నిన్నే జీ టీవీ లో అమీర్ ఖాన్ మళ్ళీ మళ్ళీ వచ్చి చెప్పాడని 'పీప్లీ లైవ్ ' చూసాను. నచ్చింది. పీ.సాయినాధ్ ద హిందూ లో దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల గురించి రాస్తున్నప్పుడు - ఆసక్తి గా (విరక్తి గా కూడా) ఫాలో అయిన ప్రాణం నాది. ఒక సమయంలో వెల్లువెత్తిన రైతు ఆత్మహత్యల బాక్ గ్రౌండ్ లో నథ్థా అనే ఒక పేద రైతు, కాంపెన్సేషన్ కోసం ఆత్మహత్య చేసుకుందామని నిశ్ఛయించుకుంటాడు. ఆ తరవాత, ఓ వైపు ఎన్నికలు ముంచుకు రావడంతో సమీకరణాల పోటీల్లో, టీ ఆర్ పీ ల వేట లో మీడియా, రాజకీయ నాయకులూ వెంటబడటం, ఆ రైతు కుటుంబం పడిన పడరాని పాట్లూ - నవ్వు తెప్పిస్తాయి. కరిస్తే కప్పకు కోపం, విడిస్తే .. అన్నట్టయిపోతుంది. బర్ఖా దత్ (రాడియా ఉదంతంలో ఖంగు తిన్నది) లాంటి ఒక పాత్ర, అందులో ఒదిగిపోయిన నటి మొహంలో 'తప్పంతా నీదే!' అనే ఎక్స్ప్రెషనూ - ముఖ్యంగా నచ్చాయి.
మొత్తానికి ఆత్మహత్య చేసుకుంటాడని ఆ రైతు గురించి పొగ గుప్పుమనడంతో గ్రామం లో జాతర మొదలవుతుంది. సరిగ్గా ఈ పాయింటు దగ్గర మార్క్ టుల్లీ రాసిన 'నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా !' గుర్తొచ్చింది. ఇందులో 1987 లో దేశాన్ని ఒక కుదుపు కుదిపిన రూప్ కన్వర్ సతీ ఉదంతం గురించి టుల్లీ సవివరంగా చెప్పాడు. విలేఖరి కున్న విశాలమైన దృక్కోణంతో ప్రత్యక్షంగా చూసి, చదివి, వినీ, అనుభూతించి సవివరం గా రాసిన ఒక చాప్టర్ ఈ సతి.
రూప్ కన్వర్ సతీ సహగమనం జరిగినప్పుడు అత్తింటి వాళ్ళు, రూప్ కన్వర్ తనంతట తానే స్వచ్చందంగా తన భర్త పార్ధివ శరీరంతో సహా తగలబడి చనిపోయిందని, ఇది గ్రామస్థులందరి సమక్షం లోనూ, తేట తెల్లంగా జరిగిన విషయం అనీ, ఘంటాపధంగా చెప్తారు.
రూప్ కన్వర్ సతి సంగతి, కన్న వారికి చెప్పనే లేదు. గ్రామం అంతా కూడబలుక్కుని ఒక 18 ఏళ్ళ అందమయిన రాజపుత్ మహిళ ని, సతి అనే దురాచారానికి బలి చేసారని కన్న వారి ఆరోపణ.
సతి జరిగిన కొన్ని రోజుల తరవాత, సతీ రూప్ కన్వర్ సజీవంగా తగలబడిపోయిన ప్రదేశంలో ఒక గుడి లాగా తయారవుతుంది. ఇప్పుడు మన ప్రాంతాల్లో వివిధ స్త్రీ ల పేర జరిగే జాతర లాగా - అక్కడ పెద్ద యెత్తున జాతర, వ్యాపారం మొదలవుతాయి.
గ్రామస్థులంతా ఈ వ్యాపారాభివృద్ధికి సంతోషించాలా, పోలీసుల, విలేఖరుల ప్రశ్నా శరాఘాతాలనించీ కాసుకోవాలా అన్న మీమాంశలో పడినట్టు కనిపిస్తారు.
రచయిత థీరీ ప్రకారం, రాజపుత్ కులస్తులు, సతీ జరగడంతో తమ ప్రతాపాల కీ, ఆచారాలకీ ఆదరణ దొరికిందని గర్విస్తారు. మార్వారీలు, వ్యాపారం పెరిగిందని ఆనందిస్తారు. ఇలా గ్రామంలో ఒక్కో కులానిదీ ఒక్కో బాధ !
పీప్లీ లో ఆఖర్న నథ్థా, గ్రామం వొదిలి పారిపోయి, డిల్లీ లో భవన నిర్మాణ కూలీ గా తేల్తాడు. అతని తోటి వాళ్ళందరూ, గ్రామాలు వొదిలి వలస వచ్చిన వ్యవసాయ కూలీలే. రైతులే ! వ్యవసాయం లో ఒడిదుడుకులని ఎదుర్కోలేక, విధాన పరమైన చిక్కుల్ని ఓర్చుకోలేక, డబ్బులేక, ఎందరో రైతులు వ్యవసాయాన్ని ఒక ఉపాధి మార్గంగా ఎంచుకోలేకపోతున్నారు. వ్యవసాయాన్ని మనం ఎంత నీర్సంగా తీసుకుంటున్నామో చూడండి.
రూప్ కన్వర్ సతీ లో కూడా వీధి మొగలో ఐస్ క్రీం బండీ వాడి దగ్గర్నించీ, రాజీవ్ గాంధీ దాకా, దీని వల్ల మనకేంటి ప్రయోజనం - మనకేంటి భంగం - అని ఆలోచిస్తారు తప్ప - చివరాఖరికి రూప్ కన్వర్ సంగతి / ఆవిడకి జరగాల్సిన న్యాయం సంగతి కూడా ఎవరికీ పట్టదు.
రూప్ కన్వర్ ని బలవంతంగా చంపేశారా / బ్రెయిన్ వాష్ చేసారా / ఆవిడ మానసిక స్థితి బాలేదా - ఎందుకలా చనిపోయింది ? గ్రామం మొత్తం కలిసి నేరస్థులా ? ఇలాంటి ప్రశ్నల కి సమాధానం ఎప్పటికీ దొరకదు.
రూప్ కన్వర్ శీలం మీద పనిలో పని గా కధలు వినిపిస్తాయి. పోలీసులు - చంపేశారనే అంటారు. కానీ, ఈ నేరం మీద అత్తవారిని అరెస్టు చేస్తే, గ్రామంలో ఆ మారణ కాండని చూసిన వారు, ప్రోత్సహించిన వారు, మూఢ నమ్మకం ముసుగులో గ్రామానికి రాబోయే పాప్యులారిటీ ని కేష్ చేసుకోదలచుకున్నవారూ - అందర్నీ అరెస్టు చెయ్యాలి.
రాజస్థాన్ ప్రభుత్వానీ, డిల్లీ గద్దెనూ, రూప్ కన్వర్, చచ్చి చాలా సాధిస్తుంది. కానీ అన్యాయమయిపోతుంది.
నథ్థా కూడా అంతే ! అతని కుటుంబానికి నథ్థా మిగలడు. ప్రభుత్వం నుంచీ రావలసిన సహాయమూ అందదు. మీడియా జాతరంతా, ఇంకో బ్రేకింగ్ న్యూస్ వెంబడి పరుగు తీసి పీప్లె ని ఖాళీ చేసేస్తుంది. ఎలక్షన్లు ముగియడంతో, పీప్లీ నుండీ నాయకులూ, పోలీసులూ కనుమరుగవుతారు. ఇంత కాలమూ ఈ సర్కస్ ని అంతా చూసిన గ్రామం, గ్రామస్థులూ, మళ్ళీ తమ తమ జీవితాల్లో నిశ్శబ్దంగా మునిగిపోతారు.
అయితే, ఇలాంటి సినిమాలూ, వ్యాసాలూ, పట్నాల్లో సుఖంగా పరుగులు తీస్తున్న మామూలు మధ్యతరగతి భారతీయుల్ని, ఒక సారలా తట్టి ఊరుకుంటాయి. రాజస్థాన్ లో ఇప్పటికీ బాల్య వివాహాలూ జరుగుతున్నాయి. ఇప్పటికీ సతీ సహగమనాలు జరుగుతున్నాయి (ట!) కానీ వాటిని గ్లోరిఫై చెయ్యడం - రాజకీయ కారణాల దృష్ట్యా తగ్గింది. టెలివిజన్ లో మాత్రం - సాంప్రదాయ కుటుంబాల్లో, సాంప్రదాయాలూ, ఆచారాలూ పాటించే, (నార్థ్ ఇండియన్) స్త్రీ ల దుఃఖ భరిత జీవితాన్ని గ్లోరిఫై చేస్తూనే ఉన్నారనుకోండి.
ఇంకా రైతులూ, చేనేతాజీలూ, వెధవది - టామిళ్ నాడ్ లో తిరుపూర్ గామెంట్స్ లో పంచేసే టెక్స్టైల్ కార్మికులూ - అందరూ - ఇలా ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఆత్మహత్య చాలా సంధర్భాల్లో - ఒక ఆక్రందన ! 'నాకు హెల్ప్ కావాలీ' అని - వ్యక్తి అరిచే ఒక అరుపు ! దాన్ని ఎవరు స్వీకరిస్తున్నారు ? కొందరు రా.నా.లు 'వొళ్ళు బలిసి ఆత్మహత్యలు చేసుకుంటున్నార్రా ఈ రైతులు ! ' అని కోప్పడేస్తారు.
సరేలే ! అదంతా మనకెందుకు గానీ.. చెప్పొచ్చేదేంటంటే - మార్క్ టుల్లీ రాసిన -'No Full Stops in India చదవండి. ఇండియా గురించి మనకేటి తెల్సంటారు ? ఒక పాలి చదివితే తెలిసొస్తాది.
కాపోతే కుంజెం ఓల్ద్ హిస్టరీ. అంటరాని వర్గానికి చెందిన తన నౌఖరు ఊర్లో జరిగిన పెళ్ళి దగ్గర్నించీ, కుంభ్ మేళా, అతి పెద్ద మొదటి టెలీ సోప్ - రామాయణం, స్వర్ణ దేవాలయం, సతీ సహగమనం.. ఇలా దేశాన్ని ప్రభావితం చేసే ఉదంతాల - ఇంకో కోణాల్ని చర్చించారిందులో.
ఫాస్ట్ బీట్ జర్నలిజం ఉండదిందులో ! మనకి నచ్చేవీ, మనం వినాలనుకునేవీ కాకుండా, మనకి తెలియనివీ, మనం ఊహించనివీ, (అన్నీ తెల్సినవే), మన దేశంలో పాతుకుపోయిన బ్యూరాక్రసీ, నిష్కృయాప్రియత్వాన్నీ, ప్రజల పాట్లనీ హాస్యస్ఫోరకంగానూ, వ్యంగ్యంగానూ, కావాల్సిన చోట్ల, సీరియస్ గానూ చెప్తాడు మార్క్ టుల్లీ. మన దేశం గురించి ఒక బీ.బీ.సీ. వోడు ఎంత బయాస్డ్ గా చెప్తాడో అనుకునే వాళ్ళకి ఆశ్చర్యం కలిగి తీరుతుంది - ఆ నిజాయీతీకి, భారత దేశం మీద ఆయనకున్న ప్రేమకీ !
06/12/2010
20/11/2010
The Financial Expert
''ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్'' - ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం చదివాను. ఆర్.కే. నారాయణ్ - నా అభిమాన రచయిత, మాల్గుడీ నేనెంతో ఇష్టపడే ఊరు. ఈ ఊర్లోనే ఈ ఫీనాన్షియల్ ఎక్స్పర్ట్ ఉండేది. పేరు మార్గయ్య.
ఒక బాంకు బయట రిజిస్టర్ పట్టుకుని కూర్చుని, అప్పులిస్తూ, డబ్బు సంపాదన మీద తోచిన సలహాలూ అమ్ముతూ జీవితాన్ని ఎలానో నరుక్కొస్తుండే వాడు. కానీ అతనిలో ఒక 'ఇది' ఉంది. అది డబ్బు సంపాయించి పెద్ద వాడవ్వాలనే 'కసి'. కానీ దారిద్ర్యం అతన్ని వెంబడిస్తూ ఉంటుంది. ఆఖరికి కొన్నాళ్ళకి కర్మ వశాన, శని దృష్టి వక్రీకరించి, 'మా బేంకు ముందు కూర్చుని మా (అప్పులిచ్చే) బిజినెస్సుకి అడ్డం పడుతున్నావంటూ' బేంకీ వాళ్ళు దెబ్బలాటకొస్తారు. బెంకు దగ్గర చెట్టు కింద తన పేషీ కోల్పోయాక, ఆదాయం కోసం పడరాని పాట్లు పడతాడు. అతనికి డబ్బు విషయంలో తన ప్రావీణ్యాన్ని అమ్ముకోవడం తప్ప ఇంకో విద్య తెలియదు. అప్పు తీర్చవలసిన వాళ్ళు ఇంకా ఉండనే ఉన్నారు ! (డబ్బు సర్క్యులేషన్ లో వుంది) వడ్డీలు (చక్ర వడ్డీ) ఇంకా కొందరు కట్టనే లేదు. చేతిలో చిల్లి గవ్వ ఉండని పరిస్థితి. దానికి తోడు మార్గయ్య కొడుకు కేవలం పెంకితనానికి అతని రిజిస్టర్ని చింపి దాన్ని కాలువలో పడేస్తాడు. అందులో చిట్టా పద్దులన్నీ - మార్గయ్య అప్పిచ్చిన వాళ్ళ వివరాలు వగైరా ఒక్కసారి పోతాయి. అవన్నీ ట్రేస్ లేకుండా కొడుకు ఇలా భగ్న పరచడంతో అతని వెన్ను విరిగినట్టు అవుతుంది. ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో, అతనికి ఏదో ఒక ఆదాయ మార్గం కావాలి. కొడుకుని నాలుగు వాయంచినా, వాడంటే ప్రాణం మార్గయ్యకి. భార్యా బిడ్డల్ని ఎలానో ఒక లా పోషించుకోవాలి. ఏ ప్రయత్నమూ ఫలించక.. భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకోవడం ఎలా అని భయపడిపోతాడు మార్గయ్య ! ఈ పరిస్థితులే అతన్ని దేవుడి వైపు మొగ్గేలా చేస్తాయి. ఇలాంటి ఖర్మ కాలి, జీవితం మీద ఆశ పూర్తిగా కోల్పోయిన రోజుల్లో ఎవరో చెప్పారని లక్ష్మీ పూజ చేస్తాడు మార్గయ్య. [డబ్బు అనే విజన్ ఉన్న వాడు కాబట్టి లక్ష్మీ దేవి కటాక్షం కోసం వెంపర్లాడతాడు]
ఈ పూజకి ఏమేమి వస్తువులు కావాలో అవి ఖచ్చితంగా - తూ, చా, తప్పకుండా, ఆవు పాలు, బురద కుంట లోని కమలం - ఘృతం - ఇంకేవో - అలా. ఇలా పూజ సామాగ్రి సేకరించడం అతనికి రివాజుగా మారుతుంది. అలానే ఒక రోజు అడవిలో ఏదో (పూజకే) తెచ్చుకోవడానికి వెళ్తాడు. అక్కడ ఇంకోడు డాక్టరును అంటూ ఒక 'పాల్' (డా. పాల్) కలుస్తాడు. అలా మాటా మంతీ కలిసి ఇద్దరూ స్నేహితులవుతారు. డబ్బు కోసం అతని మాట విని బొమ్మలతో సహా 'సెన్సువల్ (sex)' సాహిత్యాన్ని ముద్రించడం మొదలు పెడతాడు. అది బంపర్ హిట్ అయి, వెంటనే అతని సక్సెస్ గ్రాఫ్ పైకి ఎగబాకుతుంది. ధనార్జన పెరుగుతుంది. అతను ఇంతకు ముందు ఏ బాంకు ల ముందు డబ్బా పెట్టుకుని కూర్చునే వాడో ఆ బాంకు ల కన్నా ఎక్కువ డబ్బు చేరుతుంది. స్వతహాగా మార్గయ్యది ఒక 'అహనా పెళ్ళంట లో కోట శ్రీనివాసరావు' లాంటి పిసినారి/greedy మనస్తత్వం. దానికి ఈ డబ్బు పైత్యం కూడా తోడవ్వడంతో సమాజంలో కొద్దో గొప్పో (బైటికి కనబడని) నిరసన కూడా ఎదురవుతుంది.
జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను అనుభవించిన మార్గయ్య మార్గయ్య చెట్టు కింద పద్దులు రాసుకునే సామాన్యుడిగా జీవితం ఆరంభించినపుడు అతని సర్వస్వమూ ఆ రిజిస్టరే ! ఇప్పుడు జీవితం కుదుటపడిందయ్యా అనుకునేసరికి, (డబ్బు కోసం గడ్డి కరిచినా - డబ్బున్న వాడు డబ్బున్న వాడే - వాడి జీవితం నిలదొక్కుకున్నట్టే!) కొడుకు (ఈ Sex literature, డబ్బు కారణంగా) చెడిపోయాడని, చెడు అలవాట్ల పాలయ్యాడనీ తెలుస్తుంది. కొన్నాళ్ళకి కొడుకు ఇల్లొదిలి పారిపోతాడు. ఎంతో కష్టపడి, అతని గురించి వాకబు చేసి ఇంటికి తీసుకొచ్చిన మార్గయ్య - అప్పటికీ కొడుకు మీద ఏవో ఆశలు పెట్టుకుంటాడు.
మొత్తానికి జీవితం చివరి అంకానికి వచ్చేసరికీ, బిజినెస్సు లో మోసం ఎదురయ్యి కొంతా (partner డబ్బంతా చేజిక్కించేసుకుంటాడు) , పరిస్థితులు కలిసి రాక కొంతా - నష్టాలు పలకరిస్తూ, చివరికి జోలె ఖాళీ అవుతుంది. మార్గయ్య బ్రతుకు ఎక్కడి నుంచి బయలు దేరిందో అక్కడికే చేరుతుంది. ఇంక చెయ్యడానికి ఏమీ లేక, కొడుకుని పద్దులు రాయడానికి, అలాంటిదే ఓ రిజిస్టరు ఇచ్చి చెట్టు కింద కూర్చోమంటే, చెడిపోయిన కొడుకు నిరాకరిస్తాడు.
ముసలి అయిపోయిన మార్గయ్య మళ్ళీ యధా ప్రకారం చెట్టు కింద బేంకు ముందర అదే బల్ల, అలాంటి రిజిస్టరే పట్టుకుని కూర్చుంటాడు. స్థూలంగా ఇదీ కధ. అయితే ఇందులో irony మార్గయ్య జీవితాంతం డబ్బు వెనకే పరుగు పెట్టినా, జీవితంలో మిగతా అంశాల మీద పెద్దగా దృష్టి పెట్టక, నిర్లక్షం చేసి, ఆఖరికి డబ్బు చేతే నిర్లక్షం చేయబడతాడు. డబ్బు కన్నా మానవ సంబంధాలు మెరుగైనవి అని తెలుసుకునే సరికీ పుణ్యకాలం వెళ్ళిపోతుంది. అదీ - ఈ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కధ ! ఎలక పందాల్లో గెలిచినా నువ్వు ఎలకవే అని అందరూ ఒప్పుకున్నా - ఎలక పందాల్లో పాల్గొనక మానరు. అదో విష్ణుమాయ !

14/11/2010
మామయ్య కు అభిమానంతో,
దాదాపు ఆరేడేళ్ళుగా కేన్సర్ తో తీవ్రంగా పోరాడి, ఈ రోజు మావయ్య మమ్మల్ని విడిచి, అమ్మవారి దగ్గరకు వెళ్ళిపోయాడు. జీవితంలో ఎన్నో విషాదాలను ధైర్యంగా ఎదుర్కొని, శాక్తేయంలో సర్వాన్నీ మరిచి, పులిలా బ్రతికి వెళ్ళిపోయిన మా పెద్ద మావయ్య, శ్రీ రామకృష్ణ గారికి ఎంతో అభిమానంతో నా ఈ అశృనివాళి. ఇంత కన్నా ఎక్కువ చెప్పడానికి దుఃఖం అడ్డొస్తూంది. కేన్సర్ కి సిగ్గుండాలి. డౌన్ డౌన్ కేన్సర్. జై హో మావయ్య !
పై ఫోటో లో మావయ్య, తన స్నేహితులు, నాద బ్రహ్మ శ్రీ నేదునూరి కృష్ణమూర్తి తో ! (ఈ ఫోటో నేనే తీసేను విశాఖపట్నంలో మావయ్య వాళ్ళింట్లో, సాగర్ నగర్.)
Subscribe to:
Posts (Atom)