Pages

06/09/2008

ఈద్గా - మున్షీ ప్రేంచంద్

ఇది మున్షీ ప్రేంచంద్ రచించిన చిన్ని కధ. హమీద్ అనే నాలుగేళ్ళ బీద పిల్ల వాడు - తన అమ్మమ్మ తో కలిసి ఉంటూ ఉంటాడు. 30 రోజుల పవిత్ర రోజా పాటించిన తరవాత తరవాత ఈద్ పర్వదినం వచ్చింది. వీధి లో అందరు పిల్లలూ బొమ్మలూ, మిఠాయిలూ కొనుక్కుంటున్నారు. పెద్దలు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు. ఇంట్లో చిన్న చితకా వస్తువులూ కొనుక్కుంటున్నారు. చంకీలు ఉన్న తమ టోపీల చిరుగులు కుట్టుకుంటున్నారు. పండగ కాబట్టి చిన్న పిల్లలందరికీ వారి పెద్దలు ఈదీ (బహుమానంగా కొంచెం డబ్బు) ఇచ్చేరు. ఆ డబ్బుతో పిల్లలంతా బజారులో / ఈద్ సంత లో ఎంజాయ్ చేస్తున్నారు. హమీద్ అమ్మమ్మ కడు బీదది, నిస్సహాయురాలైన వృద్ధురాలు! ఆవిడ పాపం హమీద్ కు 3 నయా పైసలు మాత్రం ఇవ్వ గలుగుతుంది.



ఈద్ కోసం నిజానికి ఈ పిల్లల బేచ్ లో చాలా రోజుల నుండీ ప్లానింగ్ నడుస్తూ ఉంది. వీళ్ళంతా ఈదీ తో ఫలానా బొమ్మలు కొనుక్కుంటామనీ, ఇంకేదో చిరుతిండి కొనుక్కుంటామనీ కలలు కంటున్నారు. హమీద్ కు ఇవన్నీ కొనుక్కునే స్థోమత లేదు. మిగతా పిల్లల ముందు చిన్నబుచ్చుకుంటాడని అమ్మమ్మ ఎలానో మూడు పైసలు ఇచ్చింది.


వీటితో ఏమి కొనుక్కోగలడు ? ఏదీ మూడు పైసలకు రాదు. మిగతా పిల్లలు కొనుక్కున్న రక రకాల బొమ్మలు చూస్తూ, నిరుత్సాహ పడుతూ సంత లో ప్రతీ ఆట వస్తువ విలువా అడుగుతూ తిరుగుతూ ఉంటాడు హమీద్. ఉన్నట్టుండి వాడికి చిమ్మ్ టా (పట్టకారు / Tong ) అమ్మేవాడు కనపడ్డాడు. వెంటనే హమీద్ కు అమ్మమ్మ గుర్తొచ్చింది. హమీద్ కు ఈ ప్రపంచంలో ఉన్నదల్లా ఆ ముసలి అమ్మమ్మే. ఆవిడ వంట చేసే టప్పుడు / రోటీలు చేసేటప్పుడూ, చేతితోనే రొట్టెలు పట్టుకు కాలుస్తూ ఉంటుంది. ఆవిడకు రొట్టెను పట్టుకునే ఆ పట్టకారు లాంటి చింటా లేదు మరి.


వెంటనే బేరం జరుగుతుంది. మూడు నయాపైసలకు చింటా ఇవ్వనంటాడు దుకాణదారు. అయితే, అంతకన్నా ఎక్కువ డబ్బు హమీద్ దగ్గర లేదు. నిరుత్సాహ పడి వెనుతిరిగి పోతున్న పిల్లవాడిని పిలిచి, ఎలాగో ఆ మూడు పైసలకే చింటా ఇచ్చేస్తాడు దుకాణదారు !

సంత నుండీ తిరిగి వస్తున్న హమీద్ ను మిగిలిన స్నేహితులు ఆటపట్టిస్తారు. బొమ్మలు కొనుక్కోమని డబ్బు ఇస్తే, చింటా కొంటావా అని ఏడిపిస్తారు. ఆ నాలుగేళ్ళ బుడ్డోడు మాత్రం ఈ వేళాకోళాలకు అదరడు - బెదరడు. పైగా తన చింటా అందరికన్నా గొప్ప ఆటవస్తువ అని, భుజం మీద పెట్టుకుంటే, గద అవుతుందనీ, విల్లు లా సంధిస్తే, విల్లు అవుతుందనీ.. ఇలా ఎలా కావాలంటే అలా దానితో ఆడుకోవచ్చని వాదిస్తాడు.


పిల్లలు - అమాయకులు. మొదట కాసేపు హమీద్ మాటలు నమ్మక పోయినా, కొంత సేపటికి తమ తమ బొమ్మలతో ఆడి, బోరు కొట్టి, వాళ్ళకి హమీద్ దగ్గరున్న చింటా ఆకర్షణీయంగా కనపడుతుంది. ఒక్కొక్కరూ.. 'ఒరే, నీకు నా బొమ్మ ఇస్తాను - కాసేపు నీ చింటా నాకివ్వరా..!' అని అడుగుతూ.. ఎక్స్చేంజ్ చేసుకుని చింటాతో ఆడుకుంటారు. మొదట టాం సాయర్ చచ్చిన ఎలకని ఇవ్వడానికి బెట్టు చేసినట్టు కాసేపు బెట్టు చేసినా... చింటా ఇచ్చి, తను ముచ్చట పడిన స్నేహితుల బొమ్మలతో తనూ కాసేపు ఆడుకుని తన సరదా తీర్చుకుంటాడు హమీద్.


ఇలా... సాయంత్రం ఇల్లు చేరేసరికీ, హమీద్ తన స్నేహితులందరి బొమ్మలతోనూ ఆడేసుకునుంటాడు. సరదాగా.. ఉల్లాసంగా ఇంటి సావిట్లోకి అడుగుపెట్టీసరికీ, తన కోసం ఆందోళన తో ఎదురుచూసిన అమ్మమ్మ..'ఇంత ఆలస్యమైందేమిరా.. ఈదీ తో కొన్న బొమ్మ ఏదీ ?' అని అరుస్తుంది. ఆవిడకి చింటా చూపిస్తే.. మొదట కోపగించుకుంటుంది. 'నీకు బొమ్మ కొనుక్కోమని డబ్బులిస్తే, ఇలంటి వస్తువ కొన్నావేమి రా?' అని విరుచుకుపడుతుంది. ఆవిడకి పాపం తల్లీ తండ్రీ లేని తన మనవడంటే, చాలా ముద్దు. ఎన్నడూ వాడి సరదాలు తీర్చగలిగే శక్తి ఆమెకు లేకపోయింది. ఈ ఈద్ కి ఎలా అయినా వాడికి ఏదో ఒకటి కొనిపెట్టాలని ఆమె తాపత్రయం.


వెంటనే.. 'నీకు చింటా లేదు కదా అమ్మమ్మా.. రొట్టెలు చేస్తున్నప్పుడు నీ చేతులు కాలడం నాకు తెలుసు. అందుకే ఈ చింటా నీ కోసం తీసుకొచ్చాను !' అని హమీద్ అనగానే, తన పట్ల మనవడికున్న ప్రేమకూ, అభిమానానికి నోట మాట రాక మ్రాన్ పడిపోయి, కొంత సేపటికి కన్నీళ్ళపర్యంతం అవుతుంది ఆ అమ్మమ్మ !



కధ నాకు గుర్తున్న మటుకూ స్థూలంగా ఇది. ఈ కధ నాకు మామూలుగా తెలియక పోను. నాకు హిందీ సాహిత్యం తో (లోగ్ లుగాయీ తరహా..) తో పరిచయం అంతంత మాత్రం. అయితే ఈ కధ ను ఎన్నో సంవత్సరాలు స్కూల్ టీచర్ గా పని చేసి రిటైర్ అయిన ఒక స్నేహితురాలు చెప్పారు. ఇది ఎప్పుడో 5 ఏళ్ళ క్రితం సంగతి. ఆవిడ, స్వతహాగా టీచర్ మరియూ మంచి పాఠకురాలు గాబట్టి ఈ కధను చిన్న పిల్లలకు చెప్పినట్టు, రసరమ్యంగా చెప్పారు.



మున్షీ ప్రేంచంద్ రచించిన ఈ కధ (ఈద్ వస్తున్నది గాబట్టి గుర్తొచ్చింది. తప్పులు / మరచిపోవడాలూ ఉండొచ్చు ! కానీ హృద్యమైన ఈ కధని అందరితో పంచుకుందామని చెప్పానిక్కడ) ఎన్నో సంవత్సరాలుగా ఉపవాచకంగా స్కూలు పిల్లల కు చెప్పబడుతూంది. అసలు మంచి కధలు కావాలంటే, పిల్లల ఉపవాచకాలు వెదకడం మంచిది.

13 comments:

సుజాత వేల్పూరి said...

ఈ కథ చదివిన గుర్తో, విన్న గుర్తో ఉందండీ నాకు కూడా! బాగుంది కథ! మీరు కూడా అచ్చు చిన్న పిల్లలకు చెప్పినట్టే పెద్ద పెద్ద మాటలు వాడకుండా సింపుల్ గా భలే చెప్పారు!

ఇలాంటి కథలను ఇదివరలో ఒక పబ్లిషరు హిందీ కథా భారతి పేరుతో వేసారని విన్నాను. నా దగ్గర ఒక పార్టు ఉంది. అందులో కథల ఒరిజినల్ రచయితల పేర్లు లేవు.

అన్నట్టు టెంప్లేట్ మళ్ళీ మార్చారేం? చాలా సింపుల్ గా ఉంది.

Anonymous said...

నా పేరు కుడా హామిద్,

మీ కధ చాలా బాగుంది ,నేను ఈ కధ విన లేదు కాని,
కధలొ ని సంఘటనలు నా జీవతం లో ను జరిగాయి.

Sujata M said...

hi hameed.

Roja Mubarak aapko.

Sujata M said...

Sujata garu

Thanks...


sujata garu.. Templet vishyam loa vaaaaaaaaa.... ! ghoram jarigipoayindi. Yesterday night, I was just meddling with my Templete. Suddenly net got disconnected, after smtime, lost power.. I thought I lost my blog. fortunately, I could save it and changed its templete to a simple one. kasepaTiki, maLLaa karenT poayindi.

inkeppuDoo TempleT joaliki poakooDadani, lempaleasukunnaa!

Purnima said...

Havels (Wires that don't catch fire) ఆడ్ గుర్తువస్తుంది నాకు. ఓ చిన్న పిల్లాడు దీపం వెలుతురులో చదువుకుంటుంటే, అతని అమ్మ రొట్టెలు చేస్తూ చేతులు కాల్చుకుంటుంది. అది గమనించిన చిన్నవాడు పరిగెత్తి కెళ్ళి ఓ వైర్ ని పట్టకారులా వంచి ఆమెకి ఇస్తాడు. అప్పుడు ఆవిడ కొడుకు వైపు చూసే చూపు, full of admiration. Awesome thought అనిపించింది.

ఇప్పుడీ కథ చదివాక, ఆ ఆడ్ కి ప్రేరణ ఇది అయ్యి ఉండవచ్చు ఏమో అనుకుంటున్నాను. మంచి కథను పంచుకున్నందుకు ధన్యవాదాలు!

ఓ ఉచిత సలహా చెప్తునా? టెంప్లేట్ మార్చే ప్రయత్నం పెట్టుకునేటప్పుడు, ఉన్న టెంప్లేట్ html కోడ్ మొత్తం ఒక చోట కాపీ చేసుకుని పెట్టుకుంటే బెటర్. మన ప్రయోగాలు విఫలించినా పాత దాన్ని మళ్ళీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు తెలీదని కాదు, నాకు చెప్పాలనిపించి. ;-)

Sujata M said...

పూర్ణిమా.. థాంక్స్. ఈ ఏడ్ నేను చూడలేదు. మీరు వీడియో లింక్ ఇస్తే (ఉంటే) చాలా ఆనందిస్తాను.

టెంప్లెట్ సంగతి నాకు తెలియదు. ప్రతీ సారీ జ్యోతి గారి వెంటపడి నా బ్లాగ్ కి ఫేస్ లిఫ్ట్ చేయించుకుంటూ ఉంటాను. ఈ సారి నేనే చేద్దామని రంగంలోకి దూకి, భంగపడ్డాను. దానికి తోడు, బీ ఎస్ ఎన్ ఎల్ కనెక్షన్ తెగిపోతుండటమూ, కరంట్ పోవడం లాంటి ఎక్స్ట్రా ఎఫెక్టులన్నీ తోడయ్యి, బుద్ధొచ్చింది.

అమ్మలూ.. కంప్యూటరు చదువుకున్నదానివి. నాకు కొంచెం ఇలాంటి టిప్స్ చెప్పి పుణ్యం కట్టుకోమ్మా. థాంక్స్.

బుజ్జి said...

'నా చిమటా మామూలు ఆటబొమ్మ కాదు, నా చిమట జాతీయ వీరుడు...' అంటాడు ఒక దగ్గిర.. అది భలే గుర్తుండిపోయింది నాకు..

Purnima said...

ఇంద, ఆడ్ లంకె:

http://video.google.com/videoplay?docid=-5016652019240432545

హావెల్ ఆడ్స్ పై ఒక బిజినెస్స్ వ్యాసం:
http://www.thehindubusinessline.com/catalyst/2008/07/03/stories/2008070350160400.htm

మీ వల్లే దొరికిందీ వ్యాసం, అందుకు మీకు ధన్యవాదాలు!

అన్నట్టు.. మీకు ఇష్టమైన ఆడ్స్ తెలుసుకోవాలని ఉంది. చెప్పరూ.. :-)

టెంప్లేట్లతో నా తిప్పలు అన్నీ ఇన్నీ కావు! అందుకే ఎలా చెయ్యాలి కన్నా, ఎలా చెయ్యకూడదో బాగా చెప్పగలను. ;-)

Sujata M said...

Purnima..

Thanks a lot for sharing that with me. I liked the simplicity of the Ad.

My fav ad is (current) : MP Tourism Ad.. saying hindustan ka dil dekho.

Sujata M said...

Purnima

link idi : http://in.youtube.com/watch?v=A1TI-Es7HWI

dingu said...

Thanks for sharing this story, while reading unknowingly my eyes became wet. For my son I have bought a battary operated bike recently I feel so happy when he drives that, because when iwas a kid my friend had a car, he never gave me to drive because it is very costly, my father doesn't have that much money to buy one for me. Yes indeed still now many doesn't have money to fulfill their children dreem toys. Any in somalia many mothers doesn't have milk to feed their children as they donot have food to eat. I really wonder all rich people in the world keeps 10% of their monthly income can feed all hunger in the world. May god give them this thought

Thirmal Reddy said...

20 years venakki vellanu. school gurthochindi. IDGAH story maa hindi teacher chepparu. Munshi Premchand ane peru naa gundello mudrapadipoindi. Edo patha pusthakam kalla mundu kanipinchina feeling.
thanks Sujatha

Thirmal Reddy

Unknown said...

సుజతా గారు నమస్తే నాకు ఈద్గా తెలుగు అనువాదం "మసీదు"కావలండి కొంచెం చెప్తార లింక్ పేరు