ఓర్హాన్ పాముక్ రాస్సిన ఓ అద్భుతమైన నవల "మ్యూజియం ఆఫ్ ఇన్నోసెన్స్" ! ఇది ఓ పురుషుని ప్రేమ గాధ. ప్రేమ అంటే అలాంటి ఇలాంటి ప్రేమ కాదు. దేవదాసు లాంటి ఇంటెన్స్ ప్రేమ. దాన్ని వ్యక్తపరచడం లో పిచ్చి. ప్రేమను కోల్పోవడంలో పిచ్చి. విరహం లో పుట్టిన పిచ్చి. ఓ పురుషుని ప్రేమ ! విశేషం అంతా ఇదే.
ఇస్తాంబుల్ లో ఓ ధనిక యువకుడు కెమాల్. ఎంగేజ్మెంట్ అయిన రెండో నెల లో కాబోయే భార్య కు హాండ్ బాగ్ కొనడానికి వెళ్ళి, తనతో చిన్నపుడు ఆడుకున్న దూరపు కసిన్ - ఆ చిన్న పిల్ల పెరిగి పెద్దదయి, అందమైన వనితగా విచ్చుకున్న ఫ్యూసుం ని చూస్తాడు. వీళ్ళలో ఎవరు ఎవరితో ముందు ప్రేమ లో పడ్డారో చెప్పడం కష్టం. కానీ అంతస్థుల అంతరం, పరిస్థితుల ప్రాబల్యం... వల్ల పెళ్ళి దాకా రాలేకపోయిన ఈ ప్రేమ.. కెమాల్ తల్లికి చెందిన ఓ ఖాాళీ అపార్ట్మెంట్ లో వీళ్ళిద్దరూ ఒకరికొకరు అర్పించుకుంటూ.. ఎఫైర్ నడిపే దాకా మాత్రం వెంటవెంటనే చేరుతుంది. కానీ కెమాల్ తన కాబోయే భార్య పరువు, తమ పరువు.. ఇవన్నీ ఆలోచించుకుంటూ.. ఫ్యూసుం కి అన్యాయం చేస్తానేమో అనే భయం తో .. ఉక్కిరిబిక్కిరి అవుతూ, తూకం లో ఇద్దర్నీ వేసి ఎటూ తూగలేక సతమతం అవుతుండగానే, తన కన్నా ఎన్నో ఏళ్ళు చిన్నది, టీనేజ్ ఇచ్చే పిచ్చి ధైర్యం తో తన ప్రేమని, కెమాల్ మీద తన పిచ్చి ప్రేమ ని స్పష్టం గా వ్యక్తం చేస్తుంది ఫ్యూసుం. వీళ్ళిద్దరి దగ్గరితనాన్ని పసిగట్టిన తల్లి హెచ్చరికల్లో.. రియాలిటీ ఎదురుగా - టర్కిష్ ముస్లిం గా తన ముందు ఉన్న కర్తవ్యాన్ని నిర్వహించేందుకు.. ఫ్యూసుం ని పక్కకి నెట్టి, పెళ్ళి కి సిద్ధపడతాడు కెమాల్. అంతే. అక్కడితో ఫ్యూసుం అర్ధాంతరంగా తన తప్పు తెలుస్సుకున్న దానిలా అతని జీవితం నుండీ అదృశ్యం అవుతుంది.

ఫ్యూసుం నిష్కృమణ అర్ధం అయ్యాకా.. తట్టుకోలేని కెమాల్ గాధ - పాముక్ నోటెమ్మట వింటూ.. కళ్ళల్లో నీళ్ళు తిప్పుకోని పాఠకుడుండడు. ఈ కెమాల్.. ఫ్యూసుం లేని శూన్యాన్ని తట్టుకోలేక, దేశదిమ్మరిగా, మన దేవ దాసు లా మారి, తన ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకుంటాడు. జీవితం నిట్టూర్పులతో ముందుకు పోతూనే వుంటుంది. కెమాల్ కు మిగిలిందంతా జ్ఞాపకాలే. రహస్యంగా ఫ్యూసుం తో ప్రేమలోకపుటంచులు చూసిన తల్లి అపార్ట్మెంట్.. ఆ మంచం.. ఫ్యూసుం వాసన ఇంకా అట్టిపెట్టుకున్నయ్యేమో అనుకుంటూ ఆ దుప్పట్లూ, దిండులూ.. ఫ్యూసుం తాగి పారేసిన సిగరెట్ పీక... అన్నీ అన్నిట్నీ హత్తుకుని, ఓ లాంటి ప్రకోపంలో మునిగి తేలుతూ.. ఆ జ్ఞాపకాలే తిండి, నిద్రా అన్నట్టు, అవి లేకపోతే బ్రతకలేనట్టూ బ్రతుకుతాడు. ఫ్యూసుం చెవి రింగు ఒకటి ఎంతో అపురూపమైన జ్ఞాపకం. మధుర స్మృతి. అద్భుత మైన మెమెంటో .. జ్ఞాపిక. దాన్నే ఆసరా గా చేసుకుని బ్రతకడం. కెమాల్ ని చూసి స్నేహితులూ, కుటుంబసభ్యులూ.. విచారం లో మునిగిపోతారు. శుభ్రంగా పెళ్ళి చేసుకుని కళ కళ్ళాడుతూ బ్రతకాల్సిన కొడుకు కళ్ళ ముందే ఇలా ఎందుకూ పనికిరాని పిచ్చి వాడిలా తిరగడం తట్టుకోలేక తండ్రి మరణం.. తండ్రి ఫ్యూనరెల్ లో కనిపించినట్టే కనిపించి మాయం అయిన ఫ్యూసుం ని తల్చుకుని ఇంకా వెర్రి ప్రేమ లో పైత్యంలో విరహం లో మునిగిపోతాడు కెమాల్.
ఆఖర్న ఆమె ఆచూకీ దొరికేనాటికి ఫ్యూసుం ఒక గృహిణి. కెమాల్ మీద కోపంతో ధుమ ధుమలాడే ప్రేమిక. వేరే వ్యక్తి కి భార్య. పేద వాతావరణం లో ఇస్తాంబుల్ లో బీద సాదలు ఉండే లోతట్టు ప్రాంతం లో ఇల్లు. కెమాల్ ఒక్క రోజు కూడా ఫ్యూసుం ని చూడకుండా ఉండలేక, వారి తో తన బంధుత్వాన్ని సాకు గా పెట్టి దాదాపు ప్రతి సాయంత్రం, ఫ్యూసుం ఇంటికి వెళ్ళి వాలేవాడు. ఫ్యూసుం పట్ల అతని ప్రేమని అర్ధం చేసుకున్న ఆమె తల్లితండ్రులు అతని రాక కి ఆటంకాలు ఏర్పరచకుండా.. అల్లుడితో లౌక్యం గా నెట్టుకొస్తూ ఉంటారు. కధలో ఎంతో విశ్వాసపాత్రులైన, కెమాల్ ని చిన్నప్పటి నుంచి ఎరిగిన దాది, డ్రైవర్ కూడా మర్చిపోలేని పాత్రలు. ఎన్నో కష్టాలు పడి, ఫ్యూసుం మనసులో తన స్థానాన్ని తెలుసుకుని.. ఆమె భర్త కి ఉద్యోగం ఇప్పించి, తనతో వ్యాపారం చేయించి, నానా పాట్లూ పడి ఫ్యూసుం తో సన్నిహితత్వాన్ని కాపాడుకోగలుగుతాడు. ఆఖరికి ఆ ఎందుకూ కొరగాని భర్త తో విడాకులకు ఫ్యూసుం తండ్రి మరణం తర్వాత పరిస్థితులు దారితీస్తాయి. ఆఖరికి ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుని ఒక రాత్రి ప్రేమార్ణవం లో మునిగి తేలి. తర్వాత మద్యం మత్తు లో డ్రైవ్ చేేేస్తానని పట్టు పట్టి, వేేగంగా డ్రైవ్ చేసి, ఆక్సిడెంట్ అయి, ఫ్యూసుం మరణించాక, ఎలా అనిపించాలి కెమాల్ కి ? ఫ్యూసుం మరి తనకి దక్కదని తెలుసుకున్నాక, గుండె పగిలిన కెమాల్.. ఈ మ్యూసియం ను స్థాపిస్తాడు.
తనూ ఫ్యూసుం కలిపి ఎన్నో అత్భుతమైన క్షణాల్ని గడిపిన ఆ అపార్ట్మెంట్.. పెళ్ళయిన ఫ్యూస్సుం ఇంటికి వెళ్ళినప్పుడు అడపా దడపా ఆమెకు సంబంధించిన ప్రతీదీ పిచ్చి వాడిలా సేకరించిన కెమాల్.. ఆ ఇంట్లో పెట్టి... అవన్నీ తన అమాయకత్వానికి, ప్రేమకీ ప్రతీకలు గా వాట్ని తన కలెక్షన్.. జ్ఞాపికల కలెక్షన్ గా దాచుకుంటాడు. కానీ తన మరణానంతరం.. ఎవరూ వాట్ని నాశనం చెయ్యకుండా ఓ ఏర్పాటు చేసుకుంటాడు. అదే ఈ మ్యూజియం. దీనికి టికెట్ ఉంది. ఎవరైనా వెళ్ళొచ్చు. ఆ జ్ఞాపికల్నీ - ఆ పిచ్చి ప్రేమ - వస్తువుల పట్ల ప్రేమ కాదు.. మనిషి పట్ల ప్రేమ ! ఒకప్పుడు ఆకర్షణ గా కొట్టిపడేసిన మోహం - ప్రేమ - అదేంటో - ఒక హృద్య మానవ భావన. దానికోసం కెమాల్ చేసిన ప్రయాణం.. ఆ బాధా చూడ్డానికి. కెమాల్ ఏర్పాటు ఏంటంటే, ఓ రోజు వెళ్ళి ఓర్హాన్ పాముక్ ని కలవడం.. తన కధ చెప్పి.. తన కధ గురించి ఓ పుస్తకం రాయమనడం.. అదీ - ఇది.
ఈ పుస్తకం లో ఈ మ్యూజియం తాలూకూ ఫోటోలున్నాయి. పాఠకుడు నవల చదువుతూ ఆ గాఢ ప్రేమ జలధి లో కొట్టుకుపోతూ మ్యూజియం అణువణువు నూ దర్శిస్తాడు. ఈ నవల 2008 లో విడుదలయ్యాకా.. టర్కీ లో ఈ మ్యూజియం కి జనం క్యూలు కట్టారు. అందుకే నవల్లో ఓ టికెట్ కూడా ఇచ్చారు. ఒక కాపీ ని తీస్కెళ్తే మనకి ప్రవేశం ఉచితం అన్నమాట. ప్రేమ గురించి.. పురుషుడి గాఢ ప్రేమ గురించి ఇలాంటి నవల ఇంకోటేదైనా వచ్చినట్టు నాకు తెలియదు. మన దేవదాసు లా .. అనిపించినా కెమాల్ చివరి నిముషం వరకూ ఆశ తోనే జీవించాడు. ఫ్యూసుం తింగరిది అనిపించినా.. ఆలోచిస్తే, ఆవిడ నిస్సహాయత కూడా అర్ధం అవుతుంది.
సో ... ఓర్హాన్ రాసిన 'ఇంకో వ్యక్తి' ప్రేమకధ స్వగతం లో సాగి పాఠకుణ్ణి తన తో పాటూ ప్రేమ ఊబిలోకి లాగేసి.. కెమాల్ ప్రేమనూ ఫ్యూసుం నూ అమరులని చేసేస్తుంది. ఎన్నో అమర ప్రేమ కధల్లాగే ఈ కధ కూడా విషాదాంతం. ఓ వేళ కెమాల్, ఫ్యూసుం పెళ్ళి చేసుకుని ఉంటే ఎంత దెబ్బలాడుకునే వాళ్ళో ఏమో కానీ.. వాళ్ళు విడిపోవడం.. వాళ్ళ కోప తాపాలూ.. వాళ్ళ ఏకైక ప్రేమ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఉన్న అంతులేని అభిమానం... మనల్ని అబ్బుర పరుస్తాయి. కెమాల్ కధ (అసలు పేరు కాదు లెండి) ఓ టర్కిష్ సెన్సేషన్ గా మార్చి అది ఇంగ్లీష్ లో అనువాదం అయాకా, ప్రపంచ వ్యాప్తంగా దానికి ప్రాచుర్యాన్ని కల్పించిన పాముక్ ఈ నవల్లో టర్కీ జీవన విధానాన్ని విస్త్రుతం గా చర్చిస్తాడు. మిగిల్న యూరప్ తో కలవనివ్వని ఇస్లాం మత వాదం... అటు అచ్చమైన ఇస్లామీయులతో కూడా కలవలేని యూరోపియనిజమూ కలిస్సిన సమాజం. పెళ్ళికి ముందు సెక్స్ ఓ ఎడ్వెంచర్. అది యూరోపియన్లని చూసి నేర్చుకున్న అద్దె సంస్కృతి. అటు ఆధునికత కీ, పురాతన భావజాలానికీ మధ్య నలిగే యువత. కట్టుబాట్లకీ, అవి తెంచుకు పారిపోవడానికీ మధ్య నలుసు లాంటి టర్కిష్ హిపోక్రసీ.. ఓ సంధి లాంటి పరిస్థితి. వీటిల్లో యువత ఓ దారి నిశ్చయించుకోలేక సతమతం అవ్వడం.. ఆస్థీ అంతస్థు ల వల్ల బంధు సంబంధాల్లో కూడా కనిపించే తేడాలూ, కుత్సితత్వం, వివేకానికీ, మనసు కీ మధ్య సంఘర్షణ.. టర్కిష్ సామాజిక జీవనం.. ఇలా అన్నిట్నీ.. అల్లుకుంటూ, పేరుస్తూ, విప్పుతూ.... ఇంత పెద్ద నవల అంతే అమాయకంగా రాసి, ఈ మ్యూజియం ను ప్రపంచానికి అంకితం చేసిన పాముక్ రచనల్లో ప్రత్యేకమైనదీ, మిస్ కాకూడనిదీ. ఈ "మ్యూజియం ఆఫ్ ఇన్నోసెన్స్".
***