నాకు చాలా నచ్చింది ఈ సినిమా. జూడ్ లా అంటే ఉన్న ఇష్టం వల్ల మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూంది. ఇక్కడ ఇద్దరికీ అస్సలు సంబంధం వుండదు. భాష తెలీదు.. అయినా ఎలానో కనెక్ట్ అవుతారు. అసలతను అంత పెద్ద సినీ తార అని ఇంకో పెద్దాయనకి తెలీదు. తన నిత్యజీవితం లో తన ఇమేజ్ మూలంగా తరచూ ఇబ్బందులు పడే జూడ్, తనని సహజం గా, తోటి ప్రయాణికుడి గా మాత్రమే భావించిన ఆ అపరిచితుడి తో ఎంత బాగా మూవ్ అవుతాడో చూసి చాలా ఆనందించాను. కొత్త మూవీ. షార్టు ఫిలిం ల కరిష్మా ని పెంచిన జూడ్ లా కి :) SALAM.