Pages

08/09/2010

Idga - Munshi Premchand

 




ఇది మున్షీ ప్రేంచంద్ రచించిన చిన్ని హిందూస్తానీ (ఉర్దూ) కధ. హమీద్ అనే నాలుగేళ్ళ బీద పిల్ల వాడు - తన అమ్మమ్మ తో కలిసి ఉంటూ ఉంటాడు. 30 రోజుల పవిత్ర రోజా పాటించిన తరవాత తరవాత ఈద్ పర్వదినం వచ్చింది. వీధి లో అందరు పిల్లలూ బొమ్మలూ, మిఠాయిలూ కొనుక్కుంటున్నారు. పెద్దలు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు. ఇంట్లో చిన్న చితకా వస్తువులూ కొనుక్కుంటున్నారు. చంకీలు ఉన్న తమ టోపీల చిరుగులు కుట్టుకుంటున్నారు. 

పండగ కాబట్టి చిన్న పిల్లలందరికీ వారి పెద్దలు ఈదీ (బహుమానంగా కొంచెం డబ్బు) ఇచ్చేరు. ఆ డబ్బుతో పిల్లలంతా బజారులో / ఈద్ సంత లో ఎంజాయ్ చేస్తున్నారు. హమీద్ అమ్మమ్మ కడు బీదది, నిస్సహాయురాలైన వృద్ధురాలు! ఆవిడ పాపం హమీద్ కు 3 నయా పైసలు మాత్రం ఇవ్వ గలుగుతుంది. ఈద్ కోసం నిజానికి ఈ పిల్లల బేచ్ లో చాలా రోజుల నుండీ ప్లానింగ్ నడుస్తూ ఉంది. వీళ్ళంతా ఈదీ తో ఫలానా బొమ్మలు కొనుక్కుంటామనీ, ఇంకేదో చిరుతిండి కొనుక్కుంటామనీ కలలు కంటున్నారు. 

హమీద్ కు ఇవన్నీ కొనుక్కునే స్థోమత లేదు. మిగతా పిల్లల ముందు చిన్నబుచ్చుకుంటాడని అమ్మమ్మ ఎలానో మూడు పైసలు ఇచ్చింది. వీటితో ఏమి కొనుక్కోగలడు ? ఏదీ మూడు పైసలకు రాదు. మిగతా పిల్లలు కొనుక్కున్న రక రకాల బొమ్మలు చూస్తూ, నిరుత్సాహ పడుతూ సంత లో ప్రతీ ఆట వస్తువ విలువా అడుగుతూ తిరుగుతూ ఉంటాడు హమీద్. 

ఉన్నట్టుండి వాడికి చిమ్మ్ టా (పట్టకారు / Tong ) అమ్మేవాడు కనపడ్డాడు. వెంటనే హమీద్ కు అమ్మమ్మ గుర్తొచ్చింది. హమీద్ కు ఈ ప్రపంచంలో ఉన్నదల్లా ఆ ముసలి అమ్మమ్మే. ఆవిడ వంట చేసే టప్పుడు / రోటీలు చేసేటప్పుడూ, చేతితోనే రొట్టెలు పట్టుకు కాలుస్తూ ఉంటుంది. ఆవిడకు రొట్టెను పట్టుకునే ఆ పట్టకారు లాంటి చింటా లేదు మరి. వెంటనే బేరం జరుగుతుంది. మూడు నయాపైసలకు చింటా ఇవ్వనంటాడు దుకాణదారు. అయితే, అంతకన్నా ఎక్కువ డబ్బు హమీద్ దగ్గర లేదు. నిరుత్సాహ పడి వెనుతిరిగి పోతున్న పిల్లవాడిని పిలిచి, ఎలాగో ఆ మూడు పైసలకే చింటా ఇచ్చేస్తాడు దుకాణదారు ! 

సంత నుండీ తిరిగి వస్తున్న హమీద్ ను మిగిలిన స్నేహితులు ఆటపట్టిస్తారు. బొమ్మలు కొనుక్కోమని డబ్బు ఇస్తే, చింటా కొంటావా అని ఏడిపిస్తారు. ఆ నాలుగేళ్ళ బుడ్డోడు మాత్రం ఈ వేళాకోళాలకు అదరడు - బెదరడు. పైగా తన చింటా అందరికన్నా గొప్ప ఆటవస్తువ అని, భుజం మీద పెట్టుకుంటే, గద అవుతుందనీ, విల్లు లా సంధిస్తే, విల్లు అవుతుందనీ.. ఇలా ఎలా కావాలంటే అలా దానితో ఆడుకోవచ్చని వాదిస్తాడు. 

పిల్లలు - అమాయకులు. మొదట కాసేపు హమీద్ మాటలు నమ్మక పోయినా, కొంత సేపటికి తమ తమ బొమ్మలతో ఆడి, బోరు కొట్టి, వాళ్ళకి హమీద్ దగ్గరున్న చింటా ఆకర్షణీయంగా కనపడుతుంది. ఒక్కొక్కరూ.. 'ఒరే, నీకు నా బొమ్మ ఇస్తాను - కాసేపు నీ చింటా నాకివ్వరా..!' అని అడుగుతూ.. ఎక్స్చేంజ్ చేసుకుని చింటాతో ఆడుకుంటారు. మొదట టాం సాయర్ చచ్చిన ఎలకని ఇవ్వడానికి బెట్టు చేసినట్టు కాసేపు బెట్టు చేసినా... చింటా ఇచ్చి, తను ముచ్చట పడిన స్నేహితుల బొమ్మలతో తనూ కాసేపు ఆడుకుని తన సరదా తీర్చుకుంటాడు హమీద్. 

ఇలా... సాయంత్రం ఇల్లు చేరేసరికీ, హమీద్ తన స్నేహితులందరి బొమ్మలతోనూ ఆడేసుకునుంటాడు. సరదాగా.. ఉల్లాసంగా ఇంటి సావిట్లోకి అడుగుపెట్టీసరికీ, తన కోసం ఆందోళన తో ఎదురుచూసిన అమ్మమ్మ..'ఇంత ఆలస్యమైందేమిరా.. ఈదీ తో కొన్న బొమ్మ ఏదీ ?' అని అరుస్తుంది. ఆవిడకి చింటా చూపిస్తే.. మొదట కోపగించుకుంటుంది. 'నీకు బొమ్మ కొనుక్కోమని డబ్బులిస్తే, ఇలంటి వస్తువ కొన్నావేమి రా?' అని విరుచుకుపడుతుంది. 

ఆవిడకి పాపం తల్లీ తండ్రీ లేని తన మనవడంటే, చాలా ముద్దు. ఎన్నడూ వాడి సరదాలు తీర్చగలిగే శక్తి ఆమెకు లేకపోయింది. ఈ ఈద్ కి ఎలా అయినా వాడికి ఏదో ఒకటి కొనిపెట్టాలని ఆమె తాపత్రయం. వెంటనే.. 'నీకు చింటా లేదు కదా అమ్మమ్మా.. రొట్టెలు చేస్తున్నప్పుడు నీ చేతులు కాలడం నాకు తెలుసు. అందుకే ఈ చింటా నీ కోసం తీసుకొచ్చాను !' అని హమీద్ అనగానే, తన పట్ల మనవడికున్న ప్రేమకూ, అభిమానానికి నోట మాట రాక మ్రాన్ పడిపోయి, కొంత సేపటికి కన్నీళ్ళపర్యంతం అవుతుంది ఆ అమ్మమ్మ. 

కధ నాకు గుర్తున్న మటుకూ స్థూలంగా ఇది. ఈ కధ నాకు మామూలుగా తెలియక పోను. నాకు హిందీ సాహిత్యం తో (లోగ్ లుగాయీ తరహా..) తో పరిచయం అంతంత మాత్రం. అయితే ఈ కధ ను ఎన్నో సంవత్సరాలు స్కూల్ టీచర్ గా పని చేసి రిటైర్ అయిన ఒక స్నేహితురాలు చెప్పారు. ఇది ఎప్పుడో 5 ఏళ్ళ క్రితం సంగతి. ఆవిడ, స్వతహాగా టీచర్ మరియూ మంచి పాఠకురాలు గాబట్టి ఈ కధను చిన్న పిల్లలకు చెప్పినట్టు, రసరమ్యంగా చెప్పారు. మున్షీ ప్రేంచంద్ రచించిన ఈ కధ (ఈద్ వస్తున్నది గాబట్టి గుర్తొచ్చింది. తప్పులు / మరచిపోవడాలూ ఉండొచ్చు ! కానీ హృద్యమైన ఈ కధని అందరితో పంచుకుందామని చెప్పానిక్కడ) 


For Reading Idgah in Hindi - Check here 

Video for kids to watch 

Ad by Havells India, inspired by Idgah 

7 comments:

తృష్ణ said...

good story.

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది.

కృష్ణప్రియ said...

బాగుంది Thanks for sharing...

Anonymous said...

అద్భుతమైన కథ. మున్షీ ప్రేంచంద్ కథలు పేదల కష్టాలకు అద్దంపట్టేట్టు వుండి, ఓ విధమైన బాధ కలిగిస్తాయి. 'ఫూస్ కీ రాత్ ' అనే కథలో ఓ పేదరైతు ఓ కంబళి కొనుక్కోవాలని ఎంతలా వేచి పంట సరిగ్గారాక ఎలా నిరాశ పడతాడో చెబుతాడు. చాలా వాస్తవంగా వుంటుంది. ఈ కథ చాలా బాగుంది.

సూర్యుడు said...

touching story

భావన said...

బాగుందండి స్టోరీ.

శ్రీలలిత said...

కథ గొప్పగా వుంది..