నడిపిస్తుంది !

రిటయిరయ్యాకా పెన్షన్ తో ఇంటద్దె కట్టడం ఎంత పెద్ద సర్కస్ ? అందుకే ఇప్పుడు ఇల్లుండాల! పిలకాయలక్కూడా ! వచ్చే యేడు బియ్యం బులియన్ ఎంతకి పెరుగుతుందో, వెచ్చాల కోసం జీతం లో ఎంత శాతం ఖర్చుపెట్టాలో ?! కూరగాయలసలు డబ్బిచ్చినా దొరుకుతయో లేదో ! అన్నిటికీ ఈ లోకం లో డబ్బు కావాలి. ఈ 20 వ శతాబ్దంలో 'ఇంకా..' డబ్బు కావాలి. మున్ముందు 'ఇంకా', 'ఇంకా' కావాలి. దానికి జనాభా అంతా సమిష్టి గా 'అవినీతి' మరియూ, 'నీతి' మార్గాల్లో రైలు పట్టాల్లా.. సమాంతర రేఖల పై ప్రయాణం చేస్తుంటే, ఒక వైపు పట్టాల్ని కూలదోస్తామంటున్న్నరు. వాటెబౌట్ ఫ్యూచర్ ? రేప్పొద్దున్న దేశం ఎలా నడుస్తుంది ? అసలు అవినీతి తగ్గాలంటే - జనాభా తగ్గాలి, రేట్లు తగ్గాలి ! ఇదంతా అయ్యే పనేనా ?

రికార్డు కుంభకోణాల్తో యూ.పీ.యే.. ఇంక దిగిపోవచ్చని పత్రికలు చెప్తున్నాయి. మరి మళ్ళీ గెలవాలంతే, ఓటర్లకు నజరానాలివ్వాలంటే, ఎలక్షన్ రోజు తాగించి, విందులు చెయ్యాలంతే, చిన్నా చితకా పేట నాయకులకు సూట్కేసులిచ్చి వోట్లు కొనాలంటే, కుల వర్గ ప్రాంత మత బేధాల పరంగా ప్రతీ వారిలోనూ అభద్రత కలిగించి, విడదీసి, మళ్ళీ అభయాలిచ్చి, వోటాట గెలవాలంటే, ఏ సర్కారు కైనా అవినీతి అవసరం. ఓటమ్ముకునే వోటరు అవినీతి వ్యతిరేక పోరాటానికి తగడు. అయితే, జన చైతన్యం మెల్లిగానూ మహోధ్రుతంగానూ రావడం - మెచ్చుకోదగ్గదే ! పోయిన సంవత్సరం ఎన్నికల్లో - ఈ 'హక్కుల ప్రచారం' వల్ల ప్రభావితం చెంది, జీవంలో మొదటి సారి, ఎండలో రొప్పుతూ, రోజుతూ, క్యూ లో నించుని ఓటు వేసినవారెందరో ! (ఓటు హక్కు వినియోగం) మరి 'అన్నా హజారే' ఇంకో హజారు బార్లు ప్రధానికి ఉత్తరం రాసినా తీరట్లేదని చెప్పి, అన్నం మాని కూర్చున్నడంట. ఇలాంటి పాపులర్ పబ్లిక్ ఫిగర్ - బాలీవుడ్ స్టైల్లో రంగంలోకి దిగితే, నాటకీయత రక్తి కట్టి - చట్టం వచ్చి, అదెప్పుడో టెర్రరిస్టు దాడి లో చచ్చిపోవాల్సిన పార్లమెంటేరియన్లందరూ - తీహారు జైల్లో సర్దుకుంటారని 'భావి భారతం' ఆశిస్తోంది. ఇదేమైనా వాల్డ్ కప్పా - అత్భుతాలు జరిగిపోవడానికి ? దేశం పరువుని (అంటూ ఒకటుంటే) బయటికీడ్చడం తప్ప ! మన లో రిచ్ పీపుల్ పెరుగుతున్నారు. వాళ్ళు ఏటికేటికీ మరీ రిచ్ అవుతూ వస్తున్నారు. అవేవో జాబితాలకెక్కుతున్నారు ! దేశానికీ పేరు తెస్తున్నారు. మరి పూర్ పీపుల్ ఏటికేటికీ మరింత పూర్ అవుతున్నరంటారు. గ్లాసు లో సగం నీళ్ళు పోసి 'గ్లాస్ ఈజ్ హాఫ్ ఫుల్' అనడం ఎపుడు నేర్చుకుంటారో !

BTW .. If u still feel that its 'ok' to support Anna Hazaare, click here. :D Go ahead.

22 comments:

Vinay Chakravarthi.Gogineni said...
This comment has been removed by the author.
కొత్త పాళీ said...

Brilliant.
I really really hope people get behind this in a massive wave.

Anonymous said...

Nice that you have posted about the much expected movement against corruption. Thanks for the links through which I can send my donation.

Please give more informative and serious(not satirical) and encourage people to support the noble cause, voluntarily.

సిరిసిరిమువ్వ said...

:))

వేణూశ్రీకాంత్ said...

Good One Sujata gaaru..

Sravya V said...

Nice one Sujatha gaaru !

Mauli said...

ఒక వార౦ తర్వాత హార౦ చూస్తే అవినీతి పై స్పీచులు .టపాలు చదవలేదు మొదటి పేజీ లో కొన్ని వ్యాఖ్యలు మాత్రమే. ఆ ఆవేశాలు చూడగానే మొదట వచ్చిన పెద్ద ప్రశ్న అసలు అవినీతి అంటే ఏంటి ?

హ్మ్ ఇ౦టరెస్టి౦గ్ గా మీ టపా కూడా కొ౦త ఇలానే సాగి౦ది. అవినీతి అన్న పద౦ డబ్బు తోనే ముడి పడి ఉన్నదా? అ౦టే ఎ౦ చేసిన డబ్బు కోసమే కాబట్టి అవినీతి ని డబ్బు లో కొలుస్తున్నామా?

'అబద్ద౦' కి 'అవినీతి' కి తేడా ఏ౦టి? మొదట అబద్ద౦ చెప్పను అన్నవారు అవినీతి గురి౦చి వ్యాఖ్యాని౦చాలి అన్నది నా స్వాభిప్రాయ౦.

Anonymous said...

/మొదట వచ్చిన పెద్ద ప్రశ్న అసలు అవినీతి అంటే ఏంటి ?/
/'అబద్ద౦' కి 'అవినీతి' కి తేడా ఏ౦టి? /
'యే బారాత్ నై చలేగీ' అని ఇంకా ఎవరూ జనంలోంచి అరవలేదే అనుకుంటూనే వున్నా... :P
'అంటే ఏంటి? డెఫినిషన్ వుందా?' అద్గదీ! అలా నిగ్గతీసి అడగండి.... జనాలని :D
చాలా మేధోపరమైన మౌలిక అంశాలను మీ ప్రశ్నల ద్వారా స్పృశించారు. ధన్యవాదాలు. వీటికి సమాధానం కావాలంటే... :)))

Mauli said...

:))

oh you gave the meaning in title only ..'The non-sense'

seems alright!

Srisail Reddy Panjugula said...

అవినీతిని తల్చుకుంటుంటే నాకు నేరం నాది కాదు ఆకలిది లోని ’మంచిని సమాధి చేస్తారా...’ పాట గుర్తొస్తోంది. ’తప్పుచేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి... మరపురాని గుణపాఠం పదిమందిలో నేర్పించాలి... అయితే, ఎన్నడు పాపం చేయనివాడే ముందుగ రాయి విసరాలి... మీలో పాపం చేయనివాడే ఆ రాయి విసరాలి... ఏ దోషం లేని వాడే ఆ శిక్ష విధించాలి...’

Not sure, if I can throw the stone.

Srisail Reddy Panjugula said...

అవినీతిని తల్చుకుంటుంటే నాకు నేరం నాది కాదు ఆకలిది లోని ’మంచిని సమాధి చేస్తారా...’ పాట గుర్తొస్తోంది. ’తప్పుచేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి... మరపురాని గుణపాఠం పదిమందిలో నేర్పించాలి... అయితే, ఎన్నడు పాపం చేయనివాడే ముందుగ రాయి విసరాలి... మీలో పాపం చేయనివాడే ఆ రాయి విసరాలి... ఏ దోషం లేని వాడే ఆ శిక్ష విధించాలి...’

Not sure, if I can throw the stone.

Durga said...

అవినీతి కూడా ఒక సామాజిక దురాచారం, సామాజిక రుగ్మత. ఒకప్పటి సంఘసంస్కర్తలు కూడా అప్పటి సామాజిక దురాచారాల గురించి ఇలాగే మన జీతితాల్లో భాగం అయిపోయాయి మనం చేస్తే మాత్రం మార్పు వస్తుందా అనుకుంటే ఆ సమస్యలన్నీ ఇప్పటికీ అలాగే వుండేవి.
తప్పు చేయని వారే రాయి విసరాలి అంటే అవసరాన్ని బట్టి తప్పదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో తప్పు చేయాల్సి వచ్చింది. అందుకని ఇప్పుడు ఆ సమస్యకు వ్యతిరేకంగా పోరాడే అవకాశం వస్తే, నేను తప్పు చేసాను, నాకు అర్హత లేదు అని వూరుకోవాలా? లేక అవినీతితో ఒకప్పుడు పడిన బాధ మళ్ళీ పడకూడదంటే, ఇతరులకు కూడా బాధ కలగకూడదంటే ప్రతి ఒక్కరూ కలిసి ప్రయత్నించాల్సిందే అనుకుని ముందుకి సాగడం ముఖ్యమా, కాదా? ఆలోచించండి.

Anonymous said...

Well said, Durgaji.

Those have done mistakes also can come back and support the movement. There is no such thing as lack of morals to support a good cause. A flesh trader too can support the cause.

Sujata M said...

వినయ్ గారు -

సిటీలో పెరిగిపోతున్న సంపదనీ విజృంభించి ఖర్చు చేస్తున్న మధ్యతరగతి నీ చూస్తే మీ డౌట్ అందరికీ కలుగుతుంది. కానీ పేదరికం మన దేశం లో ఇంకా ఉంది సర్. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా మనది బీద దేశమే !

Sujata M said...

కొత్త పాళీ గారు

బ్రిలియంట్ కామెంట్ ! :డ్

Sujata M said...

Snkr,

Thanks. I shd check myself before posting. Ur suggestion is taken.

Sujata M said...

Varoodhini garu,
venu Srikant garu, Sravya, Mouli, Srisailreddy garu,

Thnks

Sujata M said...

దుర్గ గారు

మీ వ్యాఖ్య నాకు చాలా నచ్చింది. మీతో ఏకీభవిస్తున్నాను.

Anonymous said...

13 April 2011 07:16
Did I suggest anything? No!

I just commented on Mr. Mauli's (funny) comment. :)

Sujata M said...

Snkr ji

I replied to ur first comment. :)

Sujata M said...

Snkr ji

And I suppose its Ms. Mouli !!! [not Mister.Mouli]

Anonymous said...

/Ms. Mouli /
కెవ్వ్వ్వ్వ్! మగ పేరనుకున్నా! చెప్పారు థాంక్స్... వామ్మో ! ఏ పేరెనక ఎవరున్నారో ఎవరికి ఎరుక, ఈ నెట్ మీద?! :)