ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్ - ఏనుగు లక్ష్మణ కవి.
ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా వెరువక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి నైజం. అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు.
(ఇష్టమైన తెలుగు పద్యం.. పాత ఈనాడులో దొరికింది)
47 comments:
ఈ పద్యం నాక్కూడా ఇష్టమైనదే!
అది సరే ఏమైపోయారూ? మరీ బిజీగా ఉన్నట్లున్నారు?
నాక్కూడాను. :)
మీరు ఇంతకన్నా తరచుగా రాస్తుండాలి!
baagundandi padyam
మా తెలుగు మాస్టారి గొంతు ఖంగున మోగిందండి చెవుల్లో.. మంచి పద్యాన్ని గుర్తు చేశారు..
ఇది మాకు భర్తృహరి సుభాషితాని గా చెప్పారు!?
ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచై:
ప్రారభ్య విఘ్న నిహతా విరమంతి మధ్యా:
విఘ్నై: ముహుర్ముహరపి ప్రతిహన్య మానా:
ప్రారబ్ధం ఉత్తమ జనా:న పరిత్యజంతి
ఇంకోటి:
ఛిన్న: అపి రోహతి తరవ:
క్షీణ: అపి ఉపచీయతే పున: చంద్ర:
ఇతి విమృశంత: సంత:
న సంతప్యంతే విప్లుతా లోకే
ఈ పైరెండూ బాగా జీవితంలో వాడుకుంటుంటాను. ఏం చేద్దాం అలా ఉంది - స్మూత్ గా లైఫ్ సాగదుగా మరి! :)
రేడీయోలో వచ్చే:
కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా న స్నానం న విలేపనం నాలంకృతా మూర్ధజా:
వాణ్యేక సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతే ఖలు భూషణాని సతతం
వాక్ భూషణం భూషణం
నేను సరిగ్గా నేర్చుకోని వాడుకోవాల్సిన మరో సుభాషితాని
"మౌనం అపణ్డితానాం" అని అది గుర్తులేకే ఈ వాగుడు - టైపుడు!?? ఎవరన్నా చెప్పి పుణ్యం కట్టుకోండి.
ఈ మీరు చెప్పే ఉత్తములు, మధ్యములు, అధములు... వారికి సంబందించిన, వారికి మాత్రమె ఉపయోగ పడే పనుల విషయంలో వర్తిస్తుంది అని అనుకుంటున్నాను. మరి పదిమందికి పనికి వచ్చే పని మొదలు పెట్టె, పెట్టిన పనులను హేళన, అవరోధం, అడ్డంకులు కలుగ చేసే వారిని ఏమనాలి?? సోది నాయాళ్ళు ?? వేదవలనాలా?? సన్నాసులనాలా? కోజ్జాలనాలా??
EE padhyam ea panikaina varthistundi, addankupettevare leka pothe dhherulu lokamlo undaneundaru
mrmr
chinnapudu chadivina padhyam.. dorukunthunda leda ani try chesanu... chala thanks...
chinnapudu chadivina padhyam...Sagam varaku gurthosthundhi..... migilina rendu padhala kosam try chesa....
meku chala chala thanks.....
thank you...
Thanks for posting..
Thanks for posting
Thanks for posting
Thanks for the post.
It would be good to follow this poem in life.
Manchi padyam. Vethiki mari chinanatidi ikada dorikindi. Kani ikada ichina danilo chinna grammar mistakes unnayani pidithundi.
Vignanihanya.... 3 line
Pragnanidhul.....4 line
I am teaching this to my I year Civil students. I wanted telugu script for the poem and I got it thanks.
I am teaching this to my I Year Civil Engineering students. Thanks for the Telugu script of the poem.
Good poem
ఈ పద్యం చదివి తెలుగు వక్తృత్వము పోటీ లో రెండవ ప్రైజు పొందేను. 1968-69 10 వ తరగతి 1st batch.
సంతోషం అండీ.
Please add the meaning of each line too. Thanks.
Fell good poem
Word to word ardhalu evaranna vivarinchagalaru /m\
“When challenges are thrown in front of you.People with mean attitude won’t take it, because it is burdensome in nature.People with fickle behavior will give it up in the middle, because they could find an excuse for their give-up. But people with reverend demeanor will not give a scope for fate or karmic repercussions,because they are indeed intelligent and outstanding”
“When challenges are thrown in front of you.People with mean attitude won’t take it, because it is burdensome in nature.People with fickle behavior will give it up in the middle, because they could find an excuse for their give-up. But people with reverend demeanor will not give a scope for fate or karmic repercussions,because they are indeed intelligent and outstanding”
Thank u andi
Correction required at the last line. Its pragnya nidhul gaavunan.... But not pragnya nidhulal gaavunan....
Correct me if i am wrong.
అభివృద్ధి నిరోధకులు అనాలి.
I like this very much .
Thank you for keeping this poems..
అమృత తుల్యం , అతి మధురం
Chala bagundi.
అటజనికాంచె భూమిసురు డంబరచుంబి శిర స్సర జ్ఝరీ
పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్
కటకచరత్ కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
ఇది నాకు ఇష్టమైన పద్యం
It's good.. I do remember this only when I hesitate to start some work.. Always motivates me .
ఎందుకో అనుకోకుండా పద్యం గుర్తొచ్చింది.....అంతర్జాలం లో వెతకగ దొరికింది చాలా సంతోషం ...ధన్యవాదములు
Evvala Nidra levagane ‘sputanatananukula’ aani edo padyam lo world gurthochindhi Bt ahh padyamyokka starting gurthuratle...can any1??
“Sputanatananukula” e word a padyam lonidi can any1 ???
నాకు చాలా ఇష్టమైన పద్యం.🙏
Still reading
Thank you so much andi eppudu nuncho vetukutunna e padyam kosam
కందము*🌹🌷ఈవిధముగా కూడా చూడవచ్చు 👇
కార్యము
సాధించుటలో !
చర్యను మొదలిడరధ
ములు శంకోన్మదులై !
చర్యవిడుమధ్యు
లడ్డుచె !
కార్యాటంకముల
గూల్చుఘను
లుత్తమముల్ !
Ahrambiru neecha manavulu padyam loni alankaran cheppagalara plz
ఈ సుభాషితం కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. సరే ఎలాగూ వచ్చాను కదాని ఎందుకు వెయుకుతున్నానో చెప్తాను. ఏదయినా ఎవరయినా. ప్రారంభించమని అడిగినప్పుడు మాత్రమే ఈ సుభాషితం కరెక్ట్.
బాగుంది
Desa Bashalandu Telugu Lessa🙏
Sir maku tatparyam cheppa galara
Post a Comment