Pages

02/09/2008

ఉండ్రాళ్ళు / & / కుడుములు చెయ్యడం ఎలా ?!

హైదరాబాద్ లో వినాయక చవితి పందిళ్ళూ, పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ పేరిస్ విగ్రహాలూ,పందిళ్ళ నిండా పిల్లలూ, సినిమా పాటలూ, రంజాన్ ప్రార్ధనలూ, రోజా, హలీం దుకాణాలూ.. ఊరంతా పండగ వాతావరణం వుంది.

అన్ని వస్తువుల ధరలూ అదిరిపోతున్నాయి. హుస్సేన్ సాగర్ లో మునగలేక, మునగలేక మునిగే వినాయకుళ్ళను తలచుకుంటే బాధ కలుగుతుంది. బుజ్జి బంగారు గణపతి ని ఆ చెత్త హుస్సేన్ సాగర్ లో ముంచీ, దేవుణ్ణీ ; కృత్రిమ రంగులూ, రసాయనాలూ, వ్యర్ధాలూ కలిపి చేసిన విగ్రహాల్ని ముంచి హుస్సేన్ సాగర్ నూ ; ఇబ్బంది పెట్టేసే అతి పెద్ద పండగ మొదలయింది.

ఇన్ని సంబరాల మధ్య ఒక ఎత్తుకొచ్చిన టపా (link only) రాసేందుకు సాహసిస్తున్నాను. నిజానికి -రేపటికి సిద్ధంగా ఉంచుకున్న నా కిచెన్ నోట్స్ ఇది. 'ఉండ్రాళ్ళు / & / కుడుములు చెయ్యడం ఎలా ? ' - ఈ ఐడియా తట్టగానే, మా ఊరమ్మాయి శైలజ రాసే శైలూస్ కిచెన్ అనే ఫుడ్ బ్లాగ్ లో ఈ రెసిపీ దొరకబుచ్చుకుని, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

Note : [మా శైలూస్ కిచెన్ నాకు చాలా నచ్చుతుంది. ఆంధ్రా వంటలూ, ముఖ్యంగా మా విశాఖ వంటలూ శుభ్రంగా దొరుకుతాయి] ఇది నా బ్లాగ్ లో అతికించడానికి కారణం, ఇది నాకు విపరీతంగా నచ్చడమే. నాకు నచ్చిందల్లా నా బ్లాగ్ లో పెట్టీసి, కుంచెం ఇంగ్లీష్ లో పొగడడం నాకు అలవాటు. దీని వల్ల ప్రమాదం ఏమైనా ఉందేమో నాకు తెలియదు.


ఉండ్రాళ్ళ గొడవ పక్కన పెడితే, నా వైపునుంచీ ఒక నాగరికమైన ఉచిత సలహా ఏమిటంటే, చిన్న, మట్టితో చేసిన విగ్రహాన్ని కొని (రంగులు పూయనివి) పూజ చేసుకోండి. కొంచెం పర్యావరణం గురించి ఆలోచించండి. నా బ్లాగ్ చదివే వాళ్ళకు వినాయక చవితి మరియు రోజా శుభాకాంక్షలు. అందరూ, శ్రద్దాసక్తుల తో, భగవంతుని మీద ప్రేమతో, సమాజం పట్ల కొంచెం బాధ్యత తో ఈ పండగలను సెలెబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తున్నా !

3 comments:

Rajendra Devarapalli said...

మా విశాఖ వంటలూ.......
వామ్మో మా అవిడ ఇది చదవలేదు కదా??!!! :(

Purnima said...

మీకూన్నూ వినాయక చవితి శుభాకాంక్షలు.

శీర్షిక చూడగానే అమ్మని అడిగి చెబుదామనుకున్నా ఆ వంటకాలు ఎలా చేస్తారూ అని. మీరే పెట్టేశారు. అయినా అమ్మ రెసిపీ చెప్తాలే! ;-)

పూర్ణిమ

విహారి(KBL) said...

మీకు వినాయక చవితి శుభాకాంక్షలు