Pages

08/02/2013

బోరింగ్ కబుర్లు1. కొందరు నిరుద్యోగం భయంతో 'చిరుద్యోగాలు' చేస్తుంటారు.  ఎంత చిరుద్యోగాలయినా పర్లేదు. కాంట్రాక్టు ఉద్యోగాల్లో చేరి 'పెర్మినెంట్ ' ఎప్పటికైనా అవుతామేమో అని ఎదురు చూసే చాలా మంది ఆశావహుల్ని చూస్తుంటాం.  ఇది ఒక రకం అబధ్రత.  ఈ చిన్న ఉద్యోగం కూడా లేపోతే ఏం కాను అనే బెంగ తో కూడా ఆ చిన్న ఉద్యోగాన్ని చేస్తూనే వుంటారు.   కాంప్రమైస్ అయ్యి, ఆ తరవాత పోటీలో నెగ్గలేక, తరవాత అలవాటు పడి, అలా 'ఎక్కడ చేరిన గొంగళి ' ని అక్కడే వొదిలేస్తూంటారు. అది చాలా మటుకూ వ్యక్తిగత & వృత్తిగత నిర్ణయం అనుకోండి. కానీ మరీ ఇలానా ? 1971 - 2001 వరకూ, కేవలం నెలకు 15 రూపాయల కొన్ని పైసల  జీతంతో పని చెయ్యడం సాధ్యమా ?   

అది టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో టాయిలెట్లు కడిగే ఉద్యోగం. కానీ ఇన్నేళ్ళ శ్రమ కి ఇద్దరు మహిళా సఫాయీ వాలీ లకు ఇంతవరకూ అందిన జీతం మొత్తం కలిపి 5400/- ట. అన్యాయం కదా.  విషయం ఇప్పుడు ట్రైబ్యునల్లోనో కోర్టు లోనో ఉంది.  వాళ్ళకి జీతం పెంచే ప్రతిపాదన, ప్రభుత్వ పరిశీలన లో వుంది. గానీ ఈ ఇద్దరు మహిళలూ, గమ్మత్తుగా గెనీస్ బుక్ లో ఎక్కేందుకని దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళ ప్రత్యేకత, 'ప్రపంచం లో అతి తక్కువ జీతం తీసుకున్నవాళ్ళు !' నిజమే ! ఇంతకన్నా తక్కువ జీతం వుంటుందా ?

2.  Delhi లో జ్యోతీ సింగ్ రేప్ కేస్ సృష్టించిన సంచలనం ఇపుడిపుడే ఫేడ్ ఔట్ అవుతూంది.  ఇదో టీ కప్పు లో తుఫాను లా మిగిలిపోకుండా ఇంకా చాలా సంస్థలూ, మహిళా హక్కుల గురించి పోరాడే వాళ్ళూ కృషి చేస్తూనే వున్నారు.  అయితే ఇది అంత ఈజీ గా మర్చిపోగలిగే సంఘటన కాదు.  పరిస్థితి హాలా ఉద్రిక్తంగా ఉన్నప్పుడు కూడా ఎన్నో అత్యాచారాలు జరిగాయి. అంటే ముఖ్యంగా అవన్నీ మహిళల పై తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి చేసే దారుణ ప్రయత్నాలే.  ఇలాంటి అత్యాచారాలు ఎన్నో! ఎన్నెన్నో !  అయితే ఇంత ప్రజాగ్రహం, దానికి ప్రభుత్వ స్పందనా, మిగిలిన ప్రపంచాన్ని కూడా ఆశ్చర్య పరిచింది.   అయితే ఈ బడబాగ్నిని మన తో పాటూ ప్రపంచం మొత్తం పంచుకుంటూంది కాబట్టి ఈ 14th of February, 2013 న  ఇది చేస్తున్నారు.   ప్రపంచం లో వివిధ ప్రాంతాలో మహిళలు వివిధ రకాలు గా లైంగిక అణిచివేత కి గురవుతున్నారు.  కోట్లాది మంది రేప్ సర్వైవర్స్, బాధితులు ఆ ఒక్కరోజు వీధుల్లో చేసే ప్రదర్శన, పెద్ద మార్పు తేలేకపోవచ్చు. కానీ సమస్య ఎంత పెద్దదో, ఎంత హేయమైనదో, తెలియజేస్తుంది.  వాళ్ళలో కొందరికైనా న్యాయం జరుగుతుంది అని ఆశ.  కొడవటిగంటి కుటుంబరావు - 'చదువు' లో ఒక  పాత్ర అంటుంది.  "రామకోటి రాస్తే స్వరాజ్యం వస్తుందంటావా - ఆనందంగా రాస్తాను"  - అని.  (అంటే ఈ లక్ష్యం కోసం నాకు చేతనైనది నేను చేస్తాను' అని)  దీనికి సంబంధించిన వీడియో :

http://www.youtube.com/watch?v=gl2AO-7Vlzk


11 comments:

A Homemaker's Utopia said...

నాకు బోర్ కొట్టలేదండీ..మంచి కబుర్లు రాశారు..:-)

Sujata said...

Thank you very much andi.

జయ said...

ఈ కఠిన సత్యాలు ఎప్పటికీ కబుర్లు అయిపోకూడదనేది నా కోరిక.

Sujata said...

Jaya garu

I wish I could say 'Tathastu'!

నిషిగంధ said...

జయ గారి మాటే నాదీనూ!
అసలు వీటిని 'కబుర్లు ' కేటగిరీలో వేసినందుకు మిమ్మల్ని గర్హిస్తున్నా, సుజాతా :)

Sujata said...

thanx.

కృష్ణప్రియ said...

పైన చెప్పినట్లు ఇవి బోరింగ్ కబుర్లు కానేకావు.అంత తక్కువ జీతం తో అంత కాలం పని చేయించడం.. క్షమించరాని నేరం.

Sujata said...

Krishna Priya garu

Thanks for coming here. Yes. There are so many such instances of exploitation like this. Really sad.

Narayanaswamy S. said...

Why boring?

రాధిక(నాని ) said...

ఇవి బోరింగ్ కబుర్లు కావండి .అలోచింపజేసేలావున్నాయి.

Sujata said...

Thank you Radhika garu.