Pages

26/07/2010

జ్ఞాపకాల గజిబిజి

1) మార్క్ ట్వైన్ రాసిన 'ప్రిన్స్ ఎండ్ ద పాపర్' - అయితే ఇంగ్లీషు ఒరిజినల్ గానీ లేదా మన నండూరి వారి 'రాజు - పేద' అనే తెలుగు అనువాదం గానీ చాలా మంది పెద్ద పిల్లకాయల దగ్గర వుండొచ్చు. ఇదే సబ్జెక్టుతో అప్పుడెప్పుడో, మా టీవీ లో ఒక సినిమా చూసాను. బహుశా ఆ సినిమా పేరు కూడా రాజు-పేద నే అనుకుంటాను. ఇందులో బీద అబ్బాయి (టాం కాంటీ) తండ్రి (జాన్ కాంటీ) పాత్ర లో నూనుగు మీసాల 'ఎన్ టీ ఆర్' నటించారు. 'ఎన్ టీ ఆర్' ని ఇలా నెగటివ్ పాత్ర లో చూసి ఆశ్చర్య పోయానపుడు. బహుశా ఆయన కెరీర్ మొదట్లో చేసిన సినిమా అయి ఉండొచ్చు. దురదృష్టవశాత్తూ ఆ రోజు కేబుల్ వాళ్ళకు పోయిందో, మాకు పోయిందో గానీ కరెంటు పోయి సినిమా చూడ్డం జరగలేదు. ఆ సినిమా ఏమిటి ? మళ్ళీ చూడాలంటే ఎలా ? ఆ సినిమా మళ్ళా ఎప్పుడూ టీ.వీ.లో ప్రసారం అయినట్టు లేదు. ఏమి సాధనం ?

2) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, శ్రీమతి వేదవతీ ప్రభాకర్, శ్రీమతి చాయాదేవి పాడిన ఒక మాంచ్హి భజన వుంది. టీ.టీ.డీ వాళ్ళు ఎప్పుడో నా చిన్నప్పుడు విడుదల చేసిన, పేరు మర్చిపోయిన ఒకానొక కేసెట్లో మా ఇంట్లో ఉండేది. ఆ కేసెట్టు అరగ్గొట్టాకా, టేపు పాడయ్యి, మిగతా కేసెట్ల సంత లో కలిసిపోయాకా, మళ్ళా ఆ భజన దొరకనేలేదంటే నమ్మండి.

ఆ భజన మొదటి లైన్లు

''కమలా వల్లభ - గోవింద మాంపాహి
కళ్యాణ కృష్ణా - గోవిందా

యశోదబాలా - గోవింద మాంపాహి
కళ్యాణ కృష్ణా - గోవిందా

భక్త మనోహర - గోవింద మాంపాహి
కళ్యాణ కృష్ణా - గోవిందా ''

ఇలా మూడు చరణాల లాంటివి - ఇంటర్నెట్టు వచ్చాకా వెతుకుతూనే వున్నాను. ఎక్కడో ఏ మహానుభావులో దాచి ఉంచి వుంటారుగా అని ! నా బావి పరిధుల్లో ఈ పని కాలేదు. ఎప్పటికైనా ఈ భజనను ఎలా అయినా సంపాదించి వినాలని చాలా ఆశ పడుతున్నాను.

అందుకే నా humble request ఏంటంటే : పై రెండు ప్రశ్నలకీ సమాధానం తెలిసిన స్నేహితులు దయచేసి నన్ను గైడ్ చెయ్యగలరు !

10 comments:

మధురవాణి said...

సుజాత గారూ,
రాజు-పేద సినిమా నేను dvd లో చూసాను అప్పుడెప్పుడో! I'm sure you can get a DVD. ఏదైనా పెద్ద వీడియో షాపుకి వెళ్లి ప్రయత్నించండి. తప్పక దొరుకుతుంది. ఇక మీ రెండో ప్రశ్న గురించి నాకసలు పరిచయం లేదు. :-)

సుజాత వేల్పూరి said...

రాజు పేద సినిమా నవల మా ఇంట్లో "ఉండేది " తెలుసా? (ఎప్పుడో నేను పాకుతూ గడపలు దాటితే, అమ్మ మురిసి గారెలు వండిన రోజుల్లో అన్నమాట).అరుదైన పాత తెలుగు సినిమా డీవీడీలు సేకరించే పనిలో ఉన్నాను. కొన్నాళ్ళయ్యాక "ఇవి అమ్ముడు కావట్లేదు"అని డీవీడీలూ వేయడం మానేస్తే కష్టం కదా! అందుకని ఇప్పుడే సేకరిస్తున్నాను. రాజు పేద దొరికే అవకాశం ఉంది. భయపడొద్దు. దొరికితే ఇస్తా!

ఈ రెండోది కొద్దిగా కష్టమని తోస్తోంది కానీ నేనే సంపాదిస్తా చూడండి....!

నా జ్ఞాపకాలు తవ్వితే ప్రతి అంగుళానికీ ఇలా చిన్నపుడు నిర్లక్ష్యంతోనో, విలువ తెలీకో పారేసుకున్నవి దొరుకుతాయి.

సిరిసిరిమువ్వ said...

సుజాత గారు
మీరు అడిగిన భజన ఇదేనేమో చూడండి..దీనిలో చాలా అచ్చుతప్పులు ఉన్నాయిలేండి. ఆడియో కోసం నేనూ ప్రయత్నిస్తున్నాను..దొరకటంలేదండి. M.Sc లో ఉండగా మా కాలేజీలో రోజూ ఉదయం సాయంత్రం ప్రార్థనలో ఈ భజన తప్పకుండా ఉండేది...మీ టపా చూడగానే నోట్లో ఆ భజనే ఆ(పా)డుతుంది :)

http://data.sgsdatta.org/bhajan/sahityam/wiki/index.php?title=%E0%B0%95%E0%B0%AE%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B5%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AD_%E0%B0%97%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6

Sujata M said...

Madhura Vaani

Thank u very mucchu. DVD veta modalu pedataanu.

Sujata M said...

సుజాత గారు..

హ హా హా. అదే. తెలీక సగం, నిర్లక్షం తో సగం పోగొట్టుకున్న ట్రెషర్లు ఇలా పెద్దయ్యాకా గుర్తొచ్చి బాధపెడతాయి. మంచి ప్రయత్నం లో ఉన్నారు. ఆల్ ద వెరీ బెష్టూ !

Sujata M said...

వరూధిని గారు.

ఇదే ! లిరిక్స్ కొంచెం అటూ ఇటూ రాసారు. బాలమురళి శైలి లో చాలా బావుంటుంది. చాలా థాంక్స్. నా మనసు 'తిల్లాన తాదిరిధిం' అంది !

మాలా కుమార్ said...

ఈ రాజు పేద సినిమా మా చిన్నప్పుడు చూసాను . చాలా కాలం నుండి నేనూ వెతుకుతున్నాను , ఎక్కడైనా దొరుకుతుందా అని . మధురవాణి , నీకూ , నీతో చెప్పించిన సుజాత గారికీ థాంక్ యు .

Anonymous said...

raaju peda movie

http://www.chitranjali.info/Free-Online-Movies/TeluguChitralu/4674-RajuPeda-Telugu-Movie-Online.aspx

Anonymous said...

ika meeru adigina paata idena ?

http://www.acidplanet.com/artist.asp?PID=1109300&t=1

Sujata M said...

Anonymous garu,

Thank you so much.

kani, problem emitante, Raju Peda movie play kavadam ledu.

Bhajana ade, kani balamurali di kaakapovaDam konchem aaSaabhangam.
ayinaa sare,chaalaa thaanks.