మనం రాయడం మొదలు పెట్టినదగ్గరినుండీ, పుస్తకాల మీద నిషేధాలు ఉన్నాయి. వాటిని జాబితాలలో చేర్చడమూ ఉంది. 1559 లో కేథలిక్ చర్చ్, నిషేధింపబడిన పుస్తకాల జాబితాను " Librorm Prohibitorum" (Index of Prohibited Books) అనే పేరుతో తీసుకొచ్చింది. ఆ నిషేధ సంస్కృతి నాలుగొందల సంవత్సరాల తరవాత ఇరాన్ కు చెందిన 'ఆయతుల్లా రొహల్లా ఖొమైనీ', 'ద సాటనిక్ వెర్సెస్' అనే పుస్తకం రాసినందుకు సాల్మన్ రష్దీని చంపేయమని ఫత్వా జారీచేసేంతవరకూ వచ్చింది. సంపూర్ణ నిషేధాలు - అంటే ఒక పుస్తకం ప్రచురింపబడకుండా, అమ్ముడుపోకుండా చేయడం, సెన్సార్ చేయడం మాత్రమే కాకుండా చేయడమే కాకుండా, ఒకవేళ అప్పటికే అందుబాటులో ఉంటే, లైబ్రరీలనుండీ తీసేయడం, పాఠకులకు దొరకనీయకుండా చేయడం వగైరాలు కూడా.
ఫ్రెంచ్ విప్లవం జరిగినపుడు మొదటి సారి "ఫ్రీడం ఆఫ్ స్పీచ్" అనే అంశం 1789 లో తెరపైకి వచ్చింది. రెండేళ్ళ తరవాత అమెరికాలో ఫర్స్ట్ అమెండ్మెంట్ లో ఇదే అంశాన్ని తీసుకున్నారు. ఇవి ఉన్నాకూడా పుస్తకాలని నిషేధించడం ఎక్కడా ఆగలేదు. రచయితల హక్కులు, పాఠకుల హక్కులని పరిమితం చేసారు. వ్యాజ్యాలు నడిపారు. పుస్తకాలని సంవత్సరాల కొద్దీ నిషేధించారు. డీసెంట్ గా లేవనో, హింస నో సెక్స్ నో ప్రేరేపిస్తున్నాయనో నిషేధించడం కాస్త అర్ధం చేసుకోదగినదే. అయితే, జాత్యాహంకారులు, యుద్ధోన్మాదులు, రాజకీయ వాదులు, చరిత్రనో, సైన్స్ నో అంగీకరించని వారు కూడా నిషేధాలని నడిపించారు. అయితే ఎన్నో గొంతులు కలిసి చేసిన పోరాటాలవల్ల, రాసిన వాళ్ళూ, చదివినవాళ్ళూ, నిషేధించినవాళ్ళూ, ప్రభావితులవడం వల్ల, మనలో మెల్లగా మార్పు వచ్చింది. మానవత్వాన్ని గుర్తు చేసే హక్కు పుస్తకాలకు ఉన్నంతకాలం, నిషేధాలు వాటిని ఆపలేవు.
ఈ పుస్తకంలో వివాదాస్పదమనో, రెచ్చగొట్టే స్వభావం ఉన్నందుకో, విప్లవ భావాలను ప్రచురించినందుకో నిషేధింపబడిన పుస్తకాల గురించి సమాచారం ఉంది. వీటిని చరిత్రలో ఎక్కడో ఓ చోట, ఏదో ఒక టైం లో ఆపేందుకు ప్రయత్నించారు. పుస్తకాల్ని నిషేధించడం, వాటి ప్రతుల్ని దొరకనీయకుండా చెయడం, కుప్ప పోసి తగలబెట్టడం, వాటి గురించి ప్రజలెవ్వరూ మాటాడకుండా చెయ్యడం, ఇల చాలానే జరిగాయి. అయితే, ఇవి ఆయా పుస్తకాలకి మంచే చేసాయి. నిసేధింపబడిన చాలా పుస్తకాలు సూపర్ డూపర్ హిట్ లు అయ్యాయి. జనం లో వాటిని చదవాలన్న ఉత్సుకత పెరిగింది. మార్క్ ట్వైన్ అన్నట్టు పుస్తకాల అందుబాటుని పరిమితం చేస్తే, వాటి అమ్మకాలు పెరుగుతాయి. ఎందుకంటే, నిషేధింపబడిన పుస్తకాన్ని చదివేందుకు అందరికీ ఆసక్తి ఉంటుంది.
ఈ పుస్తకం లిస్ట్ చేసిన పుస్తకాలు ఇప్పుడు మనం చాలా మటుకు చదివినవే. ఉదాహరణకు ఒకప్పుడు బైబిల్ కూడా నిషేధింపబడిన గ్రంధమే. అలాగే స్వచ్చంద మరణం గురించి వాదించే పుస్తకాలతో పాటు, హత్యలు చేయడం ఎలాగో చెప్పే పుస్తకాలు కూడా నిషేధింపబడ్డాయి. స్వేచ్చ ఉంది కదా అని ఇష్టం వచ్చినది రాయడం, దాని ద్వారా సమాజానికి హానిచెయ్యడం మంచిది కాదని చర్చలు జరిగాయి. ఇప్పుడు కాలానుగతంగా పుస్తకం లో భాగాలను చూస్తే అవి ఇలా ఉన్నాయి:-
- Pre - 1900
- 19 Century
- Between the Wars
- The Post War Years
- The Late 20th Century
- The 21st Century
ఇప్పుడు నిషేధింపబడిన పుస్తకాల జాబితాలో ఇప్పుడు బాగా పేరు పొందిన, కొన్ని ప్రముఖ పుస్తకాల పేర్లు చూద్దాం.
- The Canterbury Tales
- Wycliffe's Bible
- Grimm's Fairy Tales
- Frankenstein
- The History of Mary Prince
- Te Communist Manifesto
- Madame Bovary
- On the Origin of Species by Means of Natural Selection
- Adventures of Huckleberry Finn
- The Earth
- The Awakening
- Ulysses
- Mein Kamph
- Lady Chatterley' Lover
- The Well of Loneliness
- A Farewell to Arms
- All Quiet on the Western Front
- As I Lay Dying
- Brave New World
- Gone with the Wind
- Their Eyes were watching God
- The Grapes of Wrath
- The Diary of a Young Girl
- Nineteen Eighty Four
- The Catcher in the Rye
- Fahrenheit 451
- The Lord of the Files
- Lolita
- Doctor Zhivago
- Things Fall Apart
- A Raisin in the Sun
- To Kill a Mockingbird
- Catch - 22
- One Flew over the Cuckoo's Nest
- The Autobiography of Malcom X
- I Know Why the Caged Bird Sings
- Slaughterhouse-Five
- Black Voices from Prison
- Maurice
- The Color Purple
- The Handmaid's Tale
- Beloved
- Spycatcher
- The Satanic Verses
- The Alchemist
- Final Exit
- American Psycho
- Shame
- The God of Small Things
- The Harry Potter Series
- The Kite Runner
- The Bastard of Istanbul
- The Cartoons that Shook the World
- Melissa (formerly George)
- The Hate you Give
- I Have Men
- 1000 years of Joys & Sorrows
Surprising ! వీటిల్లో ఎన్ని అత్భుతమైన పుస్తకాలున్నాయో కదా. కొన్ని మీరు విమర్శించే పుస్తకాలు కూడా ఉండొచ్చు. కొన్ని వాణిజ్యపరంగా చాలా సక్సెస్ సాధించినవి కూడా ఉన్నాయి. నల్లజాతి మహిళల పుస్తకాలు, మెక్సికో, రష్యా దేశాల గొంతులనీ అణిచివేసే ప్రయత్నాలు, బానిసత్వ నిర్మూలనని వ్యతిరేకించే లాబీలు ఈ నిషేధాలలో పెద్ద పాత్ర పోషించాయి. కొన్ని నిషేధాల్లో, తమ పిల్లలను ఈ బాధితుల రేప్, హింసల వర్ణనలు చదవనీయరాదంటూ అమెరికాలో స్కూలు పిల్లల తల్లిదండ్రులు పట్టుబట్టడం కూడా ఉంది. అలా ఈ పుస్తకంలో వీటన్నిటి గురించి, ప్రతి పుస్తకం గురించీ, ఒకటీ రెండు పేజీల సమాచారం ఉంది. ఎవరు ఏ పుస్తకాన్ని ఎందుకు వ్యతిరేకించారు ? ఎలా కేసులు నడిచాయి. ఎన్నాళ్ళు నిషేధించారు వగైరాలు. చాలా ఆసక్తికరంగా ఉంది.
వీటి నిషేధాలకి ఆయా దేశ కాల మాన పరిస్థితుల బట్టీ బోల్డు కారణాలున్నాయి. ఉదాహరణకు చైనాలో పాశ్చాత్య భావజాలం, యూరోపియన్ ప్రభావాన్ని పెంచే సాహిత్యం నిషేధం. వాటి ప్రతులు తైవాన్, హాంగ్ కాంగ్, మంగోలియాలలో విస్తృతంగా అమ్ముడుపోయినా కూడా, చైనా లో అవి దొరకవు. రచయితలు ఇతర దేశాల్లో శరణార్ధులవుతారు. దేశంలోనే ఉంటే మాయమవుతారు. ఇస్లామిక్ దేశాల్లో ఇస్లాం మీద పట్టు కోసం ఇరాన్, సౌదీ అరేబియా దేశాలు తమలోతాము కొట్టుకుంటూ, ఇలాంటి "మతాన్ని" చర్చించే పుస్తకాల నిషేధాల మీద ప్రత్యేకాశక్తి కనపరుస్తాయి. మతానికి వ్యతిరేకంగా రాస్తే అక్కడ కఠిన శిక్షలుంటాయి. ఇరాన్ లో మరీ కఠిన శిక్షలు ఉంటాయి.
అయితే, భావ వ్యక్తీకరణ స్వేచ్చకు ఈ నిషేధాలు ప్రమాదకరం కాబట్టి, కాల పరీక్షకు ఎదురొడ్డి వీటిలో చాలా పుస్తకాలు బయటికొచ్చాయి, బాగా అమ్ముడుపోయాయి, చరిత్రని మార్చాయి. చలనచిత్రాలుగా రూపు దిద్దుకున్నాయి. బోల్డెన్ని అవార్డులు అందుకున్నాయి. సినిమాలుగా మారాక, పుస్తకాల అమ్మకాలు బాగా పెరిగాయి. యుద్ధం మీద, యుద్ధం వల్ల కలిగే వినాశనాన్ని గురించి, జాతి హననాన్ని గురించీ ఈ పుస్తకాలు, సినిమాలు బాగా డాక్యుమెంట్ చేసాయి. వీటివల్ల చాలా మటుకు ప్రజాభిప్రాయాలలో మార్పు వచ్చింది. స్త్రీ పురుష సంబంధాల గురించి, హోమో ఫోబియా గురించీ, మతం, రాజకీయ నమ్మకాల గురించి, సైన్స్ గురించి, రచయితలు రాసి ఆరోజుల్లో చాలా కష్టాలకు గురయ్యారు. భూమే సృష్టికి కేంద్రం అని నమ్మిన మానవాళి, సూర్యుడి గొప్పదనాన్ని ఒప్పుకునేంతవరకు హీలియో సెంట్రిక్ పుస్తకాలు నిషేధింపబడ్డాయి.
పై పుస్తకాలు చాలా మంది చదివే ఉంటారు. జాతి వివక్ష గురించి మాట్లాడడం, స్త్రీ లైంగిక స్వాతంత్రాన్ని గురించి మాట్లాడడం, స్వలింగ సంపర్కం, కులం, మతం గురించి మాటాడడం ఒకప్పుడు పెద్ద నేరం. ఇప్పటికీ కొన్ని విషయాల పై మట్లాడడం నేరమే. రేపొద్దున్న జనంలో మానవత, విచక్షణల గురించి మేల్కొలుపులు రావడానికి పుస్తకాలే అవసరమవుతాయి. ఎందుకంటే, పుస్తకాల నుండే సినిమాలు, వెబ్ సెరీస్ లు వస్తాయి. పుస్తకాల నుండే అయిడియాలు వస్తాయి. మేధ వికసిస్తుంది. భాష పరిపుష్ఠం అవుతుంది.
మనకి బాగా తెలిసిన పుస్తకాల గురించి చిన్న నోట్స్ :
లజ్జ (SHAME) - తస్లీమా నస్రీన్.
బాబ్రీ మసీదు విధ్వంసం తరవాత భారత దేశం తో పాటు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో కూడా అల్లర్లు చెలరేగాయి. బంగ్లాదేశ్ లో ఉన్న చిన్ని హిందూ మైనారిటీని రక్షించడంలో బంగ్లాదేశ్ ప్రభుత్వ వైఫల్యాలని గురించి లజ్జ అనే పుస్తకాన్ని రాసారు. బంగ్లా భాషలో మొదట ప్రచురితమైన పుస్తకం నాలుగు నెలల్లో 60,000 కాపీలు అమ్ముడుపోయింది. అయితే అవే నాలుగు నెలలు గడవగానే, బంగ్లదేశ్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించింది. నస్రీన్ ప్రాణాలు తియ్యాలని అనధికార ఫత్వాలు జారీ అయ్యాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు నస్రీన్ శరణార్ధి అయ్యారు, మొదట స్వీడన్ లో తరవాత భారతదేశం లోనూ ఆశ్రయం పొందారు. ఈ ఒక్క నిషేధిత పుస్తకం తో నస్రీన్ ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.
Satanic Verses - Salman Rushdie
Magic Realism పద్దతిలో రాసిన ఈ పుస్తకం తో 1980 లో ఓ పెద్ద యుద్ధానికే తెర తీసారు. బేసిక్ గా ఇది, ఇద్దరు భారతీయ పురుషులు మధ్య జరిగిన కథ. ఇద్దరూ లండన్ కు వెళ్ళే విమానంలో ప్రయాణిస్తుండగా విమానం ఉగ్రదాడిలో చిక్కి, పేలిపోతే, వీళ్ళిద్దరూ మాత్రం ప్రాణాలు దక్కించుకుని ఒక బీచ్ లో తేలతారు. వీళ్ళలో ఒకరు దేవత గా, ఒకరు సాతాను గా మారడంతో కథ మొదలవుతుంది. ఇక్కడినిండీ, కలా, సాహసాల మధ్య వీరి ప్రయాణం మత చర్చలు చేస్తూ సాగుతుంది. చాలా మంది ముస్లిములు ఈ పుస్తకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే, దీనిలో విలన్ పాత్ర మహమద్ ప్రవక్తని పోలి ఉంటుంది. దాంతో పుస్తకం నిషేధానికి గురయ్యింది.
ఫిబ్రవరి 1989 లో ఇరాన్ కు చెందిన ఆయతుల్లా ఖొమైనీ రష్దీని చంపమని ఫత్వా జారీ చేసారు. ఒక మతకారుడు ఇలాంటి ఫత్వాని ఇస్తే, కేవలం ఇచ్చిన వాడే దానిని ఉపసంహరించుకోవాలి. కానీ జూన్ 1989 లోనే ఖొమైనీ మరణించాడు. ఫత్వా వెనక్కు తీసుకోబడలేదు. రష్దీ కొన్ని సంవత్సరాల పాటూ దాక్కున్నాడు. సాయుధ రక్షణలో బిక్కు బిక్కు మన్నాడు. అతని జపనీస్ అనువాదకుడిని చంపేసారు. ఇటాలియన్, నార్వే పబ్లిషర్ ల మీద పెద్ద దాడులే జరిగాయి. పుస్తక వ్యతిరేక ప్రదర్శనల్లో జరిగిన అల్లర్లలో 59 మంది చనిపోయారు. ఇంత హింసకు చలించి, రష్దీ "అల్లానే దైవం అనీ, ప్రవక్త దేవుడికి ప్రమాణం" అని ఒప్పుకుంటూ స్టేట్మెంట్ జారీ చేసాడు. అయినా ఈ నవల భారతదేశం, బాంగ్లదేశ్, సూడాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, కెన్యా, థాయిలాండ్, టాంజానియా, ఇండోనేషియా, సింగపూర్, వెనిజుయేలా లలో నిషేధించబడింది. ఆఖరికి ఒక్క సౌత్ ఆఫ్రికాలోనే మాత్రమే 2002 లో ఈ నిషేధాన్ని ఎత్తేసారు. తరువాత ఆ "లొంగుబాటు ప్రకటన" ఒక పొరపాటని రష్దీ విచారించాడు.
ఈ పుస్తకంలో ఒక పాత్ర ఇందిరాగాంధీని పోలి ఉంటుంది. ఒక 'క్రూరమైన వితంతువు, తన భర్త మరణానికి కారణం ఐంది' అంటూ ఇందిరను గురించి చెప్తున్నట్టుగా ఉంటుంది. దీనితో ఇందిరా గాంధీ రష్దీ మీద కేసు వేసి గెలిచారు. అయితే తరవాతి ప్రచురణల్లో ఇందిర పాత్రను మార్చలేదు. కేవలం ఆమె పరువుని తీసేసే 'భర్తను చంపినదంటూ' రాసిన ఒక్క వాక్యాన్ని మాత్రం తొలగించారు.
రష్దీ ప్రాణం పై ఇటీవల దాడి జరిగినపుడు ఆయన ఒక కన్నుని కోల్పోయారు. అయినా ఆయన రచనలు రావడం ఆగలేదు. చార్ట్ బస్టర్లు కావడమూ ఆగలేదు.
ఇంతకీ ఈ పుస్తకాన్ని నిషేధించిన భారత ప్రభుత్వం
నిషేధాజ్ఞ ప్రతిని ఎక్కడో పడేసుకుంది. సంవత్సరాలుగా ఆ ప్రతి ఏ రికార్డులలోనూ దొరకలేదు. ఇప్పుడు technical గా ban ఉన్నట్టా లేనట్టా?! అని ప్రశ్నలు తలెత్తాయి. Ban ని పునరుద్ధరిస్తున్నట్టు తాజా ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ ఏమీ తెలీదు.
Killing Commendatore - Haruki Murakami
మురకామీ 14 వ నవల, అతని అన్ని పుస్తకాల లానే, రసవత్తరంగా, అత్భుతంగా దట్టించిన సెక్స్, స్పష్టమైన శృంగార సన్నివేశాలతో నిండి వుంటుంది. హాంగ్ కాంగ్ Obscene Articles Tribunal, దీనిని ఇండీసెంట్ పుస్తకంగా అభివర్ణించింది. "హింస, లేకితనం, జుగుప్స కలిగించే పుస్తకంగా" దీనికిపేరిచ్చింది.
అయితే మురకామి ఇతర పుస్తకాల కన్నా ఏమంత ఎక్కువ సెక్స్ ఈ పుస్తకంలో గుప్పించనప్పటికీ, దీనిని మాత్రం నిషేధించడానికి హాంగ్ కాంగ్ అల్లర్లలో బీజింగ్ పట్ల వ్యతిరేక భావాలని ప్రకటించినందుకు గాను మురకామీ చైనా ప్రభుత్వ ఆగ్రహానికి గురవ్వడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. హాంగ్ కాంగ్ బుక్ ఫెయిర్ లో ఈ పుస్తకానికున్న చైనీస్ అనువాదాల్ని ఆఘమేఘాల మీద తీసేసారు. వెనువెంటనే చైనా మార్కెట్ నుండీ తీసేసారు. హాంగ్ కాంగ్ లో 18 ఏళ్ళు దాటిన పాఠకులకి మాత్రమే సీల్ వేసిన పుస్తకం అమ్మాలని రూల్ ఇచ్చారు. ఆ విధంగా పుస్తకం ఇతరభాషల్లోనూ హిట్ అయింది, బీజింగ్ పట్టుదల మీద మురాకామీ గెలుపూ స్పష్టమైంది.
The Bastard of Istanbul - Elif Shafak
అర్మేనియన్ క్రిస్టియన్ ల పై జరిగిన మారణ కాండ గురించి, టర్కీలో మాటాడడం నేరం. 1915 లో ఆర్మేనియన్ మారణకాండ జరిగింది. ఓట్టోమాన్ సామ్రాజ్యంలో తరతరాలు గా నివసించిన రకరకాల జాతి మతాల వారిలో ఒకరైన క్రిస్టియన్ మైనారిటీ కి చెందిన వారిని చుట్టు ముట్టి, టర్కీనుండీ నుండీ వెళ్ళగొట్టారు. అర్మేనియన్ మేధావుల్ని 24 ఏప్రిల్ 1915 న కాల్చి చంపేసారు.మిగిలిన వారిని సిరియా లో ఎడారి వైపుకు తరిమారు. 650,000 మంది ఆ ప్రయాణంలో ఆకలితో, అలసటతో మరణించారు. తరవాతెప్పుడో టర్కీ ప్రభుత్వం, ఈ మారణకాండ ని కొట్టిపారేసింది. ఎంతో ఒత్తిడి మీద "అవును చిన్న మొత్తంలో ఏదో కాస్త జరిగిందిలే" అన్నట్టు ఒప్పుకుంది. కేవలం, ఈ మారణ కాండ గురించిన ప్రస్తావన ఉన్నందుకు ఈ పుస్తకం నిషేధించబడింది.
ఎలిఫ్ షఫాక్ లాంటి ఆడది, "అర్మేనియన్ జీనసైడ్ లో ప్రాణాలు కోల్పోయిన ఓ అమ్మమ్మ మనవరాలిని" అని తన ప్రధాన పాత్ర చేత చెప్పించడం వివాదాస్పదమైంది. ఈ మారణ కాండ ని గురించి చర్చించినందుకు టర్కీకి ప్రపంచ వ్యాప్త కీర్తిని తెచ్చిన 'ఓర్హాన్ పాముక్' ని కూడా కేసుల్లో ఇరికించారు. ఈ ఒక్క పుస్తకం చాలా గొప్ప స్టేట్మెంట్ నే ఇచ్చింది.
ఇంకా చాలా మంచి మంచి పుస్తకాలే ఉన్నాయి ఈ పుస్తకంలో. చాలా మంచి నోట్స్ తో ! చదివిన వాళ్ళు - బ్లాక్ హిస్టరీ, బ్లాక్ లైవ్స్ మేటర్, ఎథునేసియా, రక రకాల దేశ చరిత్రలు, కమ్యూనిజం, మావోయిసం, మార్క్సిసం తదితర అంశాలపై వెలువడిన మంచి సాహిత్యం, కనువిప్పు సాహిత్యం, ఒకప్పుడు నిషేధాల లో నలిగి, అరిగి, పైకొచ్చిన విధానం గురించి తెలుసుకుని చాలా ఆనందిస్తారు.
ఇంకా చాలా రాయాలనే ఉంది ఈ పుస్తకం గురించి. కానీ పైనిచ్చిన లిస్ట్ లో ఉన్న కొన్ని పుస్తకాలే కాకుండా, మనకు తెలియని పుస్తకాల గురించి, అవి సాధించిన లక్ష్యాల గురించి మీరందరూ కూడా చదవాలని నా కోరిక. అందుకే కేవలం, పుస్తకంలో ఉన్న అంశాలలో కేవలం రెండు శాతం గురించి చెప్పాను. మిగిలింది ఆస్వాదించదలచుకుంటే చాలా మంచి అనుభవం.
ISBN 978-0-241-3639-1
DK Penguin Random House, DK London
***
Some famous Quotes :
If all printers were determined not to print anything till they were sure it would offend nobody, there would be very little printed.
- Benjamin Franklin, 1731.
Every dictator gets rid of the artist first. They burn the books and execute the artist first. Art might do something. Its dangerous.
- Toni Morrison
The fact that the adult American Negro female emerges formidable character is often met with amazement, distaste, and even belligerence.
- Maya Angelou.
You have to go through the darkness before you get to the light. - Haruki Murakami.
You never really understand a person, until you consider things from his point of view.. Until you climb inside of his skin and walk around in it. - Harper Lee in 'To kill a Mocking Bird'
My job is to write, which I will continue to do for as long as I live, even if I am not allowed to be read. - Taslima Nasrin
If you start reading a book and if you don't like it you always have the option of shutting it. At this point, it loses its capacity to offend you.
- Salman Rushdie
***
No comments:
Post a Comment