Voice for the voiceless, over seven decadesof struggle with
china for my land and my people - His Holiness The Dalai Lama
1959 లో దలై లామా, భారత దేశానికి శరణార్ధి గా వచ్చి, ఆరు దశాబ్దాలకు
పైగానే అయింది. ఇప్పుడు టిబెట్ చైనా ఆక్రమణ లో ఉన్న ప్రాంతం. అభివృద్ధి పేరిట
ఇక్కడ ఇన్నేళ్ళలోనూ చాలా విధ్వంశమే జరిగింది. ముఖ్యంగా చైనా అనుసరించే 'ఒకే చైనా' పాలసీ వల్ల, టిబెట్ ఇంక
ఎప్పటికీ స్వతంత్ర రాజ్యంగా గుర్తింపబడదు. దలై లామా కు ఈ సంగతి తెలుసు. పైగా ఇపుడు
టిబెట్ అంతర్జాతీయంగా ఒంటరి. దలై లామా కు, టిబెట్
శరణార్ధులకూ, ఆశ్రయం కల్పించిన నెహ్రూ నుంచి ఇప్పటి మోదీ వరకూ, భారత దేశం పట్ల
అతనికున్న కృతజ్ఞతా గౌరవ భావాలూ అన్నిటిని మరోసారి పొందుపరిచిన పుస్తకం ఇది.
నిజానికి టిబెట్ దురాక్రమణ సంగతులేవీ ఇప్పటి ప్రపంచానికి
పట్టనివి. 1950 లో కమ్మ్యూనిస్ట్ చైనా, టిబెట్ ను
ఆక్రమించింది. టిబెట్ లాంటి శాంతికాముక దేశంలో బాంబులు వర్షించాయి. అమాయక ప్రజలు
వేలాదిగా చనిపోయారు. లామా ల సాంప్రదాయం ప్రకారం నడిచే మహాయాన బౌద్ధ ధర్మం నానా
యాతనలకు గురైంది. కమ్యూనిస్ట్ లకు మతానికీ చుక్కెదురు. కమ్యూనిస్టులు దేవుడి
ఆరాధనని సహించరు. మానవ చరిత్రలో ప్రాచీనమైన టిబెట్ మత విశ్వాసాలను, సంస్కృతిని, హిమాలయాలలో
తరాలుగా నివసిస్తున్న నోమడ్ ల జీవన విధానాల్నీ, వారు మత
విశ్వాసాలతో, ప్రకృతి పట్ల భక్తి విశ్వాసాలతో కాపాడుకుంటూ వచ్చిన
పర్యావరణహిత జీవన విధానాల్నీ, సమూలంగా నాశనం చేసేందుకు చైనా కంకణం కట్టుకుంది.
ఇప్పటికీ చైనా ది చెవులు పనిచేయని నోరున్న బెల్లీకోస్
విధానమే భౌగోళిక సమగ్రతకు సవాలవుతూ వస్తుంది. టిబెట్ కు చైనా అండన ఉండటంలో సమస్య
లేదు. దలై లామా విధానాలు సంపూర్ణ స్వాతంత్రాన్ని కోరుకోవడం లేదు. చైనాలో
అంతర్భాగంగా ఉంటూనే, తమ దేశ అస్థిత్వాన్ని, ఆత్మనూ
కాపాడుకోవాలనుకుంటున్నారు. టిబెట్ తన సంస్కృతిని సమూలంగా కోల్పోకుండా, నిలుపుకోవాలనుకుంటుంది.
మతాన్ని, ప్రార్ధనల శాంతియుత జీవితాన్నే కోరుకుంటుంది. దీన్ని మధ్యే
మార్గం అన్నారు. కానీ ఇది కూడా చైనా కు అంగీకారం కాదు. చైనా ఇపుడు ప్రపంచంలో
అత్యంత శక్తివంతమైన దేశం. చైనాతో 70 యేళ్ళుగా
దలైలామా జరిపిన సంప్రదింపులు, వేడికోళ్ళు, చైనా పెడచెవిన పెట్టిన వివిధ అంశాలు, టిబెట్
విధానాల్లో మార్పులు, అసలేమి జరిగిందో, దీని నుండి
బయటపడే మార్గాలేమిటో ఎవరికీ తెలీని పరిస్థితుల్లో, ఒక దేశానికి
పెద్దగా, దలై లామా రికార్డ్ చేసి పెట్టిన టిబెట్ రాజకీయ చరిత్ర ఇది.
ఇప్పటి తరం టిబెటన్లు, రానున్న తరాల వాళ్ళూ, అసలెందుకు ఈ
గెలుపెరగని అలుపెరుగని పోరాటాన్ని ఆపకూడదో వివరించే పుస్తకం ఇది.
టిబెట్ లో ప్రధానంగా మూడు ప్రాంతాలు ఉన్నాయి. యు-థ్సాంగ్, ఆండో, ఖాం లు. రాజధాని లాసా
యుత్సాంగ్ లో ఉంది. దలై లామా మార్చ్ 17, 1959 లో టిబెట్
వదిలి, భారత దేశానికి శరణార్ధి గా పారిపోయి రావలిసొచ్చింది. 1950 నుంచీ చైనీస్
సైన్యాలు టిబెట్ ను చుట్టుముట్టి, బౌద్ధ దేవాలయాలనూ, మఠాలనూ నాశనం
చేయడానికీ, టిబెట్ చిహ్నాలను తగల బెట్టడానికి ప్రయత్నాలు
మొదలుపెట్టాయి. వేలాది మంది స్త్రీ పురుష భిక్షుకులను బౌద్ధ ఆరామాలనుండీ
వెళ్ళగొట్టాయి. చంపాయి.
జరుగుతున్న సంఘటనలను చూసి అపనమ్మకంతో, ఈ చైనా వాళ్ళు
అసలు మాట్లాడితే వింటారేమో అన్న సందిగ్ధత తోనూ, అంతర్జాతీయ
సమాజం తమను ఒంటరిగా వొదిలేయడంతో సగం నిస్సహాయత తోనూ, తమ కర్తవ్యం
ఏమిటో తెలీక, భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్నపుడు అప్పటికి కేవలం 16 ఏళ్ళ దలై లామా
టిబెట్ కు నాయకుడిగా టిబెట్ నాయకత్వాన్ని స్వీకరించాల్సి వచ్చింది. లామా లు టిబెట్
సంస్కృతిలో అంతర్భాగమైన ఓ పురాతన సంప్రదాయ ప్రతినిధులు. వీరి ఎంపిక పునర్జన్మ
సిద్ధాంతం ఆధారంగా జరుగుతుంది.
అక్టోబర్ 7, 1950 న చైనా మొదట
డ్రిచూ (యాంగ్ట్సీ) నదిని దాటొచ్చి, తూర్పు టిబెట్ ని ఆక్రమించింది. అక్టోబర్ 10 న, చాం
డో ప్రావిన్స్ ని కూడా గెలుచుకుని అక్కడి గవర్నర్, నగాబో నగవాంగ్ జిగ్మె ని
బంధించింది. అప్పటికి దలైలామా కు సంరక్షకుడి గా ఉన్న తాద్రక్ రింపోచె నవంబర్ 11 న అంతర్జాతీయ
సమాజానికి, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ కి ఈ విషయాన్ని విశదీకరిస్తూ ఓ
అప్పీల్ చేసారు. ప్రపంచం "కొరియా యుద్ధం" వైపు చూస్తున్నంత ఆసక్తితో టిబెట్ ని చూడటం
లేదనీ, ప్రపంచం దృష్టికి దూరంగా, ఓ స్వతంత్ర దేశాన్ని
చైనా దురాక్రమిస్తూ వస్తోందనీ, నిస్సహాయ ప్రజలను చంపేస్తొందనీ, ఈ విషయాన తమని
ప్రపంచం ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు.
యునైటెడ్ నేషన్స్ లో టిబెట్ విజ్ఞప్తి కి El
Salvadar నుంచి మినహా ఏ ఇతర దేశం నుంచి ఎటువంటి సాయం లభించలేదు. గ్రేట్ బ్రిటన్, రష్యాలు మధ్య
ఏషియా లో పట్టు కోసం ఆడిన గ్రేట్ గేం లో బిజీ అయిపోయి వాళ్ళూ టిబెట్ ని
పట్టించుకోలేదు. పైగా అంతర్జాతీయ ముఖ చిత్రం లో టిబెట్ లీగల్ స్టేటస్ ని అస్పష్టం
చేసేసారు. అసలు మొదట్నించీ స్వతంత్ర దేశంగానే ఉంటూ వచ్చిన టిబెట్, తన "లీగల్
స్టేటస్" గురించి ప్రపంచం వ్యక్తపరిచిన అనుమానాలని చూసి ఆశ్చర్యపడిపోయింది.
కొంచెం కొంచెం గా టిబెట్ పూర్తిగా చైనా ఆక్రమణలోకి
వెళ్ళిపోయింది. దలై లామా, ఇండియా కి తప్పించుకుని రావాల్సొచ్చింది. లామాను
అనుసరిస్తూ వేలాది గా టిబెట్ వాసులు భారతదేశానికి శరణార్ధులు గా వచ్చారు. భారత
దేశం లో వారికి తమ తమ మత విశ్వాసాలను, సంస్కృతి, సాంప్రదాయాలనూ
పరిరక్షించుకోగలిగే రీతిన, ఆశ్రయం లభించింది. భారత దేశం తన రెండో అమ్మ అంటారు దలై లామా.
ఇక్కడి పప్పు అన్నం తిని బ్రతికున్నవాడిని అని చెప్తుంటారు. తిబెటన్ల కోసం
ప్రత్యేకంగా బళ్ళూ, ఊర్లూ, ఆలయాలూ
నిర్మింపబడ్డాయి. టిబెట్ లో మిగిలిన ఇతర ప్రముఖ నాయకులు, దలై లామా కన్నా
రెండేళ్ళు చిన్నవాడైన పంచన్ లామా లు అక్కడి నుంచీ పోరాటాన్ని కొనసాగించారు.
అంతర్జాతీయం గా చైనా కు ఉన్న బలమైన స్థానం వల్ల, సంపూర్ణ
స్వతంత్రం తాము సాధించలేని కల అని అర్ధమయిన దలై లామా, కనీసం తమ
ప్రాంతాలకు అటానమీ అన్నా ఇవ్వాలని కోరుకున్నారు. చైనాలో అంతర్భాగంగానే ఉంటూ, తమ టిబెట్
సాంప్రదాయాల్ని, బౌద్ధ మత సంస్కృతి నీ, కాపాడుకోవాలని తలచారు.
దలై లామా విజ్ఞప్తులను, అతను స్థిరంగా దేశ విదేశాల్లో పేరు తెచ్చుకుని, నోబెల్ శాంతి బహుమతి పొందినాక కూడా, టిబెటీయుల లాబీ ప్రపంచ వ్యాప్తంగా తమ గొంతులను వినిపించడం మొదలు పెట్టినా కూడా, చైనా దలైలామా ను వేర్పాటువాది (splittist) గానే ముద్ర వేసింది. టిబెట్ అభ్యర్ధనలను పెడచెవిన పెట్టింది. వీళ్ళ మాటలన్నిటికీ వక్ర భాష్యాలు తీసింది. దలై లామా, ఈ 70 ఏళ్ళకు పైగా గడిచిన కాలంలో అసలు తానేయే పనులు చేసారో ఈ పుస్తకం లో రాసుకొచ్చారు. దలై లామా నడిపిన టిబెట్ ప్రభుత్వ బృందం, తర తరాలుగా, దాదాపు అందరు చైనా అధ్యక్షులతోనూ, అనగా మావో, డెంగ్ సియాఓపింగ్, జీయాంగ్ జెమిన్, హూ జింటావో, ఇపుడు ప్రస్తుత అధ్యక్షుడు సీ జిన్ పింగ్ ల వరకు అందరు అధ్యక్షులతోనూ సుదీర్ఘ రాయబారం నడిపింది.
మావో హయాం లో సంప్రదింపులకు వెళ్ళిన టిబెట్ బృందాన్ని
అవమానించి, బెదిరించి, మొదట పది, తరవాత 17 సూత్రాల
ఒప్పందం ఒకటి బలవంతాన సంతకం చేయించి, దానితోనే టిబెట్ మీద అధికారాన్ని సాధించింది
చైనా. అప్పటినించి టిబెట్ గోడు విన్నవారే లేరు. అభివృద్ధి పేరిట, టిబెట్ లో తరాల క్రితం
వెలిసిన బౌద్ధ ఆరామాలను, ఆశ్రమాలను నాశనం చేసి, (హూన్) చైనీయులని విపరీతంగా ప్రవేసపెట్టి, అక్కడి
పర్యావరణాన్ని నాశనం చేసి, ఎడాపెడా భవంతులూ, రైలు మార్గాలూ, రోడ్లూ
నిర్మించింది. బైటికి అభివృద్ధి గా కనిపించే ఈ ప్రయత్నాలు నిజానికి టిబెట్ లో
దొరికే అరుదైన వనరులను కొల్లగొట్టేందుకే. ఈ ప్రకృతి విధ్వంసం ఇప్పటికీ
నిరాటంకంగానే కొనసాగుతుంది. పర్యావరణ దృక్కోణం లో అత్యంత నాజూకు ప్రాంతం అయిన టిబెట్ లో అణుశక్తి సంబంధిత కార్యక్రమాలు చేపట్టింది.
నిజానికి ఏనాడో చైనా ని పాలించిన మంచు క్వింగ్ (Manchu
Quing) సామ్రాజ్యాన్ని ఆ పరిధినీ, చైనా ఇప్పటికీ తనదే అంటూ ఉండటమే దాని ఎజెండా.
ఇప్పుడు భారత దేశం అశోకుడి సామ్రాజ్యాన్నో, రాజ రాజ చోళుని
సామ్రాజ్యాన్నీ, ఇప్పటికీ తనదే అని ప్రకటిస్తే ఇపుడెంత హాస్యాస్పదంగా ఉంటుందో ఆలోచించండి. అతి బలవంతుడైన
శత్రువుని ఎదుర్కోగలగడం, టిబెట్ కు సాధ్యం కాదు. దానివల్లనూ, చైనా మొండి
ధోరణి వల్లనూ, దలైలామా, 'మధ్యే మార్గాన్ని' నమ్ముకుని, తన వాళ్ళ చేతుల్లోనే తీవ్ర
వ్యతిరేకత ఎదుర్కొన్నా, ఇప్పటికీ తన పోరాటం, తన పదవి కోసమో,
తన రక్షణ కోసమో కాదని, అది సమాజ హితం కోసమనీ, టిబెట్ కోసమనీ
ఉద్ఘాటించారు. ఇప్పుడు తనకి భూమి మీద అట్టే సమయం లేదు. ఈ పోరాటం ఇప్పుడు గెలిచేలా
లేదని అందరికీ తెలిసిందే. గానీ, ఇపుడు ముందుకు నడిచే దారేది? గతంలో సంప్రదింపులు ఏయే దశలలో
నిలిచిపోయాయి. ప్రస్తుతం టిబెట్ లో "అభివృద్ధి" పేరిట జరుగుతున్న దోపిడీ
ఏమిటి ? దాని పర్యవసానం ఏమిటి ? ఇవన్నీ కొంత వరకు కొత్తతరాల వారికి తెలియాలని రాసారు.
ఇప్పుడు దలైలామా వయసు 90 దాటింది. అతని
మరణానంతరం, టిబెట్ కు నాయకునిగా ఎవరైనా నిర్ణయించబడితే, అతనిని చైనా
అంగీకరించదు. చైనా ఎంపిక చేసిన దలై లామానే టిబెటన్లు స్వీకరించాలని చైనా పట్టుదలతో
ఉంది. దలై లామా అనంతరం టిబెట్ లో కొనసాగిన పంచన్ లామా, తన
సాహసపూర్వకమైన స్టేట్మెంట్ లకు తన ప్రాణాలతో మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
చైనా లో ప్రజాస్వామ్యం కోరుతూ టియానన్మెన్ స్క్వేర్ లో
తీవ్ర అణిచివేత కు గురై చనిపోయిన అసంఖ్యాకులైన చైనీయుల పట్ల సానుభూతి
వ్యక్తపరిచినందుకు దలై లామా చైనా ప్రభుత్వానికి అత్యంత అయిష్టుడైయ్యాడు. ఇప్పటికీ
ప్రపంచ వ్యాప్తంగా చెల్లా చెదురైపోయిన తమ టిబెట్ సమాజానంతటికి మోరల్ గా, రాజకీయంగా, మత పరంగా, సంస్కృతి పరంగా
ఒకే తాటిపై బంధించి ఉంచిన శక్తి దలై లామాది. అతను భారత దేశం
పట్ల, దేశం తమ దేశానికిచ్చిన బౌద్ధ సంస్కృతికి ఇచ్చిన 'ఆర్యావర్తం' గా, ఇన్నాళ్ళుగా తనకు ఆశ్రయం ఇచ్చినందున తనకు రెండో తల్లి
అయినందుకు, టిబెటన్ బౌద్ధానికి, ఆయుర్వేదానికీ, తంత్రానికీ
మూలాలయిన భారత విజ్ఞానాన్ని, శాంతియుత విధానాలతో దేశాన్ని నడిపించిన గాంధీ వాదానినీ
తలచుకుంటూ దలై లామా చేసిన వ్యాఖ్యానాలు చదివితే, అసలు నెహ్రూ
ఎందుకు దలై లామాని కాపాడి ఆశ్రయం కల్పించారో, ఆతరవాత కూడా
అందరు ప్రధానులూ టిబెటన్లను అదే ఆదరంతో ఎందుకు చూస్తారో అర్ధమవుతుంది.
ఇన్ని సంవత్సరాలుగా తమ స్వదేశం నుండి పారిపోయొచ్చి గానీ, అక్కడే ఉంటూ తమ జాతి విధ్వంశాన్ని, తమ మత, సాంస్కృతిక హనన్నన్ని గానీ చూస్తూ, తమ నేల కోసం పోరాడుతున్న టిబెటన్ల నాయకుడిగా దలై లామా రాసిన పుస్తకం చదువుతుంటే, వాళ్ళ భయాలకీ, ఇప్పటికీ తిరిగి టిబెట్ కు వెళ్ళలేని నిస్సహాయతని చూసి, జాలి కలుగుతుంది. "ఒక బౌద్ధుడిగా అబద్ధం ఆడని వాడిని. టిబెట్ ముందునుండీ చైనాలో అంతర్భాగం కాదు. అది ఆక్రమించబడింది.. మాకు మా దేశం కావాలి!" అని అడగగలిగే ఆఖరివాడు దలై లామా. అతని తరవాత టిబెట్ కు నాయకత్వం వహించే లామాలుగా పునర్జన్మించిన పిల్లల ఆచూకీనే లేకుండా చేసింది టిబెట్ ని ఏలుతున్న చైనా ప్రభుత్వం. దలై లామా చిత్రాన్ని ఇళ్ళలో పెట్టుకోవడం గానీ, ప్రదర్శనల్లో ప్రదర్సించడం గానీ నేరం. స్వతంత్ర పోరాటంలో నిస్సహాయతనీ, ఆగ్రహాన్నీ వెలిబుచ్చే యువ బౌద్ధ భిక్షువుల ఆత్మార్పణాలు, నిప్పు పెట్టుకుని చచ్చిపోవడాలూ జరిగాక, వారి కుటుంబ సభ్యుల్ని కూడా తీవ్రంగా వేధిస్తూంది చైనా ప్రభుత్వం. వాటన్నిటినీ నిరసిస్తూ, తమ యువతను ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండమని, మన ప్రాణాలంటే చైనా కు అస్సలు విలువ లేదనీ నచ్చచెపుతూ, ఓర్పుని బోధిస్తూండే ఈ దలైలామా, బహుశా చివరి దలైలామా కూడా కావచ్చు. అందుకే తన వాళ్ళకి దారి చూపుతూ రాసుకున్న పుస్తకం ఇది. చదువుతుంటే ఆ నిస్సహాయత మనల్ని కూడా కమ్ముకున్నా, బౌద్ధం చెప్పే కొన్ని సిద్ధాంతాలు, ఎక్కడో "ఆశ"ని బ్రతికుంచుతాయి. కష్టం అనుభవిస్తూ, దిక్కు తోచని మనిషి తనకుతానుగా అసలు ఆ 'ఆశ' ని బ్రతికుంచుకోవడమే జీవితంలో ఎంతో దుస్సహమైన సాధన. అదే యోగం. అదే కర్తవ్యం. అదే ఓ జాతి నాయకుడిగా దలైలామా చెప్పబోయేది కూడా.
Some glimpses :
1)
I have always maintained that our struggle
is not against the Chinese people but against an oppressive regime and for the
rights of the Tibetan people. So
logically, I have deep empathy for others oppressed by the Communist Chinese
regime, which include the Chinese people themselves.
2)
I have spent the greater part of my life in
India. And I sometimes describe myself
as a son of India. My mind has been
nourished by India's rich philosophical tradition, while my body has been fed
by Indian rice and dal. When I used to
travel internationally, I often started that I am a messenger of two great
gifts from India to humanity – religious pluralism and teaching of ahimsa, the
principle of nonviolence.
3)
Ecologically speaking, the Tibetan plateau houses
the sources of many of Asia’s greatest rivers – including Yarlung Tsangpro
(Brahmaputra) and Senge Khabab (Indus) which flow southward and Dzachu
(Mekong), Machu (Yellow River) and Drichu (Yangtze) which run east. The communist Chinese occupation of Tibet has
had a devastating effect on the health of these rivers, with significant environmental
consequences to many countries in Asia. In
the future too, under the responsible custodianship of the sources of the major
rivers is ensured. There may be
significant conflicts in connection with access to water, indispensable for he survival
of hundreds of millions of people in India, Pakistan, Bangladesh , Myanmar,
Laos, Thailand, Vietnam and Cambodia.
Some environmental specialists refer to the Tibetan Plateau as the “Third Pole” to add to the North ad South
poles, for reasons including it being the largest repository of fresh
water. In addition, the ecosystem of the
plateau plays a crucial role in the regulation of the monsoon across South
Asia.
4) It is totally inappropriate for Chinese Communists who explicitly reject religion, including the idea of past and future lives, to meddle in the system of reincarnation of lamas, let alone that of the Dalai Lama. Such meddling, I point out, contradicts their own political ideology and only reveals their double standards.
5) Appeal : To my fellow Tibetans, Never lose hope, however dark the sky may become. As our saying goes “If you fall nine times, you get up nine times.”. Always remember that a bright sun awaits behind the clouds. We are an ancient people with a long history of resilience. For millennia we ‘tsampa-eaters’ have been the custodians of the expansive Tibetan plateau known as the “roof of the world”. Throughout our history of more than two millennia, we have navigated through all sorts of ups and downs, always sure of our identity as people with our distinct language, culture and religion, and the core values that define us. Today’s dark period of Communist Chinese occupation may seem endless but in our long history, it is but a brief nightmare. As our Buddhist faith teaches us, nothing is immune to the law of impermanence.
6) Some might think, given my age and Communist China’s position as a global power today, that time is not on our side, I disagree. Yes, the Dalai Lama institution plays today an important role in unifying Tibetans everywhere, but let us not forget that while the Dalai Lama institution is only five hundred years old, Tibet’s history is older by more than a millennium and a half. So I have no doubt that our struggle for freedom will go on, for it pertains to the father of an ancient nation and its people. As an inherently unstable system, totalitarianism definitely does not have time on its side. Time is on the side of the people, Tibetans as well as Chinese, who aspire for freedom.
7)
In more than five decades of traveling around the
world, a key message I have shared from my culture is the importance of
embracing the more compassionate parts of human nature is the importance of
embracing the more compassionate parts of human nature, and how doing so will
enable us to promote peace and happiness both at the individual as well as
societal levels. One of my deeply held
convictions is that if each one of us could embrace what I call “the oneness of
humanity – a visceral sense of our shared human condition that acknowledges the
simple fact that just like me everyone else wishes to be happy and does not
want suffering – our world would be a better and kinder place for all.
The sages who have contemplated for many
eons
See this altruism alone to be of greatest
benefit
Through it, immeasurable beings can obtain,
With ease, the brightest state of happiness
….
May I be the protector to those without
protector;
May I be the guide to those traveling on
the road;
May I become a boat, a causeway, and a bridge;
For those who long to reach the further shore.
……
May I remain a sourse of sustenance for all
For as long as space endures
For as long as sentient beings remain
Until then, May I too remain,
And dispel the miseries of the world
-
Shantideva (Buddhist Guru, 8C)

No comments:
Post a Comment