Pages

24/11/2022

The Little Book of Encouragement- - His Holiness The Dalai Lama

The Little Book of Encouragement - His Holiness The Dalai Lama

Edited by Renuka Singh



రోనా రెండు మూడు దశల్లో ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టించడం మన స్మృతి పథాల్లోంచీ చెరిగిపోలేదు. చాలా మంది ఆత్మీయుల్ని, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, కోల్పోయాము.  ప్రార్ధనాలయాలకు తాళాలు పడ్డాయి. ఇంట్లో పెద్ద వాళ్ళ నుంచీ టీనేజ్ పిల్లలు కూడా వ్యాధి బారిన పడ్డారు. కొందరు మరణించారు. 

దీనిని, ప్రకృతి మనిషి అస్తవ్యస్త ప్రవర్తనల మీద కన్నెర్ర జేయడం అన్నారు. ప్రభుత్వాలు / కొన్ని కార్యాలయాలు, పోలీసులు, వైద్య వృత్తి లోని వారు, కిరాణా సామాన్ల వ్యాపారులు, కూరగాయల వాళ్ళు, ఆగిపోకుండా పని చేసారు. ఇప్పుడు కరోనా ఎప్పుడో జరిగిపోయిన విషయమే గానీ,   ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మీద అది కొట్టిన దెబ్బ చాలా గట్టిది. 

అయితే, ఇప్పటికీ, వ్యక్తిగతంగా, కరోనా దుష్ప్రభావాలు అనుభవిస్తున్నవారున్నారు.   మానసికంగా కరోనా కలిగించిన వ్యధ ఇంతా అంతా కాదు.  అది సమిష్టి వ్యధ కూడా. మనిషి సంఘజీవి కాబట్టి, ఎన్నో అనుమానాలు, ఒంటరితనం, తీవ్ర వ్యాధిని కూడా ఒంటరిగా ఎదుర్కోవాల్సి రావడం, ఎదటి వ్యక్తికి, హాని కలిగిస్తున్నానేమో అనే గిల్ట్ తో హాస్పత్రి కి వెళ్ళాల్సి రావడం, అహోరాత్రాలు ఎన్నో వాలంటీరు గ్రూపులు పని చేస్తూ, నిస్సహాయ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావడం, సకాలంలో వైద్యం అందక, లేదా అందినా సరే, తెలీని ఈ వ్యాధిని అదుపు చేయలేక,  ప్రాణాలు పోవడాన్ని ఎందరో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో చూడడం,  జరిగాయి. 

ఇది వ్యక్తిగతంగానూ, సాంఘికంగానూ మనుషులకు వచ్చిన తీవ్రమైన కష్టకాలం.  దీనికి నాలుగు ఓదార్పు మాటలు చెప్పి, తనను అనుసరించే వారికి మేలు చేసేందుకు దలైలామా కొంత ప్రయత్నం చేసారు. ఆయన సోషల్ మీడియా బైట్ ల సంకలనమే ఈ పుస్తకం.  ఇదో పెద్ద పుస్తకమని చెప్పలేం. దీని పేరు సరిగ్గ సూచించినట్టు post pandemic world కు, ఇది చిన్న ఊరటకూ, కాస్త అభినందనకూ, సాంత్వనకూ ఉపయోగపడేందుకే తీసుకొచ్చారు. అందుకే దీని పేరు The Little Book of Encouragement. 

దేశాలు, నాయకులు, శాస్త్రవేత్తలు ఈ కనిపించని, తెలీని జబ్బుతో పోరాటం చేస్తున్నపుడు, రోజువారీ మృతుల సంఖ్యల పట్టికలు తయారు చేస్తున్నప్పుడు, దలై లామా లాంటి మత గురువులు, సాంఘిక మాధ్యమాల ద్వారా - తమ అనుచరులకు ఎప్పటికప్పుడు  ధైర్య వచనాలు పలికారు. దలైలామా కు ఇప్పుడు ఎనభై ఏడేళ్ళు. 

అతను 1959 లో భారత దేశానికి శరణార్ధిగా పారిపోయి వచ్చి అరవై మూడేళ్ళు గడిచాయి గడిచాయి. అతని బుద్ధ మార్గం, నలందా శైలిది. అతని బోధిచిత్తం, భారతీయ తత్వ మూలాల మీదే నిర్మించబడినది. అందుకనే, ఈ వృద్ధుడు, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న టిబెటన్ బుద్ధులకు మాత్రమే నాయకుడిగా మిగిలిపోకుండా, వేదాంతాన్ననుసరించే ఎందరికో మార్గదర్శకుడయ్యాడు.   

ఈ స్వార్ధమయ ప్రపంచంలో మఠాధిపతులు సర్వసంగ పరిత్యాగులయినప్పటికీ, పీఠాధిపత్యం కోసం హత్యలు చేసుకుంటారు, పోట్లాడుకుంటారు.  ప్రసిద్ధి చెందిన మత గురువో / బాబా నో మరణిస్తే, అతని సామ్రాజ్యం నాశనం అవుతుంది.   అతని మరణానికి ముందే ఆస్తి పంపకాలు జరిగిపోతాయి.  ఎల్లకాలం ప్రముఖుడై ఉండిపోయేందుకు, రాజకీయ అండదండలు సంపాదించేదుకు పెద్ద ప్రభువులు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తు ఉంటారు.  అలాంటి వారి మధ్య  "దలై లామా"  చాలా విచిత్రమైన వ్యక్తి.  


బుద్ధులు పునర్జన్మలని నమ్ముతారు. Eg. దలై లామా మరణానంతరం, అతను ఎవరి లా మళ్ళీ పునఃజన్మిస్తారో కనుక్కుంటారు.  ఏ పల్లె లోనో పెరుగుతున్న చిన్ని బాలుడిని దలై లామా పునరావతారంగా గుర్తించి, తమ మఠానికి తెచ్చుకుని, అతన్ని ఆరాధనగా పెంచుకుని, విద్య నేర్పించి, గురువు గా స్వీకరిస్తారు.  ఈ మధ్య టిబెటన్ తాంత్రిక బౌద్ధానికి చెందిన లామా Rinpoche అవతారాన్ని కనుగొన్నారు. ఈ వార్త ను చూడండి. 

https://www.shambhala.com/snowlion_articles/dilgo-khyentse-rinpoche-reincarnation/ 


https://www.thehindu.com/news/national/buddhist-nyingma-sect-identifies-reincarnation-of-prominent-rinpoche/article66174971.ece



ఇలాంటి సంప్రదాయాలనుంచీ వచ్చిన బౌధిసత్వం ఈ 14 వ దలై లామా ను ప్రపంచ వ్యాప్తంగా ప్రాచ్యులకూ, పాశ్చాత్యులకూ ఇష్టుడిగా చేసాయి. దలై లామా కు ఆశ్రయం ఇచ్చినందుకు చైనా కూ, ఇండియాకూ మధ్య ఎడతెగని యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే కాలం తో పాటూ చాలా విషయాలూ మారుతాయి. దలై లామా కూడా కొత్త మార్పులను స్వీకరించారు.  ఆయనకు గ్లోబల్ వార్మింగ్ సమస్య గురించి తెలుసు.   ప్రపంచ శాంతి కోసం అమాయకమైన కోరికలూ ఉన్నాయి ఆయనకు. కొన్ని కోట్స్ - పేజీ కొకటి చొప్పున ఉన్న ఈ పుస్తకంలో కొన్ని పేజీలు చదవండి. 


"I have wished for it in this lifetime, and I know I'd wished for this in my previous lifetimes.  My death may well mark the end of the great tradition of Dalai Lamas; the word means 'great leader' in Tibetan.  It may end with this great Lama.  The Himalayan Buddhists of Tibet and Mangolia will decide what happens next.  They will determine whether the 14th Dalai Lama has been reincarnated in another tulku.  What my followers decide is not an issue for me; I have no interest.  My only hope is that when my last days come, I will still have my good name and will feel that I have made some contribution to humanity." 

ఇప్పుడు మనం, మత బోధనల్నీ, ప్రవచనాలనీ విన్నా, వినకున్నా, ఈ ఇంటర్నెట్ యుగంలో, మన ముని వేళ్ళ అంచున నాట్యం చేసే తెరల మీద, మత గురువు ఒకడు ప్రత్యక్షమయ్యి, వాగిన వాగుడినో, వ్యక్తపరచిన అభ్యుదయ భావాల ద్వారానో, వారిని గూర్చి అంచనాలకొస్తాం.   వీరిలో, మాస్, క్లాస్ ప్రవచనకారులున్నారు.  పెద్ద యెత్తున ఫాలోయింగ్ ఉన్న వారున్నారు.  ఇంఫ్లుయెన్సర్స్ అంటాం వాళ్ళని. వేలాది, లక్షలాది మందిని ప్రభావితం చేసే లక్షణాలున్నవారున్నారు. అయితే వారిని గురించి కూడా చిన్న చమత్కారం ఉంటుంది. 

"Weakness being a part of greatness is quite a philosophical question.  It is important to know your weakness; then you can improve. If some Tibetan and Hindu Lamas consider themselves great, it is important to test, criticize, and tease them.  If they remain completely calm, it shows  that they truly practice what they teach."



ఆధునిక యుగంలోనూ, యోగ, వేదాంత, శాంతి మార్గాలను ప్రబోధిస్తున్నవారూ ఉన్నారు. వీరితో  నోబెల్ శాంతి బహుమతిని గెల్చుకున్న ఒక టిబెటన్ బుద్ధ యానపు వృద్ధ గురువుని అస్సలు పోల్చుకోలేము.  కొన్ని మాటలు చదివితే,  అతను 'బాలకుడిలా అమాయకమైన వాడు. చెడు అంటని మంచి ముత్యం!!' అనే  భావన కలుగుతుంది.   ఈ పుస్తకం కేవలం కొన్ని కొటేషన్ ల సేకరణ!   ఒక్కో పేజీ కీ ఒకో కొటేషన్. అంతే.   కానీ కొన్ని మాటలు ఆణిముత్యాలు.  మంచి మాట మన మేలుకే. 

ఇప్పుడు ప్రపంచం ముందున్న ఏకైక చాలెంజ్ పర్యావరణం. యుద్ధాలు, ప్రయాణాలు, దాదాపు అన్ని వస్తువులూ, ఆఖరికి సేద్యం కూడా, భూమికి హాని కలిగించేలా, త్వరలో మానవ జాతే తన కాలిని తానే నరుక్కునే తరహాలో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఈ అమాయక బౌద్ధుడు కొన్ని మాటలిలా అన్నాడు. 

As a buddhist monk who believes in rebirth, I say - even for selfish reasons, we must pay more attention to our planet.  Because we will come back.  And all of us would like to live on a healthy earth.  The belief in rebirth calls for more protection of our environment and climate. 


-----

ఇంకొన్ని కోట్స్   👇

-----

We really need a sense of oneness of humanity.  Thinking only of one's country, people or religion is out of date. A lot of problems arise when our thinking is restricted to one narrow identity or another.  It can lead to conflict, even wars stem from a feudal attitude.  In the past, kings, queens and sometimes even religious leaders, would go to war out of concern for their own power.  They would evoke a sense of 'us' and 'them' and conscript men to fight on their behalf.   

-----

Being too self-centred can give raise to anxiety and depression.  An effective antidote is to cultivate a sense of altruism, taking the whole humanity into account. 

-----

I have wished for it in this lifetime, and I know I'd wished for this in my previous lifetimes.  My death may well mark the end of the great tradition of Dalai Lamas; the word means 'great leader' in Tibetan.  It may end with this great Lama.  The Himalayan Buddhists of Tibet and Mangolia will decide what happens next.  They will determine whether the 14th Dalai Lama has been reincarnated in another tulku.  What my followers decide is not an issue for me; I have no interest.  My only hope is that when my last days come, I will still have my good name and will feel that I have made some contribution to humanity. 

----- 

'I always tell Tibetans; it is much better to consider the Chinese as our brothers and sisters than to think of them as our enemy - no use in that.  For the time being, there is a problem with our Chinese neighbors, but only with a few individuals in the Communist Party.  A number of Chinese leaders now realize that their seventy-year-old policy regarding Tibet is unrealistic.  There was too much emphasis on the use of force then.  So now, they are in dilemma: how to deal with the Tibetan problem? Things seem to be changing. 

-----







***