Showing posts with label Terrorism. Show all posts
Showing posts with label Terrorism. Show all posts
12/09/2019
Women in Terrorism Case of the LTTE by Tamara Herath - 5
ప్రతి ముగ్గురు పురుషులకీ ఒక స్త్రీ అనే నిష్పత్తిలో ఎల్.టీ.టీ.ఈ లో మహిళా సభ్యులు ఉండేవారు. వారిలో నాయకత్వ స్థాయిలో చాలా తక్కువమందే ఉన్నా, ప్రభాకరన్ తో వారికున్న రక్త సంబంధానికన్నా అతీతమైన బంధం, "అన్నా" అని వరుసతో పిలిచే గౌరవం, పరమ విధేయత, చెప్పుకోదగ్గవి. అసలంత చరిష్మా ని ప్రభాకరన్ ఎలా ఏర్పరచుకున్నాడు ? స్త్రీలకీ, వారి సమానత్వానికీ, పురుషులతో పోటీ పడి పనిచేసే వారి తెగింపుకీ, విశ్వాసానికీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన సంస్థ గా ఎల్.టీ.టీ.ఈ. ని రూపుదిద్దటం ద్వారానే.
తాము ఆ దేశంలో మైనారిటీలయి ఉండి, ప్రత్యేక ఈలం పోరాటం చేయడం లో ఉన్న చాలెంజ్ లను బేరీజు వేసుకున్న ఈ సంస్థ మొదటి నుండీ, స్త్రీ సమానత్వానికి తగిన ప్రాధాన్యతని ఇస్తూ వచ్చింది. వారు విధేయత తో సంస్థ లక్ష్యాలకోసం పని చేసేరు తప్ప పెద్దగా నాయకత్వ స్థానాలలో పని చేయలేదు. కానీ మతానికి సంబంధమే లేకుండా కేవలం దేశ సాధన కోసం కృషి చేసిన దళం కాబట్టి ఇక్కడ అసమానత కి తావు లేకుండా, నిజానికి మహిళల కి లైంగిక మానసిక వేధింపులు ఎదురవకుండా వారికి చాలా ప్రాధాన్యాన్నిచ్చి దళాన్ని నడిపించడం జరిగింది.
చెచెన్యా, పాలస్తీనా ల లా (అక్కడ ఆత్మాహుతి దాడి కి పాల్పడిన పురుషుడి కుటుంబానికి నాలుగొందల డాలర్లూ, స్త్రీ కుటుంబానికి రెండొందల డాలర్లూ ప్రతీ నెలా, జీవన భృతి చిక్కేది) స్త్రీ ప్రాణానికి తక్కువ విలువ, పురుషుడి ప్రాణానికి ఎక్కువ విలువా అని నిర్వచించలేదు. కానీ సాధారణ పౌర సమాజంలో స్త్రీ ల లాగా వీరు తాము బలహీనులం కాము అని నిరుపించుకోవడం కోసం ఎన్నో త్యాగాలు చేసారు. పోరాటం ముదిరినపుడు తప్పని సరి గా సాధారణ దుస్తులు ధరించాల్సి వచ్చేది. వారిని ఈ సాయుధ పోరాటంలో కి తీసుకు రావడమే సులువు. వన్ని పరిసరాల్లో ఎన్నోసార్లు ఆత్మ రక్షణ కోసం గూడు చెదిరి పారిపోవాల్సి వచ్చినపుడు, దాడులకు గురయినపుడూ వారు ఎదుర్కొన్న రక్షణ లేని పరిస్థితులకు మహిళలకి ఈ ఈలం పోరాటం ఓ కవచం లా కనిపించడంలో తప్పు లేదు.
పురుషులతో సమానంగా వారు పేలుడు పదార్ధాలు అమర్చి, పేల్చి, లోతుల్లోకి దిగి, అత్యంత సాహసమైన, దుర్లభమైన బావులు తవ్వడం లాంటి పనులు చేసారు. క్లిష్టమైన పనుల్లో స్త్రీ సహాయకురాలిగా, పురుషుడు ప్రధాన పాత్ర గా కాకుండా దానికి భిన్నంగా పని చేసి చూపించారు. వారు బావులు తవ్వినపుడు పురుషులు తట్టలు మోసారు. వారు లాండ్ మైన్ లను అసెంబుల్ చేసారు, అమర్చారు. పేలుడు పదార్ధాలను వాడారు. ఆయుధాలను మోసారు. మైళ్ళ కొద్దీ అడవుల్లో, నగరాల్లో, సైనికులమీద దాడులకు దిగారు. ఆత్మాహుతి దాడుల్లో ఒక్క మారు కూడా వెనుతిరిగి చూడకుండా పాల్గొన్నారు. పోరాటం చివరి రోజుల్లో ట్రక్కుల కొద్దీ శవాలై తేలారు. సముద్రం మధ్యలో శ్రీలంక నేవీ మీద కు దాడికి దిగారు. పురుషుల కన్నా ఎక్కువ సమర్ధవంతంగా పని చేసారు.
తమ జెండర్ సాకు గా చూపించి ఏ పనీ చెయ్యడానికి వెరవలేదు. శక్తికి మించిన పనులే చేసారు. ప్రాణాల్ని తృణప్రాయంగా వదిలారు. అయితే శ్రీలంక ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా, ఉక్కుపాదంతో నలువైపుల నుండీ చుట్టుముట్టి వేలాదిగా దళ సభ్యుల్ని తుడిచిపెట్టేసినపుడు, పురుషుల కన్నా ఎక్కువ హింసకి లోనై చంపబడ్డారు. పైగా తమని తాము నిరూపించుకోవడానికి పురుషుల కన్నా ఎక్కువే కష్టపడ్డారు. ప్రభాకరన్ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండేందుకు, ఆయన మీద గౌరవంతో ఎన్నో సమస్యలని ఎదుర్కొన్నారు. పోరాటం ముగిసి, నాయకులంతా మరణించాకా, హింసని మర్చిపోయేందుకు శ్రీలంక సమాజం చేసిన ప్రయత్నాలలో ఈ మహిళా తీవ్రవాదులని కూడా స్మృతి పథం లోంచీ అందరూ తుడిచేసారు.
ఈ మహిళా తీవ్రవాదుల గురించి సెప్టెంబరు 11 దాడుల ముందు వరకూ ఎవరూ, ముఖ్యంగా లంక మరియు విదేశీ మీడియా అస్సలు పట్టించుకోనే లేదు. సంఖ్యాపరంగా కూడా, వ్యవస్థాగత అమరిక లోనూ, తక్కిన సంస్థల్లో మహిళా తీవ్రవాదుల కన్నా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ ఫలితాలనీ, లక్ష్యాలనీ సాధించినా, వీరికి తగిన గుర్తింపు అప్పటి వరకూ దొరకనే లేదు. 9/11 తరవాత పాశ్చాత్య, లంకీయ మహిళా జర్నలిస్టులు సైతం ఈ మహిళా తీవ్రవాదుల పాత్రపై దృష్టి సారించారు. వీరి ప్రవేశం, దళాల వ్యవస్థా, పనితీరు, ప్రాధాన్యత, ధైర్యం వగైరా అంశాల పై పరిశోధన మొదలైంది.
సింహళ, తమిళ సమాజాలలో సాధారణ మహిళల నుంచీ ఈ తీవ్రవాద మహిళలకు పెద్ద సానుభూతి ఏమీ దక్కలేదు. ఎప్పుడో పాత తరపు స్త్రీలు మాత్రం, కట్టుబాట్లను చేదించి, ఆభరణాలను త్యజించి, ఆయుధాలు ధరించి, పురుషుల దుస్తులు ధరించి, ఏదో లక్ష్యం కోసం పని చేస్తున్న ఈ తీవ్రవాద మహిళలని కాస్త ఆదరంగా చూసినా, అంతకు మించి గుర్తింపు దక్కలేదు.
మే 2009 లో ప్రభాకరన్, అతని ఇద్దరు కొడుకులూ, కూతురూ, భార్యా, విధేయ అనుచరులూ హత్య కావింపబడ్డాక, ఈలం పోరాటం చాలా దారుణ పరిస్థితుల్లో ముగిసింది. అప్పటి నుండీ శ్రీలంక రాజకీయ వాతావరణం, సమాజ వాతావరణం చాలా మారిపోయింది. పోరాటం ముగిసాకా, ఎల్.టీ.టీ.యీ ఏకాకిత్వం ఎక్కువయిపోయింది. సమాజం లో ప్రతి ఒక్కరూ, వీరికి దూరంగా జరిగారు. ఏతావాతా విదేశీ మీడియా, సానుభూతిపరులూ, లంక సైన్యం సాగించిన అక్రమ నిరంకుశ రాక్షస విధానాలనూ, యుద్ధ నేరాలనూ రికార్డు చేసాయి. హిలరీ క్లింటన్ ఈ యుద్ధ నేరాలను గర్హిస్తూ చేసిన చిన్న ప్రకటనలు తప్ప ఎక్కువ పనేమీ జరగలేదు.
ఈలం పోరాటం లో ఈ మహిళల పాత్ర మాత్రం అసామాన్యమైనది. తమ నాయకుడు, అతని భార్యను మాత్రం సాంప్రదాయ కుటుంబ చట్రంలో భద్రంగా ఉంచి, మిగిలిన మహిళలను మాత్రం తీవ్రవాదం లోకి తీసుకొచ్చి, పోరాటంలో వాడుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎల్.టీ.టీ.ఈ ప్రధానంగా ఆత్మాహుతి దళం. ఇందులో ఒక మాటు ప్రవేశించాక, నిష్క్రమణ మరణం ద్వారానే అని తెలిసీ, తమిళ దేశపు లక్ష్య సాధన కోసం altruistic suicides కి ముందుకొచ్చిన ఈ వేలాది మహిళలు చరిత్ర లో ఓ భాగంగా మిగిలిపోయారు.
ఎల్.టీ.టీ.ఈ లో ఈ మహిళల active role సాధారణ శ్రీలంక /తమిళ సమాజం లో మహిళల సమానత్వ కాంక్ష కూ, వారి రాజకీయ సామాజిక చైతన్యానికీ సూచిక. ఈ మహిళలు, పురుషుల చాటు రెండో తరగతి ప్రజల్లా ఉండి పోకుండా, తమ కు ఎదురైన వ్యక్తిగత, జాతిగత అన్యాయాలను తమకు చాతనయినంత మేరకు ఎదుర్కొన్నారు. అసలు సమాజం కూడా ముప్పయేళ్ళ హింస కు ఎందరో మనుషులనీ కోల్పోయింది. తప్పనిసరి గా లక్షలాది మంది దేశాలు పట్టి పారిపోయారు.
పోరాటం ముగింపు దశలో ఎందరో అమాయక జనం తీవ్రవాదుల, సైనికుక చేతుల్లో చనిపోయారు. రచయిత్రి ఇంటర్యూ చేసిన మహిళా తీవ్రవాదులు మామూలు గృహిణులు, పిల్లలు, యువతులు.. వివిధ వయసుల్లో, వివిధ నైపుణ్యాలతో యుద్ధాన్నీ, హింసనీ దగ్ఫరగా చూసిన వారు. వారికి ఈ ఆయుధాలు, పోరాటం, దళాలలో చిక్కే గౌరవం, నిరాశ గా ఉండిపోకుండా ఏదో చేసామన్న తృప్తి ని ఇవ్వడం గురించి మాట్లాడారు. సమాజం లో మహిళల పట్ల మారాల్సిన దృక్పథం గురించి, తమ తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు.
ఈలం గురించి వివిధ వెబ్ సైట్ లలో, ఎల్.టీ.టీ.ఈ అధికారిక వెబ్ సైట్ల లో జెండర్ బేస్డ్ డాటా కోసం వీలయినంత మేర ప్రయత్నించినట్టు రచయిత్రి చాలా చోట్ల చెప్పడం బావుంది. నిజానికి ఇందరు స్త్రీలు, ఇందరు పురుషులు అని ఎక్కడా సమాచారం దొరకక కుస్తీ పడాల్సొచ్చింది. అయితే ప్రతీ సభ్యుడు, స్త్రీ పురుష బేధం లేకుండా సాధించిన వివిధ విజయాల గురించి వెబ్ సైట్ లు యధాతధంగా ప్రచురించడం ప్రస్తావించారు.
ఏదేమైనా ఈ తమిళ మహిళా పులులు ప్రత్యేకమైన పాత్ర పోషించి, తీవ్ర వా దాని కున్న dimensions ని మార్చేసారనడం లో సందేహం లేదు. 240 పేజీల ఈ రీసెర్చ్ గ్రంధం చదివి ఆ తరవాత ఊరుకోక అందులో కనిపించిన సోర్స్ ల గురించి నెట్ లో వెతికి భీభత్స రణ చరిత్ర ని చదివి, తీవ్రవాదాన్ని అణచడం లో శ్రీలంక గొప్పగా చెప్పుకునే శ్రీలంక మోడల్ మిలటరీ ప్లాన్ గురించి ఆలోచించి ఆశ్చర్యం కలిగింది. మొత్తానికి ఇప్పుడు శ్రీలంక శాంతియుత దేశం. పర్యాటక ప్రాంతం ఈలం తుడిచిపెట్టబడ్డ చరిత్ర. ఈ మహిళల మార్క్ మాత్రం ప్రపంచంలో ఎక్కడో లీలగా ఉండిపోతుంది.
-Finished-
02/08/2019
Women in Terrorism Case of the LTTE by Tamara Herath - 4
మాలతి
21 మే 1991 న తమిళనాడు శ్రీ పెరంబదూర్ లో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఎల్ టీ టీ ఈ కు చెందిన మహిళా తీవ్రవాది ధను (అసలు పేరు థెన్ మోళి రాజరత్నం) నడుముకు చుట్టుకున్న బెల్టు బాంబు పేల్చి ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో రాజీవ్, ధనులతో సహా వారికి చుట్టుపక్కల ఉన్న 16 మంది దుర్మరణం పాలయ్యారు. రాజకీయ కల్లోలం సృష్టించిన ఈ ఘటన ఆ తీవ్రవాద సంస్థ తుడిచిపెట్టబడడానికి, భారత ప్రజల్లో శ్రీలంక తమిళుల పట్ల ఉన్న సానుభూతిని చెరిపేయడానికీ దోహదపడింది. బాలసింగం అన్నట్టు ఇదో దురదృష్టకరమైన సంఘటన. ప్రభాకరన్ వ్యూహాత్మక తప్పిదం. అయితే, ధను తీవ్రవాదంలో మహిళల పాత్ర పట్ల ప్రపంచ దృక్కోణాన్ని మార్చేసింది.
దాడి సఫలం అయిన వెంటనే, వాటి తీవ్ర రాజకీయ పరిణామాలను ఊహించిన ఎల్.టీ.టీ.ఈ. ఈ హత్య వెనుక తమ పాత్ర లేదని వాదించింది. ధను ఐ.పీ.కే.ఎఫ్ చేతిలో అత్యాచార బాధితురాలని, ఆమె వ్యక్తిగతంగా ప్రతీకారం తీర్చుకోవడానికే రాజీవ్ ని చంపిందనీ ప్రకటించింది. ఐ.పీ.కే.ఎఫ్ 1987 - 1990 వరకూ జఫ్నా లో పనిచేసింది. మహిళల శీలం, పవిత్రతా లకు సాధారణంగా సమాజంలో ఓ గౌరవనీయమైన స్థానం ఉంటుంది. రాజ్యం / ఐపీకేఎఫ్ / శ్రీలంక దళాలు, తమిళులను కృంగదీయడానికి సామూహిక హత్యలూ, అత్యాచారాలకు తెగబడ్డాయన్నది నిజం. అలా దాడులకు, తరచూ ఇంటిని / తమ స్వస్థలాలనూ వొదిలి పారిపోవాల్సి రావడం, చెట్లకిందే సమూహాలలో బ్రతుకు జీవుడా ని జీవించడం, కళ్ళముందే అయినవారిని కోల్పోవడం, చాలా మంది మహిళలను ప్రతీకారేచ్చ తో రగిలేటట్టు చేసాయి. ఏ రక్త సంబందమూ ఇవ్వలేని బాంధవ్యాన్ని ఈలం పోరాటం కల్పించింది. వారు ఇలాంటి తీవ్రవాద / ఆత్మాహుతి దాడికి పాల్పడి, వారు తమ పవిత్రత ని తిరిగి పొందవచ్చనీ, చెరచపడ్డ ఆడది, తిరగబడటానికి, చంపడానికీ తుపాకీ చేపట్టడం, తిరుగులేని జవాబు గా భావించడం, ఓ అధికారంగా భావించడం జరిగింది. ఏ యుద్ధంలో అయినా మహిళ ల పట్ల ఘోర అన్యాయాలు జరుగుతాయి. అత్యాచారం వాటిలో మొదటిది. భర్తలనూ, పిల్లలనూ చంపడం, అశక్తురాలను చేయడం మిగతావి. వాటికి ప్రతీకారం తీర్చుకునేందుకు "తమిళ పులులు" వారికి అవకాశం ఇచ్చారు.
రేప్ కు గురయిన స్త్రీ, బయట సమాజంలో అంతగా గౌరవింపబడదు. కానీ తమిళ పులుల సమాజంలో వారికి పురుషులతో సమాన హోదా వుంది. పైగా స్త్రీ సహజ నైజం త్యాగం (సమాజపు చట్రాల ఆలోచనల్లో, స్త్రీ తప్పనిసరిగా త్యాగధనే) కాబట్టి, ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ మహిళ అయితే ఇంకా గౌరవింపబడేది. హమాస్ లాంటి చాందసవాద ముస్లిం సంస్థల్లో పురుషులతో సమానంగా తీవ్రవాద ఆత్మాహుతి దాడులకు అనుమతించాలని ఉద్యమించిన మహిళలకు ఆ అవకాశం ఇవ్వడానికి మొదట తటపటాయించినా, తిరుగులేని జవాబుదారీతనంతో, ఖచ్చితత్వం తో వారు ఈ దాడులకు దిగడం తో స్త్రీ ల ఉగ్రవాద పాత్రల పట్ల, వారికి కొన్ని కీలక ప్రదేశాల్లో పురుషులకు కూడా దొరకని ప్రవేశావకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం ఎంత లాభదాయకమో హమాస్, ఇస్లామిక్ జిహాద్ వగైరా సంస్థలు వెంటనే గుర్తించాయి.
అందరు మంచి మహిళల లాగే ఈ తీవ్రవాద ముస్లిం మహిళలు కూడా, టార్గెట్ వరకూ ఒక మగ మనిషితో వచ్చారు. ఈ మగ సహచరుడు, బహుశా వీరు దాడి చేస్తారా చెయ్యరా చూడడానికి వచ్చినట్టు కూడా అనుకోవచ్చు. వాళ్ళ కళ్ళు విప్పార్చుకునేలా దాడులు చేసిన మహిళలు, మహిళా తీవ్రవాదానికి ఒక పెద్ద పీట వేయించారు. కాశ్మీర్ లో ఈ మధ్య వరకూ చిన్న పిల్లలు, ముక్కు పచ్చలారని బాలురు, డబ్బులకు రాళ్ళు రువ్వడం ప్రచార మాధ్యమాలలో బాగా చూసాం. ఈ పసివాళ్ళే, ఆర్మీ కాన్వాయి మీద చేతితో క్లిప్ తీసి, విసిరే గ్రనేడ్ లనూ అవలోకగా విసురుతారు. అలా చిన్న చిన్న పసివారు కూడా తీవ్రవాదంలో భాగం కావడం సామాన్యం. శ్రీలంక ఈలం పోరాటంలో వేలాది పిల్లలు, మహిళలూ దళంలో చేరారు. చావు వీరికి, తమ జీవితంలో ఎదురవబోయే ఓ ముప్పు. ఎన్నో పరిణామాల వంటిదే.
అయితే ఆత్మాహుతి దళంలో చేరడం, స్లీపర్లు గా పనిచేయడం, వారి అవసరం పడినపుడు తమ నేతకు తలవంపులు తేకుండా, 100% సఫలత తో దాడికి తెగబడడం, వారు చాలా ఇష్టంగా ఎంచుకునే ప్రక్రియ. మహిళల కైతే, తమ పవిత్రతని తిరిగి పొందేందుకు ఇదో సాధనం.
నిజానికి ఎల్.టీ.టీ.ఈ. దళాలు తప్పనిసరిగా తమ ట్రైనింగ్ ముగిసిన గుర్తుగా మెళ్ళో ఓ కుప్పి / సైనేడ్ బిళ్ళ ను వేసుకునే వారు. గాజు కుప్పె / తావీజు లో పేక్ చేసిన ఆ సైనేడ్, రక్త ప్రవాహంలో చేరిన వెంటనే 5-10 నిముషాల పాటు విపరీతమైన వేదనకు గురి చేసి, మనిషి ప్రాణాన్ని తీస్తుంది. మోతాదు తక్కువ అయితే, మెదడు కోలుకోలేనంతగా దెబ్బ తింటుంది. మిలిటెంట్ విద్యార్ధి ఉద్యమంలో పోలీసులకు పట్టుబడే ముందు శివకుమార్ అనే నాయకుడు సైనేడ్ సేవించి 1974 లో ఆత్మహత్య చేసుకోవడం, ప్రభాకరన్ దృష్టిలో పడింది.
నిజానికి సైనైడ్ మరణం అత్యంత బాధ తో, హృదయవిదారకమైన వేదనతో నిండినది. కానీ పోలీస్ / సైనికుల చేతిలో విపరీతమైన చిత్రవధ, తరవాత తప్పని భయంకరమైన మృత్యువును తప్పించుకునేందుకు సైనైడ్ ను నమ్ముకుంది ఎల్.టీ.టీ.ఈ. కొత్తల్లో ఈ కుప్పె ను కొరికి, నాలుక/పెదవుల మీద అయిన గాయం ద్వారా సైనైడ్ ను తీసుకునేవారు. కానీ గట్టి గా ఉంటూండే కుప్పెను అంత గట్టిగా కొరకడం అన్నిసార్లూ కుదిరేది కాదు. గాయం చిన్నదయినా, మోతాదు తగ్గినా విపరీత పరిణామాలుండేవి.
ఆఖరికి ఈ కుప్పె లో ఆధునిక మార్పులు వచ్చి, సన్నని గాజు కుప్పెలు వాడటం మొదలయింది. భారత దేశాన్నిండీ దీన్ని దిగుమతి చేసుకునే వారు. తీవ్ర గాయాలతో శ్రీలంక దళాలకు చిక్కేసే పరిస్థితుల్లో సైనైడ్ తిని ఆత్మహత్య చేసుకున్న మొదటి మహిళా సభ్యురాలు మాలతి వీర మరణాన్ని, అక్టోబర్ 2009 లో చివరి పోరాటం లో ఓడిపోయే వరకూ ఎల్.టీ.టీ.ఈ. గౌరవిస్తూనే ఉంది. సైనేడ్ మరణాలను చాలా వరకూ హాయైన మరణంగా ప్రచారం చేసేవారు. ఎందుకంటే దొరికిపోయి, తమ తోటివారికి ప్రమాదం గా తయారవకుండా, చనిపోవడమే క్షేమమని భావించేవారు.
ఎల్.టీ.టీ.ఈ, చాలా విషయాల్లో మిగతా తీవ్రవాద దళాల కన్నా స్త్రీ సమానత్వం లో మెరుగు. ఏ నమ్మకాల మీద, బ్రెయిన్ వాషింగ్ మీదనో, తమిళ బాధిత స్త్రీలు దళంలో చేరినపుడు వారికి పురుషులతో సమాన అవకాశాలు కల్పించింది. బెదురు లేని, ఇంటిలాంటి వాతావరణాన్నిచ్చింది. అప్పటి వరకూ సామాన్యంగా జీవించేందుకు పోరాడిన సామాన్య మహిళలు కాస్తా, సమాజం కట్టుబాట్లని వదిలి, పురుషులతో సమానమైన ట్రైనింగ్, ఆయుధాలు, లక్ష్య నిర్దేశ్యాలలో, నాయకత్వ నిర్ణయాలలో భాగం తీసుకోవడం మొదలయింది.
ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వారి కుటుంబాలకి, ప్రతీ తీవ్రవాద సంస్థా నెలకింత అని స్టైపెండ్ ఇస్తుంది. కానీ హమాస్, ఇస్లామిక్ జిహాద్ లు పురుషుడి కుటుంబానికి ఎక్కువా, మహిళా తీవ్రవాది కుటుంబానికి అందులో సగం ఇచ్చేవారు. ఎందుకంటే, బ్రతికి ఉండుంటే, పురుషుడు తన కుటుంబానికి ఏదో ఓ పని చేసుకుని డబ్బు సంపాయించి ఇచ్చిఏవాడు కనుక. కానీ ఎల్.టీ.టీ.ఈ అలాంటి తేడాలేవీ చూపించలేదు. అయితే ఈ తరహా సొమ్ము ను తమిళ కుటుంబాలు ఎంత చొప్పున అందుకునేవో బయటికి తెలిసేది కాదు. ఒకవేళ వారు దాన్ని నిరాకరించినా, ఈలం సమాజంలో ఆయా కుటుంబాలకు సముచిత గౌరవం దక్కేది.
ప్రతీ 27 నవంబరు నా, వీరుల స్మారక దినం రోజు అన్న ప్రభాకరన్ ఆయా కుటుంబాలను ఉద్దేశించి బరువైన ప్రసంగం చేసేవాడు. ఆత్మాహుతి దాడి చేసుకున్న మొదటి పురుషుడు కేప్టెన్ మిల్లర్ కు ఎంత గౌరవం దక్కిందో, సైనైడ్ తిని ఆత్మహత్య చేసుకున్న మొదటి మహిళగా మాలతి కీ అంతే గౌరవం దక్కింది. వివిధ యుద్దాలలో, ఆత్మాహుతి దాడుల్లో చనిపోయిన ఈలమ్ వీరుల త్యాగాలు ఊరికేనే వృధా కావనీ, పోరాటానికి జవస్త్వాలు కూర్చడానికి ప్రాణాల్నే బలిదానం చేసిన వీర సైనికులమేలు మరవలేనివనీ ప్రభాకరన్ వల్లించడం ఆయా కుటుంబాలను సాంత్వన పరచేవి.
27/07/2019
Get Published - మహమ్మద్ ఖదీర్ బాబు
"న్యూ బాంబే టైలర్స్, ఇతర కథలు" అనే మహమ్మద్ ఖదీర్ బాబు గారి 2012 నాటి కథా సంకలనం లో నాకు నచ్చిన కథ ఈ 'గెట్ పబ్లిష్డ్'. ఒక రచయిత కి ఒక ప్రత్యేక శైలి ఉండటం, దానికి మనం అలవాటు పడడం, మరీ ఎక్కువయినప్పుడు చిరాకు పడడం, మామూలు గా జరుగుతూ ఉంటుంది. ఫలానా ఆయన / ఆమె ఇలాంటి కథలే రాస్తారూ అని ఓ ముద్ర పడిపోయాక, ఆయా కథలని చదివాక ఒకే అనుభూతి కంటిన్యూ అవదు. ఎందుకో నాకు ఇది వర్తిస్తుంది. పైగా కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు కూడా సాహిత్యం పేరుతో చలామణీ కావడం. చలామణీ అయ్యేలా ప్రచారానికి దిగడమూ, పొలిటికల్లీ కరెక్ట్ కావడం కోసం ప్రయాస కూడా మన దృష్టి ని దాటదు.
నిజానికి న్యూ బాంబే టైలర్స్ మరియు ఇతర కథల లో అన్ని కథలూ బానే ఉన్నాయి. అవన్నీ వివిధ పత్రికలలో ప్రచురింపబడినవీ, అందరూ మెచ్చుకున్నవీ. కొన్ని కథలు ముగించాకయితే ఒక క్షణం ఆగి, ఆలోచించుకోవాలనిపించేలా ఉన్నాయి. కొన్ని బీద ముస్లీము కుటుంబాల కథలు, కొన్ని మామూలు హిందూ కథలు, దురదృష్టవంతుల కథలు, పోరాట వీరుల కథలు ఉన్నాయి. కాకపోతే, అవన్నీ దాదాపు ఒకే మూడ్ లో ఉన్నట్టు అనిపించాయి. కొన్ని మరీ అతిగానూ ఉన్నట్టనిపించాయి.
"గెట్ పబ్లిష్డ్" (2010) క్లాసిక్ గా, చాలా బావుంది. ఈ కథ చెప్పడంలో రచయిత అతి ఆత్మ విశ్వాసం ఏదీ ప్రదర్శించలేదు. ఒక నిబద్ధత కల ముస్లిం జర్నలిస్ట్ ఒక బీద ముస్లిము కుటుంబం గురించి రాసిన చిన్న కథ ఇది. అయితే ఇది టెర్రరిజం కు సంబంధించిన బీద కథ. అదీ విశేషం. మహమ్మదీయుల తీవ్రవాదం వల్ల ఎవరయ్యా నష్టపోయారూ అంటే సాటి మహమ్మదీయులే. హిందూ తీవ్రవాదుల వల్ల నష్టపోయిందీ మహమ్మదీయులే. ఈ విషయాన్ని అందరూ కళ్ళతో చూస్తారు, చెవులతో వింటారు గానీ, కాయితం మీద పెట్టరు. ఏదో అడ్డుగోడ అది.
తెలంగాణా రాజధానిలో ఓ మసీదు కు నమాజు కి తరచూ వెళ్తూండే ఆంధ్రా ముస్లీము కధకుడు. ఆయన వేష భాషలేవీ హైదరాబాదీయంగా వుండవు. అసలు సాటి ముస్లీములే గుర్తు పట్టరే అన్నట్టుంటాడు. అనగా, మతాన్ని తన భుజాన వేసుకుని తిరిగే మనిషి కాదు ఆయన. సరే.. వెళ్తున్నాడా, ఆ మసీదులో ఓ చిన్ని బాలుడు. బీద వాడు. ప్రార్ధనలకు వచ్చే వారి చెప్పులకు కాపలాగా ఉండి రెండూ మూడు రూపాయలు సంపాదిస్తూ ఉండే మామూలు పిల్ల వాడు. ఈ అబ్బాయితో కథకుడికి చిన్న అనుబంధం. అదీ ట్రిగ్గర్ ఇక్కడ. వేరే ఎవరి కథ నో అయితె ఇంత ఇదిగా చెప్పుండునా ఈయన ? ఈ బుడ్డోడి కథ కాబట్టి బాగా చెప్పాడు.
అసలు ఎవరి కష్టాన్నయినా మనం మనసులతో చూస్తే గానీ, వారి చెప్పుల్లో దూరితే గానీ అర్ధం చేసుకోలేం. అదే ఈ కథ. ఈ మసీదులో చెప్పులు కాపలా కాస్తూండే అబ్బాయికి ఓ అమ్మా, నాన్న. నాన్న అంటే పిల్లాడికి చాలా అభిమానం, ప్రేమ. తండ్రి జీవితంలో ఒకప్పుడు బాగా బ్రతికి ప్రస్తుతానికి చెడ్డవాడు. తల్లి దాదాపు యాచకురాలు.. ప్రజలామెకు ఫకీరు నామం కూడా తగిలించారు. ఈ కుటుంబం, డబ్బు లేకపోయినా మనశ్శాంతిగానే బ్రతుకుతూంది. కానీ ఓ ఉగ్రదాడి తరవాత అనుమానితుడి గా పిల్లాడి తండ్రిని ఓ రాత్రి వేళ భోజనం చేస్తుండగా వచ్చి, పోలీసులు నిర్బంధంగా అపహరిస్తారు.
తీవ్రవాద చట్టాలూ, తీవ్రవాద న్యాయాలూ చాలా తీవ్రంగా ఉంటాయి. తండ్రి తన కళ్ళ ముందే అలా మాయమవడం చూసిన పిల్లాడు భయంతో జ్వరం తెచ్చుకుంటాడు. అదృష్టం బావుండి కొన్నాళ్ళకు అమాయకుడైన తండ్రిని పోలీసులు విడిచిపెడతారు. బందీగా ఉన్నప్పుడు విపరీతమైన చిత్రవధకు గురయిన ఆ తండ్రి ఇప్పుడో జీవచ్చవం. ఆ కుటుంబం పడ్డ కష్టాలనూ, పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ నీ దగ్గరగా చూసి, కథకుడు రాసిన రిపోర్ట్, ఆయన రాసినది చదివి స్పందించిన పత్రిక సంపాదకుడి మానవత్వ స్పందనా ఈ కథ. ఈ జీవచ్చవమూ, రోజూ రాత్రవగానే జ్వరం తెచ్చేసుకుని భయంతో వొణికే చిన్న పిల్లాడూ.. వీళ్ళ జీవితాలు ఒడ్డున పడేలా చేసేది ఏది ? పైగా ఆ కుటుంబం ధనసాయం తీసుకోదు.
ప్రధాన మీడియాలో ఇలాంటి ముస్లీం గొంతులని వినిపించి, వారి తరఫు కథ ను చెప్పడానికి ప్రయత్నిస్తే ఆ కథనాలు ప్రచురితమవుతాయా..? ఎటువంటి ముద్రా వేయకుండా ప్రజలు అలాంటి కథనాలని చదువుతారా అనేది కథకుడు సంధించిన సూటి ప్రశ్న. ఈ సంకలనం లో కొన్ని మిగతా ముస్లిం కథలు కూడా ఇవే ప్రశ్నలు వేస్తాయి. పాత బస్తీ విలాసమూ, మహమ్మదీయ నామధేయమూ బ్రతుక్కి అడ్డంకిగా మారిన వేలాది యువకుల గురించి ప్రస్తావన ఉంటుంది.
ఇలాంటి కథలు రాయాలంటే అరుంధతీ రాయ్ కే సాధ్యం. అలా నిర్భయంగా ప్రశ్నించాలంటే లౌక్యం చొక్కా విప్పేసి, ధైర్యం చొక్కా తొడుక్కోవాలి. కాబట్టి, ఒక తెలుగు కథ గా ఇది చాలా విచిత్రమైన కథ. అడ కత్తెరలో ఉన్న పోక చెక్కల్నిగురించి ఇలా రాసి, ప్రచురించి, మానవత్వం ప్రదర్శించినందుకు రచయితకు అభినందనలు.
ఈ మధ్య కాలంలో నాకు చాలా చాలా తక్కువ తెలుగు కథలు నచ్చుతున్నాయి. ఊరికే డీటైల్స్ ఎక్కువుండే రచనలు అస్సలు నచ్చట్లేదు. ఎక్కడికక్కడ చిన్న చిన్నభాగాలుగా, ముందుకూ, వెనకకూ జరుగుతూ సంభాషణ లాంటి కథ నచ్చడం చాలా బావుంది. మనకి కావలసింది చేంజ్. బాధితుడి కథ విన్నాక, అతని వెర్షన్ పట్ల కూడా సానుభూతి కలగాలి. అప్పుడు సమాజం కదులుతుంది. ముస్లిం కథలైనా, వేరే ఏమయినా, ఇవే చేస్తాయి. కానీ పుస్తకాల, ప్రచురణల మార్కెట్, పాఠకుల మార్కెట్ కన్నా చాలా విభిన్నంగా ఉండటం ఇప్పుడిప్పుడే తెలుస్తూంది. కాబట్టి కొన్ని ప్రచురణ కి నోచుకోవడం, నోచుకోకపోవడం గురించి ఎవరి అభిప్రాయాలు వారివి. అందుకే ఇది రొటీన్ కన్నా భిన్నం. ఇలాంటిది ఇంకోటి రాదు. వచ్చినా ఒకటే ట్రంప్ కార్డ్ ఎక్కువ నాళ్ళు చెల్లదూనూ.

***
12/04/2019
Women in Terrorism Case of the LTTE by Tamara Herath - 3
Part - 3
ఈ పుస్తకంలో శ్రీలంక చరిత్ర ని పూర్తిగా చర్చించండం జరిగింది. సింహళీయులు - తమిళులు మధ్య తగువు ఎలా మొదలయిందో వివరంగా రాసారు. శ్రీలంక చరిత్ర ప్రకారం శ్రీలంకీయులలో, సింహానికి పుట్టిన సింహళులు కాకుండా హైనా సంతానం తరాచ్చులూ, కాకి సంతానం బలిభోజకులు, కుందేలు సంతానం లంబకన్నులు, నెమలి సంతానం మోరియాలూ ఉన్నారు. సింహళులు, భారత దేశం నుండీ వెళ్ళగొట్టబడిన ఒక రాజు, తంబప్ని ప్రాంతంలో నాలుగో, ఆరో శతాబ్దంలో ఒక సిమ్హాన్ని వివాహం చేసుకోవడం ద్వారా జన్మించారు. పైన చెప్పిన వివిధ జంతువులు ఆయా జాతులు ఆరాధించిన దేవతలు కావచ్చు. వీటికి ఆధారాలు ఏమీ లేవు. వారి పురాణ గాధల ప్రకారం కావచ్చు. ఉదాహరణ కి ఆంధృలు నాగులు అని ఒక థియరీ ఉంది. మహాభారత యుద్ధంలో నాగులు పాల్గొన్నారు. వారి సంతానమే ఆంధృలు అంటారు. అలాగే వీళ్ళూ. ఇప్పుడు ఈ సింహాలు తాము, తమిళుల మీదా, ఇతర తెగల మీదా ఆధిక్యం ప్రదర్శించడం - దానికి తిరుగుబాటు గా ప్రభాకరన్ పులులని ప్రతీక గా తీసుకుని బ్లాక్ టైగర్స్ ని తన జెండా గా మార్చుకోవడం, చరిత్ర.
నిజానికి డా. తమారా హెరాథ్ సింహళ మూలాలున్న బ్రిటిష్ వనిత. అయినా తూకం ఎటూ బరువెక్కకుండా ఈ ఈలం పోరాటం తాలూకూ మూలాలనూ వేర్లనూ చక్కగా పక్షపాతం లేకుండా టైం, డేట్ లైన్లతో సహా వివరించారు. సింహళాన్ని అధికార భాషగా తమిళుల మీద రుద్దడం ఇందులో ఒక భాగం. సింహళ భాష రానివారికి ఉద్యోగాలు దొరకవు. బ్రతుకు తెరవు లేదు. వివక్ష రూపాలనూ, నెమ్మదిగా మొదలయిన అసంతృప్తి తీవ్ర అసహనంగా రూపుదిద్దుకుని తీవ్రవాదం గా రూపాంతరం చెందడం ఇందులో కళ్ళకు కట్టినట్టు రచయిత్రి చెప్తారు.
నిజానికి ఈలం అంటే అర్థం శ్రీలంకే. తమిళ ఈలం అంటే శ్రీలంక లో తమిళ భాగం. శ్రీలంక యొక్క తమిళ పదం 'ఈలంకై' కు మరో రూపమే ఈలం. భాషా ప్రాతిపదికన శ్రీలంక సమాజం చీలిపోవడానికి బ్రిటీషు వారి 'విభజించు పాలించు' సూత్రమే కారణం. అది రాను రానూ తమిళు ల పై వివక్ష, అత్యాచారానికీ. వారి తిరుగుబాటు కూ, మరిన్ని వ్యధలకూ కారణమయింది. ఈ ఈలం పోరాటం 1970 లలోనే మొదలయింది.
ఈ ఉద్యమంలో స్త్రీల ప్రవేశం, పిల్లల ప్రవేశం, మరణాల ద్వారా తగ్గిపోతున్న దళ సంఖ్యని పెంచడానికి పనికొచ్చేది. పైగా అణిచివేత, వెలివేత, ఉన్న ఊర్లనుండీ, ఇళ్ళ నుండీ మాన ప్రాణాలు దక్కించుకుంటూ పారిపోతూ, జాఫ్నా, వన్ని లాంటి ఊర్లలో తల దాచుకున్న కుటుంబాలూ, చెట్ల కింద కుల మత, వర్గ భేధాలు లేకుండా కమ్యూన్ల మాదిరి బ్రతుకుతూ కలగలుపుకున్న స్నేహాలు, చెల్లా చెదురయిన బ్రతుకుకు, ఆగిపోయిన చదువుకూ, అత్యాచార బాధితులకూ, అందరినీ కోల్పోయిన అనాధలకూ ఎల్.టీ.టీ.యీ ఆశ్రయం ఇస్తూ అక్కున చేర్చుకోవడం మొదలయింది.
ఇళ్ళలో పెద్దవారు ప్రభాకరన్ గురించి, అతని దళం గురించీ అబ్బురంగా చెప్పుకోవడం, ప్రభాకరన్ ప్రదర్శించే నైపుణ్యమైన పెద్దన్న తరహా లక్షణాలు, మెరిసే బూట్లూ, పులిచారల యూనిఫాం, చేతిలో తళుక్కుమనే తుపాకీ, మెడలో రక్షణ కోసం ఉండే సైనేడ్ - ఇవన్నీ పెద్ద ఆకర్షణలు. ఇంకే భవిష్యతూ లేని తరానికి ఈ వాలంటీరింగ్ తప్ప వేరే దారి లేదు. అలా అని ప్రతీ అత్యాచార బాధితురాలూ ఈలం పోరాటంలో చేరినట్టు కాదు. ప్రతి ఆత్మాహుతి దాడి జరిపిన మహిళా, అత్యాచార బాధితురాలు కాదు. కానీ ఎక్కువ సార్లు ఇదే జరిగింది. వారిని బ్రెయిన్ వాష్ చేయడం సులభం. ఇదో ఆబ్లిగేటరీ ఆల్ట్రూయిస్టిక్ సూయిసైడ్.
పైగా తమిళులపై జరిగిన అకృత్యాలలో భాగంగా గాంగ్ రేప్ లకు గురయిన మహిళలకు తమ శరీరం అపవిత్రం అయిందనీ, ఆత్మాహుతి దాడి ద్వారా దాన్ని పునీతం చేసుకోవచ్చనీ, (అగ్నిప్రవేశం) లేదా ఇలా ప్రతీకారం తీసుకోవచ్చనీ కొన్ని భావాలు అప్పటికే పాతుకుపోయి ఉండేవి. తమని ప్రత్యక్షంగా అతిక్రమించిన వ్యక్తుల మీద ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా ఈ పతనానికి కారణమైన నేతల మీదా, వ్యవస్థ మీదా ప్రతీకారం తీసుకోవడం ద్వారా సమాజానికో సందేశం ఇవ్వడానికీ బెల్టు బాంబు ఉపయోగపడేది.
పైగా ప్రభాకరన్ దళంలో అత్యాచార బాధితులని తక్కువగా చూడడం, తక్కువ కులాల వారిని వివక్ష తో చూడడం అలాంటివేవీ లేకపోవడం, బయట సమాజం కన్నా దళంలో దొరికిన సమానత్వం, గుర్తింపూ, బంధనాలూ వారిని ఎక్కువగా ప్రభావితం చేసేవి. ఇలా అగ్ని పునీతం అవ్వడం లాంటి ఎల్.టీ.టీ.యీ తరహా నమ్మకాలు మత పరమైన బ్రెయిన్వాషింగ్ కి ఉపయోగపడ్డాయి.
ఎల్.టీ.టీ.యీ లో అందరు దళ సభ్యులూ ఏదో రకం బాధితులే. అందరూ అన్నా, అక్కా, అలా వరసలు కట్టి పిలుచుకుంటూ ఒకే కుటుంబం లా ఉంటూండే వారు. పురుషులదో గ్రూప్, మహిళలది వేరే గ్రూప్. వారి మధ్య ఇంటరాక్షన్ తక్కువ. గెలుపు సంబరాల్లో కూడా ఎక్కడా స్త్రీ పురుషులిద్దరూ కలిసి నృత్యం చేసిన ఆనవాళ్ళు లేవు. మహిళలు వేరే గా, పురుషులు వేరే గా సంబరాలు చేసుకునే వారు. ఒక వేళ స్త్రీ పురుసుల మధ్య ప్రేమ తలెత్తితే, వారి పెళ్ళి బయటి సమాజం లొ లానే జరిగేది. తమిళుల విలువల ప్రకారం, అబ్బాయి అమ్మాయి దళ కమాండర్ కు తన ప్రేమ విషయం చెప్పి అనుమతి కోరాలి. అమ్మాయికి ఈ సంబంధం అంగీకారం అయితేనే పెళ్ళి జరిగేది. పెళ్ళయే దాకా వారు ఎప్పుడూ కలుసుకోనే కూడదు అనే నియమం తో.
పైగా ప్రభాకరన్, మాలథి (మాథి) ల పెళ్ళయే దాకా, దళంలో పెళ్ళి ని, ప్రేమలనూ నిషేదించారు. అవి దళ సభ్యులను లక్ష్యానికి దూరం చేస్తాయేమో అని భయపడ్డారు. పెళ్ళి, పిల్లలూ, ఝంఝాటం తమకు వద్దనుకున్నారు. కానీ ప్రభాకరన్ మాలతి ని కిడ్నాప్ చేసి తమిళ నాడు లో ఉంచి పెళ్ళి చేసుకోవడం పెద్ద కధ. ఆయన వివాహం తరవాత దళ సభ్యుల్లో ప్రేమ పెద్ద ఆక్షేపణ కాలేదు. అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయి ఇష్టప్రకారమే జరిగేది. అమ్మాయి ఇష్టపడకపోయినా, సమయం కోరినా ఆమె మాటకు పూర్తి విలువ ని ఇచ్చేవారు. మహిళలు సాధికారంగా ఫీల్ అవడానికి ఈ నియమం ఎంతగానో పనిచేసింది. తమ పట్ల ఇంత మానవత్వంతో వ్యవహరించే దళం వారికి కుటుంబం కన్నా ఎక్కువ అయ్యేది.
సాధారణం గా దళంలోకి రిక్రూట్మెంట్ ద్వారా గానీ వాలంటరీ గా గానీ [ఆడ, మగ] పిల్లలు, మహిళా సభ్యులు 16 లేదా అంత కన్నా చిన్న వయసులోనే చేరేవారు. ఒక లక్ష్యంతో ఆధర్శం తో చేరే వారు. వారికి పెళ్ళి పెద్ద లక్ష్యం కాదు. చాలా మంది పెళ్ళి కి ఇష్టపడలేదు కూడా. పెళ్ళి చేసుకుంటే, బయటి సమాజంలో లాగే తమ స్త్రీపాత్ర ని పోషించండానికి ఎక్కువ మంది ఇష్టపడలేదు.
తీవ్రవాదం లోకి మహిళలని మతపరంగా ఆకర్షించడం పాలస్తీనా లో ప్రయత్నాల గురించి తెలుసుకున్నాం కదా. యాసర్ అరాఫత్ పిలుపు ను అందుకుని రంగంలోకి దూకిన మహిళలని "ఆర్మీ ఆఫ్ రోజెస్" అన్నారు. 'దారీ అబూ ఆయెషా' అనే మహిళ ఇద్రిస్ తరహాలో కాకుండా పక్కా ప్రణాళిక తో, వీడియో రికార్డింగ్ తో సహా మొదటి అధికారిక ఆత్మాహుతి దాడి కి పాల్పడ్డాకా, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ నుంచీ 2003 లో ముగ్గురూ, హమాస్ నుండీ 2004 లో ఒకరూ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
హమాస్ కు చెందిన మత గురువు షేక్ యాసిన్, కొరాన్ లో స్త్రీలు ఇలాంటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకూడదని ఎక్కడా లేదనీ, వారు భేషుగ్గా పాల్గొనచ్చనీ ప్రకటించి గేట్లు బార్లా తెరిచాడు. 2004 లో 14 జూన్ న 'రీం రియాషీ' అనే మహిళ, ఒక భార్య, తల్లి, బామ్మ, అన్ని బాధ్యతలూ ఉన్న మహిళ హమాస్ తరఫున మొదటి ఆత్మాహుతి దాడికి పాల్పడి చరిత్ర సృష్టించింది. అంటే, బాదరబందీలు లేని, సమాజానికి భారమయ్యే విధవల్లాంటి వారే (వర్త్ లెస్) తీవ్ర వాద దాడి చేయక్కర్లేదు. అందరూ ఆహ్వానితులే అని దీనర్ధం.
పైగా దీనికో మత విశ్వాసం కూడా తోడ్పడింది. నలుగురిని చంపుతూ ఇలాంటి దాడిలో పొందిన వీర మరణం తరవాత దొరికిన స్వర్గంలో సర్వ సుఖాలతో పాటూ, ఒక మంచి భర్త లభించడం, తద్వారా 70 మంది బంధువులని కాపాడబడడం లాంటి బోనస్ లు కూడా ఉంటాయిట. దీని అర్ధం నాకూ తెలీదు. కానీ ఇలాంటి మత విశ్వాసం ద్వారా, మరణానంతరం, అందరికీ సాయపడగలగడం, భర్త కి సేవ వగైరాల ద్వారా మళ్ళీ బాధ్యతలని స్వీకరించడం ద్వారా స్త్రీ త్యాగధనం మరింత పెంచే ప్రయత్నం జరిగినా.. అదో నైతిక ధర్మం అన్నట్టు జరిగిన మీడియా ప్రచారం, మధ్య ప్రాచ్యంలో మహిళలు విస్తృతంగా బాంబ్ బెల్టులను ధరించేలా ఆయుధాలు చేపట్టగలిగేలా చేసింది.
Notes :
కోరా లో ఎ.టీ.టీ.యీ మహిళా బ్రిగేడ్ ల గురించీ, మహిళా సభ్యుల పాత్ర గురించీ విస్తృత వ్యాసం.
ఆర్మీ ఆఫ్ రోజెస్ - Yasser Arafat మహిళలను తమ దేశంకోసం ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడమంటూ వారిని తన 'ఆర్మీ ఆఫ్ రోజెస్' గా అభివర్ణించినప్పుడు వచ్చిన అనుకోనంత గొప్ప రెస్పాన్స్, వఫా ఇద్రిస్ దాడి, మరణం.. చక చకా జరిగిపోయాక, వేలాదిగా మహిళలు పాలస్తీనా పోరాటంలోకి దిగడం ఒక చారిత్రాత్మక మలుపు.
Shiek Yassin of Hamas
10/04/2019
Women in Terrorism Case of the LTTE by Tamara Herath - 2
Part - 2
సాధారణంగా పురుషాధిక్య సమాజంలో స్తీ కి వుండే వర్త్ లెస్ నెస్.. లేదా విలువ లేకపోవడం తీవ్రవాదంలో కూడా కనిపిస్తుంది. మాస్కో థియేటర్ దాడిలో కేవలం మహిళా ఉగ్రవాదుల శరీరాలకే బాంబు బెల్టులు కట్టి ఉన్నాయి. దీని ద్వారా స్త్రీ విలువ, పురుషుని కన్నా తక్కువే ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా ఆయా తీవ్రవాద పోరాటాల్లో ఆత్మాహుతి దాడికి ఎంచుకోబడిన స్త్రీలు, సాధారణంగా విధవలూ, పిల్లలు లేని వారు, పెళ్ళి కాని వారూ.. అలా బాధ్యతలూ, బంధనాలూ లేని వారిలోంచీ వుండేవారు. రాను రాను, పిల్లలున్న తల్లులు కూడా ప్రాణ త్యాగానికి సిద్ధపడటం మొదలయింది.
జనవరి 2002 లో యాసర్ ఆరాఫత్ దృష్టి మగ "షహీద్" ల నుంచీ మళ్ళి మహిళా "షహీదా"ల పైకి, ఆత్మాహుతి దాడుల ద్వారా వారు ఉద్యమానికి చేయబోయే సాయాన్ని అత్యంత ప్రభావవంతంగా గ్లోరిఫై చేయడాన్ పట్లా మళ్ళింది. వాళ్ళ త్యాగనిరతి ని హైలైట్ చేస్తూ, ఈ పనుల ద్వారా వారు సాధించిన సమానత్వాన్నీ, ప్రదర్శించిన నిస్స్వార్ధత నీ, ముఖ్యంగా 'స్త్రీ జీవితం' తాలూకూ బాధ్యత నీ, గుర్తు చేస్తూ వాళ్ళని ప్రభావితం చేసేలా మారింది పాలస్తీన్ ఉద్యమం.
అయితే తీవ్ర వాదంలో ఎల్.టీ.టీ.ఈ సాధించిన ఘనత ఏంటంటే, స్త్రీలని తీవ్రవాదంలోకి ఆకర్షించడం ద్వారా, చాందసవాద తమిళ శ్రీలంక సమాజంలో స్త్రీ ల పాత్రని మార్చి, తీవ్రవాదంలోనూ, బయట సమాజంలో కూడా స్త్రీల దృక్పథం మారడంలోనూ, వాళ్ళని కుల వర్గ ఆర్ధిక అంతస్తుల బేధాలు లేకుండా కలిసి పని చేసేలా చేసి, శ్రీలంక సమాజం లో మార్పు తీసుకురావడం. కొన్ని పురుషాధిక్య భావాలున్నా, సెక్సువల్ హెరాస్మెంట్ లేని, కుటుంబ వాతావరణం కల్పించడం ద్వారా, తమిళ మహిళా పులులు పూర్తి అంకిత భావంతో పని చేసేందుకు అనుగుణమైన వాతావరణాన్ని అందించడం.
ఇక్కడ పాలస్తీనా మహిళా తీవ్రవాదం లోకి వస్తే, 2000 లో 'ఆల్ అక్సా ఇంతిఫదా' తరవాత తమ బ్రతుకులు దుర్భరం అయ్యాయని వాళ్ళ కంప్లైంట్. వాళ్ళ లక్ష్యం (soft target) ఎప్పుడూ సాధారణ ప్రజలు, పౌర సమాజం, వీరి మీద ఆత్మాహుతి దాడి సులభం, ఖరీదు 150 అమెరికన్ డాలర్ల కన్నా చవుక. పైగా మహిళలకు ఒక గుర్తింపు కల్పించడానికి ఒక ఆయుధం. రెఫ్యూజీ కాంప్ లలో బ్రతుకు తిప్పలు, అష్ట కష్టాలూ పడుతూ (దీనికి ఒక సొల్యూషన్ లేదు.. బహుశా జీవితాంతమూ ఆ కేంప్ లోనే బ్రతకాలి) తమ జీవితంపై అన్ని హక్కులూ గల సోదరుల, తండ్రుల, భర్తల, కొడుకుల నిర్ణయాలపై ఆధారపడుతూ బ్రతికే బ్రతుకు కూ, తమకు కాస్తో కూస్తో సాధికారతని ఇచ్చేదీ అయిన తీవ్రవాదం వైపు వారు సులువుగానే మళ్ళారు., ఈ విలువే లేని బ్రతుకు లో చైతన్యం కోసం కొందరు ఉగ్రవాదం కోసం వస్తే, 'హమాస్', 'ఇస్లామిక్ జిహాద్' లు వారి ని తమ తమ స్వార్ధం కోసం సపోర్ట్ చేయడం, 'ఆల్ అస్కా మార్టిర్స్' సంస్థ పూర్తి లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వడమూ చేసి పూర్తి తోడ్పాటుని అందించాయి.
సాయుధ, ఆత్మాహుతి యుద్ధంలోకి స్త్రీలను ఆరాఫత్ అధికారికంగా ఆహ్వానించిన రోజు 27 జనవరి 2002 నే 'వఫా ఇద్రిస్' అనే మహిళ, రెడ్ క్రీసెంట్ ఉద్యోగి, డిపార్ట్మెంటల్ స్టోర్ లోకి తన హాండ్ బాగ్ లో బాంబ్ ని తీసుకు వెళ్ళి పేల్చడం ద్వారా, ఒకరి మృతికి, 100 మంది ఇజ్రాయిలీలకు గాయాలకీ కారణం అవుతుంది. 'ఆల్ అక్సా బ్రిగేడ్' ఈ దాడికి బాధ్యత వహించింది. కానీ దాడికి ముందు సాధారణంగా పాలస్తీనియన్ తీవ్రవాదులు విడుదల చేసే వీడియో మెసేజ్ ఏదీ ఇద్రిస్ ఇవ్వలేదు. కాబట్టి, ఆమెకు దాడి గురించి తెలియనే తెలియదనీ, ఆమెను ఒక పావులా గా వాడుకున్నారనీ ఆరోపణలు వచ్చాయి. మొన్న కాష్మీర్ లో సీ.ఆర్.పీ.ఎఫ్ పైన జరిగిన దాడిలో తీవ్రవాది విడూల చేసిన వీడియో మెసేజ్ చూసే వుంటారు. అది ఒక ప్రొఫెషనల్ హాక్. దాడి చేయడం ఎవరైనా చేస్తారు. ప్రచారం పొందడం ముఖ్యం కదూ. అసలు తీవ్రవాదం లక్షణమే, భయాందోళనలకు గురి చేయడం. [తానేదో మంచిపనినే చేస్తున్ననన్న నమ్మకంతో].
వఫా మరణాన్ని గ్లోరిఫై చేసి ఆమె శ్రద్ధాంజలి లో వఫా బలిదానం ద్వారా, పాలస్తీనా జాతీయోద్యమం లో మహిళల పాత్రకి గౌరవాన్ని తెచ్చిపెట్టినట్టు ప్రచారం జరిగింది. ఆమె మరణం ఒక అత్యత్భుతమైన హీరొఇజం ని కళ్ళెదుట నిలిపినట్టు, మహిళలు కూడా ఇలా ఆత్మ బలిదానాలు చేయడం ద్వారా జాతి విముక్తి త్వరలోనే కలుగుతుందనీ, నమ్మకం కలిపించే ప్రచారం జరిగింది.
ఇక్కడ తమిళ పులుల పోరాటంలో రేప్ బాధితులు - దాడుల ద్వారా, తమ శరీరాలు పవిత్రమైనట్టు భావించడం, వారికి వివిధ మాధ్యమాల ద్వారా దొరికిన సెన్షేషనల్ గుర్తింపూ, మీడియా రిపోర్ట్ లు అలాంటి పని చేసిన మహిళల మీద వివిధ కధనాలు ప్రచారం చేయడం ద్వారా వారికి దొరికిన పేరు, పరువూ, ఖ్యాతీ, ఈ మార్గంలోకి లాక్కొచ్చాయి. అయితే ఇంత త్యాగం చేస్తున్నా, ఇంత సాహసం చేస్తున్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క తీవ్రవాద సంస్థ లోనూ, ఉదాహరణకి Urugvayan Tupamaros Revolutionary Group, Salvadorian Farabundo Marti Front for National Liberation, Nicaraguan Sandivistas, Chinese Red Army, వగైరా ఎందులోనూ మహిళలకు తగిన రాంకులలో సమనత్వం, పై స్థాయి నాయకత్వ స్థానమూ దొరకననే లేదు. దీనిని బట్టి వాళ్ళని పూర్తిగా పని దోపిడీ కి గురి చేసారన్న సంగతి , వాడుకున్నారు అన్న విషయం తెలుస్తుంది. వీటిల్లో LTTE
నయం.
నయం.
Notes :
09/04/2019
Women in Terrorism, Case of the LTTE - Tamara Herath
Netflix లో బోడీ గార్డ్ అని ఒక సిరీస్ ఉంది. ఇంగ్లీష్ డ్రామా. సరే. దీన్లో ఒక ముస్లిం మహిళ మొట్ట మొదటి ఎపిసోడ్ లోనే, తన చాందసవాద టెర్రరిస్ట్ భర్త కారణంగా బ్రెయిన్ వాష్ చేయబడి, వళ్ళంతా బాంబ్ లు కట్టుకుని, ట్రెయిన్ లో వొణికిపోతూ హీరో కి కనిపిస్తుంది. ఒక్క బటన్ నొక్కగానే విధ్వంసం సృష్టించగల క్షణాన, హీరో ఆమెతో మాట్లాడి, భయాన్ని పోగొట్టి, మెల్లగా ఆమె బాంబ్ ను పేల్చకుండా ఆపగలుగుతాడు. ఇరవయ్యీ పాతిక కూడా మించని - బహుశా టీనేజ్ అమ్మాయి లా వుండే ఈ అతి భయస్తురాలు సిరీస్ అంతా చెమట్లతో, వొణికిపోతూ, భయపడిపోయి, తికమక పడుతూ పెడుతూ, ప్రేక్షకుల జాలి ని అంతా గాలన్ల కొద్దీ తాగేస్తూ... ఉండగా చివరాఖరికి ఈమే టెర్రరిస్టు అనీ, పెద్ద ఇంజనీరనీ, బాంబులు చిటికెన వేలు తో తయారుచేయగల సమర్ధురాలనీ, వగైరా తెలుస్తుంది. అంతవరకూ ఆమె మీద జాలి పడిన ప్రేక్షకుడు షాక్ అవుతాడు. భయపడతాడు. నివ్వెరపోతాడు. ఈ పాత్ర పోషించిన నటి "మొదట చేయననుకున్నాను గానీ, తరవాత ఈ పాత్ర చాలా శక్తివంతంగా అనిపించి, Empowering గా అనిపించీ చేసానని" ఒక ఇంటర్వ్యూ లో చెప్తుంది. పాత్ర పేరు 'నాదియా'. భయంకరమైన ఉగ్రవాది. అంత సున్నితమైన, పువ్వు లాంటమ్మాయి, మనుషుల ప్రాణాలంటే లెక్క లేని పిచ్చి మనిషి అనీ, అమాయకులని నిష్కారణంగా చంపేందుకు, అదీ, అత్యంత ఘోరంగా.... వెనకాడదనీ తెలుసుకున్నాక చాలా బాధనిపిస్తుంది. సరే.. ఈ పిల్ల కి తీవ్రవాదం ఎంపవరింగ్ గా అనిపించడం (పాత్రకూ, పాత్ర ధారికీ) చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించి, ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను.
ఇరాక్ సిరియాల్లో ఐసిస్ మీద యుద్ధం ఓ కొలిక్కి వచ్చేలా అనిపిస్తూ, కలుగులోంచీ వందలాదిగా తీవ్రవాదులూ, ఇల్లూ, పొల్లూ, దేశమూ, సొంత జీవితాన్నీ విడిచిపెట్టి తీవ్రవాదులకి సాయం చేయడానికీ, పిల్లల్ని కనడానికీ వరసకట్టి వెళ్ళిన వివిధ దేశాల ఐసిస్ పెళ్ళికూతుర్లూ, ఐసిస్ విధవలూ, వారికి పుట్టిన, పుట్టి, గిట్టిన పిల్లల గురించీ కూడా విరివి గా వార్తలు వస్తున్నాయి. భవిత గురించి వాళ్ళ ఐడియాలూ, యెమనీ యజీదీ మహిళల సాక్షాలూ, వారిని తిరిగి సమాజం లోకి ఆహ్వానించడానికి జంకే దేశాలూ.. ఇవన్నీ తీవ్రవాదంలో మహిళల పాత్ర ఇలా కూడా ఉండటం, ఇంటర్ నెట్ ద్వారా యువతులని ఆకర్షించి, సిరియా దాకా తీసుకొచ్చి, వాళ్ళని భార్యలుగా కుదిర్చడం, పెళ్ళిళ్ళు చేయడం, వారూ దీనికి సిద్ధపడీ, ఇష్టపడీ, బురఖాలు ధరించి, సామూహిక హత్యల్ని నిర్లిప్తంగా చూస్తూ, ఏదో 'మంచి పని చేసేస్తున్నట్టు నమ్మడం, వారి మానసిక స్థితీ, భవిష్యత్తూ.. తల నొప్పులన్నీ పక్కన పెడితే, అసలు తీవ్రవాదం ఎలా మహిళల్ని శక్తివంతం చేస్తుంది - సమాజికంగా, ఎమోషనల్ గా.. అనే ప్రశ్న ఎవరికైనా ఎదురవుతుంది.
కొన్ని సమాజాల్లో మరీ ఎక్కువగా, కొన్నిటిలో తక్కువగానూ మహిళలు అసహజమైన అసమానత ని ఎదుర్కొంటారు. వారికి ఇష్టపడిన వారిని పెళ్ళాడే హక్కు లేదు. ఇష్టం లేనివాడిని వొద్దనే హక్కు లేదు. చదువుకునే హక్కు లేదు. ఉద్యోగం చేసే హక్కూ లేదు. వారు కేవలం వస్తువులు. తండ్రీ, సోదరుడూ, భర్తా, కొడుకూ.. వీళ్ళ చేతుల మీదుగా బ్రతకాల్సిన బానిసత్వం చాలా మామూలు విషయం. మతం కూడా వీలైనంత తొక్కి పారేస్తుంటుంది. సాంప్రదాయం, ఆచారం, పద్ధతీ, ముఖ్యంగా శీలం, ప్యూరిటీ, పవిత్రత.. ఇవన్నీ మేకులై శిలువ కొట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తీవ్రవాదం నిన్నూ ఓ మనిషి గా గుర్తించి నీ బ్రతుక్కీ ఓ లక్ష్యం ఉంది.. నువ్విలా కా.. నువ్విది చెయ్యు.. నువ్వు చేయగలవూ.. ఇలా ప్రోత్సాహకరంగా ఉంటూన్నపుడు స్త్రీలు ఆకర్షితులవుతారు. పైగా దీని వెనక ఏవో ఆదర్శాలూ, మత పరమైన గుర్తింపూ దక్కేటప్పుడు. వగైరా వాదనలు, థియరీలను ఈ పుస్తకంలో చక్కగా చర్చించారు.
తమిళ పులుల గుర్నించి ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితం అనితా ప్రతాప్ రాసిన"ఐలాండ్ ఆఫ్ బ్లడ్" చదివాక, ఎల్ టీ టీ ఈ గురించి ఒక పుస్తకం చదవడం ఇన్నాళ్ళకి ఇప్పుడే. అనితా ప్రతాప్ తమిళ సింహళుల మధ్య ఈ యుద్ధం ఎందుకు జరిగిందో రాసినట్టు గుర్తు లేదు. కానీ ప్రభాకరన్ ఒక్కో సాటి తమిళ తీవ్రవాద, మిత వాద, అతివాద బృందాలనీ, లీడర్లనీ మట్టు పెట్టుకుంటూ వస్తూ, భయంకరం, భయానకమైన హత్యలు చేసి, తమిళ, సింహళ సమాజాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ, ఒక ప్రభంజనం లా ఎలా తెరమీదకొస్తాడో రాసారు. అయితే, అప్పటికి తమిళ ఈలం కోసం పోరాటం జరుగుతూండేది. అనిత శ్రీలంక లో పర్యటించినపుడూ, తొట్ట తొలి గా ప్రభాకరన్ ను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ గా నిలిచినప్పుడూ.. ఆ సమయాల్లో ఆమె ముందే ఎన్నో హత్యలు జరిగాయి. భీభత్సాన్ని కళ్ళారా చూసారావిడ. కూడళ్ళలో, లాంప్ పోల్ ల దగ్గర కట్టేసి, తుపాకీతో కాల్చి చంపేసిన మనుషుల శవాలని చూసారావిడ. భయాందోళనలు సృష్టించడమే ప్రభాకరన్ యూ ఎస్ పీ.. చివరికి ఈ అతి తీవ్రవాదమే, రాజీవ్ గాంధీ ని హత్య చేయడానికీ, ఆఖరికి తానూ మట్టుపడిపోవడానికీ దారి తీసింది.
Women in Terrorism Case of the LTTE ని ఒక మహిళ Tamara Herath ఇంత సమర్ధవంతంగా రాయడం, తాను చెప్పే ప్రతీ వివరానికీ, రిఫరెన్సు, ఫుట్ నోట్సూ ఇవ్వడం.. టైం మెషీన్ మీద రైడ్ లా అనిపించాయి. రాజీవ్ హత్య సమయంలో మేము ఫ్రంట్ లైన్, తెలుగులో కాబోలు అచ్చయ్యే ఇండియా టుడే లాంటి మేగజైన్ లని ఎంతో ఆసక్తి గా చదివే వాళ్ళం. శ్రీలంక నుండీ పోటెత్తే తమిళ శరణార్ధులూ, వారి పై తమిళ రాజకీయాలూ అవీ చాలా ఆశ్చర్యం కలిగించేవి. అయితే, వయసూ, అజ్ఞానం అదేదో మనకి సంబంధించిన విషయం కాదనుకోవడమూ.. అవన్నీ గుర్తొచ్చాయి. తమిళ శరణార్ధులు, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడి, ప్రభాకరన్ మరణం తరవాత ఈలం మాటే లేకుండా ఇప్పుడంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించడం. పెరిగిన టూరిజం. ఇదీ ఈ నాటి వాస్తవం. కానీ ఒకప్పుడు అత్యంత అధిక సంఖ్య లో మహిళలూ, పిల్లలూ పనిచేసిన తీవ్రవాద సంస్థ ఈ ఎల్ టీ టీ ఈ. రాజీవ్ హత్య లో చనిపోయిన, ఆత్మాహుతి దాడి చేసిన తీవ్రవాది కూడా ఒక మహిళే. తీవ్రవాదులకు - వారు ఏ ప్రాంతానికీ, దేశానికీ, సంస్కృతికి చెందిన వారైన ఒక కామన్ వర్క్ కోడ్ ఉండటం, తాము ప్రచారం పొంద దలచిన దాడులని, ముఖ్యంగా దళాన్ని ఉత్తేజితం చేసే ఎన్ కౌంటర్లనూ, ఆత్మాహుతి దాడులనూ వీడియో గ్రాఫ్ చేయడం - అదే వారి డిజిటల్ సిగ్నేచర్ కావడమూ, చీకట్లో, తమిళ నాడు లో ఓ మారుమూల చిద్రమై చనిపోయిన రాజీవ్ హత్య కేసు ను సాల్వ్ చేయడానికి ఈ కేమెరాలే ఆధారం కావడమూ కాకతాళీయాలు.
మహిళ లని ఆయుధాలుగా వాడటం, వారి శరీరాలని ఆత్మాహుతి దాడుల కోసం వాడుకోవడమూ, అలా ఉద్యమం కోసం పనికిరాగలగడంలో తమ శక్తి ని ఉపయోగించడం వల్ల మహిళ శక్తివంతంగా ఫీల్ కావడం గురించి రక రకాల వాదనలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ప్రముఖమైనది బ్లాక్ విడోస్ ఆఫ్ చెచెన్యా అనే మహిళా తీవ్రవాద సంస్థ. రష్యా ఆక్రమణ లో అణగదొక్కబడిన చెచెన్లు విప్లవం లేవదీసినప్పుడు 1994 లోనే మహిళలు, ముఖ్యంగా ఉద్యమ ప్రభావితులైన విధవలు, తమ ఆత్మల్నీ, శరీరాల్నీ, విప్లవం కోసం అంకితం ఇచ్చి, తిరుగులేని ఖ్యాతిని, తమ త్యాగం ద్వారా బహుశా స్వర్గం లో స్థానాన్నీ సంపాదించారు.
విధవా జీవితం లో పనికిరాకపోవటమనే నిరాశక్తికరమైన, దుర్భర, విలువ లేని జీవితాన్ని గడపడం కన్నా విప్లవం కోసం, దేశం కోసం, ఒక ఆదర్శం కోసం చనిపోవడమే మేలు అని తలిచిన చెచెన్ మహిళలు, బహుశా మొట్ట మొదటి మహిళా తీవ్రవాదులు. 1994-96 దాకా జరిగిన పోరాటంలో మహిళలు, ఆత్మాహుతి దాడుల్లో విస్తృతంగా పాల్గొనడం జరిగింది. కేవలం 2004 లోనే మహిళలు 12 ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. అక్టోబర్ 2002 లో మాస్కో లో అత్యంత దారుణమైన థియేటర్ ముట్టడి లో పాల్గొన్న తీవ్రవాదుల్లో కేవలం 16 ఏళ్ళ అమ్మాయి కూడా ఉండటం చాలా బాధాకరం. చెచెన్ ఆత్మాహుతి మహిళా దళాల స్పూర్థి ని పాలస్తనైసేషన్ గా కొట్టి పడేసారు కానీ నిజానికి పాలస్తీనా మహిళలే చెచెన్ మహిళల నుండీ స్పూర్థి పొందారు. ముస్లిం మహిళలు గా చెచెన్ సోదరీమణులు చేసే సాహసాలను, త్యాగాలనూ మమ్మల్నీ చేయనివ్వండీ అంటూ పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ కు ఉత్తరం రాసారు.
- ఇంకా వుంది.
Notes :
LTTE
Anita Pratap : Prabhakaran ను ఇంటర్వ్యూ చేసిన మొదటి జర్నలిస్ట్. ఈమె పుస్తకంలో మహిళల పట్ల ప్రభాకరన్ సంస్కారవంతమైన ప్రవర్తన నీ, తమిళ పులుల విలువల గురించీ రాసారు. ఈలం కోసం జరిగిన పోరాటంలో ప్రభాకరన్ ఎంతటి ఘోరాలకు పాల్పడినా, అతను గానీ, అతని సంస్థ లో సభ్యులు గానీ సిమ్హళ మహిళల పైన అత్యాచారాలకూ, అకృత్యాలకూ పాల్పడిన ఆధారాలు / కధనాలూ లేవు. ఆఖరికి చివరి ఈలం పోరాటం తరవాత శ్రీలంక సైనికులు మాత్రము తమిళ మహిళలని చంపే ముందు అత్యాచారం చేసి, తీవ్రంగా అవమానించి, చిత్రవధలు చేసి చంపినట్టు, ట్రక్ లలోకి స్త్రీల నగ్న మృతదేహాలను గుట్టగా విసిరేస్తూ.. "ఆమె ఇంకా కామంతో నిట్టూరుస్తుంది చూడు", " ఈమె కు ఇంకా కావాలంట !" అని నవ్వుతూ అంటూన్న శ్రీలంక సైనికుని వీడియో, చానెల్ 4 డాక్యుమెంటరీ లో చూడొచ్చు.
హమాస్ : పాలస్తీనా కు చెందిన (తీవ్రవాద ) సంస్థ
Black Widows of Chechnya : చెచెన్యా లో మహిళా తీవ్రవాదుల సంస్థ. షహీదా అనే పదానికి గుర్తింపు తెచ్చిన మొదటి సంస్థ
Grozny
Moscow Theater Seize
The Hindu Article : ఈ పుస్తకం గురించి ఒక పరిచయం. ఎంపవర్మెంట్ భ్రమల గురించి.
12/08/2017
The Ministry of Utmost Happiness - Arundhati Roy
ఏ భేషజాలూ లేకుండా నిజమే చెప్పాలంటే, ఓ 200 పేజీల దాకా... దీనిలో "హాపీనెస్" అనేది మచ్చుకన్నా లేదే అని నట్టుతూ.. కధ తప్ప చెత్త అంతా ఉందని విసుక్కుంటూ కూడా, వొదల్లేక చదివాను. వొదల్లేకపోవడానికి సాహితీ స్పృహ, ఇది విడిచిపెట్టేయదగ్గ పుస్తకం కాదు అనే భావన, వగైరాల కన్నా, మానవత్వం ముందు నించుని తోవ చూపించడం వల్లే, మిగిల్న పుస్తకం అంతా చదవగలిగాను. ఈ కధ అంతా మనిషిలో లోపించిన మానవత్వం గురించే. అసలు దీన్లో కధ ఏమీ లేదు. ఎప్పటిదో పాత కధ. రెండు మూడు - నుంచీ - ఓ ముప్ఫయ్ అరవై దాకా పాత్రలు ! ప్రతీ పాత్ర దీ ఓ విషాద గాధ.
దిల్లీ నేపధ్యం. అత్యంత బీదరికం లో మగ్గిపోతున్న అంజుం అనే హిజ్రా మనసు కధ మొదటి భాగం అంతా. అంజుం స్మశానంలో మనకి పరిచయం అవుతుంది.
She lived in the graveyard like a tree. At dawn she saw the crows off and welcomed the bats home. At dusk she did the opposite. When she first moved in, she endured months of casual cruelty like a tree would - without flinching. When people called her names - clown without a circus, queen without a palace - she let the hurt blow through her branches like a breeze and used the music of her rustling leaves as balm to ease the pain.
పాత దిల్లీ లో ముస్లింలు ఎక్కువ గా ఉండే షాజహాన్ బాద్ లో ఓ చీకటి వేళ ఆఫ్తాబ్ గా పుట్టింది అంజుం. చీకట్లో ప్రసవం చేసిన మంత్ర సాని మగ పిల్లాడు పుట్టాడని ప్రకటించగానే అంతా ఆనందిస్తారు. కానీ తల్లికి ఆఫ్తాబ్ స్త్రీ, పురుషుడూ ఇద్దరూనూ అని మర్నాడు తెలుస్తుంది. వెంటనే మాతృ సహజమమైన భయం తో ఆ విషయాన్ని దాచి, దర్గాల చుట్టూ, తన కుమారుడి (!) కోసం వేలాది మొక్కులు మొక్కుతూ, అయిదేళ్ళ వరకూ కొడుకు లానే పెంచుతుంది తల్లి. కానీ పిల్లాడు బడిలో కి వెళ్ళే సమయానికి, మొదటి సారిగా తండ్రికి ఆఫ్తాబ్ విషయం చెప్పాల్సొస్తుంది. తమకి పుట్టిన బాబు పరిస్థితి ఇదీ అని తెలుసుకున్న తండ్రి హతాశుడయిపోతాడు. డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలూ, అవమానాలూ, క్లేశాల అధ్య ఆఫ్తాబ్ పెద్ద వాడవుతున్నాడు. అతని శరీరానికీ, మనసుకీ పొంతన కుదరక, విపరీతమైన మానసిక సంఘర్షణ తో బాధపడుతూ చివరికి తాముండే చోటికి దగ్గర్లోనే హిజ్రాలుండే ఖ్వాబ్ గంజ్ - కు చేరి, అక్కడే తన జీవితాన్ని, అంజుం గా మారి గడుపుతాడు. ఈ అంజుం చిన్నతనం లో హిందుస్తానీ సంగీతం నేర్చుకుని గొంతు మారాకా - వివిధ శస్త్ర చికిత్సలూ, నాటు వైద్యాల వల్ల గొంతు లో స్థిరత్వం పోయి, పాడడమే వొదిలేయాలిసి వస్తుంది.
అంజుం బ్రతుకంతా హిజ్రా గా - దిల్లీ లో వివిధ శుభకార్యాల లో పాల్గొని, ఆశీర్వాదాలు ఇవ్వడం లోనూ, గాన బజానాల లోనూ, పాత దిల్లీ ని చూడడానికొచ్చే విదేశీయులు భారతీయ హిజ్రాల గురించి నిర్మించే డాక్యుమెంటరీల లో మెరవడంలోనూ, వివిధ పత్రికల లో ఇంటర్వ్యూలూ, ఫోటోలూ దిగడం తోనూ ఉపాధి ని పొందుతూ - ఒక రకంగా హాయిగా - జీవిస్తుంది. కానీ హిజ్రాల లో ఉన్న మానవత్వం - "తల్లి" తనాలు ఓ మెట్టు పెద్దవే. జమా మసీదులో ఓ పసిపాప ని ఎవరో వొదిలేసి వెళ్ళిపోతే, తప్పిపోయిన పిల్లేమో అని తన వాళ్ళ కోసం వెతికి, ఆఖర్న ఆ పాప ఎవరో వదిలించు కునేందుకు వదిలి పెట్టిన పాప అని గ్రహించి, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురే అంజుం లోకం.
సాధారణ కుటుంబం లో ఇమడలేక, తనంతట తానే ఇల్లొదిలి బయటికి వచ్చిన అంజుం కి తన కుటుంబ సభ్యుల ప్రేమాదరాలకు ఎన్నడూ లోటు లేదు. చాలా మంది హిజ్రాల లాగా ఈమె ను తల్లి దండ్రులే విడిచిపెట్టేయలేదు. ఖ్వాబ్ గంజ్ చేరిన కొన్నాళ్ళ వరకూ, అంజుం కి తల్లి వేడిగా భోజనం వండి కారియర్ పంపేది. నెమ్మదిగా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే వరకూ అంజుం కి అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ ప్రేమ దొరికింది. అందుకే, పరిస్థితులు విపరీతంగా దిగజారి ఖ్వాబ్ గంజ్ వొదిలేసే పరిస్తితులొచ్చిన సమయానికి చనిపోయిన తన కుటుంబ సభ్యుల సమాధుల దగ్గరకే వచ్చి ఆ సమాధుల మధ్య కొత్త జీవితాన్ని మొదలుపెడుతుంది. ఇక్కడ ఆమె లోకం, పరిధీ విస్తృతమయ్యి, తననంత తాను బ్రతుకుతూ, మరి నలుగుర్ని చేరదీసి పెంచగలిగే ధైర్యం, తోడూ, స్థిరత్వం కలుగుతాయి. అంజుం ధైర్య శాలి. కరుణామయి. ఎన్నో భయాలు, బెంగల మధ్య, జీవితాన్ని వెతుక్కున్న మంచి మనిషి.
ఈ లంకె ను అక్కడల్లా వొదిలి, కశ్మీర్ లో ఓ ముగ్గురు స్నేహితుల కధ ని మొదలు పెడుతుంది రచయిత్రి. వాళ్ళు ముగ్గురూ, నాగా, మూసా, బిప్లవ్ - దిల్లీ లో ఆర్కిటెక్చర్ చదువుతారు. వీళ్ళ క్లాస్ మేట్ - కేరళ కుట్టి - తిలోత్తమ. ఈ నలుగురిదీ కాలేజీ స్నేహమే. వీళ్ళలో నాగా, బిప్లవ్ లు మరీ చిన్ననాటి స్నేహితులు. ముగ్గురు అబ్బాయిలకీ తిలోత్తమ అంటే ఇష్టం. పిల్ల నల్లగా ఉన్నా కళ గా, పైగా చాలా అందంగా పొడవైన జుత్తు తో తిలో ముగ్గురి మనసుల్నీ గెలిచేస్తుంది. కానీ తిలో ఎవ్వరితోనూ పెద్దగా కలిసి మెలిసి తిరిగే రకం కాదు. ఆమెకు తండ్రి లేడు. తల్లి పెంపుడు తల్లి కాదు, నిజమైన తల్లే అని అపవాదు ఉంది. ఏదేమైనా తిలో ది చాలా స్వంతంత్ర వ్యక్తిత్వం. కశ్మీర్ కు చెందిన మూసా ది కూడా అదే తీరు. అతనూ అంతర్ముఖుడు. కాలేజీ ముగిసాకా, మళ్ళీ కధా కాలానికి వివిధ విచిత్రమైన సంఘటనల తరవాత కలుసుకుంటారు. నలుగురి జీవితం, చిక్కగా అల్లుకుని, పెనవేసుకుపోతుంది. ఈ భాగం అంతా చాలా హృద్యంగా, తెలివిగా, వేదన తో, సౌందర్యం తో - నింపేసింది రచయిత్రి. అసలు కాశ్మీర్ ని చర్చించడానికి ఎంత రీసెర్చ్ అవసరమో అంతా చేసి, లొసుగుల తో పాటూ, అక్కడ జరిగే అన్యాయాల్ని, మనం రోజూ చూసే రాళ్ళు రువ్వే కాశ్మీర్ ని, పెల్లెట్ లు ప్రయోగించే సైన్యాన్నీ పక్క పక్కనే పెట్టి చూపిస్తుంది.
బిప్లవ్ అమితంగా ఆరాధించిన తిలో, ఆఖరికి నాగా ని వివాహం చేసుకుని 20 ఏళ్ళ కి తను ఏమి చేస్తున్నదీ అర్ధం కాక, అతన్ని విడిచి అంజుం ని చేరుకోవడమే ఈ కధ - దీని వెనుక తిలో, మూసాల ప్రేమ కథ, తొలో అందమయిన జుత్తు ని కత్తిరించిన కశ్మీరీ పోలీసు, మరణించిన అమాయకులూ, ఇవన్నీ చాలా కదిలిస్తాయి. ఒక్కో చోట చాలా బోర్ అనిపించినా, నరేంద్ర మోదీ ని విపరీతంగా విమర్శించి - గుజరాత్ కా లల్లా గా ఆ పాత్ర ని పిలుస్తూ, గుజరాత్ అల్లర్లనీ, ఇప్పటి ఉద్వేగంగా మన్ కీ బాత్ చదివే లల్లా నీ, తూర్పారబెట్టినా అది అరుంధతీ రాయ్ కే చెల్లు. నిర్మొహమాటంగా, నిర్భయంగా మనం ప్రభుత్వానికి కట్టబెట్టిన సామ్రాజ్యాధికారం - ఎదురులేని తనానికీ, ఆరిస్ట్రోక్రసీ కీ ఎలా దారి తీస్తూందో ఒక మేధావి గా, ఆలోచించే వ్యక్తి గా చాలా వ్యాఖ్యానాలు చేస్తుంది. కొన్ని వీటిల్లో చాలా అతి గా అనవసరంగా, బోరింగ్ గా అనిపిస్తాయి. వీట్లో - ఒక తెలుగు మహిళా నక్సలైట్ రాసిన ఉత్తరం, దిల్లీ లో ధర్నాల, నిరసన ల రొటీన్, అంజుం పిల్లని పెంచే విధానం, నాగా, తిలో ల వివాహ జీవితం, కశ్మీర్ లో అమ్రీక్ సింగ్ అనే సిక్కు పోలీసు దురాగతాల, దుశ్చర్య ల వర్ణన, విపరీతం - మరీ - అనిపిస్తాయి. కానీ అవి వాస్తవానికి దూరం కాదు. ఏ కష్టాలూ ఎరక్కుండా మీడియా చెప్పిందే నిజమని నమ్మే మామూలు ప్రజల కి - నిజాలు కనిపించవు. కానీ కొన్ని పరిస్థితులు సత్యదూరాలు కావు. మేల్కొలుపులు.
ఈ పుస్తకం రాయడానికి రచయిత్రి కి సుమారుగా 11 ఏళ్ళు పట్టింది. 1980 ల లో సిక్కు ల ఊచకోత దగ్గరినించీ, మేధా పాట్కర్ ఆందోళనలూ, దేశాన్ని ఓ కుదుపు కుదిపిన రెండో స్వాతంత్రోద్యమం - అన్నా హజారే రాం లీలా మైదానం లో సాగించిన ఉద్యమం, కేజ్రీవాల్ పుట్టుకా, పతనం, (నవల లో అగర్వాల్) ప్రతీ నేతా తాలూకు వితండ వాదనా పటిమ, ఇలా కొన్నేళ్ళ కధా వస్తువు లు - ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ గా జరుగుతున్న గోరక్షణ పేరుతో జరుగుతున్నసామూహిక హత్యలూ - అలా ఎన్నేళ్ళ నుండో అతి మామూలుగా జరిగిపోతున్న సంఘటనలు ఇవి. ఇదంతా మన దేశం గురించి, ప్రస్తుత, పాత కాలపు ఎమర్జెన్సీ నుండీ జరిగిన అరాచకాల గురించీ పెద్ద చర్చ - చర్చ అని కూడా అనకూడదు - రేపు ఏంటి అంటూ గతాన్ని మర్చిపోయే ప్రజలకి ఒక రిమైండర్. అత్భుతం - నచ్చిందీ అనలేము - బోరింగ్ - అనలేము. ఏదో ఆత్మ వుందీ పుస్తకం లో.
ఆ ఆత్మ అంతా - ఎపిటాప్ లది. కధంతా పంచదార గుళికల్లాంటి కవితలు - వందల ఏళ్ళ నాటి సూఫీ కవితలు - ఉర్దూ కవితలు - ఇవే అందం. మచ్చుకి :-
Le saans bhi ahista ki nazuk hai bahut kaam
Afaq ki iss kargah-e-shishagari ka
Breathe, gently here, for with fragility all is fraught,
Here, in this workshop of the world, where wares of glass are wrought
కశ్మీర్ గురించి మాత్రం ఓ నిజం - మనందరికీ తెలిసిన నిజమే గానీ, కొంచెం ఎక్కువ నిజం :-
The inbuilt idiocy, this idea of jihad, has seeped into Kashmir from Pakistan and Afghanistan. Now, twenty-five years down the line, I think, to our advantage, we have eight or nine versions of 'True' Islam battling it out in Kashmir. Each has its own stable of Mullahs and Moulanas. Some of the most radical among them - those who preach against the idea of nationalism and in favour of the great Islamic Ummah - are actually on our payroll. One of them was recently blown up outside his mosque by a bicycle bomb. He wont be hard to replace. The only thing that keeps Kashmir from self-destructing like Pakistan and Afghanistan is good old petit bourgeois capitalism. For all their religiosity, Kashmiris are great businessmen. And all businessmen eventually, one way or another, have a stake in the status quo - or what we call the "Peace Process", which, by the way, is an entirely different kind of business opportunity from peace itself.
కాశ్మీర్ గురించీ, హిజ్రాల జీవితం గురించీ, ఏదీ దాయకుండా, భయపడకుండా - కాసిన్ని అతిశయోక్తుల తో రాసినా - కొన్ని థియరీ లు మాత్రం నిజంగా ప్రసంశించే విధంగా చక్కగా వివరించడం లో మాత్రం చాలా చక్కని ప్రతిభ కనబరిచిందీవిడ. అన్యాయాలూ, మానవ హక్కుల ఉల్లంఘనా - వీటన్నిటి మధ్యా - ఇస్లాం అనే మాట మీద తమ లో తామే కొట్టేసుకుని లేదా భద్రతా దళాలతో ఎదురు కాల్పుల్లో ఈ తీవ్రవాదులు భారత్ లో కి చొరబడిన ఆర్నెల్లకల్లా చనిపోయే విషయాన్ని - నవ్వుతూ చెప్పేస్తారు. హిజ్రాలూ, వాళ్ళ వ్యవస్థా, నక్సలిజం లో మహిళా కామ్రేడ్ల దుస్థితీ, వాళ్ళ కర్తవ్య దీక్ష, తీవ్రవాదుల భావోద్వేగాలూ, వాళ్ళని రక్షించే ప్రజల defiance, వీటన్నిటి మధ్యా మన కధ ఇది. మన దేశం కధ. అంజుం ఉండే స్మశానం లో కొన్ని సమాధులకి కధ లుంటాయి. ఈ సమాధుల చుట్టూ అల్లుకున్న కధల పుస్తకం చదవచ్చు. అందుకే కవర్ కూడా ఒక సమాధి - దాని మీద ఓ చిన్న పూవు. చావు లో సౌందర్యాన్ని విప్పి చెప్పే వర్ణనలు. దాల్ లేక్ నుంచీ దర్గాల వరకూ, ఉర్దూ కవితల మాధుర్యాన్నీ, చనిపోయిన పిల్లల సమాధుల మీద చిన్ని చిన్ని రాతల్నీ - అన్నిట్నీ ఎంతో నిబద్ధత తో సేకరించి, విస్తారంగా రాసిన కధ ఈ Ministry of Utmost Happiness. (ఈ పేరు వెనక కూడా ఒక చారిత్రాత్మక కధ ఉంటుంది. అది మాత్రం చదివి తీరాల్సిందే)
అరుంధతీ రాయ్ అతిశయోక్తుల్లో మన దేశ వినాశన ప్రస్తావన కూడా వస్తుంది. కశ్మీర్ వాది ఒకడు మన దేశం ఏదో ఓ నాటికి సమాధి కావల్సిందే అంటాడు. పెద్ద పెద్ద సామ్రాజ్యాలే నేల మట్టం అయినప్పుడు మన లాంటి చిన్న దేశం ఒక లెక్కా.. ఇలానే స్వయంకృతాపరాధాల్ని పునరావృతం చేస్తూంటే - నీ పరిస్థితి కూడా ఇంతే అని చెప్పబోయేటట్టుండే ఈ ప్రస్తావన మరీ అతి గా అనిపిస్తుంది. కానీ ఇదొ మంచి ప్రయత్నం అని చెప్పడానికి సందేహించక్కర్లేదు.
* * *
First published in pustakam.net.
First published in pustakam.net.
04/05/2017
ISIS The State of Terror - Jessika Stern & J.M.Berger
ఇది ఒక సారి చదవడానికీ, కరెంట్ అఫైర్స్ రిఫ్రెషర్ లాంటి పుస్తకమే. ఇది సాహిత్యం కాదు. కొందరి జీవితం. ఎప్పటికప్పుడు మారిపోయే వార్తల్లో ఒక భయంకరమైన కధనం. కాకపోతే ఈ కధ లో బోల్డన్ని మనకి తెలిసినవీ, తెలియనివీ థియరీలు ఉన్నాయి. ఈ కార్పొరేట్ తరహా, ఎక్సిక్యూటివ్ ఉగ్ర సంస్థ పుట్టు పూర్వోత్తరాల గురించి చాలానే పుస్తకాలొచ్చాయి. అన్నిట్నీ చదవలేకపోయినా, నేను తడిమిన రెండు మూడు పుస్తకాల్లో ఇది కాస్త ఆసక్తికరంగా అనిపించింది. కాలంతో పాటు ద్రవంలా పరిస్థితులు ఎప్పటికప్పుడూ మారిపోతున్నప్పుడు ఫాలో అప్ లా ఇలాంటి రికనర్లు ఉపయోగపడతాయి.
కొత్తగా తెలుసుకోవడానికి ఏమీ లేకపోయినా ఒక రిఫ్రెషర్ లాంటి పుస్తకం ఇది. "ఇదే ఆఖరు. దీని తరవాత ఇంక ప్రపంచమే లేదు" అనిపించేంత దారుణమైన, బలంగా అల్లుకున్న, లొంగని మొండి కేన్సర్ లాంటి వ్యవస్థ ఐసిస్; అతి పెద్ద నెట్వర్క్ ఉన్న తీవ్రవాద సంస్థ. అమెరికానే ఐసిస్ ని సృష్టించిందీ, ప్రోత్సహిస్తోందీ అని రక రకాల వాదనలు ప్రచారంలో ఉన్నా, ఐసిస్ పుట్టుక, బ్రతుకు, చావు (!) గురించి ప్రపంచానికి, ముఖ్యంగా పాత్రికేయులకూ తెలిసిన సమాచారమే ఈ పుస్తకం.
గ్లాసరీ లో పేరులు, టైంలైన్ లో వార్తలూ, సమస్య ను సరిగ్గా అర్ధం చేసుకోవడానికి పనికొస్తాయి. రచయితలు ఇద్దరూ (అమెరికన్) జర్నలిస్టులు: జెసికా స్టెర్న్, జె ఎం బెర్గర్లు. ఇది ఒక చరిత్రను నమోదు చేసే ప్రక్రియ అని ఇద్దరి అభిప్రాయం కూడా. "If journalism is the first draft of history, a book such as this can only be the second draft, and certainly not the final word." ఏ రోజుకారోజు కొత్త కొత్త వార్తల్లో పాత వార్తలు మరుగున పడిపోయే ఈ కాలంలో పుస్తకంలో ముఖ్య భాగాల్నిండా.. 'ఈ పుస్తకం ప్రెస్ కి వెళ్ళినపుడు ఇలా జరిగింది' అని మరీ మరీ చెప్పుకున్నారు.
ఐసిస్ బహుశా ఎన్నడూ లేనంత విస్తృతంగా ప్రపంచమంతా విస్తరించిన సంస్థ. మామూలు ఉగ్రవాద మూక కాదు. దీనికి పెద్ద బలగం, వ్యూహం, లక్ష్యం వున్నాయి. ఏ దేశానికి చెందిన వారినైనా ఒక సారి తమ లో చేర్చుకున్నాకా, వీలైనంత వరకూ వారి చావు కబురు మాత్రం తప్పకుండా దగ్గరి వారికి చేరవేయగల సమగ్రమైన, ఒక ప్రభుత్వ సంస్థ లాగా ఆర్గనైస్డ్ పరిధి వారికి ఉంది. ఐసిస్ బాధితులు రెండు రకాలు. [ముస్లిం యువత] మతపరమైన ప్రలోభాలతో తమలోకి ఆకర్షించగా మిగిలిన, ఆ పిల్లల్ని కోల్పోయిన తల్లులూ. తండ్రులూ ఒక రకం ; ఐసిస్ చంపేసిన జనం, వారి బంధువులూ ఇంకో రకం.
పుస్తకంలోకి దూకే ముందు ఒక సారి గుర్తు చేసుకోవాల్సినవి :
2003 లో ఇరాక్ మీద అమెరికా యుద్ధం మొదలు, సద్దాం ప్రభుత్వం కూలడం, జర్కావీ (Terrorist leader behind AQI, ISIS) అనే భూతం పుట్టుకొచ్చి బాగ్దాద్ లో UN Headquartes మీద బాంబు దాడి చేయడం.
2004 లో అబూ గ్రాయిబ్ జైల్లో, బందీలు గా ఉన్న వారిపై US సాగించిన అకృత్యాల ఫోటోలు బహిర్గతం, వెల్లువెత్తిన ప్రజాగ్రహం, AQI (al Qaeda in Iraq) మొదలు. జర్కావీ, బిన్ లాడెన్ కు మద్దతు ప్రకటించడం
2005 లో పబ్లిక్ గా ఆల్కైదా ఇన్ ఇరాక్ (AQI), శిరస్చేధాలకు తెగబడటం. విదేశీ పోరాట వీరులకు ఆకర్షణీయంగా మారడం. ఈ లోపు Iraq లో బలవంతపు ప్రజాస్వామ్యం స్థాపన. అల్లకల్లోలం గా సున్నీ, షియాల ఆధిపత్య పోరు.
2006 లో అమెరికన్ బాంబు దాడిలొ జర్కావీ మరణం, ఐ.ఎస్.ఐ స్థాపన, అబు ఒమర్ అల్ బగ్దాదీ (బాగ్దాద్ కు చెందిన ఒమర్) దాని నాయకుడు గా ప్రకటింపబడడం. సద్దాం ఉరి.
2007 లో అమెరికన్ మిలిటరీ ఆధిపత్యం, సున్నీల ఉద్యమం మొదలు, దారుణంగా అణచపడిన ఐ.ఎస్.ఐ.
2008 లో Twist in the tale - ఇరాక్ ప్రైం మినిస్టర్ మాలీకీ 'షియా మిలీషియా' అణిచివేతకు ఆదేశాలివ్వడం,
2009 లో మాలీకీ ఆదేశాల మేరకు 'సున్నీ తీవ్రవాద సంస్థల' అణిచివేత. అంతర్గత కలహాల అనంతరం, సున్నీల లో ఐ.ఎస్.ఐ పట్ల పెరిగిన ఆదరణ. పట్టు తిరిగి సాధించుకుందుకు అవకాశం. ఐ.ఎస్.ఐ. బాంబు దాడుల్లో ఇరాకీ మంత్రులు సహా 100కు పైగా మరణం, అమెరికాకు చెందిన 'కాంప్ బక్కా' మూసేసాకా, దాన్నుండీ "అబు బకర్ అల్ బగ్దాదీ" విడుదల.
2010 లో అమెరికా దాడులో ఐ.ఎస్.ఐ. నాయకులు "అబు ఒమర్ అల్ బగ్దాదీ", "అబు అయూబ్ అల్ మస్రీ" ల మరణం తరవాత 'అబు బకర్ అల్ బగ్దాదీ' దానికి నాయకుడు కావడం.. ఇరాకీ ప్రభుత్వం లో మతపరమైన ఇబ్బందులు, కుట్రలు. అల్లకల్లోలంగా ఇరాక్ రాజకీయ చిత్రం. ప్రజల్లో ప్రభుత్వం మీద పెరిగిన అసంతృప్తి.
ఇది ఇరాక్ దాకా... ఇపుడు సిరియా:
2011 లో సిరియా లీ దారా పట్టణం లో పదిహేనేళ్ళ పిల్లలు ఒక డజన్ మందిని ప్రభుత్వ వ్యతిరేక గ్రాఫిటీ రాసినందుకు రెజీం అరెస్టు చేసింది. దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త నిరశనలు. ఈ పిల్లల్లో "హంజా అల్ ఖాతిబ్" అనే పిల్లాడి చిత్రవధలతో చంపబడ్డ శరీరం ఇంటికి రావడం, ప్రజల్లో ప్రభుత్వం పట్ల వెల్లువెత్తిన ఆగ్రహ జ్వాల, అసాద్ ఉక్కు పాదం, ఇంకా ఇక్కడ పాకిస్తాన్ లో, ఒసామా బిన్ లాడెన్ మరణం,
2012 లో జవాహిరి (ఒసామా తరవాతి ఆల్ కైదా నాయకుడు) అసాద్ కు వ్యతిరేకంగా ముస్లింలు ఐక్యం కావాలని పిలుపు. ఐ.ఎస్.ఐ. మొదటి popular వీడియో The clanging of swords విడుదల. ఈ కాలంలోనే తన మీద పెద్ద అదుపు లేకపోవడం వల్ల జూలు విదిల్చిన ఐ.ఎస్.ఐ, జైళ్ళ నుండీ ఖైదీల్ని విడిపించడం అనే 'గోడలు బద్ధలు కొడదాం' అనే ఉద్యమాన్ని లేవదీసింది. ఇది, ఖైదీల్ని తమలో చేర్చుకుని, తమను "బలవంతంగా" చేసుకునే ప్రక్రియ.
2013 లో అమెరికా సిరియా కి "నిరాయుధ" మద్దతు ప్రకటించడం, 'జభాత్ అల్ నుస్రా' అనే తీవ్రవాద సంస్థ ప్రాబల్యం పెరగడం, తూర్పు సిరియా ఇస్లామిస్ట్ గ్రూపుల అదుపుకి రావడం. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మెర్జర్ లను ప్రకటించినట్టు ఐ.ఎస్.ఐ, 'జభాత్ అల్ నుస్రా', తమ సిరియన్ విభాగం అని ప్రకటించడం, వీళ్ళు కాస్తా దాన్ని ఖండించడం, అవీ. పూర్తి స్థాయి అంతర్యుద్ధం మొదలు. వివిధ జైళ్ళ నుండీ 500కు పైగా కరుడు కట్టిన ఆల్కైదా తీవ్రవాదుల విడుదలంచేసి తమలో కలిపేసుకున్న ఐ.ఎస్.ఐ. సిరియన్ రెబల్స్ ని కూడా సిరియా నుండీ తరిమేసి, ఆధిపత్యం నిలుపుకోవడం. ISI - ISIS (Islamic State in Iraq and Syria) గా మారి తన మొదటి అధికారిక ట్విట్టర్ అకౌంట్ ని తెరవడం.
2014 లో అల్కైదా,ఇతర తీవ్రవాద సంస్థలతో పోట్లాటలు వచ్చినా, ముందుకే వెళ్ళి ఒక రోజు వేలాది ట్వీట్లు చెయ్యగల 'ఆప్' ని తీసుకు రావడం, డజన్ల కొద్దీ ఇరాకీ సైనికుల తలలు నరకడం లాంటి భయానక దృశ్యాలున్న The Clanging of Swords Part-4" వీడియో విడుదల, దేశ విదేశాల్లో యువత లో పెరిగిన క్రేజ్, ఇపుడే కాలిఫైట్ ప్రకటన, ISIS కాస్తా ఇస్లామిక్ స్టేట్ (Islamic State), 'అబు బకర్ అల్ బగ్దాదీ' - "కాలిఫ్ ఇబ్రహీం" గా మారడం, IS మొదటి ఇంగ్లీష్ మాగజీన్ 'దాబిక్' విడుదల.
ఈ సమయంలోనే విదేశీ బందీల గొంతు తెగ్గోసి చంపి, వాటి వీడియోల్ని విడుదల చేయడం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి చెందింది ఐసిస్. . ఈ ఏడాదే ఎన్నో దేశాల్లో లోన్ వుల్ఫ్ ల (విఫల మరియు సఫల) దాడుల ద్వారా, తమ వేళ్ళు ఎంత లోతులకు పాతుకున్నాయో కూడా ప్రపంచానికి చాటి చెప్పింది ఐసిస్.
ఆగస్ట్ 19, 2014 న అమెరికన్ జర్నలిస్ట్ James Foley ఆ తరవాత ఇతర విదేశీయులు - బ్రిటిష్, రష్యన్, జాపనీస్, బల్గేరియన్, కొరియన్, ఫిలిపినో పౌరులు - ఇదే పద్ధతిలో చంపబడ్డారు. ఈ చావులన్నీ వీడియో కేమెరా ఎదురుగా. ప్రపంచానికి చాటిచెప్పడం కోసం. భయోత్పాతం కలిగించడం కోసం చిత్రీకరించబడ్డాయి. జిహాదీ జాన్ గా పేరు కాంచిన బ్రిటీష్ ఉగ్రవాది ఐసిస్ పరిధి ని ఇంకోసారి తెలియజేసాడు. ఈ తల నరికే వీడియీలు మొదట అల్ కైదా ఇన్ ఇరాక్ నాయకుడు 'అబు ముసాబ్ అల్ జర్కావీ' ఐడియా. వాటి ప్రభావం మీద అతనికి గొప్ప నమ్మకం. మొండి కత్తితో తీరిగ్గా గొంతు కోయడం, కౄరతకు, రాక్షసత్వానికీ పరాకాష్ఠ. రాత్రికి రాత్రే ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసే ప్రభావశీలత వీటికి ఉంది.
శత్రువు బలాన్ని అంచనా వేయడానికీ, దాన్లో విఫలమవడానికీ చాలా తేడాలుంటాయి. ఈ మధ్య యుగాల నాటి అరాచక కౄర అకృత్యాల వీడియోల DVDలు మొదట ఇరాక్ లో ఫిసికల్ గా పంచేవారు. ఇంటర్నెట్ యుగంలో ఈ ప్రచార కార్యక్రమం కొత్త పుంతలు తొక్కింది. ప్రచారం తో పాటూ ఈ ఉగ్ర మూక కు మిగిలిన అల్లాటప్పా ఉగ్ర మూకల కన్న ఎక్కువ ప్రాబల్యం చిక్కడానికీ, కొత్త వారిని ఆకర్షించడానికీ, తిరుగులేని ఒక సాంకేతిక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికీ సహాయం చేసింది.
ఈ సంస్థ కేవలం ఇరాక్ సిరియాల్లోనే కాకుండా ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం లోనూ, లోన్ వుల్ఫ్ ల ద్వారా విస్తృతంగా యూరోప్ లోనూ వ్రేళ్ళు తన్నుకుంటూ, బలంగా, వేగంగా, చాప కింద నీరులాగా విస్తరించడానికి ఈ సాంకేతిక ఆధిపత్యమే కారణం. వందలాది ప్రాచ్య పాశ్చాత్య దేశాలకు చెందిన కొత్త సభ్యులతో కొత్త ఉత్సాహంతో పుంజుకుంటూనే ఉంది.
2014-17 వరకూ, అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ట్యునీషియా, బెల్జియం, ఇంగ్లండ్, బంగ్లాదేష్, ఇరాక్, పాకిస్తాన్ లలో పోలీసుల మీదా, సైనికుల మీదా, సామాన్య ప్రజల మీదా చేసిన వివిధ రక ఆయుధ దాడిలో దాదాపూ 1200 కు పైగా మరణించారు. ఇదో పెద్ద సంఖ్య కాదు. హిట్లర్ నాజీ జెర్మనీలో, వియత్నాం, కాంబోడియా, శ్రీలంకల్లో, గడాఫీ, సద్దాం, ఇడీ అమీన్ రాజ్యాల్లో, రెండు ప్రపంచ యుద్ధాల్లో, కరువు, కాటకాల్లో, సిరియా యుద్ధంలోనూ ఇంతకన్నా ఎక్కువ సంఖ్య లోనే ప్రజలు ఘోరాతి ఘోరంగా మరణించారు. మరి ఇదే ఎందుకు ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడించే సమస్య ? ఈ పుస్తకాన్ని చదవాల్సినిది మొదట రాజకీయ వర్గమే. దేనికైనా రాజకీయ పరిష్కారం సాధ్యమే.
ఈ సంస్థ మిగిల ఉగ్ర సంస్థల లాగా publicity shy కాదు. publicity hungry. ఆల్కైదా అగ్ర నాయకులకే విరక్తి కలిగించేంత లెవెల్లో మొండి కత్తులతో నెమ్మదిగా గొంతుకోసి హత్యలు చేయడం, ఒక గుంపు గా మనుషుల్ని హత్య చేస్తున్నప్పుడు, మిగిలిన బందీల్ని ఆ హత్యల్ని చూసేలా నిర్బంధించడం, స్త్రీల పట్లా, యజీదీల పట్లా చెప్పలేనంత ఘోరాలకు పాల్పడడం.. దొరికిన వాళ్ళను (ఇస్లాముని నమ్మని వాణ్ణి/వాళ్ళను) ఏ ఆయుధం చేతిలో ఉంటే దాంతో, ఆఖరికి చేతులతోనైనా, ఏదైనా వాహనంతోనైనా చంపమంటూ ప్రచారం చేసుకునే భయంకరమైన సంస్థ ఇది. ఆయా దాడుల్లో మరణించే ముస్లింలనూ, విశ్వాసులనూ collateral damage గా తీసిపారేసేస్తుంది.
దీన్ని ఎదుర్కోవడం కొండని తవ్వడం లాంటి పెద్ద పని. ప్రస్తుతానికి ఎక్కువ ప్రచారంలో ఉన్న వ్యూహం.. సైనిక పరమైన అలోచన. వారిని కార్నర్ చేసి, కుళ్ళగొట్టడం (let them Rot) .. ఆహారం, ఇతర సరఫరాలు అందకుండా చూడడం లాంటివి.. కానీ వివిధ భౌగోళిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, అనాలోచిత వ్యూహాత్మక నిర్ణయాల మూలంగా, పరిష్కారం మాత్రం అందనంత దూరంలో ఉంది.
ఏది ఎలా ఉన్నా, ఈ పుస్తకాన్ని చదివాకా, రచయితలు ప్రస్తావించిన వివిధ సిద్ధాంతాలు, ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్ హత్యా వ్యాపార లీలా వినోదాల వీడియోలకున్న క్రేజ్ , దీని ప్రాబల్యాన్ని తగ్గించేందుకు వివిధ రకాలుగా జరుగుతున్న యుద్ధాలూ, ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఒకోసారి అసలంత కీలకంగానే అనిపించని ఈ సంస్థ వల్ల పొంచి ఉన్న ఆపదలు - విస్తృతంగా చర్చ లోకి వస్తాయి. వాళ్ళ పనితీరు, క్రమశిక్షణ, వృత్తి లో నైపుణ్యం, ముఖ్యంగా అబు బకర్ అల్ బగ్దాదీ పట్టూ. ఇవన్నీ చదివితే, సమస్య ని అర్ధం చేసుకోగలం. అందుకే కరెంట్ అఫైర్స్ ఇష్టపడేవాళ్ళు, (ప్రస్తుతానికి కంపేర్ చేసి చూస్తే పాతదే ఈ పుస్తకం) చదవొచ్చు.
This was first published in pustakam.net [ http://pustakam.net/?p=19624 ]
18/07/2008
తీవ్రవాదం - IEDs-5
ఐ.ఈ.డీ ల లో వాడే రసాయనాలూ, పేలుడు పదార్ధాలు :-
ఈ బాంబులను తయారు చేయడానికి పెద్ద యెత్తున రక్షణ అవసరాలకు వాడే ఆర్.డీ.ఎస్, టీ.ఎన్.టీ వంటి పదార్ధాలను వివిధ కాంబినేషన్ ల లో వాడతారు. అంతే కాకుండా, గృహ, నిర్మాణ అవసరాలకు వాడే జెలిటెన్ స్టిక్స్, ఇళ్ళలొ తయారయ్యే మందుగుండు సామాగ్రి ఇంకా మార్కెట్ లో సులువు గా దొరికే అమ్మోనియం నైట్రేట్, సోడియం / పొటాషియం క్లోరైడ్, సల్ఫర్, అమ్మోనియం పఔడర్, షుగర్ పొటషియం / సోడియం నైట్రట్ మొదలైనవి కూడా వివిధ కాంబినేషన్ & నిష్పత్తు ల లో వాడ తారు.
నక్సలైట్లు ముఖ్యంగా కమర్షియల్ పేలుడు పదార్ధాలు వాడతారు - అవి ప్రధానంగా జిలెటన్ లేదా ఎ.ఎన్.ఎఫ్.ఒ (అమ్మొనియం నైట్రేట్ ఫ్యుఎల్ ఆయిల్) (ఫెర్టిలైసెర్ గ్రేడ్ అమ్మొనియం నైట్రేట్ మరియు డీసిల్ లేదా ఫ్యుఎల్ ఆయిల్ నుంచీ తీసిన పేలుడు పదార్ధం)
ఇప్పటి వరకు పేలిన బాంబులు లేదా దొరికిన పేలని బాంబులు (లైవ్ ఎక్స్ప్లోసివ్ లు) నుంచీ సేకరించిన సమాచారం ప్రకారం, తీవ్రవాదులు వాడే రసాయనాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. (Combinations)
(1) ఆర్.డీ.ఎక్స్ & టి.ఎన్.టీ (సైక్లొటోల్)
(2) కేవలం ఆర్.డీ.ఎక్స్
(3) అమ్మోనియం నైట్రేట్ తో చేసే జిలెటెన్
(4) ఎ.ఎన్.ఎఫ్.ఓ (అమ్మొనియం నైట్రేట్ ఫ్యుఎల్ ఆయిల్)
(5) అమ్మొనియం నైట్రేట్ & అమ్మొనియం పౌడెర్
(6) పొటషియం క్లోరైడ్ & అమ్మొనియం పౌడెర్ + సల్ఫర్
మన రక్షణ కోసం మనం ఏమి చెయ్యగలం ?
ఇప్పటి వరకూ జరిగిన బాంబు దాడుల బట్టీ, తీవ్ర వాదులు ఎప్పటికప్పుడు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వస్తున్నారన్నది తెలుస్తున్నది.
అయితే, కేవలం సాంకేతికత మాత్రమే కాకుండా, వారి ఎక్సిక్యూషన్ కూడా కొత్త పుంతలు తొక్కుతున్నది. ఇంతకు ముందు వరకూ కేవలం కొందరు రాజకీయ నాయకులూ, దేశాధినేతలూ, పోలీసు, మిలిటరీ సిబ్బంది ని లక్ష్యంగా చేసుకుని జరిగిన పోరటం, మన వీధుల లోకీ, మన రైళ్ళ లోకీ చొచ్చుకు వచ్చింది. సాధారణ ప్రజలను, అదీ ఎక్కువ సంఖ్య లో పొట్టనపెట్టుకోవడం కొత్త లక్ష్యం గా మారింది.
ఈ ఐ.ఈ.డీ ల తయారీ, వాడకం ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అయ్యే సోఫిస్టికేషన్ తో ఇబ్బడి ముబ్బడి గా తయారవటం మన ముందున్న ప్రధాన సమస్య.
అమెరికా లో సెప్తెంబర్ తొమ్మిది తరవాత ప్రజల్లో కలిగిన భయం.. వారి ని ప్రతీదీ అనుమానించేలా చేసి, సాధారణ జీవితాన్ని కాస్త ఇబ్బంది పెట్టిందంట. కానీ పెరిగిన సెక్యూరిటీ మీది అవగాహన, అప్పటి నుంచీ చాలా ప్రాణాలను కాపాడిందన్న సంగతి మర్చిపోకూడదు. ఒక తీవ్రవాది షూ బాంబు ద్వరా విమానాన్ని పేల్చి వెయ్యబోవడాన్ని ప్రయాణికులు అడ్డుకోవడం ఇందుకు మంచి ఉదాహరణ.
ఈ మధ్య కాలంలో కాబూల్ లో భారత రాయబార కార్యాలయం మీద జరిగిన అతి పెద్ద తీవ్రవాద దాడి కూడా ఒక సారి గుర్తు చేసుకోవాలి.
అప్పటి వరకూ అందిన ఇంటెలిజెన్స్ నివేదికల కారణంగా తీవ్ర వాద దాడి ని ఎదుర్కోవడానికి ఈ రాయబార కార్యాలయం చేపట్టిన చర్యల కారణంగా ఆ నిర్మాణానికి 100 కిలోల ఆర్.డీ.ఎక్స్ పేలుడు కు కూడా పెద్ద నష్టం జరగలేదు. పైగా, బ్రిగేడియర్, ఐ.ఎఫ్.ఎస్. అధికారి ప్రయాణిస్తున్న కారుని లోపలికి రానివ్వడానికి గేట్ ను తెరుస్తున్న సిబ్బంది, ఎలర్ట్ గా పని చెయ్యకపోతే, రాయబార కార్యాలయం మొత్తం ఈ పేలుడు కు కూలిపోయి ఉండేది. మన లో కూడా ఎలర్ట్ నెస్ ఉండాలి. ఈ ఆత్మాహుతి దాడి లో 54గురు ఆఫ్గన్లు, నలుగురు భారతీయులూ మరణించారు. కానీ తీవ్రవాదుల అసలు లక్ష్యం (సంఖ్యా పరంగా) ఇంకా చాలా ఎక్కువ.
కేవలం సమర్ధవంతమైన కట్టడి, విజిలెన్స్, ప్రజల్లో ఈ తీవ్రవాద పోకడలు, దాని వల్ల కలిగే ప్రమాదాల గురించి కాస్త సాధారణ పరిజ్ఞానం మాత్రమే మన పోరాట పద్ధతి. అనుమాస్పదమైన విషయాల్ని నిర్లక్ష్యం చెయ్యకపోవడం, నిర్లక్ష్య ధోరణి తగ్గించుకోవటం, సెక్యూరిటీ లాప్సెస్ కనిపిస్తే, అధికారులకు కంప్లైంట్ చెయ్యడం సెక్యూరిటీ చెక్ లకు సహకరించడం, సెక్యూరిటీ అంటే విసుక్కోకపోవటం, పోలీసు తో సహకరించడం మొదలయినవి మాత్రమే మన ప్రాణాలను కాపాడతాయి.

15/07/2008
తీవ్రవాదం - IEDs - 4
అయితే, ఈ ఐ.ఈ.డీ లను ఎలా పేలుస్తారు ?
ఐ.ఈ.డీ లను తయారు చేయడంతో పాటూ, వాటి వాడకం లో కూడా సింపుల్ టెక్నాలజీ నే వాడతారు. ఈ ట్రిగ్గెరింగ్ మెకానిజం లలో కొన్ని రకాలుంటాయి.
1) టార్గెట్ చేతే ఆక్టివెట్ చెయ్యబడే బాంబులు /Anti-Handling
ప్రెషర్ రెలీస్ ట్రాప్ స్విచ్చు లను వీటిలో వాడతారు. అంటే, పోలీసులో, బాంబ్ స్క్వాడ్ వారో, బాంబు ను తెరవగానే, పెద్ద విస్ఫోటనం జరిగేలా వీటిని తయారు చేస్తారు. ఇలాంటి దాడులు జార్ఖండ్ లో జరిగాయి. పోలీసులు ఒక అనుమాస్పదమైన కేష్ బాక్స్ ను తెరవగానే, దానికున్న ట్రాప్ స్విచ్చు అందులో అమర్చిన బాంబ్ ను ఆక్టివేట్ చేసింది. అలానే, పస్చిమ బెంగాల్ లో కూడా ఒక పాల కేన్ (బాంబు, పాపం బాంబు స్క్వాడ్ సభుడు ఆ కేన్ మూత తెరవగానే పేలిపోయింది.
2) Timer mechanism
దీన్లో కూడా రకాలున్నాయి.
ప్రోగ్రాం చెయ్యగల టైమింగ్ డివైస్ లేదా ఎ.బీ.సీ.డీ టైమర్ ఒక రకం. ఇవి 1995 నుంచీ అందుబాటు లోకి వచ్చాయి. ఇవి ఎంత ఇంప్రూవ్ అయాయంటే, వీటిని దాడి కి 194 రోజుల, 11 గంటల 15 నిముషాల ముందు ఫిక్స్ చేసినా పని చేస్తాయి. (అంటే, అంత ముందే, టైం ను సెట్ చేసి, బాంబును సేఫ్ గా అమర్చి, వాడుకోవచ్చన్నమాట)
క్వార్జ్ లేదా డిజిటల్ అలార్మ్ క్లాక్ టైమెర్ ఇంకో రకం ! ఇవి బాంబు పేల వలసిన టైంకు అలార్మ్ బజర్ మోగడం ద్వారా బాంబులోని పేలుడు పదార్ధాన్ని పేల్చడానికి వాడతారు. సంఝౌతా ఎక్స్ ప్రెస్ లో ఇలాంటి టైమర్ ఉన్న ఐ.ఈ.డీ నే వాడారు.
సెల్ ఫోన్ టైమర్ : సెల్ ఫోన్ లో మోగే అలార్మ్ బజర్ ద్వారా కూడా ఐ.ఈ.డీ లోని డిటొనేటర్ ను ఆక్టివేట్ చేస్తారు. హైదరాబాద్ లోని మక్కా మసీదు, అజ్మీర్ షరీఫ్ దర్గా, హుబ్లీ కోర్టు లలో దీన్నే వాడారు.
3) రిమోట్ / రేడియో ద్వారా కంట్రోల్ చెయ్యగల మెకానిజం
నక్సలైట్ అన్నలు బాగా వాడే ఒక రకం వైర్ కంట్రోల్. లాండ్ మైన్ అమర్చిన తరవాత, లాండ్ మైన్ కు బాగా దూరంగా (సేఫ్ డిస్టెన్స్) కూర్చుని, ఒక కనిపించకుండా పాతిపెట్టిన వైర్ ద్వారా ఆ లాండ్ మైన్ కు పవర్ ను పంపించి, టార్గెట్ దాని మీదుగా పాస్ అవుతున్నపుడు పేలుస్తారు. ఈ వైరు పేల్చడానికి ఒక హెవీ డ్యూటీ కారు బేటరీ కావల్సొస్తుంది.
ఇంకో రకం వైర్ లెస్ లేదా రేడియో తరంగాల ద్వారా పేల్చడం : ఈ పద్ధతి జమ్మూ కాష్మీరు లో బాగా వాడుక లో ఉంది. వీటికి 3 DTMF కోడెడ్ రెసీవర్లూ, ఒక VHS ట్రాన్స్ మీటరూ వాడతారు. ఈ మధ్యే, సెల్ ఫోన్ల సహాయంతో ఇంకా దూరం నుంచీ ఈ లాండ్ మైన్లను వైర్ లెస్ తరంగాల ద్వారా ఆక్టివేట్ చేసి పేల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తీవ్ర వాదం - IEDs - 3
ఈ వాహనాలనే బాంబు లు గా వాడడం లో ఇంకో గమ్మత్తు ఉంది. (గమ్మత్తు అన్న పదం నిర్దాక్షిణ్యమే! క్షమించండి) ఈ వాహనం పేలుడు కు గురయ్యాక, దీని బాడీ ముక్కలు ముక్కలు గా చెదురుతుంది. ఈ ఇనుప ముక్కలు (Sharpnel) బాధితుల శరీరాల్లోకి చొచ్చుకుపోయి, తీవ్ర గాయం, రక్త స్రావం తద్వారా బాధితుల మృత్యువు కు దారి తీస్తాయి. పూర్వకాలం లో లాగా, బాంబు ల లో ఇనుప ముక్కలూ, మేకులూ కుక్కి, కష్టపడి తయారు చెయ్యనక్కర లేదు. తెలివి గా ఏ స్కూటర్ నో, కార్ నో, సైకిలు నో వాడితే, పేలుడు తరవాత, ఆ వాహనాల విడి ముక్కలే అధిక నష్టాన్ని కలిగిస్తాయి.
3) కంటైనెర్ ఐ.ఈ.డీలు
సినిమా హాళ్ళ లో, రద్దీ గా ఉండే మార్కెట్ లలో, టూరిస్ట్ స్పాట్ లలో, రైళ్ళ లో (public transport systems) కామన్ పీపుల్ (సామాన్య జనాన్ని) టార్గెట్ చెయ్యడానికి వాడతారు. ఈ బాంబులు సాధారణంగా ఆయా పరిసరాల్లోకి సరిపోయే విధంగా ఉండే కంటైనర్ ల (ప్రెషర్ కుక్కర్ లూ, సూట్ కేసులూ, ఏర్ బాగ్లూ లాంటివి) లో ఒక ఐరెన్ కేసింగ్ తో తీసుకుని వెళ్తారు. ఈ పద్ధతిని లక్నో లోని కోర్టు భవనం లోనూ, లాయర్ల చాంబర్ లోనూ ప్రయోగించారు. మన కళ్ళ ముందు ముంబాయి లోకల్ ట్రైన్ ల సీరియల్ దాడుల జ్ఞాపకం చెదిరిపోనేలేదు కదా ! ఈ దాడుల్లో ఈ ప్రెషర్ కుక్కర్ లనే వాడారు.
కంటైనర్ లంటే, కుక్కర్ లే కాకుండా, పాల కేన్లూ, టిఫిన్ బాక్సు లూ, కేరియర్లూ, ఘీ (నెయ్యి) డబ్బాలు, ట్రంక్ పెట్టెలు, ఆఖరికి ఎల్.పీ.జీ.సిలిండర్లు కూడా కావచ్చు.
కాబట్టి, ఎక్కడన్నా, అసాధారణంగా ఏదయినా బాగ్, బాక్స్ లేదా కనీసం టిఫిన్ బాక్స్ దొరికినా, కనిపించినా ప్రమాదమే అని తెలుసుకోవాలి.
4) మానవ బాంబు
మానవ బాంబు / ఆత్మాహుతి దాడి చాలా పోటెంట్ మెథడ్ గా పేరొందింది. పేలుడు పదార్ధాలను, (ఐ.ఈ.డీ లను) వొంటికి ధరించి, లేదా పోర్టబుల్ పేలుడు పదార్ధాలను వాహనం లో అమర్చి, ఆ వాహనాన్ని టార్గెట్ ను చేరేందుకు వాడుతూ టార్గెట్ దగ్గరకు పోయి, వాటిని పేల్చడం ద్వారా, టార్గెట్ కు ప్రాణ నష్టం కలిగించడం దీని ప్రధాన లక్షణం. వాయు మార్గం గుండా దాడి చెయ్యడం - (ఏరియల్ దాడి) కూడా ఆత్మ హత్యా సదృశ్యమే !
ఉదా : ఎల్.టీ.టీ.ఈ దాడులు
రాజీవ్ గాంధీ హత్య, బియాంత్ సింగ్ హత్య, మనకు మానవ బాంబులను పరిచయం చేసాయి. హైదరాబాదు లో ఎస్.టీ.ఎఫ్. ఆఫీసు మీద మానవ బాంబు దాడి గుర్తుందిగా. ఇలానే, మన పార్లమెంట్ మీద దాడి కూడా ఆత్మాహుతి దాడే ! ఈ దాడి లో తీవ్రవాదులు ప్రాణాలకు తెగించి పాల్గొన్నారు.
5) పార్సెల్ బాంబులు / లెటర్ బాంబులు
పార్సెల్ / లెటర్ లో టార్గెట్ కు బాంబు ను పంపాలంటే, సాధారణంగా ఐ.ఈ.డీ చాలా చిన్నదీ మరియూ శక్తి వంతమైనదీ అయి ఉండాలి. ఈ రకం బాంబులు ఐ.ఈ.డీ రకాన్ని బట్టీ నష్టాన్ని కలిగిస్తాయి. కేరళ లో 2006 లో ఇలాంటి బాంబులు కూడా పేలాయి. వీటిని సాధారణంగా లో ఇంటెన్సిటీ బాంబు దాడులు గా పరిగణిస్తారు.

14/07/2008
తీవ్రవాదం - IEDs - 2
ఒక చోట బాంబు పేలుడు జరగ గానే, అది తీవ్ర వాదుల దాడి అని నిర్ధారణకు రావడం వెంటనే జరిగినా, అది ఏ తీవ్రవాద సంస్థ చేసిందో వెంటనే కనిపెట్టలేక పోవడానికి ముఖ్య కారణం - ఇమిటేషన్. ఒక సారి ఒక బాంబు దాడి సఫలం అయ్యాక, ఒక సంస్థ అదే రీతి లో (అవే బాంబులూ, పద్ధతులూ ఉపయోగిస్తూ) దాడి చెయ్యొచ్చు. కానీ చాలా కేసుల లో, ఒకే పద్ధతిని వేరే వేరే తీవ్ర వాద సంస్థలు అనుకరిస్తాయి. అందుకే, బాంబు పేలుడు మేమే చేసామని ఆయా సంస్థలు ప్రకటించే వరకూ ఫలానా సంస్థే చేసిందని పోలీసులు నిర్ధారణగా చెప్పలేరు.
ఇంకో భయంకరమైన విషయం ఏమిటంటే, పోలీసుల / దర్యాప్తు సంస్థల వద్ద, ఎప్పటి కప్పుడు మారిపోతుండే కొత్త ఐ.ఈ.డీ ల సాంకేతిక పరిజ్ఞానం గురించి ముందస్తు సమాచారం ఏమీ వుండదు. పైగా, పేలుడు జరిగాకా.. పేలుడు ఏ పదార్ధం తో జరిగిందో తెలుసుకునేసరికే తాతలు తిరిగి వస్తారు. ఇది పెద్ద టైం వేస్ట్ వ్యవహారం. కానీ ఇదే పోలీసులకు దొరికే ముఖ్యమైన నోట్స్. ఎందుకంటే, దీని ద్వారానే, తీవ్రవాదుల పేలుడు కు ఉపయోగించే పద్దతి మీద అవగాహన వస్తుంది. అంతే.
అందుకే, ఇప్పటి దాకా జరిగిన పేలుళ్ళూ, దాడుల ఆధారంగా పేలుడు కు ఉపయోగించిన పద్దతులూ, పరికరాలూ - అంటూ ఒక సామాన్య పరిజ్ఞానం అందుబాటు లో ఉంది. ముఖ్యంగా ఐ.ఈ.డీ లలో రకాలూ ఈ కింది విధంగా ఉంటాయి.
1) లాండ్ మైన్లు / భూమి లో పాతి పెట్ట బడ్డ ఐ.ఈ.డీ లు
ఈ లాండ్ మైన్లు నక్సలైట్ల హాట్ ఫేవరేట్ బాంబులు. వీటి ద్వారా, పోలీసులూ, వీ.ఐ.పీలను తుదముట్టించడం చాలా విరివిగా జరిగింది. ఇవి ప్రాధమికంగా, వైర్ లెస్ పరిజ్ఞానంతో తయారవుతాయి. కేమెరా ఫ్లాష్ ద్వారా ట్రిగ్గెర్ చెయ్యబడతాయి. వీటిని, సాధారణంగా, వాహనం లో ప్రయాణిస్తున్న వారి మీద దాడి చెయ్యడానికి వాడతారు. సెమీ-మెటల్ రోడ్లు, కచ్చా రోడ్లు, కల్వర్టులు, రైల్ రోడ్ క్రాసింగ్లూ, నదీ తీరాలు, రోడ్డు మలుపులు లాంటి, ఎక్కడ వాహనం వేగం బాగా తగ్గించి నడపాలో అక్కడ, అమర్చుతారు. వాహనం వేగం తక్కువ గా ఉన్నప్పుడు, ఖచ్చితంగా పేలుడు జరపొచ్చు, ఎక్కువ ప్రాణ నష్టం కలిగించ వచ్చు. అయితే, ఈ పద్ధతి లో, ఇలా, దాడి చెయ్యడానికి ఎంచుకునే ప్రదేశానికి ఒక ఫీచర్ ఉండి, కొంత లో కొంత అయినా మనం అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే, జనార్ధన రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి అదృష్టవంతులు, వెంట్రుక వాశిలో మృత్యువు ను మోసం చేసేసారు.
అయితే, అందరూ అదృష్టవంతులు కాలేరు గా. అందుకే, చాలా మంది పోలీసు అధికారులూ, వారితో పాటూ ప్రయాణిస్తున్న సివిలియన్లు (పౌరులు) కూడా ఎన్నో సార్లు మృత్యువాత పడ్డారు. ఉదా : చత్తీస్ గడ్ లోని దంతేవాడా లో 100 కిలోల పేలుడు పదార్ధాలు అమర్చి, పేల్చిన లాండ్ మైన్, (2005 లో) పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని తునాతునకలు చేసింది. ఈ దాడిలో వాహనం లో ఉన్న 27 మంది లో 24గురు అక్కడి కక్కడే చనిపోయారు.
2) వాహనం లేదా సైకిలుకు అమర్చిన ఐ.ఈ.డీ లు.
వాహనాలను బాంబులనూ, పేలుడు పదార్ధాలను ఒక ప్రదేశాన్నించీ, వేరొక ప్రదేశానికి రవాణా చెయ్యడానికి వాడటం ముందు నుంచీ ఉన్నదే. కానీ ఈ వాహనాలనే, పేలుడు కు ఉపయోగించడం, ఇంకొక పద్ధతి. బొంబాయి పేలుళ్ళు వీటికి ఉదాహరణ. అసలు ఈ ట్రెండ్ 1920 లో ఒక ఇటాలియన్ తీవ్రవాది న్యూయార్క్ లో వాల్ స్ట్రీట్ లో జె.పీ. మోర్గన్ వాళ్ళ ఆఫీసు దగ్గరకి ఒక పేలుడు పదార్ధాలు నింపిన గుర్రపు బగ్గీ ని తోలుకు వచ్చి, పేల్చెయ్యడం తో మొదలయ్యింది. ఈ దాడి లో, 40 మంది మరణించారు.
ఇరాక్, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ లలో కూడా ఈ పద్ధతి చాలా వాడబడుతుంది. రక్షక బలగాల కాన్వాయ్ కి దగ్గరగా ఒక బాంబ్ లు నింపిన వాహనాన్ని పార్క్ చేసి, కాన్వాయ్ సమీపిస్తుండగా పేల్చడం (రోడ్ సైడ్ పార్క్ చేసిన కారు బాంబులు), తద్వారా, సైనికులకు ఎక్కువ హాని కలిగించడం, దీని ముఖ్య ఉద్దేశ్యం.
వీటిల్లో, మన దేశంలో, ఎంతమాత్రం అనుమానం కలిగించని వాహనం సైకిలు. ఈ సైకిలు కే, బాంబులను ఏ బాగ్ లోనో ఉంచి, అమర్చి, రద్దీ గా ఉండే మార్కెట్ ఏరియాల్లో, గుళ్ళలో, ప్రార్ధనా స్థలాల దగ్గరా పార్క్ చేసి ఉంచడం; అదను చూసుకుని పేల్చడం కూడా ఈ మధ్య చాలా సక్సెస్ ఫుల్ గా తేలింది.
ఈ పద్ధతి / సైకిళ్ళ లో అమర్చ గల ఐ.ఈ.డీ లనే, ఈ మధ్య లక్నో, ఫైసాబాద్, వారణాసి ల సీరియల్ దాడులలో వాడారు. ఇలానే, గోరక్ పూర్ లో బాంబు దాడి కూడా నిర్వహించారు. 2008 లో జైపూర్ దాడుల లో వాడినవి కూడా, సైకిలు ఐ.ఈ.డీ లే.

తీవ్ర వాదం - IEDs - 1
చాలా రోజులయింది ఏమైనా రాసి. అయితే ఈ సారి ఏదయినా కొత్త విషయం రాద్దామని అనిపించింది. తీవ్ర వాదం గురించి రాస్తే ఎలా ఉంటుంది అనిపించింది. మనకి మన ఏరియాలొ ఎక్కడన్నా బాంబు పేలి ఒక పది పదిహేనుగురు చనిపోతే గానీ.. ఈ టాపిక్ అంటే ఇష్టం ఉండదు. ఒక సారి బాంబు పేలి, ఎంతో ప్రాణ నష్టం కలిగాక.. మీడియా కెమెరాల మధ్య ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూనే, మరుసటి రోజు, అదే పరిసరాల్లో, మన రొటీన్ జీవితం లోకి మెల్లగా జారిపోతాం.
మరి తీవ్ర వాదం అంటే ఏమిటి ? దీన్ని నిలువరించడానికి ఏమి చెయ్యాలి ? మనం మన ప్రశాంత మైన జీవితం లో మునిగి ఉండగా.. ఏదో ఒక దురదృష్టకరమైన క్షణం లో ముంచు కొచ్చే మృత్యువు తీవ్రవాదం ! ముఖ్యంగా మనలని భయోత్పాతానికి గురి చెయ్యడానికి దారుణ మారణ హేల ని రచించే ఉన్మాదమే తీవ్ర వాదం.
దీన్ని నిలువరించడానికి, ఈ సైద్ధాంతిక వైపరీత్యాన్ని తట్టుకోవడానికి, అసలు మన రక్షణ బలగాలకు దీని లోని లేటెస్ట్ పోకడ లు (ట్రెండ్ లు) తెలియాలి. సైద్దాంతిక వైరుధ్యాలని వెంటనే సరిదిద్దలేము. కానీ మన శత్రువుల (తీవ్ర వాదుల) బలా బలాలేమిటో, వారు అనుసరించే విధానాలేమిటో తెలుసుకుంటేనే కదా మనం వారిని ఎదుర్కోగలం !
రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం లాంటి జాతీయ పర్వ దినాలు దగ్గర పడుతూండగా, డిల్లీ లో ప్రభుత్వ యంత్రాంగం ఎంత హడావుడి చేస్తుందో తెలుసా ? వార్తా పత్రికలలో, రోడ్ ల మైకు ల లోనూ.. అనుమానాస్పదమెదైనా, వ్యక్తి అయినా, బాగ్ అయినా వెంటనే పోలిసుల దృష్టి లోకి తీసుకు రమ్మని విజ్ఞప్తులూ, ఇంటికి అద్దెకి వచ్చే యువకుల, ఇంట్లోకి పనికి పెట్టుకునే వ్యక్తుల మీదా పోలీసు వెరిఫికెషన్ చేయించండంటూ ప్రకటనలూ, వెల్లువెత్తుతాయి. రైల్ స్తెషన్ లోనూ, రోడ్ ల మీదా అదనపు బలగాలు మోహరించి ఉంటాయి. హఠాత్తుగా ఇండియా గేట్ చుట్టూ రక్షణ వలయాలు ఏర్పడిపోతాయి. ఏదో సాయంత్రం ఐస్క్రీం తినడాంకి వెల్టే, నల్ల పిల్లి కమాండోలు జీప్ లో కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఇవన్నీ మనల్ని కాపాడడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలు.
ఈ భయం దేనికి ? ఎవరి నుంచీ.. లాంటివన్నీ మనల్ని తీవ్రవాదాన్ని గురించి ఆలోచింప చేస్తాయి. తద్వారా, వారి సైద్ధంతిక వాదాల్ని బహిర్గతం చేస్తాయి. తీవ్రవాదం మామూలుగా మనల్ని భయపెట్టకపోను. కానీ బాంబులూ, ఐ.ఈ.డీ (Improvised Explosive Devices) లు లేకపోయి ఉంటే, మనం తీవ్రవాదాన్ని పెద్ద లెక్క చేసే వాళ్ళం కాదు. తీవ్రవాదం అంటే పోలీసులూ, తీవ్రవాదులకూ మధ్య ఏదో యుద్దం లే అనుకుని ఉండేవాళ్ళం. అందుకే, ఈ ఐ.ఈ.డీ లు ఇప్పటి తీవ్రవాదులకు మురిపెమైన ఆయుధాలు.
ఇప్పటి తీవ్రవాదులంతా, తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లూ.. రక రకాల సాంకేతిక రంగాలలో అత్భుత ప్రతిభ కలవాళ్ళూ కావడం ఈ ఐ.ఈ.డీ ల సృష్టి కీ, విస్తృత వాడకానికీ దారితీసింది. చవగ్గా, తేలికగా దొరికే రశాయనాలు, విడి భాగాలతో సులభంగా తయారయ్యే ఐ.ఈ.డీ లూ / బాంబులు అందుకే ఇప్పటి ఫేవరెట్ ట్రెండ్.
పైగా, ఈ కొత్త బాంబులతో నిక్కచ్చి గా దొరికే అత్భుత ఫలితాలు (ఎక్కువ సంఖ్య లో ప్రాణ నష్టం) రక్షణ బలగాలను తీవ్ర నిరాశ లోకి నెట్టేస్తాయి. (మొరేల్ దెబ్బ తీయడానికి బాగా ఉపయోగ పడుతుంది) వేరే వేరే తీవ్రవాద సంస్థలు ఈ విభాగంలో తమ తమ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటాయి. (Like.. you have one Idea and I have one Idea, when we share them, we both will have two ideas each!)
ఇలా ఎప్పటికప్పుడు మంచి పరిజ్ఞానం తో ఐ.ఈ.డీలు విజృంభిస్తున్నాయి. అందుకే, వీటిలో కొన్ని రకాల గురించి నాకు తెలిసిన కాస్త జ్ఞానాన్ని పంచుదామని ఈ ప్రయత్నం.

Subscribe to:
Comments (Atom)