Pages

23/11/2025

The Cooking of Books - Ramachandra Guha

 The Cooking of the Books – Ramchandra Guha

 



ఒక రచయిత తన ఎడిటర్ తో దీర్ఘకాలిక సాన్నిహిత్యంస్నేహంనలభై ఏళ్ళకు పైగా నిలుపుకున్న, తమ అరుదైన బంధం గురించి రాసిన పుస్తకం ఇది.   రచయిత కూతన ఎడిటర్ కూ మధ్య ఎన్నో వృత్తి పరమైన సమ్మతీఅసమ్మతీవాదనలుచర్చలూ ఉంటూనే ఉండొచ్చు గాక. కానీ రామచంద్ర గుహ లాంటి ప్రతిభావంతుడైన రీసెర్చర్ కు 'వజ్రాన్ని' సానబెట్టే మరో 'వజ్రం' లాంటి ఎడిటర్ దొరకడం వల్ల అది తన ప్రయాణాన్నీవ్యక్తిత్వాన్నీ ఎలా తీర్చిదిద్దిందో రాసుకున్న జ్ఞాపకాల గుచ్చం ఈ పుస్తకం.

 

1980 ల లో డిల్లీ లో రామచంద్ర గుహ పీ.హెచ్.డీ చేస్తున్నపుడు రుకున్ అద్వానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్స్ డిల్లీ శాఖ లో ఎడిటర్ గా పనిచేస్తుండేవారు. నిజానికి ఇద్దరూ దిల్లీ లే సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి వచ్చినవారే. కాలేజీ రోజుల్లో ఒకరినొకరు ఎరిగిన వాళ్ళు. కాలేజీ లో క్రికెట్ ఆడుకుంటూఏ గుండప్ప విశ్వనాథన్  లానో ఎదగాలని కలలు కన్న గుహమొదట్లో  అసలు అద్వానీ దృష్టిని ఆకర్షించనే లేదు.  

అద్వానీ ఒక ఇంట్రావర్ట్. అతనిది సంగీత సాహిత్యాలతో నిండిన జీవితం. అతని పరిధి విశ్వమంత పెద్దది. కానీ స్నేహితులని చెప్పుకోదగ్గవారు వేళ్ళ మీద లెక్క పెట్టుకోగలిగినంత మందే. బహుశా మనుషుల్ని పెద్దగా ఇష్టపడనిపేరుపాపులారిటీ నీ గాఢంగా అయిష్టపడే ఈ అద్వానీకి  ఎప్పుడూ బురద కొట్టుకుపోయిక్రికెట్ ఆట లో మునిగి తేలుతూండే గుహ పెద్దగా నచ్చలేదనే చెప్పొచ్చు.

 

సెయింట్ స్టీఫెన్స్ఆ రోజుల్లో ఇంజనీరోడాక్టరో కాకుండా ఇతర చదువుల్ని ఇష్టపడే యువత కోసం ఓ పెన్నిది లా ఉండే ప్రముఖమైన కాలేజీ. ఎందరో ప్రముఖ సివిల్ సర్వెంట్లనురచయితలనుపాత్రికేయులనువిశ్లేషకులనుసోషల్ సైన్సెస్ లో ప్రతిభావంతులను చిలికి వెన్నలా తీసి పెట్టిన కాలేజీ. ఇక్కడ  గుహ కాలేజీ మేట్లు అమితవ్ ఘోష్శశి థరూర్ వంటి వాళ్ళు. 

 

"రాం గుహ" డెహ్రాడూన్ లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. తండ్రి డెహ్రాడూన్ లో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో సైంటిస్ట్. తల్లి హైస్కూల్ టీచర్. బాల్యం అంతా డెహ్రాడూన్ లోచదువు డూన్ స్కూల్ లో. తరవాత కాలేజీ చదువుకు ఢిల్లీ చేరి అక్కడ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ లో ఎకానమిక్స్ చదువుకున్నాడు. తరవాత దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ లో, ఎకానమిక్స్ లోనే మాస్టర్స్ చేసాడు. కలకత్తాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో సోషియాలజీ లో పీ.హెచ్.డీ చేసాడు. దానికి అతను ఎంచుకున్న సబ్జక్ట్ ఆనాటికి ప్రముఖంగా నడిచిన "చిప్కో ఉద్యమం".

 

సున్నితమైన హిమాలయాల ఎకోసిస్టం గురించి విస్తృతంగా చదువుకున్నాడు. రీసెర్చ్ కోసం డెహ్రాడూన్ నాటి రోజులు ఎంతో పనికొచ్చాయి. ఎందరినో హిమాలయాల పల్లెవాసులను కలిసాడు. అభివృద్ధి పేరిట అడ్డదిడ్డంగా వేలాది ఏళ్ళుగా భూమిలో వేళ్ళూనిన మహా వృక్షాలను ఎడా పెడా నరకడానికి వ్యతిరేకంగానే చిప్కో ఉద్యమం మొదలయింది. కొండ గ్రామాలకు వాటి పరిధిలోని చెట్లు ఎందుకు అంత విలువైనవో ప్రపంచానికి తెలియజెప్పాలిసిన అవసరం ఉందని ఆ రీసెర్చ్ అతనికి తెలియజేసింది. చెట్లు నరకడంకొండలను తొలచడంక్రమేపీ ఎలా భూమి కోతకుకొండలు బలహీనమవడానికి,  అకాలమైన లాండ్ స్లైడ్స్ కుషిఫ్టింగ్ కు  దారితీసాయో జనాలకు చెప్పాలనుకున్నాడు.  మనుషులు కొండలకు చేసే గాయాలుఅభివృద్దిపేరిట  అశాస్త్రీయంగా రోడ్లు  నిర్మించడాలుట్రాఫిక్ఇళ్ళు నిర్మించేయడాలు కొండల్ని పిండి చేసేస్తాయి. నదుల దారుల్ని మార్చేస్తాయి. దేశపు వర్షాల మీదవాతావరణం మీదా దుష్ప్రభావాన్ని చూపుతాయి. వీటి గురించి స్పృహ అప్పుడపుడే కలుగుతున్న రోజుల్లో తను పర్యావరణం గురించి రాయాలిన అవసరం ఉండటాన్ని గ్రహించాడు.

 

ఈరోజుల్లోనే అతనిని ప్రముఖ బ్రిటీషు ఇండియన్ ఆంత్రపాలజిస్ట్ వెర్రియెర్ ఎల్విన్ (1902-22) ఆకర్షిస్తాడు. ఎల్విన్ఒరిస్సామధ్యప్రదేష్మధ్య భారత దేశంలో గోండుల మీదబైగాల మీద పరిశోధన చేసిన వాడు. ఆదివాసీల హక్కుల గురించిఅడవి బిడ్డల పట్ల మైదాన ప్రాంతాల వారు జరిపే అన్యాయాల గురించీ డాక్యుమెంట్ చేసిన వాడు. ఆ తరవాత అతను నార్త్ ఈస్ట్ లోకి కూడా విస్టృతంగా గడిపి అక్కడి ట్రైబల్స్ జీవితాల మీద కూడా పరిశోధనలు చేసాడు. భారత దేశాం లో ఆంత్రపలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పడినాక సంస్థ కు  డిప్యూటీ డైరక్టర్ గా పనిచేసాడు.  నార్త్ ఈస్ట్ ప్రభుత్వాలకు ట్రైబల్ వ్యవహారాలలో సలహాదారుడిగా పనిచేసాడు.  భారతీయ ఆంత్రపలజికల్ స్టడీస్ కూట్రైబల్స్ గురించి అతను ఏర్పరిచిన విద్య కూ  అతనికి పద్మభూషణ్ అవార్డ్ తీసుకున్నాడు. అతని ఆత్మకథ "The Tribal World of Verrier Elvin" కు సాహిత్య ఎకాడమీ అవార్డ్ వచ్చింది.

అలాంటి ఎల్విన్ పట్ల, తాను చిప్కో ఉద్యమం గురించి రీసెర్చ్ చేస్తున్న రోజుల్లోనే రామచంధ్ర గుహ కు "హీరో వర్షిప్" చేయబుద్ధి కలిగింది.  బహుశా దాదాపుఅతనిని ఈ మనిషి ‘షేప్’ చేసినట్టే.   ఒకప్పుడు కాలేజీ లో రుకున్ అద్వానీ దృష్టి లో కేవలం "ఆట గాడి" గాపెద్దగా చదువు లేకుండా రికామీ గా తిరిగే జూనియర్ గా మాత్రమే ఇమేజీ ఉన్న రాం గుహఈ ఎల్విన్ పిచ్చిలో పడి ఉండటం వల్ల "సీరియస్" వ్యక్తి గా కనిపించడం మొదలయింది. ఒక స్నేహితుడి  పెళ్ళి లో వీళ్ళిద్దరూ ఊసుపోక చెప్పుకున్న కబుర్లలో రాం గుహ ఎల్విన్ ని ప్రస్తావించడం,  అద్వానీ ని ఆకర్షించింది.  అప్పటికే కేంబ్రిడ్జ్ లో చదువుకునిఉద్యోగం కూడా చేసిదేశానికి తిరిగి వచ్చి,  OUP (Oxford University Press) లో చేరిన రుకున్ అద్వానీరాం గుహ లోని రచయితని  పసిగట్టిన  ఘడియలు అవి.  ఎల్విన్ గురించి రామచంద్ర గుహ  రాసుకున్న నోట్లు, వ్యాసాలు, రకున్ ని విపరీతంగా ఆకర్షించాయి. అతనిలో స్పార్క్ ని మొట్ట మొదటగా గుర్తించినది రుకున్ ఒక్కడే.  

 

రామచంద్ర గుహ ఒక చరిత్రకారుడిగాఎన్విరాన్మెంటలిస్ట్ గామేధావిగా ఎలాగో ఓలా కాలం వెళ్ళబుచ్చేవాడేమో. గానీ అతనిలో పొంగిపొర్లుతుండే నిజాయితీనీఉత్సాహాన్నీప్రతి విషయాన్నీ దీర్ఘంగా చదివిఆకళింపు చేసుకునిదానిని నలుగురికీ అర్ధమయే రీతిలో మలిచి చెప్పగలగడాన్ని అతని ప్రత్యేకత గా గుర్తించింది రుకున్ అద్వానీ నే. అతని ప్రోత్సాహంబుజ్జగింపులతో రచనని మొదలుపెట్టినాఅదే తన బలం అని రాం గుహ కూడా గ్రహించడానికి కారణమైన వాడు అద్వానీ.

 

అసలు రుకున్ అద్వానీ దీరామచంద్ర గుహ దీ చాలా దీర్ఘకాలిక స్నేహం. రుకున్ అద్వానీ తో కలిసి పని చేసిన  రచయితలు చాలా తక్కువమందే. కానీ వాళ్ళ పుస్తకాలు ఎంతో విలువైనవీనాణ్యమైన సమాచారంతో ఉన్నవీ. వీటిని రచయిత తో పాటూ ప్రయాణిస్తూఎడిట్ చేస్తూతనదైన లోకంలో యోగి లా బ్రతికే రుకున్ అద్వానీ అంటేగుహ కు ఎంతో అభిమానంగౌరవం. ఇద్దరి మధ్యా ఎన్నో సంవత్సరాలుగా నడిచిన ఉత్తరాలుకొన్ని పేరు పొందిన తన పుస్తకాలలో ఎలాఎంత  ఎక్కువ మేధో భాగస్వామ్యం అద్వానీది ఉందో ఒక రికార్డ్ లాగా రాసికృతజ్ఞతలు చెప్పుకున్న పుస్తకం ఇది. 

కొన్ని రాం గుహ కు పేరు తెచ్చిన వ్యాసాలుపుస్తకాలురుకున్ రాయించినవే. లేదా దాదాపు అతని ఐడియాస్ లోంచి పుట్టినవే. ఉదాహరణ గా తన మదిలో తొలుస్తున్న ఐడియాల గురించి రాంరుకున్ కు ఉత్తరం రాస్తేఅతనిచ్చిన సమాధానాల్ని పొందుపరుస్తూవాటి ని ఆధారం గా చేసుకుని తను తన పేరుతో అచ్చయిన వ్యాసాలలోకొన్ని మార్పుచేర్పులతో రుకున్ అభిప్రాయాలనే ప్రచురించడం గురించి యధాతధంగా రాసారు.

 

రాం గుహ మొదట క్రికెట్ రచయిత. క్రికెట్ గురించి చాలా 'కాలం' లుపుస్తకాలు రాసారు. అతను ఇంటెలెక్చువల్ విషయాల గురించి రాసినపుడు జనం అతన్ని కొత్తలో సీరియస్ గా తీసుకోనే లేదు. అపుడు నిరుత్సాహపడిన అతన్ని రుకున్ ప్రోత్సహించారు. రకరకాల అభిప్రాయ బేధాలుఎప్పుడు పడితే అపుడుఎంత పెద్దవి అంటే అంత పెద్దవి ఉత్తరాలు రాసుకోగలిగేంత చనువూస్నేహమూ వచ్చాకఇద్దరూ ఒకరిని ఒకరు వొదులుకోలేదు.  వృత్తి కి లోపలా బయటా కూడా స్నేహం కొనసాగింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ లో ఎన్నో ఏళ్ళు పని చేసాక రుకున్ అక్కడ రాజకీయాలకు ఇమడలేకబయటికి వచ్చి ఇంకో స్వతంత్ర ప్రచురణ సమ్ష్థ "పెర్మనెంట్ బ్లాక్ "  ను నెలకొల్పాక అతని చేత తమ పుస్తకాలను ఎడిట్ చేయించుకోవాలని గుహ తో పాటూ ఎందరో రచయితలు,  మేధావులు ఈ సంస్థ కు మారారు. పుస్తకాల రచయితలతో సమానంగా ఎడిటర్ గా రుకున్ ఎంతో పేరు సంపాదించాడు.

 

దిల్లీ లోని ఆక్స్ఫర్ద్ యూనివర్సిటీ ప్రెస్స్ లో ఎన్నో ఏళ్ళు పనిచేసాకపబ్లిసిటీనీ అస్సలు ఇష్టపడని రుకున్ దిల్లీ వదిలి చివరికి రానీఖేత్ లో తన భార్యతో కలిసి స్థిరపడ్డాక కూడాఅతని ప్రచురణ సంస్థ  Permanent Black లో  పుస్తకాలు ప్రచురించకపోయినా కూడా వీళ్ళిద్దరి మధ్యా పలురకాల విషయాల మీద ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. చాలా సార్లు గుహ రాసిన ఎన్నో పుస్తకాలలోవ్యాసాలలో రుకున్ భావాలు ప్రతిఫలించాయి. రుకున్ తన వ్యాసాల మీద రాసిన విమర్శలూవిశ్లేషణలతో నిండిన ఉత్తరాలే ఈ పుస్తకం నిండా పొందుపొరిచారు. వాటి నుండి స్పూర్తి పొందితన ఆలోచనల్లో స్పష్టతను తెచ్చుకున్నారు గుహ.

 

రుకున్ మనుషుల ప్రాపకం అక్కర్లేని మనిషి. అతనిది చిన్న కోటరీ. దాన్లో అత్యంత నాణ్యమైన స్నేహాలే ఉన్నాయి.  అయితే అది గర్వం అనోఇంకేదో అనో చాలా మంది అనుకోవచ్చు గాక. అందులోనూఎంత విరివిగా ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపినాఎంత దీర్ఘంగా ఫోన్ లో మాటాడుకున్నాకొన్ని సార్లు వారాల తరబడి రుకున్ నుండీ ఉలుకూ పలుకూ ఉండేది కాదు. ఈమెయిళ్ళ కు మాత్రమే అడపా దడపా జవాబులొచ్చేవి. రాణీఖేత్ లో పోస్ట్ మేన్ రోజూ ఆ కొండదారి లో నడిచి రాలేకరుకున్ ఉత్తరాలను అతని ఇంటికి వెళ్ళే ఏ చాకలి కోతోట వానికో ఇచ్చి పంపేవాడు. అంటే రుకున్ తన రాణీ ఖేత్ కాటేజీ లో రణగొణ ధ్వనులకూవాయుమనుష్య కాలుష్యాల కు దూరంగా ఎంత ప్రశాంతంగాతనకి ఇష్టమైన బీథొవెన్ సంగీతం వింటూతనకి ఇష్టమైన రచనలను చదువుతూఎడిట్ చేస్తూసాహిత్యాన్ని ఎంజాయ్ చేస్తూఎంత హాయిగా ఉంటూండేవాడో తెలుస్తూంది. చాలా సార్లు అతని దీర్ఘ మౌనాలు  కలవరపెట్టినాఅలా “కదిలించకుండా” ఉండటమే అతనికి ఇష్టం అని స్నేహితులు తెలుసుకున్నారు. 

ఎన్నో గొప్ప  రచనలలో రచయిత కన్నా ఎడిటర్ ప్రతిభావంతుడైతేమేధావైతేఆ రచన కు ఎన్ని నగిషీలునకాషీ పన్లు జరుగుతాయోఫలితంగా రచన చక్కగా రూపుదిద్దుకుని రచయితకు మంచి గుర్తింపు దొరుకుతుందో అందరికీ తెలిసిందే. ఇక్కడ ఎడిటర్ చాలా సార్లు దాదాపు రచనను తిరగరాసిచెక్కితీర్చిదిద్దిరచయితకన్నా ఎక్కువ పని చేసి ఒక రూపు తీసుకొస్తుంటాడు. కొందరు రుకున్ లాంటి ఎడిటర్లు రచన లో తప్పులను దిద్దటమే కాదురచయితకు ఇంకా స్పష్టత కలిగేలాప్రోత్సాహకరంగాసద్విమర్శలతో ఉత్తరాలు రాసిరచనను, రచయితే మళ్ళీ కొత్త దృక్కోణంతో రాసేలా చేయడంలో సాయపడతారు. అలా ఎందరికో ఎన్నోసార్లు జరిగినట్టు గుహ కు తెలుస్తుంది. 

 

ఈ పుస్తకంరామచంద్ర గుహ బయోగ్రఫీ కాదు. కేవలం రచయితగా తను మారిన ప్రక్రియటైం లైన్ఆ దారిలో రుకున్ చూపెట్టిన వెలుగు - అతని గుంభనమైన ఆప్యాయ స్నేహందీర్ఘకాలిక మిత్రత గురించి కృతజ్ఞతా పూర్వకంగాప్రేమతో రాసుకున్న ఓ ఉత్తరం. రచనంతా చదివాకదీనిని ఎడిట్ చేసిందెవరా అనిపిస్తుంది.   రుకున్ లాంటి స్నేహితులు దొరకడాం అరుదు. స్నేహాలలో పరస్పర గౌరవాలు మిగలడం, ఎటువంటి విధాన పరమైన విబేధాలున్నా, మంచి స్నేహితులు మానసిక ప్రశాంతతకు, జీవితం పట్ల ఉత్తేజం కలిగించడానికి ఔషధుల్లా, ఎంత పనిచేస్తారో మనకు తెలుస్తుంది. అలాంటి స్నేహితులని నిలుపుగలగడం, గౌరవించుకోగలగడం, కొందరికే తెలిసిన విద్య. 

   

Some Interesting glimpses : 

(1)  OUP by Rukun published Thammu Mama's (Dr KT Acharya) book "Indian Food : A Historical Companion"... later a sequel “A Historical Dictionary of Indian Food”  Thammu mama died in 2002, but his intellectual legacy lives on.  Of his documentation of food markets in ancient India, which sold the flesh of many animals the cows included, Nandita Haskar Remarked. ‘Thank goodness KT Acharya is dead, otherwise he would be executed as an anti-national by the Hindu extremists’.  Dr.Acharya’s literary legacy that ‘his work in documenting food reference in a wide range of texts is so wide and comprehensive, its almost a default to start looking up what he has said on any food subject before starting.

(2)  While Ram Guha was writing Elwin Biography, Rukun wrote :  It seems to require more detail when you are talking about Elwin’s intellectual work / ethnography.  You should tell us more about what Elwin said about the tribals, what aspects of their minds / society he focused on, more detail on the anthropological context & his differences / deviations from these, your assessment of the virtues and limits of his methodology.  I don’t know if you get what Im driving at, or if you agree.  Im basically trying to get a bigger, fatter, richer, fuller, more analytical, deeper, more informative, GREATER biography out of you.

 

(3)  What makes Rukun Advani a great editor is that he understands language, and he understands thought.  No other editor I have worked with has a PhD from Cambridge.  In Rukun’s case that early training in academic rigour was enhanced, while in the OUP, by working with historians and social scientists in shaping their books.  When presented with a complex argument in sociology or political thought, Rukun can come to grips with it – and tell you how to refine it.

 

(4) While Ram wanted to write "The Rise and Fall of the Bilingual Intellectual”, Rukun wirtes :  One can think of at least two modern Bengali novelists who write their novels only in English, but who evince the hugest anxiety to be seen as citizens of Bengal in the fullest sense – people as proficient in Bengali as in English.  This is probably true of every Bengali who writes a novel in English, and indeed of any Bengali intellectual who writes any kind of thing at all in English. Just as the economist knows he can never be seen as proper economist unless he is first a mathematician, the Bengali bilingual intellectual knows that he will remain a prophet without honour in his own ‘desh’ if he is seen as not equally grounded in both Bengali and English.

(5) My personal favourite : (A letter written by Rukun to the author)

The young publisher has written a surprisingly stupid review in Outlook praising CB.  The publisher seems to think that anything that sells a million copies must have value, whereas no one would have noticed any value in B if he’d sold only 5000.  I think (the young publisher) has got the wrong end of the stick totally.  First because B is an extension of the magazine buying culture of this country, where 9 bucks seems worth blowing up if a herd of fellow nerds is buying it up too and you don’t want to seem left behind by the Joneses.  Second, a million fools buying Bhagat, like the millions of Indian males who piss in full view, only suggests that civilizationally the vulgar middle class’s dominance of India is absolute – to the extent of beguiling this otherwise sharp individual. Publishers become suddenly amenable to jettisoning standards when they think of the effect of a million copies on their own publishing programme.  Im almost grateful for being stuck bang in the middle of unreadable elites whose books sell only a few copies, at least there is no pressure on me to compromise by singing hosannas to B and S de.  

 

(6)   {Editor's Notes}  The source cited in the footnotes suggest a wealth of material that you could probably use to make this chapter come alive, for it seems to have the potential.  Please be more expansive here – at present you seem to suppress too much in pursuit of the barest socio-economic history.  Indian historians tend to address themselves only to other Indian historians, either because of a too great concentration on the economic, or because their source material doesn’t yield anything of more general interest or because they are inherently suspicious or literary and cultural phenomena. 

***

 

No comments: