Pages

16/06/2024

అంతరిక్ష పోటీ లో దూసుకుపోతున్న చైనా (Translation)

చైనాకు చెందిన చాంగ్-ఇ 6 ప్రోబ్ చందమామకి అవతల వైపు జూన్ 2 న లాండ్ అయింది.  అక్కడినుండి ఎనాలసిస్ కోసమని భూమికి సాంపిల్స్ కూడా తెస్తుంది.  చైనాకి చెందిన ఒక అంతరిక్ష వాణిజ్య సంస్థ, మే 29 న సముద్రం నుంచి తన రెండవ లాంచ్ చేసింది.  ఇది 2024 వ సంవత్సరంలో చైనా యొక్క 25 వ ఆర్బిటల్ మిషన్. చైనా ప్రధాన స్పేస్ contractor చెప్పిన దాని ప్రకారం వాళ్ళు 2024 సంవత్సరంలో 100 లాంచు లు చేద్దామని లక్ష్యం పెట్టుకున్నారంట. మే 2024 సరికి చైనా కి చెందిన, "ఫంక్షనల్ గా ఉపయోగంలో ఉన్న" 600 సాటిలైట్లు, ఇప్పటికే  భూ కక్ష్య లో ఉన్నాయి.  చైనా మిలిటరీ ఈ స్పేస్ మిషన్ ల కు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. జనవరి 2024 కల్లా చైనా కి 359 నిఘా సాటిలైట్లు ఉన్నాయి. అవి 2018 లో ఉన్నవాటికి మూడు రెట్లు ఎక్కువ.  చైనా "లాంగ్ మార్చ్" రాకెట్లు ప్రపంచంలో కెల్ల శక్తివంతమైన రాకెట్లలో కొన్ని.  లాంగ్ మార్చ్ 5 (CZ-5) అయితే 25000 కిలోల పే లోడ్ ని భూ నిమ్న కక్ష్యలోకీ (Low Earth Orbit) , 14000 కిలోల పేలోడ్ ని జియోస్టేషనరీ (భూ స్థిర కక్ష్య) ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి మోసుకుపోగలదు.  

ఇలా వేల టన్నుల పేలోడ్ ని ఇకపై ఇలా స్పేస్ కి తరలించేందుకని చైనా తన దగ్గరున్న అన్ని రాకెట్లనీ 2035 కల్లా పూర్తిగా "రీయూసబుల్ రాకెట్లు" గా మార్చేయాలని కూడా అనుకుంటుంది. అలా దాని లక్ష్యం ప్రకారం 80 టన్నుల LEO వేరియంట్ పూర్తిగా రీయూసబుల్ రాకెట్ 2040 కల్లా ఉపయోగం లోకి వస్తుంది. ఒక్క మీటర్ ఆక్యురసీ తో ప్రస్తుతం మనం విస్తారంగా ఉపయోగిస్తున్న  జీపీఎస్ (GPS) ని మించిన  సామర్ధ్యంతో పనిచేయబోయే బైడూ వ్యవస్థ ని చైనా అభివృద్ధి చేస్తూంది. ఇప్పుడు మనకి భూమిపై అందుబాటులో ఉన్న 5G  ఇంటర్నెట్ ని,  సాటిలైట్ ఇంటర్నెట్ తో ముడివేసి ఈ బైడూ నేవిగేషన్ సిస్టం పనిచెయ్యబోతుంది.  ఇప్పటికే ఇరవై ఇద్దరు చైనీయులు స్పేస్ కు ప్రయాణం కట్టారు. 2030 కల్లా చైనీస్ ఆస్ట్రోనాట్లతో స్పేస్ వాక్ చేయించేద్దామని అనుకుంటున్నారు.  ఇంకా మనుషుల క్రూతో చందమామ మీదకి అడుగుపెట్టాలని  కూడా ప్లాన్స్ ఉన్నాయి. మార్స్ మీదికీ మూన్ మీదికీ వెళ్ళేందుకు వాళ్ళకు టైం టేబుల్ కూడా తయారయింది. Queqiao & Tiandu  సాటిలైట్లతో కలిపి చందమామ కి సందేశాలను రిలే చేస్తూ చందమామ లో దూర దూర ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  రష్యా, చైనా లు షేరింగ్ లో ఒక న్యూక్లియర్ రియాక్టర్ చందమామ మీద 2035 కలా నిర్మించేసేయాలని అనుకుంటున్నారు - అదీ, మానవరహితంగా!   చైనా కి భూ కక్ష్యల్లోనే ఉండే సోలార్ పవర్ ప్లాంట్ లని నిర్మించేయాలని కూడా ప్లాన్స్ ఉన్నాయి. 

కొన్ని ఆర్ పీ ఓ (RPO - Rendezvous and Proximity Operations) లని కూడా నిర్వహించేస్తున్నారు. ముఖ్యంగా జీ ఈ ఓ (GEO geostationary belt) బెల్ట్ కి దగ్గరగా వెళ్ళడం, పరిశీలించి రావడం లాంటివి.  2022 లో చైనీస్ సాటిలైట్ ఒకటి, తనకి అడ్డొచ్చిన ఒక మృత సాటిలైట్ ని తీస్కెళ్ళి, 300 కిలో మీటర్ల అవతల సాటిలైట్ల స్మశానం (graveyard) లోకి విసిరేసి రావడం గమనించారు. అంటే అలాంటి కేపబిలిటీ - సామర్ధ్యం అప్పటికే వాళ్ళకుందన్నమాట. తనకు కావాలంటే శత్రువు కి చెందిన సాటిలైట్ ని తొలగించే లేదా నిరుపయోగంగా చెయ్యగలిగే సామర్ధ్యం అన్నమాట. అదే విధంగా తనకు కోపం కలిగించే సాటిలైట్లను కక్ష్యలనుండి తొలగించేసేందుకు అణ్వాయుధాలని కూడా వాడాలని (ఏంటీ సేటిలైట్ కెపాసిటీ & cyber electronic warfare) చైనా అనుకోవచ్చు. ఈ ప్రమాదాలను ప్రపంచం  గ్రహించుకోవాలి.  రష్యా కూడా ఇలా న్యూక్లియర్ స్పేస్ వెపన్స్ ని అభివృద్ధి చెయ్యడానికి ప్రయత్నిస్తుంది. ఇవి సృష్టించే మేసివ్ ఎనర్జీ వేవ్స్  సాటిలైట్లను మట్టుపెట్టొచ్చు.  చైనా స్పేస్ ఆధారిత ఎసాట్ (ASAT- Anti-Satellite)  వ్యవస్థ మీద కూడా పరిశోధనలు చేస్తుంది. ఇవి చైనా శత్రుదేశాలు ఆలోచించాలిన విషయాలు.  

షిజియాన్-17 (Shijian-17) అక్టోబర్ 2021 లో ప్రయోగించారు కదా. అది చైనాకు చెందిన మొదటి రోబోటిక్ ఆర్మ్ ఉన్న సాటిలైట్. దీనికి జియోస్టేషనరీ ఆర్బిట్ లో ఉన్న వస్తువులతో చిన్న సైజు కుస్తీ చేసే సామర్ధ్యం ఉంది. షియాన్ -12 (Shiyan-12)  కి అయితే,  రెండు అనుబంధ ఇన్స్పెక్టర్ సాటిలైట్స్ ఉన్నాయి. అవి అమెరికన్ ఇన్స్పెక్టర్ సాటిలైట్లు వస్తే, తప్పించుకునేందుకు దానికి సహకరిస్తాయి.  అంటే, అంతరిక్షం లో పోరాటం చేసే సామర్ధ్యం ఉన్నట్టేగా! TJS -3 అయితే ఒక ఉప-ఉపగ్రహాన్ని కూడా జేబులో పెట్టుకుని వెళ్తుంది. ఆ ఉప-ఉపగ్రహానికి "హెచ్చరించే, సిగ్నళ్ళని దొంగతనంగా వినే, ఏమార్చే" సామర్ధ్యాలుంటాయి. అంటే, సైబర్ ఎలక్ట్రానిక్ ఆపరేషన్స్ లో ఉపయోగపడే సిగ్నల్ స్పూఫింగ్ కు పాల్పడగలదు.  ఇలా  చైనీస్ ప్రైవేటు స్పేస్ కంపెనీల సామర్ధ్యం, వాటి ప్రయత్నాలనీ పక్కనపెడితే, చైనా ప్రభుత్వ రంగ అంతరిక్ష్య సంస్థ  CASC, రెండు పెద్ద వ్యాసార్ధం ఉన్న రీయూసబుల్ రాకెట్లని ప్రయోగాత్మకంగా టెస్ట్ చేసేద్దామనుకుంటుంది.  నాలుగూ, అయిదూ మీటర్ల వ్యాసార్హ్దం ఉన్న 'లాంగ్ మార్చ్ 10' రాకెట్లను 2025 లోనూ, 2026 లోనూ ప్రయోగిస్తారు. ఇలా మళ్ళీ మళ్ళీ ఉపయోగించగలిగే రాకెట్లను స్పేస్ ఎక్స్ (SpaceX) తరహాలో తయారుచేసేసుకునే సామర్ధ్యం చైనాకు దక్కుతుంది.  ఇంకా అదే విధంగా మళ్ళీ మళ్ళీ ఉపయోగించగలిగే స్పేస్ షటిళ్ళని కూడా తయారుచెయ్యాలనుకుంటుంది.  ఇవి ఆయుధాలను, శక్తివంతమైన మైక్రోవేవ్ ఆయుధాలను, లేదా లేసర్ ఆయుధాలను, అంతరిక్ష్యంలో ప్రయోగించేందుకు వేదికలుగా ఉపయోగపడతాయి.

చైనా ఈ సంవత్సరం స్టార్ లింక్ (Starlink) తరహా ఇంటర్నెట్ సాటిలైట్ల పుంజాన్ని (Constellation) భూనిమ్న కక్ష్య లో (లియో Low Earth Orbit) లో ప్రవేశపెట్టేందుకు  సన్నాహాలు చేస్తుంది. ఇందులో 26000 సేటిలైట్లుంటాయి. ఇవి భూగోళాన్నంతటినీ కవర్ చేస్తాయి. వీటిని ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీలు నడిపిస్తాయి.  అలాగే 2024 మొదటి సగం నుండీ 2029 దాకా 1300 సాటిలైట్లని  China Satellite Network ప్రవేశపెట్టబోతుంది.  ఇలా చైనా మొదటి సాటిలైట్ నెట్వర్క్, అంతరిక్షంలో అమెరికా అధికారానికి 2035 కల్లా చెక్ పెట్టగలదు. దీనికి 6G సామర్ధ్యం వాడుకుంటుంది. కంపెనీలు తక్కువ ఖర్చులో అంతరిక్షానికి రవాణా సాటిలైట్లని నడపబోతున్నాయి.  కొన్ని చంద్రుడి మీద లాండ్ అవడానికీ, మరీ ఆశమోతు కంపెనీలు అక్కడ కాలనీలు నిర్మించడానికీ అవకాశాలను వెతుకుతున్నాయి.  కొన్ని చంద్రుడి మీదికి టూరిజం కూడా మొదలుపెట్టాలనుకుంటున్నాయి. ఇప్పటిదాకా చైనా అంతరిక్ష రంగం, అమెరికా, రష్యాలు సాధించిన మైలు రాళ్ళనే చేరింది సరే. కానీ ఇప్పుడు అది కొత్త లక్ష్యాలను పెట్టుకుంటోంది. (Setting new standards!)   చైనా ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఇప్పటికే చాలా వ్యూహాత్మకంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా  పేరు తెచ్చుకుంది. ఓషనోగ్రఫీ, సమాచార నెట్వర్క్ లు, లైఫ్ సైన్సెస్ మరియు అణు శాస్త్రంలో కూడా మంచి అభివృద్ధి సాధించింది ఈ దేశం.  అది ఇకపై స్పేస్ లాంచులు, సేవల్నీ ఒక వాణిజ్యంగా అభివృద్ధి చెయ్యాలనుకుంటోంది.  అధ్యక్షుడు Xi   చైనా, అమెరికాలమధ్య వాణిజ్య ప్రతిష్ఠంబన వల్ల అస్సలు ఇకపై నష్టపోకూడదు అనుకుంటున్నాడు. అంతరిక్షపు పోటీ లో 80 శాతం ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఎందుకు ప్రోత్సహించారంటే, ఈ అంతరిక్ష రంగంలో ప్రతీదీ 2025 కల్లా స్వదేశంలోనే అందుబాటులోకి తేవాలనే. ప్రతీ పార్టూ స్వదేశంలో దొరికేయాలని కూడా. 

 

చైనా ప్రతి స్థానిక ప్రభుత్వం కిందనూ ఒక స్పేస్ డెవలెప్మెంట్ జోన్ (మన సెజ్ లాగా) తీసుకురాబోతుంది. దీనివల్ల స్పేస్ ఇండస్ట్రీకి చెందిన ప్రతీదీ స్థానికంగానే తయారు చేసేందుకు, సప్లై చైన్ దెబ్బతినకుండా ఉండేందుకూ వీలవుతుంది.  Xi అధికారంలో ఉన్నంతవరకూ  చైనా లో అంతరిక్ష రంగానికి చాలా ప్రాముఖ్యత దొరుకుతుంది.  అలా కొన్ని కీలక ఏరోస్పేస్ ప్రాజెక్ట్ లలో ముందండడం ద్వారా అమెరికా పై పైచేయి సాధించగలం అని అధ్యక్షుడి ఆశ.  అలా China ని భూతల స్వర్గం గా 2050 కల్లా మార్చాలని వాళ్ళ లక్ష్యం.  ఇటు మన దేశం స్పేస్ టెక్నాలజీలో చాలా అంశాలలో నైపుణ్యం సాధించినా, చైనా బెదిరింపులకి సరిపడా విజ్ఞానం మనకి ఇప్పటికీ లేనట్టే. అలా అని ఇండియా చైనాతో పోటీ పడాలని కాదు గానీ మన సొంత ఆర్ధిక, రక్షణ అవసరాలకైనా మనం మనల్ని ఇంకా ముందుకు తోసుకుపోవాల్సిన అవసరం ఉంది. చైనాకి ఇప్పటికే పూర్తిగా పనిచేసే సాటిలైట్ ఆధారిత navigation సిస్టం ఉంది. మన రీజినల్ జీ.పీ.ఎస్ NavlC, ఇంకా నత్తనడకల్లోనే ఉంది.

 హిమాలయాల మీదా, ఉత్తర హిందూ మహాసముద్రం పైనన్నూ చైనా కున్న స్పష్టమైన అంతరిక్ష దృష్టికి  సాటిలేదు. ఇదే పరిస్థితుల్లో మన దేశంలో ఉన్న(అంతరిక్ష ఆధారిత) సమాచార వేగం ఎంత తక్కువగా ఉందంటే, యుద్ధ సమయాల్లో మనకి అది ఏమాత్రం సరిపోదు. మనకి మరిన్ని సాటిలైట్లు కావాలి. అప్పటిదాకా మనం విదేశీ సాటిలైట్లమీద ఆధారపడాల్సిందే.  మన రక్షణరంగం ఇంకా బోల్డన్ని సాటిలైట్లని ఇవ్వమని ప్రభుత్వాన్ని అడగాలి. ప్రభుత్వం కూడా ఈరంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలి. సురక్షిత సాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ లో చైనా ఇప్పటికే చాలా అభివృద్ధి సాధించింది. మనకన్నా అంతరిక్ష సంపదలపై దాడులు చేయగలిగే సామర్ధ్యం, బోల్డన్ని ఏంటీ సాటిలైట్ ఆయుధాలూ ఉన్నాయి. అంతరిక్షమే అంతిమ సరిహద్దు.  భారత దేశం ప్రస్తుతం మంచి పొజిషన్ లోనే ఉన్నా ఇంకా చెయ్యాల్సింది చాలా వరకు  మిగిలిపోయే ఉంది.   

***

Original : China 'Races Ahead' of mentor Russia, outpaces NASA as Xi Jinping goes all out to win space race, EurAsian Times, 09 Jun 2024, OPED by Air Marshal Anil Chopra (Retd)

 

 




 


No comments: