Pages

22/04/2009

చాక్లెట్ కత్తులు

మా హీరో ప్రోజెక్ట్ కోసం జెనీవ్ ప్రయాణం కట్టినపుడు ఒక స్నేహితుడు 'అయితే నీకు స్విస్ బాంకు అకౌంటు ఉంటుందిరొయ్ !' అని చెణికేరు. అపుడు గానీ మాకా విష్యం తట్టనే లేదు. అంతవరకూ అక్కడ ఇళ్ళు దొరకకపోవడం గురించీ, మనకు ఫ్రెంచీ, ఇటాలియనూ రాకపోవడం గురించీ చింత పడిన తరవాత, ఈ సంగతి పట్టుకుని, మేము కూడా మా హీరోని ఉబ్బేసి పంపించేశేము ! అద్వానీకి ఇపుడు ఏమీ తోచక, అమెరికన్లు ఇచ్చిన అయిడియా ఒకటి పట్టుకుని స్విస్సు బాంకుల వెంట పడటంతో ఈ విషయం మళ్ళా గుర్తొచ్చింది.

చిన్నప్పుడు నేను రేడియోలో వాతారరణ సూచనలు వినేటపుడు 'భారీ వర్షం ' అనే పదానికీ, పేపరు చదివేటపుడు 'స్విస్ బాంకు ' అనే పదానికీ అర్ధం తెలీక తికమక పడేదాన్ని. భారీ వర్షం అంటే ఇందృడి భార్య శచీ దేవి కుర్పించే వర్షం అని అర్ధం అయింది గానీ - ఈ స్విస్ బాంకు అంటే ఏమిటో తెలిసేది కాదు. ఈ లాజిక్ కి వెనుక వాళ్ళు భార్య వర్షం అనే అంటున్నారేమో గానీ అది నాకు భారీ అని వినిపిస్తోంది లే అని ఖచ్చితంగా నమ్మకం వుండేది.


నేను పోయినేడు జెనీవ్, బెర్న్ ల లో తిరిగినపుడు అక్కడక్కడా యూ బీ ఎస్ బాంకు బిల్డింగ్ ఎదురయేది. అప్పటికి పేరు తెలిసిన ఏకైక & ప్రముఖమైన బాంకు కాబట్టి గుర్తుపట్టి.. మేమిద్దరం - ఆహా ఎంత డబ్బు ఉంటుంది కదా.. మన సినిమా వాళ్ళ, రా.నా. ల, గాంగుస్టర్ల డబ్బల్లా ఇక్కడే కదా ఉండేది - అని అబ్బురపడ్డాం. ఇలాంటి సందర్భం లోనే, నా మెదడు లో చిలిపి Cells జెఫ్ఫెరీ ఆర్చర్ రాసిన Twist in the Tale కధల సంపుటి లోని ఒక కధను గుర్తు చేసేయి.

మొంబాసా అనే ఆఫ్రికన్ సామ్రాజ్యం ఒకటి ఉంటుంది. (పై పై న కధ చెప్తున్నా..) ఇక్కడ ప్రభుత్వం లో అందరూ తీవ్రంగా అవినీతిపరులు. పాపం అధ్యక్షుడు ఎంత ఆ దేశాన్ని అభివృద్ధిపదం లో కి తీస్కెళ్దామని ఎత్తులు వేసినా, ఈ అవినీతిపర అధికార యంత్రాంగం అంతకు పై ఎత్తులు వేసి, కనబడిన రూపాయినల్లా (వాళ్ళ రూపాయి) కబ్జా చేసేసేది. అధ్యక్షుడికి ఈ డబ్బంతా, స్విస్సు బాంకుల్లో మూలుగుతోందని తెలుసు - అచ్చం ఇపుడు అద్వానీ గారికి వచ్చిన అవిడియాలాంటిదే ఆయనకీ వస్తుంది. అంటే ఎవరెవరికి ఎంత సొమ్ముందో కనీసం ఆ బాంకు వాళ్ళనడిగి తెలుసుకుని, ఆయా అధికారులను దండించో, అదిరించో, బెదిరించో ఆ డబ్బుని మొంబాసా కి తెప్పించుకోవాలి. అపుడే అవినీతీ అరికట్టబడుతుంది, రూపాయలతో దేశమూ బాగుపడుతుంది - అని ఆయన ప్లాన్.

అయితే, ఆయనకి అడుగడుగునా శత్రువులే. ఈ పనిని తానై స్వయంగా చేయలేడు. కాబట్టి ఒక నమ్మకమయిన అధికారి కావాలి. అపుడు హీరో ని పట్టుకుంటాడు. ఈ నవ యువకుడు - ఇంగ్లండు లోనీ, అమెరికాలోనీ చదువుకుని, దేశాన్ని పైకి తీసుకురావాలనే తపన తో వచ్చినవాడు. ప్రభుత్వం లో చేరి, తన నిజాయితీ తో, నిష్పాక్షికత తో, ఖచ్చితత్వంతో అందరి దృష్టినీ (చివరికి అధ్యక్షుల దృష్టినీ..) ఆకర్షిస్తాడు.

ఆయన మీద అధ్యక్షుని నమ్మకం పెరుగుతుంది. ఇక రకరకాల ప్రాజెక్టులకూ, పనులకూ అతన్నే పర్యవేక్షకుని గా నియమిస్తాడు. కొన్నాళ్ళకు ఎలా అవుతుందంటే, ఈ యువకుడు చెప్తే కానీ మొంబాసా లో ఆకు కూడా కదలడానికి వీలు లేదు. దేశంలో అవినీతి తగ్గలేదు కానీ బహిరంగత్వం తగ్గింది. విచ్చలవిడి అవినీతి స్థానంలో 'ఉస్ష్ ..గప్ చుప్ అవినీతి ' బయల్దేరింది. అధ్యక్షుడికి అంతా బానే ఉంది గానీ ఈ తెర వెనుక అవినీతి నచ్చలేదు. ఆయన కి తన ప్లాను గుర్తొచ్చి ఈ కుర్రాడితో డిస్కసన్ పెడతాడు. అయ్యవారి ఆదేశాల మీదను కుర్రాడు తన తెలివితేటలన్నీ ఉపయోగించి, రక రకాల స్విస్ బాంకుల్లో అకౌంట్లున్న మొంబాసా వాసుల లిస్టు ఒకటి తయారు చేస్తాడు. ఇంక స్విజ్జర్లాండు వెళ్ళి బాంకు ల లో ఇంకొన్ని వివరాలు సేకరించడమూ, అధికారికంగా అధ్యక్షులవారి విన్నపాన్ని విన్నవించడమూనే మిగిలి వుంది.

ఇలా ఈ బాంకుల్లో డబ్బు దాచుకోవడానికి - ఈ బాంకులు పాటించే నియమావళి కారణం. అవి పీక పోయినా సరే తమ కస్టమర్ల వివరాలను బయట పెట్టము అని ప్రమాణం చేసేస్తాయి. కేవలం ఈ నియమావళి వల్లనే స్విజ్జర్లాండు లో ఆయా బాంకుల్లో ఆయా దేశాలనుంచీ పోగయ్యే ధనం ఉత్పత్తి చేసే లాభం ఆ దేశ జీ.డీ.పీ లో 12% ఉందంట ! అందుకే మరి - ఇదో విన్ - విన్ వ్యాపారం.


సరే మన వాడు అయ్యవారి అనుమతి తో, భార్యా, పిల్లలకు ఒక వారం పాటూ అమెరికా తిరిగొస్తానని చెప్పి, జెనీవా ప్రయాణం కడతాడు. (తన ప్రయాణం రహస్యం మరి !) జెనీవ్ లో దిగగానే హోటలు కెళ్ళి టిప్పు టాపు గా తయారయ్యి ఒక ప్రసిద్ధ బాంకు కు తను తయారు చేసిన లిస్టు పట్టుకుని వెళ్తాడు. మేనేజర్ ని కలుస్తానంటాడు. కారణం చెప్పడు. మేనేజరు కు తను మొంబాసా నుంచీ వచ్చిన రాయబారిననీ, అధ్యక్షుడిచ్చిన ఉత్తరం చూపించి, ఈ లిస్టూ చూపించి, ఎవరి ఖాతా లో ఎంత సొమ్ముందో చెప్పమంటాడు. సహజంగానే మేనేజరు ఒప్పుకోడు. గొడవ (వాదనలు) జరిగాకా, చైర్మెన్ ను కలుస్తారిద్దరూ. చైర్మను, ఈ అతిధి కి బ్రెమ్మాండంగా అతిధి మర్యాదలు చేస్తాడు గానీ ఈ విష్యాలు మాత్రం చెప్పనంటాడు. అది మా బాంకు పోలసీ గురూ - అని నచ్చ చెప్తాడు.

మన వాడు ఊరుకోడు. నేను రాయబారిని. మా అధ్యక్షుడి కి చెప్పి మీ దేశం తో మా దేశం చేసే బిజినెస్సునంతా (!!!!) ఆపు చేయించేస్తానంటాడు. మాకు ఫ్రాన్సు మిత్ర దేశం కాబట్టి ఫ్రాన్సు, స్విజ్జర్లాండుల మధ్య వ్యాపారం కూడా కట్టడి చేస్తానంటాడు. యూ.ఎన్.ఓ లో ఫిర్యాదు చేస్తానంటాడు.. అయినా చైర్మెన్ ఒప్పుకోడు. చివరికి తన కోటు చేబులోంచీ అకస్మాత్తుగా పిస్టలు తీసి చైర్మన్ నూ, మేనేజర్ నూ చంపేస్తానని బెదిరిస్తాడు. వాళ్ళు పాపం వొళ్ళంతా చెమటలు పట్టి, చావు భయంతో వొణికిపోతారు గానీ, ఈ రాయబారి గారి కోరిక తీర్చం అంటారు. ఏ.సే. (వేడి గది అనాలేమో) గది లో వాతావరణం అదుపు తప్పి వుంటుంది. బాంకు చైర్మను మతి పోయి వుంటుంది. మన యువకుడూ వొళ్ళెరగని కోపంలో వుంటాడు.. రెండు క్షణాలు గడుస్తాయి....

అప్పుడు మన వాడు 'ఎట్ ఈస్' లో నిల్చుని, టై వొదులు చేసి, తన తో పాటూ తీస్కొచ్చిన చెత్త సూట్కేసు తెరిచి చైర్మెను ముందు పెడతాడు. 'Well.. ఇంక నేను నిశ్ఛింతగా ఇక్కడ అకౌంటు ఓపెన్ చేస్కోవచ్చన్నమాట' అంటూ చైర్మెన్ ను చూసి అందంగా నవ్వుతాడు. ఇంతకీ ఆ సూట్కేసు (బ్రీఫ్ కేసు) లో కట్టల కొద్దీ కొన్ని కోట్ల విలువ చేసే కరెన్సీ ఉంటుంది.

ఇదీ కధ ! ఇపుడు అద్వానీ అడిగాడనో, జీ 20 లో పెద్ద వాళ్ళు తీర్మానించేరనీ - టెర్రరిస్టు లతో థ్రెట్ అనీ - ఇలా రక రకాల కారణాలకు స్విస్సు బాంకులు లొంగి తమ కస్టమర్ల గుట్టు విప్పాయనుకోండి - ఇలాంటి ట్విస్టే ఏదో ఎదురవ్వొచ్చు. వీ.డీ.ఎస్ లాంటి హాస్యస్ఫోరకమయిన అయిడియాలు, ఎలక్షన్లప్పుడు రా.నా.లు చెప్పే తమ తమ ఆదాయ వ్యయాల, ఆస్తిపాస్తుల వివరాలూ చూసి వాళ్ళ నిజాయితీ + సిగ్గులేని తనాన్ని చూసి నవ్వుకునే మనం, అప్పుడు హిందూజాల పేర్న ఇన్ని వేల కోట్లూ ఇంకా ఫలానా ఇంకోరి పేర్న ఉన్న ఇంకొన్ని కోట్ల కోట్లూ గురించి పేపర్లలో చదివి నవ్వుకుంటామో, నివ్వెరపోతామో చూడాలి. చివరికి బీ.జే.పీ ఆధ్వర్యంలో బోల్డంత కార్పొరేటైసేషను జరిగి ఇండియా వెలిగిపోయింది కాబట్టి భా.జ.పా నేతల పేర్లు కూడా బయటపడొచ్చు. అందుకే మేలో ఫలితాలు విడుదల అయ్యాకా - చాక్లెట్లకూ, కత్తులులకూ ఫేమస్ అయిన స్విజ్జర్లాండు మీద మన బడా నేతలు చాక్లెట్టు కత్తులు దూయటం తగ్గిపోతుంది. కాబట్టి ఇది ఎన్నికల స్టంటు మాత్రమే. అదీ ఇక్కడ Twist in the Tale.

8 comments:

సూర్యుడు said...

"అవి 'పీక పోయినా' సరే తమ కస్టమర్ల వివరాలను బయట పెట్టము అని ప్రమాణం చేసేస్తాయి."

ఈ విశాఖ మాండలీకాన్ని చాలారోజుల తర్వాత చదివాను :-)

Sujata said...

hee hee

te.thulika said...

హీహీ, మీకు కథలు రాయడం రాకపోవడం ఏమిటి! మీరాజకీయాలు నాకు తెలీకపోయినా ఈకథ చదువుతూ నవ్వుకున్నాను. చాలా బాగా రాశారు.

Sujata said...

థాంక్స్ ! మీ వ్యాఖ్య నన్ను ఆనందంలో ముంచెత్తింది. నిజంగా.

బుద్దా మురళి said...

సుజాత గారు మొగాంబ ఖుష్ హువా .... కథ బాగుంది. మొన్న ఒకతను నగరం నిద్రపోతున్న వేళ సినిమా తీశాడు అది రాజశేఖర్ రెడ్డి అవినీతి పైనట.. రెండు వారాల తరువాత ఆ నిర్మాత నంది శ్రీహరిని అరెస్టు చేశారు .. చెయిన్ వ్యాపార పేరుతో వంద కోట్ల వరకు జనం నుండి దోచుకున్నాడు. ఆ డబ్బుతోనే సినిమా తీశాడు .

Sujata said...

OH !

Thanks for the nice comment.
Mugambo must always stay 'Khush'.

Chandu S said...

nice narration.

Nandu Raghu said...

oh nyc