Pages

06/02/2009

డెబిట్ కార్డు డౌటు !

బ్లాగు ద్వారా కొన్ని సందేహాలు నివృత్తి చేసుకోవం, ఖచ్చితమయిన ఆధారాలతో సమాచారం అందిపుచ్చుకోగలగడం సాధ్యం అవుతుంది. ఇప్పటి దాకా నాకు కావల్సిన పాటలేంటి, సమాచారమేంటి, కావలసిన పుస్తకం, సినిమా.. ఇలా అన్నిటి గురించీ చదువరులు విలువయిన సమాచారాన్ని అందించారు. Many thanks to them. ఇపుడు నాముందు ఉందో ముఖ్య సందేహం !

హెరిటేజ్ ఫ్రెష్ వాళ్ళు 300/- కన్నా తక్కువ బిల్ అమౌంట్ కి డెబిట్ కార్డు తీసుకోరుట - పాలసీట ! మేనేజర్ ని అడిగాను - ఎందుకు ? అని! ఆయన వివరించలేకపోయాడు. ఎందుకు తీసుకోరు ? వాళ్ళకు నష్టమా ? మరి ఎస్.బీ.అయి వాళ్ళు డెబిట్ కార్డు వాడండీ అని టీవీలో వచ్చి కూడా చెప్తున్నారు కదా ! 300/- లకు షాపింగ్ చేస్తేనే డెబిట్/క్రెడిట్ కార్డు తీసుకుంటారని వినియోగదారుడు అవసరం లేని వస్తువేదో బలవంతంగా కొనాలిసి రావడం అన్యాయం కదా ! పెట్రోలు పంపుల్లో మాత్రం వంద, యాభయికి కూడా కార్డు వాడొచ్చు ! షాపుల్లో ఎందుకు కాదు ?


ఇది ఇంకో ధర్మ సందేహం ! కొన్ని దుకాణాల్లో డెబిట్ కార్డు మీద 2% సెస్సు వేస్తారు ! రిసీట్ ఇచ్చినాకూడా అదే కొనుగోలు కి కేష్ పర్చేస్ కి సెస్సు ఉండదు ! ఏమిటి ఈ రహస్యం ? డెబిట్ కార్డు వాడడం మనకి మంచిది కాదా ? బాంకుకు మంచిది కాదా / దుకాణదారులకు మంచిది కాదా ?

6 comments:

Mana matam said...

if they take debit card for less than a certain amount, the commission will cut-off their profits. that's the reason why they don't accept debit cards. according to rule, this is illegal. if u can bring that to notice of authorities (ur debit card company like master, visa, american express etc) they will fine the shop who didn't accept ur card.

this is something followed only by indian stores in US also. they won't take credit/debit cards below $15 or $20. sometimes they will charge extra for using such.

i can suggest u that u note down the address of company who denied the use of debit card below Rs300/- and then complain about them to whatever card company u use. don't call the bank. i hope this might help.

cbrao said...

While reimbursing the amount to merchants credit card companies deduct 1.85% towards their charges.This will eat away the profit margin of retail merchants. In the case of electronics, computer goods, because of competetion the profit margins on sale of goods is low and hence they can't afford further erosion of profit. For this reason, electronic goods merchants charge additional 2% if you offer payment through Credit card or Debit card.

Use of cash is advised in such cases.

WebSphere said...

@cbrao: How you say its 1.85%? Who told you? How u landed to 2% Credit Card Charges?

@Mana matam: >>the commission will cut-off their profits.
What commission?

Any card company, acts as a broker between two major entities. Those are called as Issuer and Merchandiser.

Means that, You have ICICI Debit Card, You have swiped your card through a machine, its issued by HDFC Bank, means that the shop owner has account with HDFC. As your card is ICICI, How this transaction is processed? It is processed like a cheque, means that at the end of days transactions, the merchandiser has to submit all his transactions to his bank, and bank passes those other banks transactions to the respected bank with the transaction code blabla. The role of CARD Company is to provide backbone for the total transaction.

Why companies set their own rules saying, 300 is min? Because, they have to pay certain amount in using the swiping machine, and phone line blabla.

WebSphere said...

merchandiser is called acquirer.

Anonymous said...

నాకంటే ముందు నలుగురు చెప్పేశారు!...సరే తెలుగులో చెప్పే మెదటివాడిని నేనౌతా!

మీరు కార్డ్ స్వైప్ చేసినప్పుడు, మీ అకౌంట్ నించి షాపు వాడి అకౌంట్ కి డబ్బులు వెళ్తున్నాయి. షాపు వాడికి ఆ పనిని ఆ ఈడిసీ మెషిన్ ఇచ్చిన బ్యాంకువారు చేసిపెడితున్నారు. దానికి బ్యాంకువారు షాపువాడి నుంచి చార్చ్/ఫీ కలెక్ట్ చేస్తారు. అది 1% నుంచి 2% దాకా ఉందనుకున్నాం. కాక ఈడిసీ మిషిన్ ఒక టెలిఫోన్ ద్వారా కనెక్టడ్ కాబట్టి, ఆ కనెక్టివిటీ కాల్ చార్జ్స్ ఉంటాయి. షాపువాడికి మొత్తం మీద 2% ట్రాంసాక్షన్ కాస్ట్ ఉన్నా, ఒకవేళ వాడి బిజనస్ మీద వాడికి అంత మార్జిన్ కూడా లేనప్పుడు, ఆ విధంగా డబ్బు తీసుకోవడానికి నిరాకరిస్తాడు.

అలా నిరాకరించ కూడదన్న నిబంధన ఏదీ ఉన్నట్టు నాకు తెలీదు.ఎందుకంటే, ఏ వ్యాపారంలొ అయినా వ్యాపారి తనకు రావల్సిన చెల్లింపు ఏ రూపేణా ఉండాలి అని చెప్పుకొనే అధికారం ఉందనే నేననుకుంటున్నాను. కొన్ని పెద్ద లావా దేవీలలో, మేము డిడి లే స్వీకరిస్తామని చెప్పుకునే అధికారం ఉన్నట్టు, చిన్న లావా దేవీలకి మేము క్యాష్ మాత్రమే స్వీకరిస్తామని చెప్పుకోవచ్చు గదా!

నేను కార్డ్, క్యాష్ కాకుండా చెక్ ఇస్తేనంటే మాత్రం వాడు ఒప్పుకుంటాడా! అలా నిరాకరించకూడదన్న నిబంధనేమీ లేదే!?

కాకపోతే, వాళ్ళు బ్యాంకు వారి ట్రాంక్సాక్షన్ చార్చ్స్ ని, ఓ ఆపరేషనల్ కాస్ట్ కింది భావించి, తదనుగుణంగానే వస్తువు ధరలు నిర్ధారించుకుంటారు కాబట్టి ఇది ఎథికల్ వ్యాపార లక్షణంగా నాకన్పించెట్లేదు. కానీ, వారి లెక్కలు, వారి ఇష్టం. ఒకవేళ , వినియోగదారులు దీనిని ఫ్రీగా ఇచ్చే షాపులకై వెళ్ళడం వల్ల నష్టపోతున్నామని వారనుకున్న రోజు, ఈ నిబంధన వాళ్ళే మారుస్తారు.

పెట్రోలు బంకులకు మాత్రం ఖచ్చితంగా కార్డ్ స్వీకరించాలన్న నిబంధన ఉన్నట్టు చూచాయగా గుర్తు.క్యాష్ ఇంటెన్సివ్ వ్యాపారమవ్వటమే కాక, ఇంకా చాలా కారణాలు అనిపిస్తున్నాయి. వినియోగదారుడిగా మనం గమనించాల్సిందేమిటంటే, పెట్రోలు బంకుల యందు మీరు స్వైపు చేస్తే, మీ కార్డు / అకౌంట్ లోనే బ్యాంకు వారు చార్చ్స్ వేస్తారు.బంకువారికి కాదు (కిటుకు అర్ధమైందా!!)

అందుకే బ్యాంకు కార్డ్ లు, పెట్రోలు పంపిణీ సంస్థలతో ఉమ్మడి కార్డ్ లు కూడా ఇస్తున్నారు. వాటిల్లో ఇలా కనీసం ఇంత మొత్తం ఖర్చు చేస్తే, మీకు ఛార్చ్ లు వేయం అని ఫైన్ ప్రింట్ లో రాసి, పెద్దగా మా కార్డ్ అన్ని "ఫలానా" బంకులందూ ఫ్రీగా వాడుకోవచ్చు అని రాస్తారు.

ఒకవేళ మనం అన్ని చోట్ల కార్డ్ గీసే ఆధికరం ఉన్నవాళ్ళమని మీకు తరువత ఏమన్నా తెలిస్తే, మరో బ్లాగు రాయండి.నాకు చాలా ఉపయోగ పడుతుంది. :)

-రేరాజ్ ; rayraj.wordpress.com
(సాంకేతిక కారణాలవల్ల ఒపెన్ ఐడి ద్వారా వ్యాఖ్య ప్రచురింప బడనందువల్ల, అనానిమస్ అని పోస్టు చేస్తునాను.

కొత్త పాళీ said...

దీనంతటికీ వెనకాల ఇంకో భాగోతం ఉంది. ఇలా కార్డులతో లావా దేవీలు ఒక నెట్వర్కు మీద జరుగుతాయి. ATM లు కూడా ఈ నెట్వర్కు మీద ఆధారపడే పని చేస్తాయి. ఫోనుల నెట్వర్కుల మీద ఫోను కంపెనీలకి అధికారం ఉన్నట్లే, ఈ నెట్వర్కుల మీద కొన్ని సంస్థలకి అధికారం ఉంది. వాటిల్లో వీసా, మాస్టర్ కార్డు అనే సంస్థలు ముఖ్యమైనవి. తమ నెట్వర్కుల మీద లావాదేవీలు జరిపినందుకు గాను ఈ నెట్వర్కులనేలే సంస్థలు ప్రతి చెల్లింపుకీ కొంత కమిషను వసూలు చేస్తారు. దుకాణదారో, కొనుగోలుదారో ఇది కట్టాలి. చాలా మంది దుకాణదార్లు తామే చెల్లిస్తారు, రెండు కారణాల వల్ల. ఒకటి కరెన్సీ తో లావాదేవీ నడపడంలో వాళ్ళకి కొంత ఖర్చుతో సహా చాలా తలకాయ నెప్పులు ఉంటాయి. కార్డు లావాదేవీలతో వీటన్నిటినించీ తప్పించుకోవచ్చు. రెండోది, బయటికొచ్చినప్పుడు తగినంత డబ్బు జేబులో (పర్సులో) వేసుకు రావడం మరిచిపోయినా కొనుగోలు దారు తమ దుకాణంలో కొనుగోలు చెయ్యవచ్చు .. ఇలా వ్యాపారం పెరుగుతుంది.
నెట్వర్కుకిచ్చే కమిషను శాతం పద్ధతి కాబట్టి అది కాదు సమస్య. ఒక చెల్లింపుని ప్రాసెస్ చేసేందుకు ఆ దుకాణానికి కొంత ఖర్చవుతుంది.
300 రూకి దిగువన కార్డు తీసుకుంటే వాళ్ళకి పోయేదేమీ లేదు, ముఖ్యంగా పెద్ద సంస్థలకి. కానీ వాళ్ళు లాభనష్టాలు బేరీజు వేసుకున్నప్పుడు 300 రూ కి తక్కువ కార్డు లావాదేవీల్ని ప్రాసెస్ చెయ్యడానికయ్యే ఖర్చు వాళ్ళ లాభాన్ని మింగేస్తోంది.