ఏనుగులు మన సంస్కృతిలో భాగం. వినాయక చవితి చాలా ఘనంగా ఇష్టంగా జరుపుకుంటాం. ఏనుగు తల ఉన్న ఈ పెద్దమనిషి మనకి భారతం రాసిపెట్టాడని నమ్ముతాం. ఎందరో భారతీయుల పిల్లలు ఈ తొండపు దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తారు. చిన్న నాటి నుండే, గుడులలో, సర్కస్ లో, సినిమాలలో ఏనుగుల్ని చూసి, వాటి మీద ప్రేమని పెంచుకుంటారు. ఎంతైనా, ఏనుగు ఒక అడవి జంతువు. దాని గురించి తెలియాల్సిన బేసిక్ సమాచారం మన పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది.
1.5 మిలియన్ హెక్టార్ల అడవిని మన దేశం పోయిన రెండు దశాబ్దాలలోనే కోల్పోయింది. 80% నికి పైగా ఏనుగుల సంచార మార్గాలు మూసుకుపోయాయి. దీనివల్ల సమతౌల్యం దెబ్బతిని, ఏనుగులకీ, మనుషులకీ మధ్య సంఘర్షణ మొదలయింది. దీనిలో రెండువైపులా ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది.
అసాం లో, ఒడిషా లో, ఆంధ్ర లో, ఇంకా పలు చోట్లలో ఏనుగులు అడవి దాటి తిండి కోసం ఊర్లలోకి రావడం అలవాటే. ఏనుగుల దాడుల్లో, ఎందరో మనుషులూ చనిపోతుంటారు. ఏనుగులు తెలివైన జంతువులు. అయినా అవి అమాయకప్రాణులే. చీకట్లలో రైళు ట్రాక్ దాటుతూ ప్రమాదాలకు గురై, మనుషుల దిగ్బంధనంలో కౄరమైన ట్రీట్మెంట్ కు గురై అవీ చనిపోతున్నాయి.
ఇండియా లో చాలా చోట్ల జనాభా పెరిగి, అడవుల అంచుల వెంబడి జనావాసాలు పెరగడం, దాని వల్ల అడవీ భాగాలలో పంటలు పండించడం, ఆ పంటల మీదికి, ఏనుగుల గుంపులు తిండి కోసం రావడం, తమ జీవనాధారాన్ని నాశనం చేస్తున్న ఈ ఏనుగుల భీభత్సాన్ని చూసి వాటిని ద్వేషిస్తున్న మనుషుల మధ్యా, ఏనుగులని రక్షించుకోవడం కష్టం గా మారింది. పైగా ఊర్లోకి వచ్చి మనుషులని చంపిన ఏనుగులంటే ప్రజలలో కలిగిన ఆగ్రహం, ఆ జీవి ప్రాణాలు తీసేదాకా పోదు.
మన దేశంలో ఒక్కో ప్రాంతానిదీ ఒకో సమస్య. మనుషులుండే ప్రాంతాలలోకి చొచ్చుకొచ్చిన ఏనుగులు (!) ఎందరో మనుషులను చంపేస్తాయి. ఆ ఏనుగుల మానసిక స్థితి, వాటి బెదురు, ఒంటరితనం, ఆకలి, నిర్దయ మనకి అర్ధంకావు. ఇలాంటి భయంకర దాడులకు దిగిన ఏనుగులకోసం కొన్ని సంస్థలు కేంప్ లను నిర్వహిస్తుంటాయి. అధికారులు, బంధించి తెచ్చిన ఏనుగులని వీటిలో సంరక్షిస్తుంటారు. జనావాసాలలో భీకరమైన హత్యలు చేసిన ఏనుగులు ఈ కేంప్ ల లో శాంత మూర్తులుగా మారుతాయి. వాటికి శిక్షణనిచ్చే మనిషి (మావటి) ఇచ్చిన మౌఖిక ఆదేశాలను కళ్ళకద్దుకుని అమలు చేస్తాయి. గద్దిస్తే బెదురుతాయి. అవి అలా ఎలా మారుతాయి? బందీగా ఉన్నా వాటికి 'రక్షణ' లో ఉన్న భావన ఎందుకు కలుగుతుంది?
ఇదే సందేహం సెంధిల్ కుమారన్ అనే ఫోటోగ్రాఫర్ కూ వచ్చింది. ఆయన దీని మీద ఏళ్లు గా పనిచేస్తున్నారు. (National Geographic Magazine ఆర్ధిక సహాయంతో). ఇప్పటి దాకా, నేరాసిందంతా ఓ ఆర్టికల్ లో, అతను చెప్పిన విషయాలు + కొంచెం స్వకవిత్వం.
ఏనుగుల ప్రవర్తనను పరిశోధిస్తూ, ఆయన చెప్పేదీ, అసలు ఏ conservationist అయినా చెప్పేదొకటే. ప్రకృతిని కాపాడండి. ప్రకృతి మనల్ని కాపాడుతుందని.
***
In Vande Bharat Express, the passengers get a rail magazine. During a journey, I read this, (in August) took photos, (dumping them here only now, because I was quite busy until recently) as I thought this is worth logging.
In this magazine, I found this simple and touching article about Photographer Senthil Kumaran's journey into the wild side of conservation.
I quote :
India has lost an alarming 1.5 million hectares of forest cover in the last two decades. As cities expand and forests shrink, elephant habitats have become fragmented, forcing these majestic being to traverse farmland and villages. With over 80% of elephant corridors encroached upon, human-elephant conflict has intensified-resulting in tragic losses on both sides.
Wildlife photographer and National Geographic Fellow Senthil Kumaran has spent last five years, documenting conflicts.
He covered the otherwise dangerous, killer elephants, that became the calmest of all, after they come to Madumalai Camp.. Curious, He wanted to raise important questions. Are these elephants truly dangerous-or reacting to a broken environment?
He wants people to see not the conflict but with compassion and complexity. Captivity may bring safety. But is it conservation?
Elephants are individuals with memory, emotion and resilience. We are losing one elephant every 72 hours in India and one human every 12 hours to conflict. This is a wake up call about our over consumption and deforestation.
Unquote
***
No comments:
Post a Comment